Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు
07-05-2022
మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని అయితే అందుకు తమకు కూడా కొన్ని ముందస్తు షరతులున్నాయని సీపీఐ మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ప్రకటనలో పేర్కొన్నారు.
వికల్ప్ ప్రకటన పూర్తి పాఠం....
మా చర్చల నిబంధనలపై ముఖ్యమంత్రి తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలి!
ప్రజల రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడం ఆపండి!
మావోయిస్టులు భారత రాజ్యాంగాన్ని అంగీకరించి ఆయుధాలు వదులుకుంటే వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రకటించడం అసంబద్ధం, కపటత్వానికి నిదర్శనం. ఒకవైపు ఏరియల్ బాంబ్ దాడులు చేస్తూ మరోవైపు చర్చల ప్రతిపాదన చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే. ఇది మావోయిస్టులపై దుష్ప్రచారం చేయడమే తప్ప మరొకటి కాదు. ఈ ప్రకటన వెనుక పెద్ద దాడికి కుట్ర జరుగుతోంది.
తూటాలకు తూటాలతో సమాధానం చెప్పే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ప్రశ్నించిన ముఖ్యమంత్రి ఇటీవలి వైమానిక దాడులకు ఎందుకు సమ్మతించారో చెప్పాలి? బఘేల్ జీ తన సొంత ప్రజలపైనే జరుగుతున్న యుద్ధంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలిపాడని ఇటీవల జరిగిన వైమానిక బాంబు దాడి రుజువు కాదా?
బస్తర్ ప్రజలపై ఏరియల్ బాంబు దాడులు జరగలేదు అంటూ బస్తర్ IG పచ్చి అబద్ధం చెబుతున్నారు. మీరు కూడా కూడా ఏరియల్ బాంబు దాడిని తిరస్కరిస్తే, ఏ దేశ సైన్యం వచ్చి బస్తర్ అడవుల్లో ఏరియల్ బాంబు దాడి చేసిందో దర్యాప్తు చేయండి.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఆరు సాయుధ సంస్థలతో తమ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నట్లు స్వయంగా ప్రధాని ప్రకటించినప్పుడు, మాతో చర్చల కోసం ఆయుధాలు వదులుకోమని ముఖ్యమంత్రి బఘేల్ జీ ఎందుకు అడుగుతున్నారు? ఇందులో ఎలాంటి లాజిక్ లేదు. పెట్రోలింగ్ ఆపరేషన్లు, ఎన్‌కౌంటర్లు, తప్పుడు ఎన్‌కౌంటర్లు, ఊచకోతలు, అక్రమ అరెస్టులు, ప్రజా ప్రాణాలకు, ఆస్తులకు నష్టం చేస్తున్నారు. మా పార్టీ, పిఎల్‌జిఎ పేరుతో ప్రతిరోజూ లక్షలాది మంది పోలీసులను, పారామిలటరీ,సైనిక బలగాలను దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో మోహరిస్తున్నారు. విప్లవ పీపుల్స్ కమిటీల నిర్మూలన కోసం ప్రచారాలను నిర్వహిస్తూ, నిరంతరం సాయుధ దళాల కొత్త శిబిరాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు మమ్ములను ఆయుధాలను వదులుకోమని అడగడం హాస్యాస్పదమైనది, అర్థరహితం మరియు అసంబద్ధం.
భారత రాజ్యాంగానికి వ్యతిరేకిస్తున్నది ప్రభుత్వాలే. ప్రభుత్వాలు మాత్రమే ప్రజల రాజ్యాంగ హక్కులను ఘోరంగా ఉల్లంఘిస్తున్నాయి. ఐదవ షెడ్యూల్, పెసా చట్టం ప్రకారం గ్రామసభల హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో గ్రామసభల అనుమతి లేకుండా పోలీసులు, పారామిలటరీ బలగాలు, సైనిక బలగాల శిబిరాలు విచ్చలవిడిగా ఏర్పాటు చేసి రోడ్లు, వంతెనలు, కల్వర్టులు నిర్మిస్తున్నారు. నిరసనలు చేస్తున్నప్పుడు, మారణకాండలు, తప్పుడు ఎన్‌కౌంటర్లలో గిరిజనులు చంపుతున్నారు. దేశంలోని సహజ సంపద, వనరులను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి బస్తర్ గిరిజనులపై వైమానిక దాడులు చేస్తున్నారు. హెలికాప్టర్లు, డ్రోన్లు పగలూ రాత్రీ వారి తలలపై తిరుగుతూనే ఉన్నాయి. వారి జీవనం కష్టంగా మారింది.
