కాషాయ కండువాల అరాచకానికి యువతి ధీటైన జవాబు

08-02-2022

హిందుత్వ మూకల అరాచకాలను ఒంటరిగా అయినా కూడా ధైర్యంగా ప్రతిఘటించిన ఓ యువతి ఇవ్వాళ్ళ దేశం దృష్టిని ఆకర్షించింది. వారం రోజులుగా కర్నాటకలో కాషాయ మూకలు సృష్టిస్తున్న మత విద్వేషాలు, అణిచివేతకు నిరసనగా ఇవ్వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి.

అయితే అన్ని ప్రదర్శనలకన్నా ఓ యువతి ప్రదర్శించిన ధైర్యం, ఆత్మవిశ్వాసంతో కూడిన ప్రతిఘటన వీడియో ఇవ్వాళ్ళ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్నాటకలోని మాండ్యా పట్టణంలో ప్రీ యూనివర్సిటీ కాలేజ్ లో జరిగిందీ సంఘటన.

హిజబ్ దరించిన ఓ యువతి తన స్కూటర్ ను కాలేక్ క్యాంపస్ లో పార్క్ చేసి కళాశాల భవనం వైపు వెళ్తుండగా అప్పటికే అక్కడ కాషాయ‌ కండువాలు వేసుకొని అక్కడ ఉన్న‌ ఓ గుంపు జై శ్రీరాం అని అరుస్తూ ఆమె వైపు వచ్చారు. ఆమెను చూస్తూ అభ్యంతకర మాటలు అరిచారు. ఒంటరి అయినప్పటికీ వాళ్ళను, వాళ్ళ వేశాలు చూసిన ఆ యువతి ఏ మాత్రం బెదిరిపోలేదు. పదుల సంఖ్యలో ఉన్న ఉన్న కాషాయ గుంపును చూసి వెనక్కి తగ్గలేదు. చేయి పైకెత్తి ʹఅల్లా హు అక్బర్ʹ అని నినదించింది యువతి. ఆ మూక ఆమెకు అతి సమీపానికి వచ్చినప్పటికీ ఆమె తన నినాదాలు ఆపలేదు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి ఆమెను అక్కడి నుంచి పంపేయడం వీడియోలో కనిపించింది. ఆ సమయంలో కెమరా తీస్తున్న వ్యక్తి వైపు తిరిగి నేను బురఖా ధరిస్తే మీకేంటి సమస్య ? అని ప్రశ్నించింది. ఆమెను పట్టుకోవడానికి కాషాయ మూక ప్రయత్నించగా కళాశాల అధికారులు వచ్చి ఆమెను రక్షించి తీసుకెళ్ళారు.

కాగా కాషాయ కుట్రలకు, అరాచకాలకు వ్యతిరేకంగా ఈ రోజు కర్నాటక వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. బెంగలూరు, మైసూరు, హసన్, షాహపూర్, శివమొగ్గ, ఉడుపి వంటి అనేక పట్టణాల్లో నిరసన ప్రదర్శ్నలు జరిగాయి. హరిహర, దేవెంగిరి నగరాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఒకరిపై ఒకరు రాళ్ళు రువ్వుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది పలు చోట్ల పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

అసలు ఈ పరిస్థితికి కారణమేంటి ?

కర్నాటకలోని ఉడుపి జిల్లా కుందాపూర్ ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ గాళ్స్ కాలేజీలో హిజబ్ ధరించిన విద్యార్థినులను అధికారులు ఈ నెల 3వ తేదీన కాలేజ్ లోకి అనుమతించలేదు. విద్యార్థునులు హిజబ్ ధరించడాన్ని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే సహకారంతో కొందరు హిందుత్వ విద్యార్థులు వ్యతిరేకించడ‍ం వల్లనే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పైగా కర్నాటక రాష్ట్ర విద్యా శాఖ కూడా హిందుత్వ వాదులకు అండగా నిలబడింది. ఇది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమంటూ ప్రజాస్వామ్యవాదులనుండి వ్యతిరేకత వచ్చినప్పటికీ కళాశాల యాజమాన్యం కానీ రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ కానీ హిందుత్వ వాదులవైపే నిలబడ్డాయి. దాంతో ఇది రాష్ట్రవ్యాప్త నిరసనలకు దారి తీసింది.

