చరిత్రకారుడు, విప్లవ మేధావి, కర్ణాటక విప్లవోద్యమ నాయకుడు సాకేత్ రాజన్‌కు జోహార్లు!
06-02-2022
ఫిబ్రవరి 6, 2005. ఒక్క కర్ణాటకకే కాదు, భారతవిప్లవోద్యమంలోనే అత్యంత విషాదకరమైన రోజు. ఆనాడు కర్ణాటక ఒక వీరపుత్రుణ్ణి కోల్పోయింది.
పడమటి కనుమల్లోని కొప్పా తాలుకా మానసినహద్య గ్రామం వద్ద స్థానిక భూస్వామి శేషాగౌడ, భజరంగదళ్ గుండా యిచ్చిన సమాచారంతో డి.ఎస్పీ శివకుమార్ ఆధ్వర్యంలో 80 మంది పోలీసులు నాలుగు గ్రూపులుగా అర్థరాత్రి ఒంటి గంటకు ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టారు. ఉదయం ఆరుగంటల ప్రాంతంలో ఒక ఇంటి నుంచి భయటికి వస్తున్న విప్లవకారుల బృందం పై కాల్పులు ప్రారంభించారు. కామ్రేడ్ సాకేత్, కామ్రేడ్ శివలింగులు నేలకొరిగారు. సాకేత్ తల వెనుకభాగం పూర్తిగా ఛిద్రమైంది. అతన్ని వెనుకనుంచి పాయింటు బ్లాక్ రేంజ్లో కాల్చేశారు. శివలింగును కూడా వెనకనుంచి కడుపులో కాల్చారు.
సాకేత్ సాంప్రదాయక అగ్రవర్ణ, ధనిక కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఆర్మీలో మేజర్, తల్లి దండ్రులు సాకేత్ ఇంజనీర్ కావాలనుకున్నారు. కానీ అతను బి.టెక్. వదిలేసి సాహిత్యాన్ని ఎంచుకున్నాడు. తర్వాత ఢిల్లీ ఐ.ఐ.ఎమ్.సి లో మాస్ కమ్యూనికేషన్స్ చదివాడు. సాకేత్ కాలేజీ రోజులనాటి స్నేహితుడు , ఇప్పుడు మైసూర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయిన లింగరాజు గాంధి ఇలా అన్నారు. ʹసాకేత్ చాలా విస్తృతంగా , ఆకలిగొన్నవాడిలా చదివేవాడు. ఫ్రాన్స్ ఫెనాన్ రాసిన wretched of the earth (భూమిదైన్యం) అతన్ని గొప్పగా ప్రభావితం చేసింది.. నేను కలవరపడ్డాను. కానీ అతని తన మనస్సుని స్థిరపరచుకోవడం మొదలు పెట్టాడు. ఇక వెనుదిరిగి చూడలేదుʹ అని అన్నారు.
1983 నుంచి సాకేత్ పూర్తిగా విప్లవోద్యమంతో మమేకమయ్యాడు. ఆనాటి విప్లవ విద్యార్థుల్లో ఒకరిగా అత్యంత నిబద్దమైన జీవితాన్ని రూపొందించుకొని, ప్రజాజీవితంలోని ఆందోళనలన్నింటిలో చురుకైన పాత్ర పోషిస్తూ కర్ణాటకలో విప్లవ పార్టీ నిర్మాణానికి పునాదివేశాడు. సాకేత్ ఉద్యమ అవగాహనకు క్రియాశీలతకు ఒకటి రెండు ఉదాహరణలు చెప్పుకోవాలి.
మైసూర్ దగ్గర రత్నహల్లిలో సూక్ష్మ భూగర్భ ఖనిజ పరిశ్రమను (Rare earth meterial plant) నెలకొల్పడంలో భారత ప్రభుత్వ విస్తరణవాద లక్ష్యాన్ని బహిర్గతం చేయడంలో ముందునిలిచాడు. ఆ పరిశ్రమ అణుబాంబుల తయారీలో ఉపయోగించే యురేనియాన్ని శుద్ధి చేయడానికి ఉద్దేశించినది. అలాగే బెంగుళూరు వద్ద పట్టమాల్లో జపాన్ పారిశ్రామిక కేంద్రం (japan industrial town ship) నిర్మాణాన్ని, పడమటి కనుమల్లో కె.ఐ.వో.సి.ఎల్ గనుల త్రవ్వకాలను, విస్తరణను అడ్డుకొన్న ఉద్యమాల్లో సాకేత్ ప్రముఖ పాత్ర పోషించాడు.
1987లో జరిగిన కర్ణాటక విప్లవ పార్టీ మొదటి సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా, 2000లలో జరిగిన నాల్గవ సమావేశంలో కార్యదర్శిగా ఎంపికయ్యాడు. 9వజాతీయ కాంగ్రెస్ కు ప్రతినిధిగా వెళ్లి కేంద్రకమిటీలో ప్రత్యామ్నాయ సభ్యుడిగా ఎన్నుకోబడ్డాడు.
రెండు దశాబ్దాల విప్లవోద్యమ జీవితంలో మావో ఆలోచనను, మావోయిస్టు వైధానికాన్ని కర్ణాటక నిర్దిష్ట పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించే కృషిచేశాడు. విప్లవోద్యమం బలహీనంగానే వున్న కర్ణాటకలో మల్నాడు ప్రాంతాన్ని బేస్ ఏరియాగా తీర్చిద్దివలసిన కర్తవ్యాన్ని స్వీకరించాడు.
