కర్ణాటక హిజాబ్ ఘర్షణ సృష్టికర్తలు ఎవరు?

కర్ణాటక

(ఈ వ్యాసం వీక్షణం ఏప్రెల్ , 2022 సంచికలో ప్రచురించబడినది.)

ఉడుపిలో ముస్లిం అమ్మాయిలు తరగతి గదిలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోసం చేసిన నిరసనను చాలా మీడియా సంస్థలు హిజాబ్ కూ కాషాయ కండువాలకూ మధ్య జరిగిన వివాదంగా అభివర్ణించాయి. కాషాయ కండువాలు ధరించిన కొంతమంది విద్యార్థులు హిజాబ్,బురఖా ధరించిన తమ క్లాస్ మేట్స్ కి వ్యతిరేకంగా చేస్తున్న నిరసనలు టీవీ ఛానళ్లకు సులభంగా వ్యాఖ్యానించే అటా ఇటా అనే దృశ్యాలను ఇచ్చాయి.

మొట్టమొదట గత మే లో ఉడుపి లోని ప్రభుత్వ ప్రియూనివర్సిటీ కాలేజ్ అధికారులు ముస్లిం విద్యార్థినులను హిజాబ్ తో క్లాసులోకి రాగూడదని చెప్పినప్పటినుండి ఈ వివాదం మొదలైంది.రంజాన్ తర్వాత కరోనా సెకండ్ వేవ్ కారణంగా కాలేజీలు మూసివేశారు.మళ్లీ సెప్టెంబర్ లో కాలేజీ తెరిచిన తర్వాత అధికారులు మరింత కఠినంగా మారారు. హిజాబ్ ధరించడం తమ హక్కు అని వాదించిన ఎనిమిది మంది ముస్లిం విద్యార్థినులను డిసెంబర్ చివరి వారంలో క్లాస్ రూమ్ నుండి బయటకు పంపించేశారు. డిసెంబర్ 31 నుండి ఈ ఎనిమిది మంది విద్యార్థినులు ఒక్క క్లాస్ కూడా హాజరు కాలేకపోయారు.
ఈ గొడవ ఎలా మొదలయింది?

ఫిబ్రవరి 10 వరకు ఈ ఎనిమిది మంది కాలేజీ బయట నిశ్శబ్దంగా నిరసన తెలియజేశారు.అయితే ఫిబ్రవరి 1న అకస్మాత్తుగా గొడవ వేరే రకంగా మారింది.ఉడుపికి 40 కి.మీ. దూరంలోని కుందాపూర్ జూనియర్ కాలేజీలో వంద మంది విద్యార్థులు అకస్మాత్తుగా కాషాయ కండువాలు వేసుకుని కాలేజీకి వచ్చారు. ఫిబ్రవరి 2న కాషాయ కండువాల సంఖ్య రెట్టింపు అయింది. ఫిబ్రవరి 5న కుందాపూర్ లో ఉన్న ఇంకో నాలుగు కాలేజీలు – బండార్కర్ కాలేజ్,బి బి హెగ్డే కాలేజి,ఆర్ ఎన్ శెట్టి కాలేజి,వెంకటరమణ కాలేజి – పెద్ద కాషాయ కండువాల ప్రదర్శనకు సాక్ష్యంగా నిలిచాయి. ఈ కాషాయ నిరసనకారులు కేవలం నిరసన ప్రకటించడమే కాకుండా క్లాస్ రూమ్ లో హిజాబ్ అనుమతిని నిరాకరించాలని డిమాండ్ చేస్తూ తమ ప్రిన్సిపాళ్లకు మెమోరాండం కూడా ఇచ్చారు.అంతే కాకుండా,తమకు అనుకూలంగా ఉండే టీవీ ఛానళ్లను పిలిచి తమ నిరసన గురించి చెప్పడం మొదలుపెట్టారు.

కాషాయ కండువాల నిరసన ఎలా మొదలయింది?

ఫిబ్రవరి 1 వరకు జరిగిన కార్యక్రమాలను దగ్గరగా పరిశీలిస్తే కుందాపూర్ లో వివిధ కాలేజీ అధికారులు తీసుకున్న నిర్ణయాలు చాలా కలవరపరుస్తాయి. కుందాపూర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్, ఇతర అధికారులు జనవరి 28న ముస్లిం విద్యార్థినులను పిలిచి ఇకనుండి క్లాస్ రూమ్ లోకి హిజాబ్ ధరించి రాకూడదని చెప్పేశారు. ఆ అధికారులు ఒక ప్రభుత్వ ఉత్తర్వును కూడా ఆ విద్యార్థినుల తల్లిదండ్రులకు పంపించారు.

