విద్యార్థి నాయకుడు అనీస్ ఖాన్ దారుణ హత్య - ఇది రాజ్య ఉగ్రవాదమే అని ప్రజా సంఘాల ఆరోపణ‌


విద్యార్థి నాయకుడు అనీస్ ఖాన్ దారుణ హత్య - ఇది రాజ్య ఉగ్రవాదమే అని ప్రజా సంఘాల ఆరోపణ‌

విద్యార్థి

21-02-2022

(రాజకీయ ఖైదీల విడుదల కమిటీ పత్రికా ప్రకటన)

ప్రజా ఉద్యమ కార్యకర్త, విద్యార్థి నాయకుడు Anish Khan అనీస్ ఖాన్ దారుణ హత్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అసలు నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలి. అనీస్ ఖాన్, Aliah University ఆలియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, Howrah హౌరాలోని అమ్తార్ శారదా ఖాన్ పారా నివాసి. 2022 ఫిబ్రవరి 18 రాత్రి రాష్ట్ర పోలీసు యూనిఫాంలో ఉన్న నలుగురు వ్యక్తులు అతని ఇంటి మూడవ అంతస్తు నుంచి కిందికి తోసి చంపేశారు.

అనీస్ ఖాన్ కుటుంబ సభ్యులు చెప్తున్నదాని ప్రకారం, అనీస్ ఖాన్ కొన్ని రోజుల క్రితం కోల్‌కతా నుండి ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతను బయటికెళ్ళొచ్చి రాత్రి ఇంట్లోనే ఉన్నాడు. అర్ధరాత్రి పోలీసు యూనిఫారంలో వున్న కొందరు వ్యక్తులు వచ్చి అరెస్టు చేస్తామని బెదిరించి, ఎవరినీ యింట్లోంచి బయటికి రానీయలేదు. వారిలో ముగ్గురు వ్యక్తులు అనిస్‌ను కొడుతూ తీసుకెళ్లి మూడు అంతస్తుల పైనున్న టెర్రస్ పైనుంచి కిందికి తోసేశారు

ఎప్పటిలాగే, ఈ సంఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు పోలీసులు ప్రకటించలేదు, ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

NRC-CAA వ్యతిరేక ఉద్యమం, ఆలియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న, ఉలుబెరియాలో ప్రజారోగ్య ఉద్యమ వ్యవస్థాపకుడు, రాజకీయ కార్యకర్తలలో ఒకరైన అనీస్ ఖాన్ హత్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

రాజకీయ కార్యకర్త అనీస్ ఖాన్ హత్య పాలన, రాజ్య ఉగ్రవాదానికి స్పష్టమైన ఉదాహరణ అని మేము భావిస్తున్నాం.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రాష్ట్ర పోలీసు, పరిపాలన, అధికార పార్టీ గూండాలు తీవ్ర స్థాయిలో దాడులు చేయడం చాలా కాలంగా చూస్తూనే ఉన్నాం. చాలా సార్లు డిఎం చట్టం బూచిని చూపి ఊరేగింపు, సభలను అడ్డుకొంటున్నారు, అరెస్టులుచేస్తున్నారు,లాకప్‌లో తీవ్ర చిత్రహింసలు పెడుతున్నారు. ఈ క్రూరమైన దురాగతానికి పరాకాష్ట ఈ రోజు మనం చూసిన రాజకీయ కార్యకర్త అనీస్ ఖాన్ హత్య.

