పూంబాడ్ లో జరిగిన రాకెట్ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
29-05-2022
బీజాపూర్-దంతెవాడ జిల్లా సరిహద్దులో, బీజాపూర్ జిల్లా, బీజాపూర్ బ్లాక్‌లోని గంగలూర్ తహసీల్ పరిధిలోని పుస్నార్ పంచాయతీలో అటవీ ప్రాంతం మధ్యలో వున్న పూంబాడ్ (బడ్డేపారా) గ్రామంలోని ఆదివాసీలు తమ గ్రామంపై జరిగిన ʹRPGʹ దాడిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గత 2022 మార్చి 3 RPG చేసిన దాడి తర్వాత గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్ (RPG) అనేది రాకెట్ లాంచర్ నుండి ప్రయోగించే పోరాట క్షిపణి ఆయుధం. దీన్ని రాకెట్ మోటారుకు అనుసంధానం చేయడం ద్వారా లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. ఒక రకం RPGని కొత్త రాకెట్-ప్రొపెల్డ్ గ్రెనేడ్‌లతో మళ్లీ లోడ్ చేయచ్చు, మరొక రకం ఒక్కసారి మాత్రమే ఉపయోగపడ్తాయి.
పూర్తి కథనం ఏమిటి
మురియా తెగ, మహారా కులానికి చెందిన ప్రజలు వుండే పూంబాడ్ గ్రామం దట్టమైన అడవి మధ్య వుంటుంది. మావోయిస్టులకు బలమైన కోటగా కూడా ఉంది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు కూడా జరుగుతుంటాయి. గంగలూరు ప్రాంతంలో 10కి పైగా సెక్యూరిటీ ఫోర్స్ (CRPF) క్యాంపులు ఉన్నాయి, వాటిలో కొన్ని పూర్తయ్యాయి, మరి కొన్నింటి కోసం భూ సేకరణ జరుగుతోంది. పుస్నార్‌లో మరో కొత్త క్యాంపు ఏర్పాటు అవుతోంది, ఇందులో పూంబాడ్ గ్రామం కూడా ఉంది, దీనికి వ్యతిరేకంగా స్థానికులు గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు.
మార్చి 3న జరిగిన ఈ ఘటన తర్వాత పూంబాడ్ నుంచి బీజాపూర్ వరకు ఆదివాసీ సముదాయంలో పలు చర్చలు జరుగుతున్నాయి. ఆయుధ స్వరూపం చూస్తుంటే మరింత భయాందోళనల వాతావరణం ఏర్పడుతోంది. ఇది మావోయిస్టుల చర్య అని పోలీసులు ప్రకటించినప్పటికీ గ్రామస్తులు అందుకు భిన్నంగా చెబుతున్నారు. పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో, పూంబాడ్ బడ్డేపరాలో మావోయిస్టులు వంట చేసుకొంటున్నారనే సమాచారం అందుకుని అక్కడికి చేరుకొన్న భద్రతా బలగాలను చూసి వారు పరుగులు తీశారని, దాదాపు గంటపాటు పరస్పరం కాల్పులు జరిగాయని, ఆ తర్వాత మావోయిస్టులు దట్టమైన అటవీప్రాంతాన్ని అనుకూలంగా చేసుకొని పారిపోయారని, ఆ సందర్భంలో మావోయిస్టులు ఆర్పీజీలతో దాడి చేశారు అని పేర్కొన్నారు.
