"రాజుగారి దేవతావస్త్రాలు" బైట పెట్టిన డిజైనర్


"రాజుగారి దేవతావస్త్రాలు" బైట పెట్టిన డిజైనర్

రాజుగారి దేవతావస్త్రాలు

16-04-2022

డిజైనర్ కునాల్ మర్చంట్ కు ప్రధానమంత్రి ఆంతరంగిక కార్యదర్శి వివేక్ కుమార్ నుంచి ఒక లేఖ వచ్చింది. కునాల్ మర్చంట్ డిజైనింగ్ రంగంలో చేసిన కృషిని గుర్తించిన ప్రధాని నరేంద్రమోడీ తన కార్యాలయం కోసం ఒక ప్రత్యేకమైన బల్లను డిజైన్ చేసి, తయారు చేయమని అడిగారని ఆ లేఖలో ఉంది. దానికి కునాల్ మర్చంట్ రాసిన జవాబు చదవండి: -ఎన్.వేణుగోపాల్

డియర్ శ్రీ వివేక్ కుమార్ గారూ,
ఇటువంటి ప్రతిష్టాత్మకమైన పథకం కోసం నన్నూ, నా రూపకల్పనా కృషినీ గుర్తించినందుకు ధన్యవాదాలు. దురదృష్టవశాత్తూ, నా రాజకీయ, సామాజిక అభిప్రాయాల వల్ల, ఈ అవకాశాన్ని సగౌరవంగా తిరస్కరిస్తున్నాను. ఆ పథకపు పోటీదార్లలో ఒకరుగా నన్ను పరిశీలించగూడదని కోరుతున్నాను.
పరిస్థితులు భిన్నంగా ఉండి ఉంటే, ఈ పథకాన్ని చేపట్టే అవకాశం నాకుంటే, నేను తప్పకుండా ఈ పథకాన్ని చేపట్టి ఉండేవాణ్ని. అటువంటి పరిస్థితిలో ఈ బల్లకు నేను ʹస్వరాజ్ బల్లʹ అని పేరు పెట్టి ఉండేవాణ్ని. అమెరికా అధ్యక్షుడు వినియోగించే బల్లను ʹనిర్ణయాత్మక బల్లʹ అన్నట్టుగానే.
నేను ఆ బల్లను మన దేశ ఐక్యతకూ, సోదరత్వానికీ, భిన్నత్వానికీ ప్రతీకగా నిలిచేలా, దేశం మొత్తం నుంచీ సేకరించిన కలపతో, ముడి పదార్థాలతో తయారు చేసి ఉండేవాడిని.

అన్నిటికన్న మొట్టమొదట నేను ఒక గాంధేయవాదినని మీకు తెలియజేయదలచాను. నేను నిజమైన అహింసా స్ఫూర్తిలో, పౌర సత్యాగ్రహం ద్వారా సామాజిక పరివర్తనలో విశ్వాసం ఉన్నవాడిని. గాంధీజీతో కలిసి నడిచిన వారి నుంచి నేను ప్రత్యక్షంగా స్వరాజ్ అనే మాటకు నిజమైన అర్థాన్ని నేర్చుకున్నాను. భారత ప్రజలలో ప్రతి ఒక్కరూ తనకు తానే యజమానిగా ఉండాలని గాంధీజీ కోరుకున్నారు. దాని అర్థం బ్రిటిష్ వలసవాదుల నుంచో, మరొక వలసవాదుల నుంచో స్వాతంత్ర్యం అని మాత్రమే కాదు. ఏ పరిస్థితిలోనైనా ఆయన సందేశం ఒకటే – ʹస్వరాజ్ అంటే స్వయం పాలన. ఒక పరాయి పాలకుడిని ప్రతిఘటించడానికీ, కూలదోయడానికీ ముందు, ప్రతి భారతీయుడూ తనకు తానే యజమాని కావాలిʹ అన్నారాయన. ఒక రూపశిల్పిగా, సృష్టికర్తగా ఈ మాటలకు నేనేమని అర్థం చెప్పుకున్నానంటే, ఒక మంచి రూపశిల్పి కావడానికి మొదటి అడుగు నా ఆత్మకు నేను యజమాని కావలసి ఉంటుందని.
రూపకల్పనా (డిజైన్) రంగంలో, ఎవరికి వారే శత్రువు. తన సొంత అహంకారాన్ని, ఆత్మసంశయాన్ని, సొంత తీర్పులను, సొంత అభిప్రాయాలను ఓడించడంలో గడ్డు అవరోధాలను అధిగమించవలసి ఉంటుంది. అన్ని కళా రంగాలలోనూ, అది రూపకల్పన అయినా సృజనాత్మకత అయినా, దురభిప్రాయమూ నిశ్చలనిశ్చితమూ నైతికతా పక్కనపెట్టి, స్వేచ్ఛగా సృజించాలంటే, విముక్తి పొందాలంటే ఇదే కీలకం. మీ ప్రభుత్వపు చర్యలూ, అభిప్రాయాలూ, దాని విధానాలూ అన్నివేళలా ప్రజల లోని ఈ విముక్తి భావోద్వేగాలను అణచివేయడానికే ప్రయత్నిస్తున్నాయని నేను గుర్తించాను. ఆ విముక్తి భావోద్వేగాల స్థానంలో మీరు ప్రపంచం గురించీ, మన చరిత్ర గురించీ, మన సమాజ భవిష్యత్ ప్రయాణం గురించీ సంకుచిత, మూఢ, చౌకబారు అవగాహనలను నింపదలచుకున్నారు.
మన ప్రస్తుత ప్రధాన మంత్రి, పాలక పక్షం అనుసరించే రాజకీయాలనూ, విధానాలనూ నేను మౌలికంగానే వ్యతిరేకిస్తూ వస్తున్నాననేది రహస్యమేమీ కాదు. మీరు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్న భారతదేశం గతంలో ఎన్నడూ ఉనికిలో లేదు. దానికి వర్తమానంలో పునాదే లేదు. దాని భవిష్యత్తులో అవకాశమే లేదు. మీ భారతదేశం దురభిప్రాయాల భారతదేశం. ద్వేషం నిండిన భారతదేశం. కొందరి గుత్తాధిపత్యపు భారతదేశం. జాత్యహంకారపు భారతదేశం. కాని నా భారతదేశం లౌకికమైనది, బహుళమైనది, అందరినీ కలుపుకుపోయేది. సహిష్ణుత నిండినది. నా భారత దేశం ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిని స్వీకరించిన, తనలో సంలీనం చేసుకున్న ఏడు వేల సంవత్సరాల నాగరికతా శక్తిని నమోదు చేసుకున్నది.

