సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం


సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం

సిలంగేర్,

11-06-2022

ఛత్తీస్‌గఢ్‌లోని హస్‌దేవ్ అరణ్య, కర్ణాటకలోని బెంగుళూరులోని గాంధీ భవన్ ఒకదానికొకటి చాలా దూరంగా ఉన్నాయి, రెండింటి భౌగోళికత చాలా భిన్నంగా ఉంటుంది, అయితే మే 30న చర్చలో వచ్చిన వార్తలకు ఒకే కాలక్రమం, అంతర్ సంబంధం ఉన్నాయి.

తమ పర్యవేక్షణలో ఈ అడవిలో నివసిస్తున్న ఆదివాసీల ప్రజా ఉద్యమం, చిప్కో ఉద్యమం కారణంగా ఆగిపోయిన చెట్లను నరికివేయడానికి తుపాకులు తదితర ఆయుధాలతో భారీ పోలీసు బలగాలు మే 30 తెల్లవారుజామున 3 గంటలకు, హస్‌దేవ్ అడవులకు చేరుకున్నాయి. చాలా సంవత్సరాలుగా ఈ అత్యంత దట్టమైన, జీవవైవిధ్య అడవి కార్పొరేట్ల దృష్టిలో వుంది. ఈ అడవి ఛత్తీస్‌గఢ్‌లోని ఉత్తర కోర్బా, దక్షిణ సర్గుజా, సూరజ్‌పూర్ జిల్లాల మధ్యలో ఉంది. దాదాపు లక్షా డెబ్బై వేల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవి జీవవైవిధ్యపరంగా కూడా విశిష్టమైనది.

వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 2021 నివేదిక ప్రకారం, హస్‌దేవ్ అరణ్యలో గోండ్, లోహార్, ఓరాన్ వంటి ఆదివాసీ తెగలకు చెందిన 10,000 మంది నివసిస్తున్నారు. ఇక్కడ 82 రకాల పక్షులు, అరుదైన సీతాకోకచిలుకలు, 167 రకాల వృక్ష జాతులు ఉన్నాయి. వీటిలో 18 రకాల వృక్షసంపద అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. విచక్షణారహిత పారిశ్రామికీకరణ కారణంగా వాయు కాలుష్యంతో నాశనమవుతున్న ఈ అడవిని ఛత్తీస్‌గఢ్‌ ఊపిరితిత్తిగా పిలుస్తారు. ప్రజా ఉద్యమం, ఈ అభయారణ్యం ప్రయోజనం కారణంగా, యుపిఎ ప్రభుత్వ హయాంలో, అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్ హస్‌దేవ్ లో "నో గో"(ప్రవేశం లేదు)ని ఆదేశించారు, హస్‌దేవ్ రిజర్వ్‌ లో ఎలాంటి జోక్యాన్నీ నిషేధించారు. అయితే గత ఏడాది అక్టోబర్‌లో, హస్డియో అరణ్యలోని పర్సా కోల్ బ్లాక్‌లో మైనింగ్‌కు మోదీ ప్రభుత్వానికి చెందిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తుది ఆమోదం తెలిపింది. కేంద్రం ఆమోదం తెలిపిన తర్వాత, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా ఇక్కడ మైనింగ్‌కు ఆమోదాన్నిచ్చింది.

అదానీ కంపెనీకి చెందిన పర్సా కోల్ బ్లాక్ మొత్తం 1,250 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది, ఇందులో 841.5 హెక్టార్ల అటవీ భూమి కోతకు గురవుతోంది. ఇందుకు తప్పనిసరి అయిన గ్రామసభల అనుమతిని కూడా తీసుకోలేదు. సుప్రీంకోర్టు, హైకోర్టులకు చూపించేందుకు నకిలీ అనుమతి పత్రాలు సృష్టించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ అదానీ ప్రాజెక్ట్ కోసం హస్‌దేవ్ అరణ్యలోని పర్సా కోల్ బ్లాక్‌లో 95,000 చెట్లను నరకాలి. ఇది ప్రారంభం మాత్రమేనని అసలు నరికివేయాల్సిన చెట్ల సంఖ్య రెండు లక్షలకు పైగా ఉంటుందని, కేవలం ఈ 841 హెక్టార్లతో ఆగదు, మొత్తం 175 లక్షల హెక్టార్ల వరకు చేరుకుంటుంది అని సామాజిక కార్యకర్తలు అంచనా వేస్తున్నారు.. అదానీ కోసం ప్రకృతిని సర్వనాశనం చేస్తున్న ఈ కుట్రకు వ్యతిరేకంగా చెట్లను కౌగలించుకున్న ఆదివాసీలకు గుణపాఠం చెప్పేందుకు ఖాకీ యూనిఫాం వచ్చింది.