ఆ రోజు మావోయిస్టులు ఎవరూ గ్రామానికి రాలేదని, భోజనం చేయలేదని, ఎలాంటి ఎన్‌కౌంటర్, కాల్పులు జరగలేదనేది స్థానిక సమాచారం. ఆ రోజు భద్రతా బలగాల బృందం పెట్రోలింగ్ చేస్తూ దంతెవాడ కొండ మార్గం ద్వారా గ్రామం వెనుక భాగంలోకి ప్రవేశించిందని గ్రామస్తులు అంటున్నారు. ఇది ప్రాథమికంగా స్థానిక ఆదివాసీలతో కూడిన DRG బృందం. DRG అంటే (జిల్లా రిజర్వ్ గార్డ్‌లు) యువ ఆదివాసీలతో కూడిన బలగం. స్థానికులవడంతో అడవిలో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడానికి అడవి-తుప్పలు, పొదలు, కొండల గుండా వెళ్ళే అన్నీ దార్లూ తెలిసి వుంటాయి. అంతే కాకుండా అడవిలో జంతువుల వల్ల కలిగే అనర్థాలు, వన్యప్రాణుల సంచారం గురించి కూడా వారికి బాగా తెలుసు. వీరిలో కొందరికి మావోయిస్టులు ఉపయోగించే దార్లు కూడా తెలుసు. ఈ కారణాలన్నింటి వల్లా, లోతట్టు ప్రాంతాల్లో గస్తీకి CRPF సిబ్బందితో పాటు వారిని కూడా పంపుతారు.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పగటిపూట 12 నుంచి 1 గంటల మధ్య భద్రతా బలగాలు వెనుకవైపు నుంచి గ్రామంలోకి ప్రవేశించాయి. వారు గ్రామంలోకి ప్రవేశించగానే, మంగు పూనెం ఇంటి నుండి పందులను, ఆయతు కోసా ఇంటి నుండి వంట పాత్రలను తీసుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు అందరూ తిని, తాగి ఆ తర్వాత వూరివైపు బయలుదేరారు. ఆ సమయంలో కొంత మంది టెండు ఆకులు ఏరుతుంటే, మరికొంత మంది తాటిచెట్ల పైన వున్నారు. పని చేస్తున్న వారిని చూసిన భద్రతా బలగాలు ఆర్పీజీతో కలిసి దాడి చేయడం ప్రారంభించాయి. గ్రామస్థులు వెంటనే తమ ఇళ్లకు పరుగులు తీశారు.
గ్రామస్థులు స్వయంగా పంచనామా చేశారు
పూంబాడ్ లో జరిగిన ఈ ఘటన తర్వాత, అన్ని ప్రాంతాల నుండి ప్రజలు ఒకచోట చేరి మొత్తం సమాచారాన్ని సేకరించారు. 2022 మార్చి 9 న అన్ని RPGల పంచనామా తయారుచేశారు. పేలిన, పేలని ఆయుధాల పంచనామాలు రెండింటినీ వివరంగా తయారు చేసారు. కాల్పులు జరిపిన రెండు RPGలు పేలలేదు, అంటే అవి ఇంకా సజీవంగా ఉన్నాయి. గ్రామస్థులు పేలిన RPG భాగాన్ని కూడా పంచనామాలో చేర్చారు.
ఈ దాడికి చాలా మంది గ్రామస్తులు ప్రత్యక్ష సాక్షులు. అది పడటాన్ని మోతీ పూనెం చూశాడు, భద్రతా దళాలు ప్రజలపై దాడి చేసినప్పుడు వారు పరుగులు తీయడాన్ని సంకీ పూనెం చూశాడు. సెక్యూరిటీ గార్డులు జనాన్ని పరుగులు తీయించడాన్ని తాటిచెట్టు పైనుంచి పోండా పూనెం చూశాడు.
రెండు RPGలు చెట్లను ఢీకొన్నాయి, ఒకటి వూరి నుంచి 300 మీటర్ల దూరంలోనూ, మరొకటి మధ్యలోనూ పడ్డాయి. ఊరి మధ్యలో RPG పడిన సమయంలో చిన్న పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. ప్రజలు మూడు సార్లు పెద్ద శబ్దాలు వినడం, మూడు RPGలు పేలినట్లు సూచిస్తున్నాయి. వాటిలో రెండు చెట్లను ఢీకొనగా, మూడోదాని ఆచూకీ ఇంకా దొరకలేదు.