సాకేత్ కర్ణాటక ప్రజల విముక్తి కోసం కలలుగన్న రాజకీయ కార్యకర్త, నాయకుడు, మార్గదర్శి, మేధావి. చారిత్రిక భౌతిక వాదం వెలుగులో కర్ణాటక చరిత్రను అధ్యయనం చేసి కర్ణాటక చరిత్ర గ్రంధాల్లో అత్యంత ప్రామాణికమైన ʹ మేకింగ్ హిస్టరీʹ రెండు భాగాలు రాశాడు. అజ్ఞాత జీవితంలోనే, తలమునకలయ్యే పార్టీ రోజువారీ పనుల మధ్యనే , కఠినమైన నిరంతర ఆచరణలో భాగంగా కర్ణాటక చరిత్రను అధ్యయనం చేశాడు. రచించాడు. మేకింగ్ హిస్టరీ విడుదలై సంవత్సరం కూడా కాలేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ వ్యాఖ్యానం ప్రకారమే - ఏ రాష్ట్ర పోలీసులు అతన్ని చంపివేశారో అదే రాష్ట్రంలోని యూనివర్సిటీలో ఆయన రచించిన చరిత్ర గ్రంథం చదవబడుతోంది. ఇలాంటి ʹతీవ్రవాదిʹ బహుశా ఇతను ఒక్కడే కావచ్చు. మంగుళూరు యూనివర్సిటీలో అతని రచనలోని కొన్ని భాగాలు విద్యార్థులకు బోధిస్తున్నారు.
మేకింగ్ హిస్టరీ మొదటి భాగంలో మానవ నివాసాల ఆనవాలు దగ్గర మొదలై బ్రిటీష్ ఆక్రమణ వరకు సాగిన చరిత్రను మార్క్సిస్ట్ ధృక్పథంలో రాశాడు. రెండు భాగాలు 1799 నాటి బ్రిటీష్ ఆక్రమణ నుండి 1857 మొదటి భారత స్వాతంత్య్ర సంగ్రామం వరకు చోటుచేసుకున్న చారిత్రక పరిణామాలను రాశాడు. మూడవ భాగంలో 1858 నుండి 1947లో బ్రిటీష్ వలస కర్ణాటక సమాజం మీద చేసిన ప్రభావాన్ని విశ్లేషించవలసి ఉన్నది. కాని అప్పటికే కర్ణాటక గ్రామీణ ఉద్యమాలను, సాయుధ పోరాటాలను ముందుకు తీసుకపోవడంలో సాకేత్ నిమగ్నమైపోయాడు. ఈలోగా కర్ణాటక ప్రభుత్వం ఆయన్ను హత్యచేసింది. చారిత్రిక భౌతిక వాదాన్ని చరిత్ర అధ్యయానికి అన్వయించడంలో సాకేత్ సుప్రసిద్ధ మార్క్సిస్ట్ చరిత్రకారుడు డి.డి.కోశాంబి పక్కన నిలబడతాడు. ఈ చరిత్ర పుస్తకమేగాక, యింగ్లీషు కన్నడ భాషల్లో ఉన్న పట్టువల్ల, సునిశితమైన రాజకీయ సైద్ధాంతిక విశ్లేషణ శక్తి వల్ల సాకేత్ యింకాఅనేక వ్యాసాలు రాశాడు.
కామ్రేడ్ శివలింగు రాయచూర్ జిల్లా సింథనూర్ తాలూకాలో ఒక మధ్యతరగతి రైతుకుటుంబంలో పుట్టాడు.రాయచూర్ రైతాంగ పోరాటాలతో ప్రేరణ పొంది 1998 లో విప్లవవిద్యార్థి ఉద్యమంలోకి వచ్చాడు. ఆ తరువాత మాల్నాడు విప్లవోద్యమాలలోకి వెళ్ళాడు. సాకేతకు గార్డుగా ఉంటూ, పోలీసుల దాడిని ప్రతిఘటిస్తూ నేలకొరిగాడు.
విప్లవం కోసం సాకేత్ పెన్ను, గన్ను సమాన ప్రావీణ్యంలో ఉపయోగించిన కమ్యూనిస్టు మేధావి, విప్లవయోధుడు. విప్లవోద్యమం నాయకత్వంలో కర్ణాటక పడమటి కనుమలలో సాయుధ పోరాటాన్ని నిర్మించి అందులో ప్రాణత్యాగం చేసిన ప్రేమ్ʹగా, ʹసాకిʹ కలం పేరుతో కన్నడ జాతీయతను, దాని చరిత్రను అత్యంత ప్రాచీన కాలం నుండి 1857 తో ఆవిష్కరించిన మేధావిగా, చరిత్రకారునిగా సాకేతకు విరసం జోహారుచేస్తోంది.
(పీపుల్స్ మార్చ్ʹ మార్చి 2005 సంచిక సాయంతో)
-వరలక్ష్మి
(2005 ఏప్రెల్ అరుణతార మాసపత్రికలో ప్రచురించబడినది)
Keywords : karanataka, saket rajan, cpi maoist, fake encounter, martyr
(2023-03-23 16:58:48)
No. of visitors : 1228
Suggested Posts
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |
| ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ... |