ʹగుజరాత్ ఫైల్స్ʹ అనే మూవీ తీస్తాను, అడ్డుకోబోమని మోడీ హామీ ఇవ్వగలరా ? ప్రముఖ దర్శకులు వినోద్ కప్రీ
22-03-2022
వివేక్ అగ్నిహోత్రి ʹది కాశ్మీర్ ఫైల్స్ʹ మార్చి 11న సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంపై దేశం రెండు వర్గాలుగా చీలిపోయింది. చిత్రంలో చూయించినవన్నీ అసత్యాలని, ఒక మతానికి చెందిన వ్యక్తులపై ద్వేషం రెచ్చగొట్టడానికే ఈ మూవీ తీశారంటూ ఆరోపణలు వచ్చాయి. కశ్మీర్ లో మరణించిన మిలటరీ అధికారి రవిఖన్నా పాత్రను వక్రీకరించారని రవి ఖన్నా భార్య ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగని విషయాలను మూవీలో చూయించారని ఆమె ఆరోపించారు. మరో వైపు ఈ మూవీ కశ్మీర్ లో హిందువుల కష్టాలు చూపించిందనే వాదనలు కూడా మరో వైపు వినిపిస్తున్నాయి. స్వయంగా అధికార బీజేపీ పార్టీ ఈ సినిమా ప్రచారాన్ని తన భుజానికెత్తుకుంది. ప్రధాని మోడీ కూడా ఈ మూవీని ఆకాశానికి ఎత్తారు.
ఈ నేపథ్యంలో తాని ʹగుజరాత్ ఫైల్స్ʹ పేరుతో గుజరాత్ అల్లర్లపై సినిమా తీస్తానని, ప్రధాని ఆ మూవీని అడ్డుకోబోనని హామీ ఇస్తారా అని ప్రముఖ దర్శకులు వినోద్ కప్రీ ప్రశ్నించారు.
వినోద్ కప్రీ తన సోషల్ మీడియా ఖాతాలో రెండు పోస్ట్‌లను పోస్ట్ చేశారు. మొదటి పోస్ట్‌లో, గుజరాత్ ఫైల్స్ పేరుతో, నేను ʹవాస్తవాల ఆధారంగా, కళ ఆధారంగాʹ సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నాను. అందులో మీ పాత్రను కూడా ʹసత్యంʹతో వివరంగా ప్రస్తావిస్తానని రాశాడు. నరేంద్రమోడీ సినిమా విడుదలను అడ్డుకోరని ఈరోజు దేశం ముందు భరోసా ఇస్తారా? అని తన పోస్ట్ లో ప్రశ్నించారు.
దీని తర్వాత అతను తన రెండవ పోస్ట్‌లో ఇలా వ్రాసాడు, నా ఈ పోస్ట్ తర్వాత, నేను కొంతమంది నిర్మాతలతో కూడా మాట్లాడాను. ʹగుజరాత్ ఫైల్స్ʹను రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు చెబుతున్న భావ ప్రకటనా స్వేచ్ఛ ఈ సినిమాకు కూడా వర్తించాలి నిర్మాతలు కోరుకుంటున్నది అదే. భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకోబోమని ప్రధాని హామీ ఇవ్వగలరా అని వినోద్ కప్రీప్రశ్నించారు.
Keywords : kashmir files, vivek agnihotri, vinod kapri, gujarat files, modi
(2023-03-26 21:11:49)
No. of visitors : 874
Suggested Posts
| నీదీ నాదీ ఒకే కథఅందరిలాగే నేనూ ఈ సినిమా నిన్ననే చూసాను పిల్లలతో కలిసి .ఈ సినిమా ఎమోషనల్ గా మనల్ని ఎంత మైమర్పింస్తుందంటే ప్రతి ఒక్కళ్లకి అది తమ కథేమో అన్పించేంత . ఈ కధ లో లూస్ ఎండ్స్ ఉన్నాయి అయినా ఫర్లేదులే అనుకుందామని కూడా అన్పిస్తుంది . అయినా కథలోచాలా అంశాల్ని లింక్ లేకుండా కలిపినట్లుగా అన్పించింది . |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ! |
| సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు |
| పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC |
| పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్ |
| దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక
|
| విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
|
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
|
| ఆదివాసీల అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ |
| ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
|
| ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
|
| ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2 |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1 |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు |
| సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం |
| చెర సాహిత్య సర్వస్వం పునర్ముద్రణ... మీ కాపీని ముందస్తుగా బుక్ చేసుకోండి.. |
more..