అయితే, వాళ్లు ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వు అంటున్నారో అది నిజానికి కేవలం ఉడుపిలో ఒకే ఒక్క కాలేజీకి సంబంధించిన కాలేజి డెవలప్ మెంట్ కమిటీ ఇచ్చిన సర్క్యులర్ మాత్రమే.
గవర్నమెంట్ పియు కాలేజి దగ్గర ముస్లిం అమ్మాయిల నిరసనను చూసిన కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ హిజాబ్ ను క్లాస్ లో ధరించడానికి వీలులేదని చెబుతూ, ఒక హైలెవల్ కమిటీ దీని గురించి తీర్మానం చేసేవరకూ అంతా ఒకేలా యూనిఫామ్ ధరించాలని ఆ సర్క్యులర్ లో రాశారు.
అయితే వింతగా కుందాపూర్ ఎమ్మెల్యే హలాది శ్రీనివాస్ శెట్టి,కాలేజీ అధికారులు ఆ సర్క్యులర్ ను వేరే విధంగా అర్థం చేసుకున్నట్టు కనిపించారు.ఒక కాలేజీ ఇచ్చిన ఉత్తర్వును అన్ని కాలేజీలకు ఇచ్చినట్టు చూపారు.

ఒక లోతైన సామాజిక విభజన

సంఘటనలను తమకు అనుకూలంగా మార్చు కోవడానికి,హిందూ జాగరణ వేదికె ఫిబ్రవరి 1 నుండి కాషాయ కండువాల నిరసనలు ప్రారంభించి ఆ ప్రాంతంలో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ నిరసనలను కారణంగా తీసుకుని కర్ణాటక ప్రభుత్వం ఏ కాలేజీ లోనూ ఏ విధమైన మతపరమైన కార్యక్రమాలు జరపరాదని,అందరూ ఒకే విధంగా యూనిఫామ్ ధరించాలని, ముఖ్యంగా హిజాబ్ దరించడానికి అనుమతి లేదని ఫిబ్రవరి 5న ఉత్తర్వులు జారీ చేసింది. దీని గురించి మాట్లాడడానికి కుందాపూర్ ఎమ్మెల్యేను సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఆయన మా ఫోన్ కాల్స్ కు, మెసేజెస్ కు స్పందించలేదు.
ఫిబ్రవరి 8న ఉడుపిలో పేరుపొందిన ఎంజిఎం కాలేజీలో హిందూ ముస్లిం విద్యార్థుల మధ్య ఉండిన స్నేహపూరిత వాతావరణం దారుణంగా దెబ్బతింది. ముస్లిం అమ్మాయిలు బురఖా వేసుకుని నిరసన తెలియజేస్తున్న కాలేజీ ఆవరణ దగ్గర కాషాయ కండువాలు వేసుకుని జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని హిందూ విద్యార్థులు నినాదాలు ఇచ్చారు.ఆ తరువాత దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో చాలా వైరల్ అయ్యాయి.అప్పటివరకు వాళ్లలో కొంతమంది అబ్బాయిలు నిరసన చేస్తున్న ముస్లిం అమ్మాయిలతో చాలా స్నేహంగా కూడా ఉండేవారు.

హిందూ జాగరణ వేదికె ఎలా పని చేస్తుంది?

ఉడుపి ఎంజిఎం కాలేజీలో ప్రదర్శనలన్నీ అయిపోయిన వారం రోజుల తర్వాత మేము ఉడుపి దగ్గరగా ఉన్న ఒక చిన్న పట్టణంలో కాఫీషాపులో కొందరు హిందూ జాగరణ వేదికెకు చెందిన ʹఅనధికార సభ్యులనుʹ కలుసుకున్నాం. ఎంజిఎం కాలేజీకి చెందిన శరత్ (పేరు మార్చడం జరిగింది) అనే జర్నలిజం విద్యార్థి కాషాయ కండువాల ప్రదర్శనకు పథకం ఎలా రచించారో ఏమీ దాపరికం లేకుండా తెలియజేశాడు.