మరో వైపు ఈ అంశంపై ఉడిపిలోని ప్రభుత్వ కళాశాలకు చెందిన ఐదుగురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కర్ణాటక హైకోర్టు, విద్యార్థులు, ఇతరులకు "శాంతి మరియు ప్రశాంతతను కాపాడాలని" విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్ పై బుధవారంనాడు విచారణ కొనసాగనుంది.

కాగా మూడు రోజుల పాటు అన్ని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

Keywords : karnataka, udupi, Hijab, RSS, BJP, Muslim, Surrounded By Saffron Scarf Group, How Student In A Hijab Fought Back
(2024-04-18 23:38:42)



No. of visitors : 662

Suggested Posts


కర్ణాటక హిజాబ్ ఘర్షణ సృష్టికర్తలు ఎవరు?

ఉడుపిలో ముస్లిం అమ్మాయిలు తరగతి గదిలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోసం చేసిన నిరసనను చాలా మీడియా సంస్థలు హిజాబ్ కూ కాషాయ కండువాలకూ మధ్య జరిగిన వివాదంగా అభివర్ణించాయి.

ʹʹవాళ్ళను ఎదిరించినందుకు నేను చింతించడంలేదు, నా హక్కు కోసం నేను పోరాడుతూనే ఉంటానుʹʹ

ఆమె పేరు ముస్కాన్ అంటే చిరునవ్వు అని అర్దం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆ అమ్మాయి ఇవ్వాళ్ళ తన రౌద్ర రూపం చూయించింది. తన హక్కులను హరిస్తే, తన ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే దేన్నైనా ఎదిరిస్తానని ముస్కాన్ తేల్చి చూపింది.

కళాశాలలో కాషాయ జెండా ఎగరేసిన అరాచక గుంపు ‍- జాతీయ జెండాను పీకేశారా ?

కర్నాటకలో కళాశాలలో హిజబ్ నిషేధించాలన్న డిమాండ్ తో కాషాయవాదులు చేస్తున్న అరాచకం ఇవ్వాళ్ళ తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో అల్లర్లు జరగగా,అనేక కళాశాలల్లో మెడలో కాషాయ కండువాలు వేసుకున్న

కాషాయ కండువాల పిల్లలకు ఉత్తరం

మిమ్మల్ని ఎప్పుడూ కలవకపోయినా మీకు ఉత్తరం రాసే చనువు తీసుకుంటున్నాను. మీ వీడియోలు మొదటిసారి చూసినప్పుడు నాకు చాల భయం కలిగిందని మీకు చెప్పకతప్పదు.

Letter from Meena Kandasamy an author, to Saffron Shawl wearing Children

I take the liberty of writing to you although I have never met you. When I first saw your videos, I admit that I was very scared. I could not believe that something like this was happening in India, our shared country. I was scared not because any of you are dangerous,

ʹతోడేళ్ళుʹ... ʹవాళ్ళపై అస్సలు దయచూపకండిʹ -హిజబ్ వివాదంపై బాలీవుడ్ ప్రముఖుల స్పందన‌

రాజకీయ స్వార్దం కోసం కావాలనే పిల్లలను రెచ్చగొడుతూ సృష్టిస్తున్న‌ హిజబ్ వ్యతిరేక అల్లర్లపై బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. నటి స్వరభాస్కర్, రిచా చద్దా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఒనిర్ ఈ అంశంపై సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు

Islamophobia is taking its most lethal form in India: Noam Chomsky

Celebrated thinker Noam Chomsky said the ʹpathology of Islamophobiaʹ, now growing throughout the West, was ʹtaking its most lethal form in India where the Modi government is systematically dismantling Indian secular democracy and turning the country into a Hindu ethnocracyʹ.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కాషాయ