నా తోటి పౌరులలో 20 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగువన బతుకులీడుస్తుండగా, ముస్లింలైన 22 శాతం మంది నా తోటి పౌరులు మీ ప్రభుత్వమూ దాని విధానాలూ సృష్టించిన అంచులకు నెట్టబడిన పరిస్థితులలో జీవిస్తున్నారు. మైనారిటీలను ఇంకా వేరుచేసే, అవకాశాల నుంచి దూరం చేసే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధానాలను రూపొందించే బల్లను రూపకల్పన చేయడం, తయారు చేయడం అనైతికమనీ, అన్యాయమనీ నేను భావిస్తున్నాను.
నాజీలకు మద్దతు ఇచ్చినవారినీ, వారికి అవసరమైన సరుకులు అందజేసినవారినీ, వారి గురించి ప్రచారం చేసినవారినీ కూడ చరిత్ర నాజీలుగానే గుర్తించిందని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. నేను అటువంటి పనితో ఎటువంటి సంబంధమూ పెట్టుకోదలచుకోలేదు. ఈ పాలకులకు ఎటువంటి సహాయమూ చేయదలచుకోలేదు. లేకపోతే చరిత్ర నన్ను మీ జాత్యహంకారానికీ, ఫాసిజానికీ, సంకుచిత, మూర్ఖ ఆలోచనా పద్ధతికీ, మీ బందిపోటుకూ సహకరించిన వాడిగా నమోదు చేస్తుంది. రూపశిల్పిగా, నేను నా చుట్టూ ఉన్న ప్రజలకు ప్రేరణ ఇవ్వదలచుకుంటాను, వారి జీవన నాణ్యతను పెంపొందించదలచుకుంటాను.

ప్రధానమంత్రి కార్యాలయానికి ఒక బల్ల తయారు చేయడం, మీ పాలనకు దోహదం చేయడం ఈ లోకంలో నా కర్మ శక్తిని దిగజార్చడం మాత్రమే కాదు. అది నా మిత్రుల పట్లా, కుటుంబం పట్లా, మైనారిటీలు, ఎల్ జి బి టి క్యు సమూహం, దళితులు, షెడ్యూల్డ్ కులాల వంటి అనాదృత నేపథ్యాల నుంచి వచ్చిన నా తోటి సిబ్బంది పట్లా అపరాధం చేసినట్టవుతుంది. ʹఎటువంటి మినహాయింపులు లేకుండా మనందరమూʹ అనే పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే నేను సగర్వంగా, నా సంపూర్ణ అంతర్గత శక్తితో, విశ్వాసంతో, మన రాజ్యాధిపతి కోసం ʹస్వతంత్రతా బల్లʹ ను నిర్మించగలుగుతాను. అప్పటివరకూ మీ బల్లకు రూపకల్పన చేయడానికీ, తయారు చేయడానికీ మరొకరిని చూసుకొండి.
అభినందనలతో
కునాల్ మర్చంట్
(తెలుగు: ఎన్ వేణుగోపాల్)

Keywords : narendra modi, Kunal Merchant, designer viral note declining to make table for Modi.
(2023-05-31 22:32:16)



No. of visitors : 522

Suggested Posts


లెనిన్‌ ఎవరూ..!?

భగత్‌సింగ్‌ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్‌ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్‌ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్‌ యూనియన్‌ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్‌ రిపబ్లిక్‌ అసోషియేషన్‌ʹ

నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం

రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి.

ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్

ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు....

Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV

I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ.

ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...

ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్‌ఖాన్‌ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్‌ఖాన్‌ స్నేహితుడు అస్లామ్‌ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.

ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !

అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు.

ఏబీవీపీకి భయపడను ‍- అమర జవాను కూతురు

ʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్....

అవును,దళిత బాలిక‌ కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులు

ఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత ‍- ఉమర్ ఖలీద్

మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.

కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు....

Search Engine

RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
more..


రాజుగారి దేవతావస్త్రాలు