మీసాలు కూడా సరిగ్గా రాని 19 సంవత్సరాల శరత్ గత రెండు సంవత్సరాలుగా హిందూ జాగరణ వేదికెలో పని చేస్తున్నాడు. ఇతను హిందూ జాగరణ వేదికె నాయకుడైనా కార్యకర్తగా పిలిపించుకోవడానికి ఇష్టపడతాడు.ఇతను చెప్పిన మీదటే మరో ఐదుగురు వేరే వేరే కాలేజీల అబ్బాయిలు మాతో మాట్లాడారు.
శరత్ ఎనిమిది సంవత్సరాల క్రితమే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో చేరాడు.కుందాపూర్ బండార్కర్ కాలేజీలో జరుగుతున్నది చూసిన తర్వాత, ఆ అమ్మాయిలు యూనిఫాంలో రావడానికి సిద్ధపడకపోతే తాము దాన్ని ఒక సమస్యగా ఎలా మార్చాలో నిర్ణయం తీసుకున్నామన్నాడు.హిందూ జాగరణ వేదికె నాయకులైన ప్రకాష్ కుక్కేహల్లి, లికేష్ లు వెనకాల ఉంటామని,ఏమీ భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారని చెప్పాడు.ఫిబ్రవరి 6న వీళ్లు నలుగురు కలిసి ఒక ఒక వాట్సాప్ గ్రూపు తయారు చేశారు.వెంటనే అందులో 201 మంది విద్యార్థులను చేర్చారు. ఇంకా కొన్ని ఇలాంటి వాట్సప్ గ్రూపులు తయారయ్యాయి.కొంతమంది హిందూ అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని వ్యక్తిగతంగా కలిసి మన సంప్రదాయం, సంస్కృతుల పట్ల బాధ్యతను వాళ్లకు తెలియజెప్పారు.తర్వాత కొంతమంది అమ్మాయిలు కూడా వీళ్లతో కలిసి పనిచేసారు.

ʹఫిబ్రవరి 7న మేం మా కాషాయ కండువాలను సంచుల్లో పెట్టుకుని ఎంజిఎం కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాం.ఈ విధంగా రెండు రకాల నియమాలను అనుసరించడం వీలు కాదని, దీన్ని మేం ఏమాత్రం సహించమని చెప్పాం. ప్రిన్సిపాల్, హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మమ్మల్ని ప్రశాంతంగా ఉండమని,సమస్య పరిష్కరిస్తామని అన్నారు. కాని మరుసటిరోజు ఒకవేళ ముస్లిం అమ్మాయిలను హిజాబ్ తో క్లాసులోకి అనుమతిస్తే మేం మా సంచుల్లోంచి కండువాలు బైటికి తీయాలని అనుకున్నాం. మర్నాడు ముస్లిం అమ్మాయిలు హిజాబ్, బురఖా ధరించి రావడమే కాకుండా లేడీస్ వెయిటింగ్ రూం దగ్గర గుమిగూడి ʹవి వాంట్ జస్టిస్ʹ అని నినాదాలు ఇవ్వడం మొదలుపెట్టారు. కొంతమంది గేటు అవతల నిలబడి అవే నినాదాలు ఇచ్చారు.దానితో మేం రెచ్చిపోయాం. దాదాపు 350 మంది హిందూ విద్యార్థులం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అరవడం మొదలుపెట్టాంʹ అని గర్వంగా చెప్పాడు శరత్.

ʹతలపాగాలు కుటుంబాలకి వెనక్కి ఇచ్చేశాంʹ

హిందూ విద్యార్థులకు కాషాయ కండువాలు, తలపాగాలు హిందూ జాగరణ వేదికె సమకూర్చిందనే అభిప్రాయాన్ని శరత్ మొదట అంగీకరించలేదు.కాని తర్వాత తను,తన స్నేహితులు కండువాలు, తలపాగాలు కొన్ని కుటుంబాల దగ్గర తీసుకున్నామని,అవి తిరిగి ఇచ్చేశామని అన్నాడు.
కాని తలపాగాలను తీసుకుని వెనక్కి ఇచ్చేసిన కుటుంబాల పేర్లు చెప్పమంటే మాత్రం ఒక్క పేరు కూడా చెప్పలేక పోయాడు.

ఫిబ్రవరి 8న ఎంజిఎం కాలేజి దగ్గరకు హిందూ జాగరణ వేదికె నాయకులు వచ్చారా అని అడిగితే, ʹప్రకాశ్ అన్న మాకు నైతిక మద్దతు తెలపడానికి వచ్చాడుʹ అని శరత్ అన్నాడు.అదే రోజు ఆ కాలేజీ బయట విద్యార్థులందరూ కాషాయ కండువాలను, తలపాగాలను జాగ్రత్తగా వెనక్కి అప్పగించడం అనేక వీడియోలలో కనబడింది కూడ.

