శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు

శాంతియుత

21-05-2022

ఈ దేశ జీవితంలో ఒక సంవత్సరం గడిచిపోయింది, శాంతియుత నిరసనలో ప్రజలు తమ జీవితాలను పణంగా పెట్టి, న్యాయం దొరకని ఒక సంవత్సరం పూర్తిగా గడిచిపోయింది. యువకుల విశ్వాసానికి మార్గాన్ని చూపే సంవత్సరం; నిరాశ, ఆవిశ్వాసాల మరో మార్గాన్ని చూపుతున్న పురాతన, విరక్త రాజకీయాల సంవత్సరం.

ఒక సంవత్సరం నుండి, యువత – వీరందరిలోకి పెద్దవాడికి కేవలం 23 ఏళ్ల వయస్సు, -12 వ తరగతి పాసైనవాడు- సిలంగేర్ లో, CRPF క్యాంపు బయట ధర్నా చేస్తున్న వీరోచిత, అహింసాయుత పోరాటానికి నాయకత్వం వహిస్తున్నాడు. వీరంతా తమ రోజువారీ కూలీ లేదా వ్యవసాయ పనులు మానుకుని వచ్చే పేద ఆదివాసీ గ్రామస్తులు, పాఠశాల అనుమతి ఇచ్చినప్పుడు వచ్చే విద్యార్థులు లేదా తమ పిల్లలను విడిచిపెట్టడానికి వేరే చోటు లేక తమ వెంట తీసుకువచ్చే మహిళలు. వారి సంఖ్య సాధారణంగా కొన్ని డజన్లు ఉంటే, ప్రత్యేక రోజులలో వేలలోకి చేరుకుంటుంది.

ఈ ప్రాంత ప్రజల రోజువారీ జీవితాల్లో అల్లుకుపోయిన ప్రకృతి రమ్యచిత్రాన్ని వలసరాజ్యం చేసిన భద్రతా శిబిరాలు, నకిలీ ఎన్‌కౌంటర్‌లు, అరెస్టులు, అన్యాయాలకు వ్యతిరేకంగా వీరు చేస్తున్న పోరాటాలు, బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర బస్తర్/కంకేర్ జిల్లాల్లో కూడా ఇలాంటి పోరాటాలకు దారితీసాయి.

2021 మే 17నాడు CRPF ఉయికా పాండు (14 సం.), కోవాసి వాగల్, ఉర్సా భీమ అనే ముగ్గురు వ్యక్తులను చంపింది. తొక్కిసలాటలో గాయపడిన గర్భవతి అయిన పూనెం సోమ్లీ మరణించింది. మరో 40 మంది గాయపడ్డారు కూడా. గ్రామస్థులకు సమాచారం ఇవ్వకుండా మే 11వ తేదీ రాత్రి CRPF సిలంగేర్ లో శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో సమస్య మొదలైంది. ఇలా ఏర్పాటు చేయడం పంచాయతీ విస్తరణ షెడ్యూల్డ్ ప్రాంతాల చట్టం (PESA) 1996 ప్రకారం చట్టవిరుద్ధం. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిలంగేర్, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు క్యాంపు దగ్గరికి వెళ్లినప్పుడు సీఆర్‌పీఎఫ్‌ కాల్పులు జరిపింది. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రతిఘటిస్తున్న తీరు చూసి సిఆర్‌పిఎఫ్ భయాందోళనకు గురైందా లేక అహంకారంతో కాల్పులు జరుపుతున్నారా? అనేది ఒక సంవత్సరం గడిచినా, మనకు ఇంకా తెలియదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానం చేసిన మెజిస్టీరియల్ విచారణ ఆరు నెలల్లోపు నివేదికను సమర్పించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ, న్యాయాన్నందించడంలో ఆసక్తి లేని ప్రభుత్వానికి ఆ విషయంలో పట్టింపు ఉంటుందా?