దీనికి సరిగ్గా 13 రోజుల ముందు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సమీపంలోని సిలంగేర్‌లో దాదాపు 20 వేల మంది గిరిజన పురుషులు మహిళలు కూడారు. ఎటువంటి ఆధునిక రవాణా సౌకర్యాలు లేని కొండలపై సుదూరంగా ఉన్న చిన్న గ్రామాలనుంచి రావడాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సంఖ్య చాలా ఎక్కువ. సిలంగేర్‌ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లోని సుక్మా జిల్లాలో ఉంది. గతేడాది 2021మే 17న జరిగిన ఈ ధర్నాపై పోలీసు CRPF జరిపిన కాల్పుల్లో నలుగురు యువకులు ఉయ్క పాండు, కోవాసి వాగా, ఉర్సా భీమా, మిద్యం మాసా, గర్భిణీ స్త్రీ పూనెమ్ సోమ్లీ, ఆమె గర్భంలో ఉన్న శిశువు వీరమరణం చెందారు. వారి స్మారకార్థం అమరుల స్థూపాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా మే 17న ఈ సమావేశం జరిగింది. ఏడాది గడిచినా ఈ ఆదివాసీల హత్యల గురించి సరియైన ఎఫ్‌ఐఆర్‌ కూడా రాయలేదు.

గత సంవత్సరం, ఈ ఆదివాసీలు ప్రతి రెండున్నర కి.మీకి CRPF క్యాంపులు-పోలీస్ కంటోన్మెంట్లు, పోలీస్ స్టేషన్ల వలను పరచే బదులు, ప్రతి 2.5 కి.మీకి మలేరియా, పోషకాహార లోపాలులాంటి వాటి వల్ల సంభవించే వేలాది ఆదివాసీల మరణాలను నివారించే ఆసుపత్రులు, తమ పిల్లలు చదవడం, వ్రాయడం నేర్చుకోవడానికి పాఠశాలలు కావాలనీ డిమాండ్ చేశారు. బస్తర్‌లోని ఖనిజ, అటవీ సంపదను నిర్దాక్షిణ్యంగా దోపిడీ చేసేందుకు, బస్తర్‌లో ఆదివాసీ, సంప్రదాయ అటవీ నివాసులు లేకుండా చేసేందుకు నాలుగు-ఆరు లేన్ల రహదారికి బదులు తమ గ్రామాలకు చిన్న రోడ్లు వేయాలి అని డిమాండ్ చేశారు. అయితే వారి మాట వినకుండా ఏ కారణం లేకుండా సీఆర్పీఎఫ్ వచ్చి నలుగురు ఆదివాసీలను హతమార్చింది.

గతంలో ఛత్తీస్‌గఢ్‌లోని బీజేపీ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే జరిగింది. నివాసితులకు బస్తర్‌ను ఒక చిత్రహింసల కొలిమిలా, ప్రజాస్వామిక, మానవ హక్కులు, రాజ్యాంగాల శ్మశానవాటికగా ఎలా మార్చారో కొన్ని విచారణ కమిషన్‌ల ఇటీవలి నివేదికలు బహిర్గతం చేశాయి.

బిజెపి పాలనలో, 2012 జూన్ 28 రాత్రి, బీజాపూర్ జిల్లా సర్కెగూడ గ్రామంలో 17 మంది ఆదివాసీ గ్రామస్థులను మావోయిస్టులు అని చెప్పి భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఈ సమయంలో గ్రామస్తుల వైపు నుంచి ఎలాంటి కాల్పులు జరగలేదు. గ్రామస్తుల ప్రకారం, చంపబడిన వారు నక్సలైట్లు కాదు, తమ సాంప్రదాయ పండుగ బీజ్ పండుమ్ జరుపుకుంటున్నారు. ఈ మరణాలపై అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ఏకసభ్య విచారణ కమిషన్‌కు జస్టిస్ విజయ్ కుమార్ అగర్వాల్‌ను చైర్మన్‌గా నియమించారు. దాదాపు ఏడేళ్ల పాటు విచారణ అనంతరం అక్టోబర్ 17న ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం కూడా చంపబడినవారు అమాయక గ్రామీణ గిరిజనులు, నక్సలైట్లు కాదు. ఎలాంటి రెచ్చగొట్టడం లేదా కారణం లేకుండా పోలీసు బలగాలు వారిని హతమార్చాయి.

