త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్


త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్

త్వరలో

09-05-2022

సిలింగేర్‌ పోరాటానికి ఏడాది
మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
త్వరలో ముద్ర ప్రచురణగా రాబోతుంది

సిలింగేర్‌.. ఒక ఊరి పేరు. కానీ ఆ పోరాటం ఆ ఊరిదే కాదు. ఆ ఊళ్లో మొదలైంది. నిజానికి ఇలాంటి పోరాటాలు గత ముప్పయ్యేళ్లుగా చాలా పల్లెలు చేస్తున్నాయి. కానీ సిలింగేర్‌లో మొదలైన పోరాటం అనేక గ్రామాలకు అంటుకుంది. పక్క రాష్ట్రానికి చేరుకుంది. ఏడాదిగా కొనసాగుతున్నది. ఎక్కడా అలిసిపోలేదు. లొంగిపోలేదు. ఆరంభం నుంచే పోలీసు కాల్పులు, దాడులు, హత్యలు. అయినా భయపడటం లేదు. ఒక ప్రజాస్వామిక పోరాటం ఎలా ఉండాలో ఆచరణలో రుజువు చేస్తున్నది.
ఇటీవలి ప్రజా పోరాటాల చరిత్రలో డిల్లి రైతుల పోరాటం తర్వాత మళ్లీ అంత విస్తృతి ఉన్నది సిలింగేర్‌ ఉద్యమానికే. ఈ రెంటికీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. తేడాలూ ఉన్నాయి. వీటివి పూర్తి భిన్న నేపథ్యాలు. భిన్న పరిస్థితులు. తరచి చూసే కొద్దీ దగ్గరితనం. రెంటిలోనూ అదే పోరాట చేవ. అదే సంసిద్ధత.

సిలింగేర్‌ చాలా సరళమైన ఉద్యమం అనిపించవచ్చు. ఆదివాసుల పోరాటం గదా అని కొందరైనా చప్పరించవచ్చు. దానికి లోకంతో సంబంధం ఏమున్నదని చేతులు ఎల్లికల వేసే వాళ్లు ఉండవచ్చు. భారత సమాజాన్ని ప్రభావితం చేసే పోరాటం కాదని సిద్ధాంతీకరించేవాళ్లు ఉండవచ్చు. ఆదివాసీ పోరాటం కాబట్టి రొటీన్‌గా ఫీలయ్యేవాళ్లూ ఉండవచ్చు.

నిజంగానే సిలింగేర్‌తో మనకు ఏరకంగా సంబంధం లేదనిపిస్తే దాని మానాన దాన్ని వదిలేయవచ్చు. మనకు కండ్లు మిరమిట్లు గొలిపే లక్షణం ఏమీ లేదనుకుంటే దానితో మనకేం పని? మన హృదయానికి పట్టనప్పడు మన నైతిక, ప్రజాస్వామిక ప్రమాణాలతో దానిని బలపరచవలసిన అవసరమేముంది? వాళ్ల పోరాటమేదో వాళ్లు చేసుకుంటారు. చావో రేవో చూసుకుంటారు. కేవలం ఆదివాసులు కదా అనే వైపు నుంచి సిలింగేర్‌ పోరాటానికి మన సానుభూతి అక్కర్లేదు. ఔదార్యం అవసరం లేదు.
అందుకే నిర్మమకారంగానే ఒకసారి లోపలికి తొంగి చూడండి. విమర్శనాత్మకంగా పరిశీలించండి. అందులో ఉన్న అనేక అంశాలు కనిపిస్తాయి. వాటి సంక్లిష్టత అర్థమవుతుంది. అప్పుడు ఆ పోరాటంలోని అంతర్గత శక్తి తెలుస్తుంది. ఒక ప్రజాస్వామిక పోరాటంగా దాని ప్రత్యేకత అర్థమవుతుంది. దేశ రాజకీయార్థిక వ్యవస్థలో దాని వ్యూహాత్మక స్థానం తెలుస్తుంది. అందులో మనందరి పోరాటం అనదగిన లోతు కనిపిస్తుంది.

ఆదివాసీ ప్రాంతాల్లో సైనిక క్యాంపులు ఎత్తేయాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం నడుస్తున్నది. చాలా చిన్న కోరిక కదా? కానీ మనందరి డిమాండ్ల ప్రతిధ్వనిగా రాటుదేలుతున్నది. కేవలం పెసా చట్టం అమలు చేస్తే సద్దుమణిగే రాజ్యాంగబద్ధ పోరాటమే కదా? కానీ రాజ్య వ్యతిరేక, వ్యవస్థా వ్యతిరేక, కార్పొరేట్‌ వ్యతిరేక విప్లవ ప్రత్యామ్నాయ విస్తృతిని ప్రతిబింబిస్తున్నది.

ఇదీ సిలింగేర్‌ ప్రత్యేకత. అందుకే అది ఒక ఊరి పోరాటం కాదు. ఏడాదిగా సాగుతున్న పోరాటం మాత్రమే కాదు. బహుశా అనేక పొరలుగా, అనేక అర్థాలతో అనేక తీరాలకు చేరగల పోరాటం. కొంచెం ఓపిగ్గా తెలుసుకోవలసిన పోరాటం. మనందరం సొంతం చేసుకోవాల్సిన పోరాటం.

కాపీల కోసం సంప్రదించండి
పాణి విరసం
9866129458

Keywords : silinger struggle, chattis garh, adivasi, crpf, book release
(2022-12-04 01:33:23)No. of visitors : 511

Suggested Posts


ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

ʹఆయన జైల్లోనే చనిపోతారేమోʹ

90 శాతం అంగవైకల్యం కలిగిన సాయిబాబాను అన్యాయంగా జైల్లో పెట్టారని.. ఆయనేమైనా యుద్ద ఖైదీనా..? ప్రభుత్వ అనాలోచిత చర్యతో యుద్ధఖైదీ మాదిరి ఆయన జైల్లోనే తుది శ్వాస విడిచే పరిస్ధితి వచ్చిందని ...

Search Engine

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
more..


త్వరలో