భారతీయ జనతా పార్టీ హయాంలో 2012, 2013 సంవత్సరాలలో సర్కెగూడ, ఈడెస్మెట్టలలో జరిగిన సామూహిక హత్యలపై రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన రెండు న్యాయ విచారణలలో, అమాయక గ్రామస్తులను CRPF చంపినట్లు తేలింది. సర్కెగూడలో మైనర్లతో సహా 17 మంది, ఈడెమెట్టలో ఎనిమిది మంది మృతి చెందారు. కాల్పులు జరపడం కాదు అసలు ఆ సమయంలో సర్కేగూడలో నక్సల్స్ ఉన్నట్లు ఆధారాలు లేవని న్యాయ విచారణలో తేలినప్పటికీ, ఎప్పటిలాగే, CRPF దానిని మావోయిస్టుల హత్యలు లేదా ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లుగా చిత్రించడానికి ప్రయత్నించింది.

2016లో భద్రతా బలగాలు తాడమెట్ల, పొరుగు గ్రామాలలో 300 ఇళ్లను తగలబెట్టాయని గుర్తించిన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కొన్ని సహాయక బలగాలపై ఛార్జిషీట్ వేసింది. అయితే, న్యాయం, మార్పులను వాగ్దానం చేస్తూ 2018లో ఛత్తీస్‌గఢ్‌లోఅధికారంలోకి వచ్చిన, బస్తర్‌ లోని ఆదివాసీల ప్రాంతంలో అత్యధిక మెజారిటీ పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రంగాల్లో ఏమైనా చేసిందా అనే ప్రశ్నకు లేదు అనే సమాధానం. జైళ్ల రద్దీని తగ్గిస్తానని, నక్సలైట్లుగా అనుమానించి అరెస్టు చేసిన వందలాది మంది ఖైదీలను విడుదల చేస్తానన్న హామీలను కూడా నెరవేర్చలేదు.

బీజేపీ-కాంగ్రెస్ భాయ్ భాయ్, ఆదివాసీ బై బై

వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు ఏడాది పాటు చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వడం ద్వారా పంజాబ్ ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాన్ని పొందాలని కాంగ్రెస్ భావించింది. కానీ తాను అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో మాత్రం తమ సొంత రైతుల విజ్ఞప్తులకు తూట్లు పొడిచింది. ఎన్నికల నేపథ్యంలో గుజరాత్‌లో, సహజ వనరులపై ఆదివాసీలకు హక్కులు ఉన్నాయని, వారిని స్థానభ్రంశం చేయవద్దని కాంగ్రెస్ చెబుతోంది. కానీ ఛత్తీస్‌గఢ్‌లో, స్థానికంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ, జీవవైవిధ్య విధ్వంసానికి, జీవనోపాధికి ప్రమాదకరంగా తయారైన పార్సా బొగ్గు బ్లాక్‌కు, పార్సా ఈస్ట్, కెంటే బేసన్ కోల్ బ్లాక్‌కు ఫేజ్ 2 పొడిగింపుకు హస్దేవ్ అరణ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వాతావరణ మార్పు బొగ్గును నిస్సారంగా మారుస్తున్న తరుణంలో, రాజస్థాన్‌కు బొగ్గును సరఫరా చేయడమే ప్రత్యక్ష కారణం అయినప్పటికీ, అదానీకి అనుకూలంగా ఉండటానికి కాంగ్రెస్, బిజెపిలు సహకరిస్తున్నాయి.

2005 రాజ్య-ప్రాయోజిత సల్వాజుడుంలో, అప్పటి కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌లోని బిజెపి ప్రభుత్వాల సహ భాగస్వామ్యం వుంది. వందలాది గ్రామాలను తగులబెట్టారు. వేలాది మంది ప్రజలను చంపేశారు. లైంగిక వేధింపుల సంఖ్యను లెక్కించనే లేదు. 2011లో లొంగిపోయిన నక్సలైట్లను ప్రత్యేక పోలీసు అధికారులుగా ఉపయోగించడాన్ని సుప్రీంకోర్టు నిషేధించిన తర్వాత, కాంగ్రెస్, బీజేపీలు రెండూ అసెంబ్లీలో కలిసి వారి పేరును సాయుధ సహాయక బలగాలుగా మార్చడానికి, వారికి జీతాల పెంపుదల, మరింత మరణాంతక తుపాకీలను ఇచ్చే చట్టాన్ని ఆమోదించాయి. వారు ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)గా కొనసాగుతున్నారు.