కుందాపూర్ జూనియర్ కాలేజి విద్యార్థి, 17 ఏళ్ల ఆశిష్ ను హిజాబ్ ఎవరికన్నా ఏ విధంగా ఇబ్బంది అని అడిగినప్పుడు ʹవాళ్లకు మతమే ముందు, దేశం తరువాత.కాని మాకు దేశమే ముందు,మతం దాని తర్వాతే. మేం అడుగుతున్నదల్లా సమానత్వం, అందరూ ఒకే రకంగా ఉండాలని మాత్రమే. వాళ్లు దానికి ఒప్పుకోవడం లేదుʹ అన్నాడు.ʹఉడుపిలో కాషాయ కండువాల నిరసన మొదలుపెట్టింది మేమే. మొదటిరోజు 90 అబ్బాయిలు,అమ్మాయిలు కండువాలు వేసుకుని వచ్చారు. రెండో రోజు 180 మంది కండువాలతో వచ్చారుʹ అన్నాడు ఆశిష్. హిందూ జాగరణ్ వేదికె తో ఎటువంటి సంబంధమూ లేదని కిరణ్ అన్నాడు.కాని శరత్ తెలుసునని, ʹఆయన ఎప్పుడూ కాలేజి దగ్గర తిరుగుతుండే కార్యకర్తʹ అనీ అన్నాడు.

మేం మాట్లాడిన వాళ్లలో ఇద్దరు అబ్బాయిలు భవన నిర్మాణ కూలీల పిల్లలు.మరొక అబ్బాయి మత్స్యకారుల కొడుకు.మేం మాట్లాడిన ఐదుగురూ ఇతర వెనుకబడిన కులాలకు (ఒబిసి) చెందినవారే. తమ ప్రాంతంలో రామాలయాలలో భజనల్లో పాల్గొనడం తమకు ఇష్టం అని గర్వంగా చెప్పారు.
యువ బ్రిగేడ్ అనే ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థ సమావేశాలకు వలంటీర్లుగా వెళ్లినప్పుడు తమకు కాషాయ శాలువాలు దొరుకుతాయని ఈ అబ్బాయిలు చెప్పారు.ఈ అబ్బాయిల సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే వాళ్లు ప్రముఖ హిందుత్వవాదుల రెచ్చగొట్టే ఉపన్యాసాలను క్రమం తప్పకుండా వింటారని తేలింది. వీళ్లలో పత్రికా ప్రపంచం గురించి ఎక్కువగా తెలిసిన శరత్ ను ఏం చదువుతావని అడిగినప్పుడు తనకు సంఘ్ పరివార్ పత్రికా కార్యాలయాలలో ఎవరెవరు తెలుసో గొప్పలు చెప్పాడు.తమకు కాలేజీలో కొందరు లెక్చరర్లు ʹరహస్యంగాʹ సహాయం చేస్తారని, అందువల్ల కాలేజిలో భయమేమీ లేదని అన్నాడు.ఈ ఐదుగురు అబ్బాయిలలో ఒక్కరికి కూడ ముస్లిం స్నేహితులు లేరు. ʹవాళ్లు మాతో మాట్లాడరు, మేం వాళ్లతో మాట్లాడంʹ అని భుజాలు ఎగరేశారు.

తలుపు తెరవడానికి నిరాకరించిన లెక్చరర్

తనను తాను నిష్పక్షపాతమైన నాయకుడినని చెప్పుకునే ఉడుపి ఎం ఎల్ ఎ రఘుపతి భట్ ప్రభుత్వ పియు కాలేజి దగ్గర నిరసన తెలిపిన ఎనిమిది మంది హిజాబ్ నిరసనకారుల మీద అన్యాయమైన ఆరోపణలు చేశాడు. ʹవాళ్లు మొదటి నుంచీ క్రమశిక్షణ లేనివాళ్లే. కాలేజి అంటే క్రమశిక్షణ ముఖ్యం కదా. ఒక విద్యా సంస్థ మత సంస్థలాగ మారగూడదు.ఈ అమ్మాయిలు ఎప్పుడూ టైం కు వచ్చేవారు కాదు, చదువులు కూడ అంతంత మాత్రమేʹ అన్నాడు.

ʹఅసలు నేను వాళ్లను కూడ తప్పు పట్టను. వాళ్లను కొన్ని సంస్థలు తప్పుదారి పట్టిస్తున్నాయి...నేను ఏ సంస్థల గురించి అంటున్నానో మనందరికీ తెలుసుʹ అన్నాడాయన సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అనుబంధ విద్యార్థి సంఘం కాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ హిజాబీ నిరసనకారులను తోలుబొమ్మల్లాగ ఆడిస్తున్నదనే తరచుగా వినబడే ఆరోపణను సూచిస్తూ.