నయా రాయ్‌పూర్ నిర్వాసిత రైతుల ఉద్యమం, పోలీసు శిబిరాలు, మారణకాండలకు వ్యతిరేకంగా, వారి ఇతర న్యాయమైన డిమాండ్‌ల కోసం, గత సంవత్సరం నుండి సిలంగర్ స్థానిక ప్రజల ఉద్యమంతో సహా, వెచ్చఘాట్, వేచపాల్, పుస్నార్, గోంపాడ్, పుస్‌గుప్ప వంటి ప్రదేశాలలో ప్రజలు శాంతియుత, రాజ్యాంగ బద్దమైన ధర్నాలు చేస్తూ ఉంటే వారిపై సాయుధ బలగాల క్రూరమైన దాడులు ఏమి సూచిస్తున్నాయి?
నిజం చెప్పాలంటే రాజ్యాంగాన్ని ఆమోదించమని అడిగే నైతిక హక్కు కూడా ప్రభుత్వాలకు లేదు. ముందుగా ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని పాటించి నిజాయితీగా అమలు చేయాలి. కేవలం కాగితాలకే పరిమితమైన సార్వభౌమాధికారం, లౌకికవాదం, సామ్యవాదం, ప్రజాస్వామ్యం వంటి రాజ్యాంగ పీఠికలోని ప్రాథమిక భావాలను ధ్వంసం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంది.
మావోయిస్టు ఉద్యమాన్ని నాశనం చేయడం కోసం, బాఘేల్ జీ విశ్వాసం, అభివృద్ధి మరియు భద్రత సూత్రాల గురించి మాట్లాడారు. ఇక్కడ దేశ, విదేశీ కార్పొరేట్ సంస్థల విశ్వాసాన్ని గెలుచుకోవడం, వారి అభివృద్ధికి అవసరమైన పథకాలను అమలు చేయడం వారి ఆర్థిక మరియు ఇతర ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఇది ఒక ఫార్ములా అని బాఘేల్ జీ మాటలను ప్రజలు అర్థం చేసుకోవాలి.
చివరగా, ముఖ్యమంత్రి చర్చల ప్రతిపాదనకు మా ప్రతిస్పందన ఏమిటంటే, మేము చర్చలకు ఎల్లవేళలా సిద్దంగానే ఉన్నాము. అందుకోసం అనుకూలమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మీది. ముందుగా మా పార్టీపై , PLGA, ప్రజా సంఘాలపై విధించిన ఆంక్షలను తొలగించి చర్చలకు అనుకూలమైన వాతావరణం సృష్టించండి. మాకు బహిరంగ కార్యకలాపాలు చేసుకునే అవకాశం ఇవ్వండి, వైమానిక బాంబు దాడులను ఆపండి, సంఘర్షణ ప్రాంతాల నుండి సాయుధ దళాల శిబిరాలను ఉపసంహరించుకోండి, బలగాలను వెనక్కి పంపండి, జైలులో ఉన్న మా నాయకులను చర్చల కోసం విడుదల చేయండి. ఈ సమస్యలపై మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేయండి.
వికల్ప్
అధికార ప్రతినిధి
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)
Bastar Talkies ట్విట్టర్ హ్యాండిల్ సౌజన్యంతో
Keywords : chattis garh, cpi maoist, Chhattisgarh Chief Minister, Bhupesh Baghel
(2025-01-16 10:54:48)
No. of visitors : 2741
Suggested Posts
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటనవిడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు. |
| జంపన్నలేఖకు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
జూన్ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన |
| PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటనపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా. |
| పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీసీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది. |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము. |
| మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనఅనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి, |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణవేలాది ఎర్రని జెండాలతో దండకారణ్యం ఎర్రబడింది. వేల మంది ప్రజల నినాదాలతో దండకారణ్యం దద్దరిల్లింది. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చత్తీస్గడ్ తెలంగాణ బార్డర్లో మావోయిస్టు పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. |