2022లో, ఆదివాసీలను పౌరుల కంటే తక్కువగా చూసే విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌లు మరోసారి ఒకే మాట మీద నిలిచాయి. ఏప్రిల్ 14-15 రాత్రి, ఉసూర్, కొంట బ్లాక్‌లలోని అనేక గ్రామాల ప్రజలు తాము మంటలను చూసినట్లు, పెద్ద శబ్దాలు విన్నట్లు చెప్పారు. మరుసటి రోజు అడవుల్లో పేలుడు పదార్థాల అవశేషాలు కనిపించాయి. ప్రజలు, పశువులు అడవులను విరివిగా ఉపయోగించడం - మహువా అత్యధికంగా సేకరించే, పంట కోత తర్వాత పశువులను మేతకు వదిలే కాలమూ అయినప్పటికీ - మరణాలు సంభవించకపోవడం అదృష్టమనే చెప్పాలి. డ్రోన్ దాడులు జరగలేదని పోలీసులు కొట్టిపారేశారు, కానీ ఆయుధాల అవశేషాల గురించి వివరాణ యివ్వలేదు కూడా.

శాంతి చర్చలు

దశాబ్దాలుగా, శాంతి చర్చల కోసం ప్రజలు పెద్ద ఎత్తున అడుగుతున్నారు. ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఇటీవలి శాంతి చర్చల ప్రతిపాదనకు జైలులో ఉన్న తమ నాయకులను చర్చలు జరపడానికి విడుదల చేయాలి, వారిపై వున్న UAPA కేసులను ఎత్తివేయాలి, భద్రతా దళాలను ఉపసంహరించుకోవాలి అనే షరతులతో మావోయిస్టులు సానుకూలంగా స్పందించారు. అనుకున్నట్లుగానే ముందస్తు షరతులతో చర్చలను నిరాకరిస్తూనే, మావోయిస్టులు రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ధృవీకరించాలి అని బఘెల్ స్వయంగా ఒక షరతు పెట్టాడు.

గత ఏడాది కాలంగా, సిలంగేర్ యువత, బస్తర్ గ్రామస్థులు తమ శాంతియుత నిరసన ద్వారా రాజ్యాంగంపై తమకున్న విశ్వాసాన్ని బహిరంగంగా ధృవీకరిస్తున్నారు. వారు ఒక మెమోరాండం అందజేయడానికి గవర్నర్‌ను కలవడానికి ప్రయత్నించారు, కాని రాయ్‌పూర్ చేరుకునేలోపే వారిని అరెస్టు చేశారు. షెడ్యూల్డ్ తెగల జాతీయ కమీషనర్, ఆదివాసీ వ్యవహారాల మంత్రి, అలాగే కాంగ్రెస్ నాయకుల వంటి చట్టబద్ధమైన అధికారులను కలవడానికి మార్చిలో వారు ఢిల్లీకి వచ్చారు, కానీ వారి సమయాన్ని పొందలేకపోయారు. రాజ్యాంగం ప్రకారం ఉద్యమ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, సాధారణంగా సిలంగేర్ లో ర్యాలీలకు వచ్చే సందర్శకులను పోలీసులు, CRPF లతో ఆపేస్తారు. ఒక సంవత్సరం గడిచినా బస్తర్‌లో మరణించిన అమాయకులకు న్యాయం చేయాలనే డిమాండ్‌లు నెరవేరలేదు.

రాజ్యాంగంపై విశ్వాసం పౌరులకు మాత్రమే రిజర్వ్ చేయబడిందా, దానిని ఉల్లంఘించడానికి ప్రభుత్వం ఏమైనా చేయవచ్చా?

(ది వైర్ వెబ్ పోర్టల్ కోసం నందినీ సుందర్ రాసిన వ్యాసం)

తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : chattis garh, silanger, bhijapur, bastar
(2024-04-20 02:56:09)No. of visitors : 1107

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


శాంతియుత