అయితే, విద్యార్థులకు కాషాయ కండువాలు సమకూర్చడంలో హిందూ జాగరణ వేదికె పాత్ర మీద వ్యాఖ్యానించడానికి ఆయన నిరాకరించాడు. కాని యాదృచ్ఛికంగా ప్రభుత్వ పియు కాలేజి బోర్డ్ అధ్యక్షుడు కూడా అయిన ఆయనే ముస్లిం విద్యార్థుల తల్లిదండ్రుల,కాలేజ్ అధికారుల సమావేశంలో ప్రతీకార చర్యల గురించి మాట్లాడి వాళ్లని భయపెట్టాడని ఆ సమావేశంలో పాల్గొన్నవాళ్లు తెలియజేశారు.
ʹమీరు హిజాబ్ గురించి మొండివైఖరి అనుకరిస్తే రేపు వాళ్లు కాషాయ కండువాలు, తలపాగాలు ధరించి వస్తారుʹ అని ఆయన అన్నాడని అక్కడున్న వాళ్లందరూ నిర్ధారించారు.
మేం అక్కడ ఈ గొడవకు గురైన ఇద్దరు ముస్లిం విద్యార్ధినులతో కూడ మాట్లాడాం. ʹమేం క్లాసులోకి వెళ్లగానే, ʹమీరు క్లాసు లోంచి బైటికి పోతారా, మేమే మిమ్మల్ని తోసేయాలాʹ అని వాళ్లు అన్నారుʹ అని ఆలియా అస్సాది చెప్పింది. తాను హిజాబ్ తో క్లాస్ రూంలోకి వెళ్లగానే, వాళ్లు తలుపు లోపలి నుంచి గడియ పెట్టారని, వాళ్లు ఏం చేస్తారోననే భయంతో తలుపు తెరవమని ఎంత బతిమిలాడినా లెక్చరర్ తలుపు తెరవలేదని ఆమె చెప్పింది.

హిజాబ్ ఘర్షణలో లైంగిక వేధింపులు

మామూలుగా కూడ క్లాసులో హిజాబ్ ధరించిన వారిపట్ల వివక్ష చాలా ప్రబలంగా ఉండేదని విద్యార్థినులు అన్నారు.వాళ్లు ఏ ప్రశ్నలు అడిగినా లెక్చరర్లు జవాబు చెప్పేవారు కాదట. లేదా ఇంటర్నల్ పరీక్షలలో వాళ్లకు చాల తక్కువ మార్కులు వేసేవారట.ʹఏమైనా సందేహాలు అడగడానికి వెళితే మా లెక్చరర్స్ అయితే ʹస్నానం చేసేటప్పుడు కూడా హిజాబ్ వేసుకొని చేస్తావాʹ అని అడిగే వారుʹ అని వాళ్లు చెప్పారు. ఇంకా వివరంగా చెప్పమని మేం అడిగినప్పుడు అటువంటి ప్రశ్నలు పురుష లెక్చరర్లే వేసేవారని కూడ అన్నారు.

హిజాబ్ పట్ల తమకున్న అనుబంధాన్ని వాళ్లు భావోద్వేగాలతో వివరించారు.చిన్నతనం నుంచీ ధరించడం అలవాటైన దుస్తుల గురించి హఠాత్తుగా ఇంత రాద్ధాంతం చేయడం, అవి ధరించవద్దని అనడం వాళ్లలో చాల ఆందోళనను నింపింది. ʹమరి మీ చదువు సంగతి ఏమిటి అని మా అధ్యాపకులు మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్లకు మా చదువు మీద నిజంగా శ్రద్ధ ఉంటే, మమ్మల్ని ఎలాగైనా క్లాస్ రూంలలోకి రానిచ్చేవారేʹ అంది హజ్రా.

విద్యార్థుల మధ్య తలెత్తిన ఈ శత్రుత్వం దేశం మొత్తం దృష్టినీ ఆకర్షించగా,తరగతి గదుల లోపల అధికార సంబంధాలు ఎలా పని చేస్తున్నాయో మనం విస్మరించాం.
హిజాబ్ ధరించిన ముస్లిం విద్యార్థినుల మీద లెక్చరర్లు వెటకారాలు,విసుర్లు వెదజల్లుతుండేవారు. ఒక పురుష లెక్చరర్ తనను ʹనువ్వు స్నానం చేసేటప్పుడు కూడ హిజాబ్ వేసుకునే ఉంటావాʹ అని అడిగాడని ఒక విద్యార్థిని మాతో చెప్పింది. ఇది దారుణమైన వ్యాఖ్య. స్పష్టంగా లైంగిక వేధింపు కిందికి వచ్చే ఘటన.

