నర్మద మరణం ప్రభుత్వం హత్యే - 25న బంద్ కు పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ
అత్యంత సీనియర్ మహిళా మావోయిస్టు నాయకురాలు నిర్మల అలియాస్ నర్మదా దీదీ మహారాష్ట్ర జైలులో మరణించిన నేపథ్యంలో ఏప్రిల్ 25న దండకారణ్య బంద్ కు పిలుపునిచ్చింది మావోయిస్టు పార్టీ. అన్ని ఆరోజు కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు.
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో 42 ఏళ్ల పాటు క్రియాశీలక సభ్యురాలిగా పనిచేసిన 62 ఏళ్ల నిర్మల, మహారాష్ట్రలోని జైలులో ఏప్రిల్ 9న ప్రాణాలతో పోరాడుతూ మరణించింది.
ʹʹకామ్రేడ్ నర్మద ఎలియాస్ ఉప్పుగంటి నిర్మలా కుమారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, గన్నవరం గ్రామంలో పుట్టి పెరిగింది. 80వ దశకంలో తన యవ్వనప్రాయంలో నక్సల్బరీ మార్గం పట్ల ఆకర్షితురాలై విప్లవోద్యమంలో అడుగుపెట్టింది. ఆనాటి నుండి విప్లవం, ప్రజల పట్ల అచంచల విశ్వాసంతో, అకుంఠిత దీక్షతో ముందుకు సాగింది. ప్రారంభ కాలంలో కొన్ని సంవత్సరాలపాటు ఆమె దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార పత్రిక - ʹప్రభాత్ʹ సంపాదక మండలి సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించింది. తర్వాత ఆమె గఢ్ చిరోలి యుద్ధ మైదానంలో కాలుమోపింది. ఒకవైపు సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తూ రెండో వైపు క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘానికి నాయకత్వం వహించింది. ఆమె కొన్ని సంవత్సరాల పాటు కేఏఎంఎస్ జోన్ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించింది.ʹʹ అని మావోయిస్టు పార్టీ మావోయిస్టు అధికార ప్రతినిధి మంగళి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ʹʹఆమె ఒక మంచి రచయిత్రి. ʹనిత్య అనే కలం పేరుతో మహిళా సమస్యలపై అనేక వ్యాసాలు, కథలు రాసింది. విప్లవోద్యమంలో తను వహించిన ముఖ్యమైన పాత్ర ఫలితంగా అమె దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆ తర్వాత డీకే ఎస్ జెడ్ సీ సెక్రటేరియట్ సభ్యురాలైంది. గఢ్ చిరోలి ఉద్యమంలో ముఖ్యమైన కీలక పాత్ర వహిస్తూ డీకేఎస్ జెడ్ సీకి చెందిన పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జ్ బాధ్యతలను నిర్వర్తించింది. ఉద్యమ ఎగుడు-దిగుళ్లలో, గడ్డు పరిస్థితిలో, తీవ్రమైన నిర్బంధంలో అమె ధైర్యసాహసాలతో ఉద్యమానికి నేతృత్వం వహించింది. ప్రజలూ, పార్టీ శ్రేణుల ప్రేమనూ, విశ్వాసాన్ని అపారంగా చూరగొన్నది. ఈ క్రమంలో కేన్సర్ వ్యాధికి గురై పోరాట ప్రాంతం నుండి బయటకు వెళ్లింది. చికిత్స పొందుతూ అరెస్టయింది.ʹʹ అని మావోయిస్టు పార్టీ తెలిపింది.
నర్మద మరణం ప్రజా ఉద్యమానికి తీరని లోటని పార్టీ పేర్కొంది.. అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు నేత నిర్మల మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ మావోయిస్టు పేర్కొంది.
జైలులో ఆమెకు సరైన చికిత్స, మందులు అందించకపోవడంతోనే ఆమె చనిపోయిందని పార్టీ ఆరోపించింది.
నిర్మల 2018లో అనారోగ్యంతో బాధపడి 2019లో హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు అరెస్టు చేశారని మావోయిస్టు అధికార ప్రతినిధి మంగళి ప్రెస్ నోట్‌లో తెలిపారు.
ఆమెను 100కు పైగా తప్పుడు కేసుల్లో ఇరికించారని, ఆమె తలపై ప్రభుత్వం రూ.25 లక్షల నజరానా పెట్టిందని మావోయిస్టు ప్రతినిధి ఆరోపించారు.
ʹʹమహిళా విముక్తి, పీడిత ప్రజల రాజ్యాధికార స్థాపనకై సుదీర్ఘ కాలం పాటు దృఢంగా పని చేసి తన అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన కామ్రేడ్ నర్మద ఆశయాలను ఎత్తిపడుదాం. ఆమె దారిలో మరింత దృఢంగా ముందుకు నడుస్తూ ఉద్యమాన్ని బలోపేతం, విస్తృతం చేసి కామ్రేడ్ నర్మద కలలను సాకారం చేద్దాం.ʹʹఅని పిలుపునిచ్చిన మావోయిస్టు పార్టీ ఆమె మరణానికి కారణమైన పాలకుల విధానాలకు నిరసనగా ఈ నెల 25 న దండకారణయ బంద్ పాటించాలని ప్రజలను ఆ పార్టీ అధికార ప్రతినిధి మంగళి కోరారు.
Keywords : narmada, nirmala, cpi maoist, dandakaranyam, abhay, vikalp, mangali
(2023-05-31 22:32:16)
No. of visitors : 561
Suggested Posts
| దండకారణ్య విప్లవోద్యమ నాయకురాలు కా. నర్మదకు విప్లవ జోహార్లు!కా. నిర్మల @ నర్మద శనివారం ఉదయం కేన్సర్ తో మరణించిందనే విషాద వార్త తెలిసింది. ఆమె మరణంతో భారత విప్లవోద్యమం ఒక గొప్ప నాయకురాలిని కోల్పోయింది. |
| విప్లవ యోధురాలు,గొప్ప రచయిత్రి నర్మద అమర్ రహే ! - క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘందండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, సెక్రటేరియట్ సభ్యురాలూ, క్రాంతికారీ ఆదివాసీ మహిళా సంఘం (కేఏఎమ్ ఎస్) సీనియర్ నాయకురాలు కామ్రేడ్ నర్మద (ఉప్పుగంటి నిర్మలా కుమారి) ఏప్రిల్ 9వ తారీఖున ప్రభుత్వ నిర్బంధంలో తుదిశ్వాస వదిలిందనే సమాచారం మాకు ఆలస్యంగా తెలిసింది. కేఏఎంఎస్ ఆమెకు వినమ్ర నివాళి అర్పిస్తున్నది. ఆమె త్యాగాల దారిలో మరింత దృఢంగా ముందుకు సాగమని కేఏఎంఎస్ కార్ |
| ʹపూచిన చెట్టుకిందనే రాలిన పువ్వుʹ -ఎన్.వేణుగోపాల్చిరకాల మిత్రురాలు, నర్మదక్కగా దండకారణ్య విప్లవోద్యమ నిర్మాణంలో సుప్రసిద్ధమైన ఉప్పుగంటి నిర్మల మరణించిందనే దుర్వార్తను ఇవాళ బొంబాయి పత్రికలు మోసుకొచ్చాయి. |