మరోవైపు.. అనీస్ హత్యపై విచారణ చేపట్టడానికి ముందే, తృణమూల్ కాంగ్రెస్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ ఘటన వెనుక కుట్ర దాగి ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, 2021, మే 24నాడు అధికార పార్టీ ద్వారా తనకు ప్రాణహాని ఉందని అమతా పోలీస్ స్టేషన్‌లో అనీస్ ఫిర్యాదు చేశాడు. అప్పట్లో అనీస్ పనిచేస్తున్న సంస్థ ఆ ప్రాంతంలో రక్తదాన శిబిరం నిర్వహించినప్పుడు స్థానిక దుండగులు అడ్డుకున్నారు. అనీస్ ఇంటిపై కూడా దాడి చేసి బెదిరించి కొట్టారు. ఇంత జరుగుతున్నా పోలీసులు అనీస్ చేసిన ఫిర్యాదును స్వీకరించలేదు. యిక వేరే మార్గం లేక, అనీస్ తన ఫిర్యాదు కాపీని పోలీస్ స్టేషన్‌తో పాటు అమాతా బ్లాక్, ఉలుబెరియా SDOలకు, హౌరా జిల్లా మేజిస్ట్రేట్‌కు కూడా పంపాడు. కానీ చంపేస్తారేమోననే తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ, పోలీసులు అనీస్ ఆరోపణలను విచారించలేదు; ఎలాంటి భద్రతా కల్పించలేదు. స్థానిక పోలీసులు, స్థానిక గూండాలు కుమ్మక్కై అనీస్ హత్యచేసినట్లు పోలీసు అధికారుల తీరును బట్టి స్పష్టమవుతోంది. అయితే ఈ దారుణ హత్యగురించి సరైన విచారణ సాధ్యమవుతుందా అనే తీవ్ర అనుమానాలు మాకు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఘటనకు బాధ్యత వహించకుండా తప్పించుకోవడానికి తృణమూల్ కుట్ర పన్నిందని గతంలో ఆరోపణలు రావడం చూశాం.
ఈ సమయంలో, అనీస్ ను హత్య చేసిన అసలైన హంతకులను శిక్షించే వరకు ఈ క్రూరమైన, రాజకీయ ప్రేరేపిత హత్యకు వ్యతిరేకంగా గొంతెత్తాలని CRPP (WB) తరపున మేము అన్ని ప్రజాస్వామిక సంస్థలకు, వ్యక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం.

మా డిమాండ్లు:
- అనీస్‌ హంతకులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి.
- అనీస్ బతికున్నప్పుడు పోలీసు అధికారులపై వచ్చిన ఆరోపణల ఆధారంగా తాజాగా దర్యాప్తు ప్రారంభించాలి.

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా తక్షణమే గళం విప్పాలని ప్రజాస్వామిక ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.

- రాజకీయ ఖైదీల విడుదల కమిటీ,
పశ్చిమ బెంగాల్

(ఎన్.వేణు గోపాల్ ఫేస్ బుక్ వాల్ నుండి)

Keywords : Anish Khan, student activist, west bengal, killed, Aliah University, Kolkata , CAA, NRC,
(2023-03-26 03:44:11)



No. of visitors : 781

Suggested Posts


కాషాయ మూక దాడిపై భగ్గుమన్న విద్యార్థిలోకం...వేలాదిమందితో ర్యాలీ

జాదవ్ పూర్ యూనివర్సిటీలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియా సహకారంతో ఏబీవీ సృష్టించిన హింసాకాండను వ్యతిరెకిస్తూ... ప్రజాస్వామ్యంపై కాషాయ మూక చేస్తున్న దాడులను నిరసిస్తూ....విద్యార్థిలోకం గర్జించింది. వాళ్ళకు మద్దతుగా ప్రజలు కదం తొక్కారు.

అవును... మేమిద్దరం కలిసే పోటీ చేస్తాం - సీపీఎం, బీజేపీ నేతల ప్రకటన‌

సిద్దాంతపరంగా శత్రువులమని చెప్పుకునే సీపీఎం, బీజేపీ లు ఎన్నికల రాజకీయాల్లో మాత్రం దోస్తానా చేస్తున్నాయి. ఎన్నికల్లో గెలవడానికి సిద్దాంతాలు అవసరం లేదని భావిస్తున్నట్టున్నాయి ఆ రెండు పార్టీలు. పశ్చిమ బెంగాల్ పంచాయితీ ఎన్నికల్లో త్రుణమూళ్ కాంగ్రెస్ ను ఓడించడం కోసం

కిషన్ జీ దారుల్లో....జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ రాజుకుంటున్నఅగ్గి

అమరుడు కిషన్ జీ నాయకత్వంలో పీడితులు మహత్తర పోరాటాలు చేసిన పశ్చిమ బెంగాల్ జంగల్ మహల్ కొండల్లో మళ్ళీ అగ్గి రాజుకుంటోంది. జంగల్ మహల్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ లు తీవ్రతరం చేశారు.