ఒక విద్యార్థిని స్నానం చేయడం గురించి ఒక లెక్చరర్ ఇలా రెచ్చగొట్టేలా అడిగినప్పుడు, ఆ విద్యార్థిని హిందువు అయి ఉంటే, సమస్య హిజాబ్ కు సంబంధించినదీ, ముస్లిం విద్యార్థినులదీ కాకపోయి ఉంటే, అటువంటి సమస్యకు స్త్రీవాదుల నుంచి పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికి ఉండేది. తరగతి గదుల్లో ఇటువంటి సాధారణ స్త్రీ వివక్ష పట్ల, వేధింపు వాతావరణం పట్ల మన పౌర సమాజం సమష్టిగానే ఎలుగెత్తి ఉండేది. బోధనాస్థలాలు సురక్షితంగా ఉండడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆందోళన చెలరేగి ఉండేది.

నేరాతీతంగా,విచారణాతీతంగా సాగుతున్న హిందుత్వ దాడులు తమకు తామే ఉద్దీపన పొందే ఔషధాలు కావు,మన సామాజిక నిర్లిప్తతే ఆ ఉద్దీపనను పెంచి పోషిస్తుంది.
ఇక్కడ మనం కర్ణాటక ప్రసార మాధ్యమాల గురించి కూడా ముఖ్యంగా మాట్లాడుకోవాలి.కొన్ని మాధ్యమాలు మినహాయించి మిగిలినవన్నీ కూడా హిందూత్వ గురించి నిలకడగా స్థిరంగా ప్రచారం చేస్తూనే ఉంటాయి.ఈ విషప్రచారం మామూలు మాటల్లోనే మొదలవుతుంది.చాల వార్తాపత్రికలు ముస్లింలను ʹఇతరʹ సమూహాలు, లేదా ʹఅన్య కోముʹ అని ప్రస్తావిస్తాయి. ఒక మతం మీద మరొక మతాన్ని రెచ్చగొట్టడానికి వార్తా ఛానళ్లు ఉవ్విళ్లూరుతుంటాయి .ప్రతి సమస్యనూ ʹమనమూ వాళ్లూʹ గా విభజిస్తుంటాయి. ఇటువంటి నేపథ్యంలో, హిజాబ్ ను వివాదాస్పదం చేయడం ప్రచార సాధనాలకు ఇష్టమైన దృశ్యంగా మారింది.
కర్ణాటక నమూనా

మంగళూరు, ఉడుపి లలో గత 30 సంవత్సరాలుగా హిందుత్వ పెంచి పోషిస్తున్న ప్రయోగశాలలు నడవడం ఏమాత్రం యాదృచ్చికం కాదు. మూడు సార్లు అతి పెద్ద మత ఘర్షణలు జరగడం,వేలసార్లు ముస్లిం ఆవుల వ్యాపారుల మీద హింస జరగడం, మతాంతర వివాహాలు చేసుకున్న జంటలపై హిందుత్వ సమస్థలు, ముస్లిం సంస్థలు దాడులు చేయడం వంటి సింగ్ చేయడం లాంటి అనేకరకాల వివాదాలతో మంగళూరు ఎప్పుడూ వార్తలలో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే సంఘ పరివార్ ఇలాంటి ప్రయోగాలన్నీ కర్ణాటకలోనే మొదట జరిపి తర్వాత మిగిలిన దేశమంతా విస్తరిస్తూ ఉంటుంది.
ఉదాహరణకు 2009లో లవ్ జిహాద్ పేరు మీద మంగళూరులోని బంత్వల్ తాలూకాలో ఘర్షణలు జరిగాయి. ప్రస్తుతం కాషాయ కండువాల నిరసనల వెనుక ఉన్న హిందూ జాగరణ వేదికె సంస్థే ముస్లింలు 700 మంది హిందూ అమ్మాయిల్ని ఎత్తుకుపోయి బలవంతంగా ముస్లిం మతంలోకి మార్చి బానిసలుగా పెట్టుకున్నారని చిన్న పుస్తకాలు అచ్చువేసి ఈ ప్రాంతమంతా పంచిపెట్టారు.