గ్రామం నుంచి వెళ్లగొట్టే కుట్ర:
సోని పూనమ్ గ్రామస్థులు గ్రామాన్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళిపొమ్మని భద్రతా బలగాలు అంటున్నాయి అని స్థానిక మూలవాసీ బచావో మంచ్ అధ్యక్షురాలు సోని పూనమ్ ఆరోపించారు. ʹʹమా గ్రామంలో కొత్త క్యాంపు ఏర్పాటు చేయాలని కొంతకాలంగా చర్చ జరుగుతోంది. అప్పటి నుండి గ్రామస్తులు దీనిని వ్యతిరేకిస్తూ ధర్నా-ఆందోళనకు కూర్చున్నారు.ʹ
అమాయక ఆదివాసీలను భయపెట్టడానికి, బెదిరించడానికి ఇది ఒక మార్గం, ప్రజలు ఇటువంటి దాడులతో భయాందోళనలకు గురవుతారు అని ఆదివాసీ కార్యకర్త సోనీ సోరి వేదన వ్యక్తం చేశారు.
గ్రామస్థులని ఖాళీ చేయించడంతోపాటు, మొత్తం ప్రాంతంలో మావోయిస్టుల వ్యతిరేక కేంపెయిన్ సాకుతో క్యాంపు పెట్టి , రాబోయే కాలంలో నీరు, అటవీ, భూములను కార్పొరేట్ రంగానికి తరలించడమే ఈ దాడి ప్రాథమిక లక్ష్యం అని పలువురు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎస్పీ, కలెక్టర్లకు జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసు
ఈ మొత్తం ఘటనను పీయూసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు డిగ్రీ ప్రసాద్ చౌహాన్ ఖండించారు. ఈ ఘటన మానవ హక్కులను ఉల్లంఘనే అన్నారుమావోయిస్టులపై సులువుగా నిందలు మోపేందుకు వారిపై కూడా ఇలాంటి దాడులు జరగవచ్చని గ్రామీణ ప్రాంత ప్రజలకు సందేశాన్నిస్తున్నారని స్పష్టమవుతోంది. ప్రభుత్వం తన పౌరులను రక్షించడానికి బదులు వారిని భయపెట్టడం ద్వారా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటుంది.
కాగా, ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుంచినట్లు పీయూసీఎల్ చత్తీస్‌గఢ్ రాష్ట్ర కార్యదర్శి రించిన్ తెలిపారు. ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కమిషన్ బీజాపూర్ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదికను కమిషన్ ముందు ఉంచేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
కాగా, ఈ అంశాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుంచినట్లు పీయూసీఎల్ చత్తీస్‌గఢ్ రాష్ట్ర కార్యదర్శి రించిన్ తెలిపారు. ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న కమిషన్ బీజాపూర్ జిల్లా ఎస్పీ, కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదికను కమిషన్ ముందు ఉంచేందుకు నాలుగు వారాల గడువు ఇచ్చింది.
ఇన్ని సందర్భాలు, పరిస్థితుల మధ్య ఆర్పీజీ దాడి అయినా, మావోయిస్టులపై ప్రచారమైనా, నీరు, అడవులు, భూమి, వనరులను లాక్కోవాలనే పథకమైనా నష్టపోయేది స్థానిక గిరిజన సమాజమే.
janchowk.com సౌజన్యంతో
తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి
Keywords : chattis garh, bobmb attack, army, police, adivasi, tribal, rocket attack
(2023-09-26 04:08:08)
No. of visitors : 1222
Suggested Posts
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటనఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన |
| మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ
ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి. |
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి. |
| ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహంచత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులుచత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. |
| ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. |
| హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు
ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు. |
| పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది. |
| మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నఛత్తీస్గడ్ లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.
|
| మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటనజూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. |