జేయూ విద్యార్థిపై బ్యాట్లతో దాడి... జై శ్రీరాం అంటూ నినాదాలు

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ లో ఓ విద్యార్థిపై కాషాయమూక విరుచుకుపడింది. క్రికెట్‌ బ్యాట్లు, వికెట్లతో విచక్షణారహితంగా దాడి చేసింది.

జైల్లో రాజకీయ ఖైదీ సుశాంత్ శీల్ మృతి.... ప్రభుత్వానిదే బాధ్యత అని CRPP ప్రకటన‌

జైలు అధికారులు చెప్పిన వివరాల ప్రకారం సుషాంత్ షీల్ అనే రాజకీయ ఖైదీ డమ్ డమ్ కేంద్ర కారాగారంలో ఈ మధ్యాహ్నం ( 16 - 6 - 2020 ) మరణించారు. అతని మరణవార్తను అధికారికంగా ధృవీకరించనప్పటికీ సుషాంత్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి, విచారానికి లోనవుతున్నాం.

భిన్నాభిప్రాయాలపై దాడికి తీవ్ర‌ ప్రతిఘటన ఉంటుంది.. ప్రాణాలకు తెగించే ప్రజలున్నారు - అమర్త్యసేన్

ప్రజాస్వామ్యమంటే కేవలం మెజారిటీ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రమే కాదనీ, ప్రజాస్వామ్యంలో అందరి ప్రయోజనాలకు చోటుంటుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహీత అమర్త్య సేన్‌ ఉద్ఘా టించారు. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ తీరుపై విస్మయం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో గెలిచినంత మాత్రానా దేశంలోని బహుళత్వాన్ని

కేంద్ర మంత్రి సాక్షిగా జాదవ్‌పూర్‌ వర్సిటీలో ఏబీవీపీ హింసాకాండ !

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ విశ్వవిద్యాల యంలో గురువారంనాడు ఏబీవీపీ నిర్వహించిన సెమినార్ కు హాజరైన కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో హాజరయ్యి మైనార్టీల ఉద్దేశాలను తాము పట్టించుకోబోమనీ, వారిని దేశం నుంచి వెళ్లగొడతామని, మూక దాడులను ప్రతిసారీ వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే రీతిలో రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన నేపథ్యంలో విద్యార్థులు ఆగ్రోహోదగ్రులై నిరసన వ్యక్త

Sharmistha:కామ్రేడ్ షర్మిస్టా చౌదరికి విప్లవ జేజేలు - ప్రగతిశీల మహిళా సంఘం

సిపిఐ (ఎం-ఎల్) రెడ్ స్టార్ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మహిళా విభాగం ఆల్ ఇండియా రివల్యూషనరీ ఉమెన్స్ ఆర్గనైజేషన్ (ఎయిర్‌వో) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ షర్మిస్ట ఆకస్మిక మృతికి దిగ్భ్రాంతి చెందుతూ ప్రగతిశీల మహిళా సంఘం

బొగ్గు తవ్వకాలపై భగ్గుమంటున్న బెంగాల్ - మమతపై తిరుగుబాటు

ప‌శ్చిమ బెంగాల్ భీర్భూమ్ జిల్లాలోని ఓ కుగ్రామం బ‌రోమాసియాకు చెందిన సునీతా హ‌న్స్ధా ఇప్పుడు గుండె ప‌గిలి ఏడుస్తున్న‌ది. త‌ర‌త‌రాలుగా ఆ భూమిపై వ్య‌వ‌సాయం చేస్తూ ‌తుకున్న త‌మ‌ను భూమిని వ‌దిలి వెళ్లిపోవాల‌ని అంటున్నార‌ని క‌న్నీరు పెట్టుకుంటున్న‌ది.

UAPAను వ్యతిరేకిస్తూ సంతకం చేసిన మమతా బెనర్జీ అదే చట్టం కింద ప్రజా కార్యకర్తలను అరెస్టులు చేస్తోంది

అక్టోబర్ 12వ తేదీ రాత్రి 11:30 గంటల సమయంలో, రాజకీయ కార్యకర్త టిప్పు సుల్తాన్‌ను శాంతినికేతన్‌లోని గురుపల్లిలో వున్న అతని ఇంటి నుండి పోలీసులు చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారు.

Search Engine

అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
more..


విద్యార్థి