లవ్ జిహాద్ కి వ్యతిరేకంగా మొట్టమొదటి పెద్ద నిరసన 22 సంవత్సరాల అనితా మౌల్య అనే యువతి కనబడకుండా పోయినప్పుడు బంత్వల్ పోలీసులకు వ్యతిరేకంగా జరిగింది.బంత్వల్ పోలీసులు లవ్ జిహాద్ తీవ్రవాదులను కాపాడుతున్నారని ఆరోపిస్తూ వారికి వ్యతిరేకంగా ఈ నిరసన జరిగింది. అయితే పోలీసులు 20 రోజుల దర్యాప్తు తర్వాత ఈ కేసును ఛేదించారు.అనితనే కాకుండా మరో ఇరవైఒక్క మంది స్త్రీలను సైనైడ్ మోహన్ అనే సీరియల్ కిల్లర్ పెళ్లి పేరుతో వంచించి చంపాడని నిరూపించారు.వాళ్లందరికీ ఆ హంతకుడు టీ లో సైనైడ్ కలిపి ఇచ్చి హత్య చేశాడు.అలా సంఘ్ పరివార్ ʹలవ్ జిహాద్ʹ కట్టుకథలని పోలీసులు ఛేదించారు. కాని ఆ కట్టుకథ నుంచి సంఘ్ పరివార్ సాధించిన ప్రతిఫలం చాల ఎక్కువ.అదే ఇవాళ దేశం మొత్తం మీద మనుషులను చీలదీసే,భయ భీతావహం వ్యాపింపజేసే అంశం అయింది.

ఈ ʹలవ్ జిహాద్ʹ కట్టుకథ తర్వాత కర్ణాటక నమూనా నుంచి ఎగుమతి కాబోయే పెద్ద సరుకులు హిజాబ్ మీద రెచ్చగొట్టిన వివాదం,గోవధ నిరోధ చర్యలు, గోవుల రవాణా వ్యతిరేక చట్టం 2020, మతాంతరీకరణ వ్యతిరేక చట్టం 2021 (ఆశ్చర్యకరంగా దీని పేరు కర్ణాటక మత స్వేచ్ఛ చట్టం!) కాబోతున్నాయనే దాన్ని తోసివేయడం కష్టం.

ఇప్పటికే పొరుగున ఉన్న తమిళనాడులో భారతీయ జనతా పార్టీ,ఇతర సంఘ్ పరివార్ అనుబంధ సంస్థలు మత మార్పిడుల గురించి ఇల్లెక్కి అరుస్తున్నాయి. ఈ మధ్యనే మదురై దగ్గర
మేలూరులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు వేయడానికి వెళ్లిన ఒక ముస్లిం మహిళను భారతీయ జనతా పార్టీ ఏజెంటు బురఖా తీసివేయమని అడిగాడు.మూకలను రెచ్చగొట్టడానికి హిజాబోఫోబియా ఒక శక్తిమంతమైన ఆయుధంగా మారనున్నట్టు కనబడుతున్నది.

ఫాసిజం సౌందర్యశాస్త్రం

ముస్సోలినీ ఇటలీలో అధికార సౌందర్యశాస్త్రం అనే అధ్యయనంలో సిమొనెట్టా ఫలాస్కా-జంపొని ఇటాలియన్ ఫాసిజం సమాజంలో కొన్ని చిహ్నాలనూ, ఆచారాలనూ ప్రదర్శనకు పెట్టి నాయకుడి పట్ల ఆరాధనను రూపొందించిందో ఎన్నో ఉదాహరణల ద్వారా చూపారు. మన స్వదేశీ హిందుత్వ ఫాసిజం కూడ ప్రజా రాశుల్లోకి తన ద్వేష రాజకీయాలను ప్రవేశపెట్టడానికి అటువంటి చిహ్నాల ప్రదర్శననే సాగిస్తున్నదో చూస్తే భయానకమైన పోలికలు కనబడుతున్నాయి.

ముస్లిం బాలికలను,స్త్రీలనూ బహిరంగంగా దుస్తులు విప్పమనడం,ఎంత బతిమిలాడుతున్నా లెక్క చెయ్యకుండా సంస్థల గేటు బైట హిజాబ్ తొలగించమని అడగడం,హిజాబ్ పీడక మూఢాచారమని చెపుతూ హిందూ మత శక్తులు తామే ముస్లిం స్త్రీల రక్షకులలా అభినయించడం, అన్నీ కూడ వాస్తవానికి ముస్లింంలను రెండో తరగతి పౌరులుగా మార్చే హిందూ రాష్ట్ర పథకంలో భాగమైన స్పష్టమైన సూచనలే.
కషాయ కండువాలతో,తలపాగాలతో పథకం ప్రకారం జరిగిన నిరసన ప్రదర్శనలు,ఏకం చేసే నినాదంగా జై శ్రీరాం అనే అరుపులు,సనాతన ధర్మానికీ, ఆర్ ఎస్ ఎస్, భారతీయ జనతా పార్టీలకూ సొంత చిహ్నమైన భగ్వ (కాషాయ) జండాను శివమొగ్గ కాలేజీ మీద ఫిబ్రవరి 8న ఎగురవేయడం – ఈ చర్యలన్నీ కూడ ఈ ప్రదర్శనా రాజకీయాలలో భాగమే. అవి కొత్తగా కనిపెట్టిన హిందుత్వ చిహ్నాలను సంఘటితం చేసే హిందువులందరి చిహ్నాలుగా చూపే ప్రయత్నాలే. ఈ చర్యలు ప్రజల మెదళ్ల మీద హిందుత్వ చిహ్నాలను ముద్రించే తక్షణ, విషపూరిత, మౌలిక లక్ష్యాన్ని నెరవేర్చేవే.