2013మే 17-18 మధ్య రాత్రి బీజాపూర్‌లోని అడ్స్‌మెటా గ్రామంలో ఇదే విధమైన మారణకాండ జరిగింది. ఇక్కడ కూడా బీజ్ పండుం పండుగను జరుపుకోవడానికి గ్రామీణ ఆదివాసీలు తరలివచ్చారు. అనంతరం నక్సల్స్‌ వ్యతిరేక చర్యలో భాగంగా వచ్చిన సైనికులు గ్రామస్తులను నక్సలైట్లుగా భావించి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మైనర్లు సహా మొత్తం ఎనిమిది మంది చనిపోయారు. మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వికె అగర్వాల్‌తో కూడిన కమిటీ ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి ఏర్పాటైన ఒక కమిటీ "అడ్స్‌మెటా గ్రామం సమీపంలో నిప్పు చుట్టూ కూచున్న వారిని చూసిన భద్రతా దళాలు బహుశా నక్సలైట్ లుగా పొరబడి గాభరాతో కాల్పులు జరిపి ఉండవచ్చు" అని హాస్యాస్పదమైన వాదన చేసింది.. అందులో ʹచనిపోయిన వారందరూ గ్రామస్థులే. అతనికి నక్సలైట్లతో ఎలాంటి సంబంధం లేదు.ʹ ఈ నివేదికపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

హస్‌దేవ్‌లో అదానీ కోసం పోలీసులను పంపి పాలకులు ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కొత్త బస్తర్‌గా మార్చే కేంపెయిన్ ప్రారంభించారు. అందుకు సరిగ్గా 6 రోజుల క్రితం, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఒక చర్చ సందర్భంగా, సిలంగేర్, హస్‌దేవ్‌లను అదానీకరణ చేయడం గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, రాహుల్ గాంధీ 2015లో తాను చెప్పిన విషయాన్ని పునరుద్ఘాటించి, చర్చల ద్వారా ఒక మార్గాన్ని కనుగొనాలని అన్నారు.

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రస్తుత గృహమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రితో ఉన్న ఫోటోలు ఈ దాడి బీజేపీ పాయోజితమైనదని స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని రైతాంగాన్ని మేల్కొలిపి, రైతులను, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయాలన్న మోదీ-అదానీ-అంబానీల రాజ్య ప్రణాళిక సఫలమవకుండా అడ్డుకున్న రైతు ఉద్యమం పట్ల కలిగిన ఆగ్రహమే ఈ దాడికి కారణం. మొత్తం మీద, పాలక వర్గం మొత్తం, దాని అధీకృత సైన్యం, గూండా ముఠాలతో కలిసి, దేశము, దేశ ప్రజలు, సహజ సంపదల దోపిడీకి వ్యతిరేకంగా మాట్లాడదానికి ధైర్యం చేసే ప్రతి గొంతును అణిచివేయాలని కోరుకుంటోంది.

ఈ రోజు-మే 30న బెంగళూరులో రైతు ఉద్యమ సీనియర్ నాయకుడు రాకేష్ టికాయత్‌పై జరిగిన దాడిని ఈ కొనసాగింపులోనే చూడాలి. గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఓ వ్యక్తి ముందస్తు ప్రణాళికతో రైతు నాయకుడు రాకేష్‌ టికాయిత్‌ ముఖంపై టీవీ ఛానల్‌ మైక్‌తో కొట్టగా, ఆ తర్వాత మరో వ్యక్తి వచ్చి సిరా చల్లాడు. దాడికి పాల్పడిన వారు ʹజై మోదీʹ, ʹమోదీ మోదీʹ అంటూ నినాదాలు చేశారు. ప్రధాన నిందితుడు భరత్ శెట్టి పోలీసుల అదుపులో ఉన్నాడు.

అయితే తెల్లవారుజామున మూడు గంటలకు హస్డియో అరణ్యలో పోలీసుల నేతృత్వంలోని అటవీ నరకివేత దళం వచ్చిన గంటలోనే, వేలాది మంది ప్రజలు వచ్చేశారు. సూర్యోదయమయ్యేసరికి కిసాన్ సభతో పాటు అనేక సంస్థల కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు, హస్‌దేవ్, సిలంగేర్ మొదలుకొని, మధ్యప్రదేశ్‌లోని వజ్రాల గనుల కోసం ధ్వంసం అవుతున్న బక్స్ వాహా అడవితో సహా అటువంటి ప్రతి దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారనీ, ఎదుర్కోవడానికి సంసిద్ధంగా వున్నారనేది సుస్పష్టం.

ʹరెండువైపుల వారూ సంసిద్ధతతో వచ్చారు

వీరు మెడలతో వారు రంపాలతోʹ (డాక్టర్ కువర్ ʹబేచైన్ʹ కవితా పంక్తి)

అయినప్పటికీ - పోరాటం కొనసాగుతోంది. ఒక దాడి ప్రస్తుతానికి ఆగింది, మరో దాడికి సన్నాహాలు జరుగుతున్నాయి.

-బాదల్ సరోజ్

(బాదల్ సరోజ్ లోక్‌జతన్ సంపాదకుడు, ఆల్ ఇండియా కిసాన్ సభ సంయుక్త కార్యదర్శి.)

(janchowk.com సౌజన్యంతో...)

తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి

Keywords : chattis garh, hasdev, silanger, tikait, bengaluru, adivasi
(2023-09-29 02:11:28)No. of visitors : 1253

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
more..


సిలంగేర్,