(జి. విష్ణు ఉడుపిలో నివసించే ఫ్రీలాన్స్ రచయిత. మీనా కందసామి తమిళనాడుకు చెందిన కవి, రచయిత)
(తెలుగు: రాణి నిడదవోలు)

Keywords : hijab, udupi, karnataka, RSS, BJP, hindu jagarana vededike,
(2024-07-15 11:47:07)No. of visitors : 3865

Suggested Posts


ʹʹవాళ్ళను ఎదిరించినందుకు నేను చింతించడంలేదు, నా హక్కు కోసం నేను పోరాడుతూనే ఉంటానుʹʹ

ఆమె పేరు ముస్కాన్ అంటే చిరునవ్వు అని అర్దం ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ఆ అమ్మాయి ఇవ్వాళ్ళ తన రౌద్ర రూపం చూయించింది. తన హక్కులను హరిస్తే, తన ఆత్మ గౌరవం మీద దెబ్బకొడితే దేన్నైనా ఎదిరిస్తానని ముస్కాన్ తేల్చి చూపింది.

కళాశాలలో కాషాయ జెండా ఎగరేసిన అరాచక గుంపు ‍- జాతీయ జెండాను పీకేశారా ?

కర్నాటకలో కళాశాలలో హిజబ్ నిషేధించాలన్న డిమాండ్ తో కాషాయవాదులు చేస్తున్న అరాచకం ఇవ్వాళ్ళ తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్రంలోని అనేక పట్టణాల్లో అల్లర్లు జరగగా,అనేక కళాశాలల్లో మెడలో కాషాయ కండువాలు వేసుకున్న

కాషాయ కండువాల పిల్లలకు ఉత్తరం

మిమ్మల్ని ఎప్పుడూ కలవకపోయినా మీకు ఉత్తరం రాసే చనువు తీసుకుంటున్నాను. మీ వీడియోలు మొదటిసారి చూసినప్పుడు నాకు చాల భయం కలిగిందని మీకు చెప్పకతప్పదు.

Letter from Meena Kandasamy an author, to Saffron Shawl wearing Children

I take the liberty of writing to you although I have never met you. When I first saw your videos, I admit that I was very scared. I could not believe that something like this was happening in India, our shared country. I was scared not because any of you are dangerous,

ʹతోడేళ్ళుʹ... ʹవాళ్ళపై అస్సలు దయచూపకండిʹ -హిజబ్ వివాదంపై బాలీవుడ్ ప్రముఖుల స్పందన‌

రాజకీయ స్వార్దం కోసం కావాలనే పిల్లలను రెచ్చగొడుతూ సృష్టిస్తున్న‌ హిజబ్ వ్యతిరేక అల్లర్లపై బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. నటి స్వరభాస్కర్, రిచా చద్దా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ ఒనిర్ ఈ అంశంపై సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు

కాషాయ కండువాల అరాచకానికి యువతి ధీటైన జవాబు

హిందుత్వ మూకల అరాచకాలను ఒంటరిగా అయినా కూడా ధైర్యంగా ప్రతిఘటించిన ఓ యువతి ఇవ్వాళ్ళ దేశం దృష్టిని ఆకర్షించింది. వారం రోజులుగా కర్నాటకలో కాషాయ మూకలు సృష్టిస్తున్న మత విద్వేషాలు, అణిచివేతకు నిరసనగా ఇవ్వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి.

Islamophobia is taking its most lethal form in India: Noam Chomsky

Celebrated thinker Noam Chomsky said the ʹpathology of Islamophobiaʹ, now growing throughout the West, was ʹtaking its most lethal form in India where the Modi government is systematically dismantling Indian secular democracy and turning the country into a Hindu ethnocracyʹ.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కర్ణాటక