భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
19-06-2022
(కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన పూర్తి పాఠం...)
సైన్యాన్ని నాజీకరించే, పౌర సమాజాన్ని సైనికీకరించే కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేకʹఅగ్నిపథ్ʹ పథకానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి, పలువురికి గాయాలకూ దారి తీసిన ప్రభుత్వ అణచివేత వైఖరినీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది సైన్యాన్ని ఫాసిస్టీకరించే, పౌర సమాజాన్ని విచ్ఛిన్నం చేసి సైనికీకరించే పథకం.
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన గడచిన 8 సంవత్సరాల రెండు దఫాల పాలనలో దేశంలో యావత్తు రంగాలనూ ఫాసిస్టీకరణ చేస్తూ వస్తున్నది. జూన్ 14వ తేదీన ప్రకటించిన, సైన్యంలోకి భర్తీ పథకంగా ముందుకు తీసుకువచ్చిన ʹఅగ్నిపథ్ʹ ఉద్యోగ కల్పన పేరుతో దేశ ప్రజలపై ఫాసిస్టు అణచివేత సాధనమే.
ప్రజా వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల విధానాల వల్ల ప్రపంచంలోను, దేశంలోనూ రోజు రోజుకూ నిరుద్యోగం పెరుగుతున్నది. పర్మనెంటు ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితులలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ʹఅగ్నిపథ్ʹలో చేరడం యువతను బలవంతంగా భర్తీ చేసుకోవడమే అవుతుంది. ఎల్ పీజీలో భాగంగా, ప్రభుత్వ వ్యయాన్ని కనిష్టం చేయాలన్న ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతులకు లోబడి జరుగుతున్నది. సైన్యంలో వేతనాలు, భారీ ఫించనుల ఖర్చును తగ్గించేందుకే ఈ ʹటూర్ అన్ డ్యూటీʹ పథకాన్ని తీసుకువచ్చామని ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదుల మధ్య పోటీ సాయుధ ఘర్షణల రూపం తీసుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. అంతర్జాతీయ రాజకీయాలలో భారతదేశం ఎంత చురుకుగా వ్యవహరించబోతున్నదో ఇది తెలియజేస్తుంది. యుక్రెయిన్ పై రష్యా దురాక్రమణ యుద్ధ పరిణామాలలో ఇది ఒక భాగం. ఆర్థిక సంక్షోభం కారణంగా పెరుగుతున్న దైనందిన జీవిత సమస్యలతో ప్రజలలో పెరుగుతున్న అశాంతిని, కార్మిక, కర్షక, దళిత, అదివాసీ,జాతుల పోరాటాలను అణగదొక్కడానికి, ప్రత్యేకంగా భారతదేశంలో వర్గ పోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం అత్యంత కుట్రపూరితంగా ఈ పథకం ముందుకు తీసుకువచ్చింది. స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఛత్తీస్ గఢ్ లో అదివాసీ యువతను పోలీసు బలగాలలోకి తీసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నం ఇది.
మొదటి 90 రోజులలో 46,000 మందిని భర్తీ చేసుకుంటామని, నాలుగేళ్ల పాటు ప్రత్యేక శిక్షణను అందించి అందులో 25 శాతం మందిని సైన్యంలోకి తీసుకుని మిగిలిన 75 శాతానికి మనిషికి 11.71 లక్షల రూపాయలు ఇచ్చి, ఫించన్ వంటి మరే రకమైన సౌకర్యాలూ లేకుండా పంపించివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్ల కాలంలో వారి వేతనాలలో కోత ద్వారా జమ చేసే 5.50 లక్షల రూపాయలకు అంతే మొత్తం ప్రభుత్వం కలుపుతుంది. ఈ పథకంలో శిక్షణ పొందేవారు ʹఅగ్నివీర్ʹలంటున్నారు. ఇది ప్రజలపై క్రూర అణచివేతను అమలు చేసే ఎస్ పీఓ, డీఆర్డీ వంటి బలగమే తప్ప మరొకటి కాదు. పైపైనే అయినా దీనిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు జవాబుగా, యువతను ప్రేరేపించే ప్రయత్నంగా, ఈ 75 శాతాన్ని వివిధ పరిశ్రమలలోకి తీసుకుంటారని, ఈ పథకం ద్వారా దేశంలో సుశిక్షితమైన సైన్యం తయారవుతుందని కేంద్ర మంత్రులు వివిధ రకాలుగా ప్రకటనలు ఇస్తున్నారు. భాజపా పాలిత రాష్ట్ర ప్రభుత్వాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లు ఈ శిక్షణ పొంది తిరిగి వచ్చిన వారికి పోలీసు బలగాలలోకి తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించాయి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భాజపాల సిద్దాంత, భావజాల శిక్షణకు, ఈ రకంగా ʹనయా భారత్ʹ పేరుతో భారతదేశాన్ని ʹహిందూ రాజ్యంʹగా రూపొందించే తమ ఎజెండాకు ఈ పథకం తోడ్పడుతుంది. ʹవన్ నేషన్, వన్ ఎవ్రీథింగ్ʹ అన్న నినాదంతో దేశాన్ని ఫాసిస్టు ఏకీకృత పద్ధతిలో రూపొందించేందుకు, దేశంలో కార్మికులు, కర్షకులు, మధ్య తరగతి వంటి పీడిత వర్గాలను, వారికి నాయకత్వం వహిస్తున్న విప్లవ పార్టీని, విప్లవకారులను, ప్రశ్నించే ప్రతి గొంతునూ అణచివేసేందుకు ఒక విస్తృత సైన్యం తయారవబోతున్నది. ఇప్పుడీ పథకం దేశాన్ని ʹవన్ నేషన్, వన్ పోలీస్ʹ దిశగా తీసుకుపోతుంది.
అత్యంత దూకుడుగా తమ ఎజెండాను ముందుకు తీసుకువెళుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు దేశ రాజ్యాంగ నియమాలను కానీ పార్లమెంటరీ వ్యవస్థ నిబంధనలను గానీ పాటించకుండా, కనీస గణతంత్ర స్వభావాన్ని దృష్టిలోకి తీసుకోకుండా కనీసం ప్రతిపక్షాలను సంప్రతించకుండా ఈ పథకాన్ని ప్రకటించాయి. దీని వల్ల కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ప్రభావితం అవుతాయి.
ఈ ఫాసిస్టీకరణ పథకం లోతులను అర్థం చేసుకుని దాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసి, ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని వెనక్కు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిందిగాను, ఈ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసననోద్యమాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక మహా ఉద్యమంగా మలచవలసిందిగానూ మా పార్టీ కేంద్ర కమిటీ దేశ యావత్తు పీడిత వర్గాలు, పీడిత సెక్షన్లు, పీడిత జాతులకు పిలుపునిస్తున్నది. దేశ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ʹఅగ్నిపథ్ʹలో చేరవద్దని దేశ యువతకు విజ్ఞప్తి చేస్తున్నది.
అభయ్
అధికార ప్రతినిధి
కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
Keywords : agneepath, agneeveer, cpi maoist, abhay
(2022-08-11 22:06:20)
No. of visitors : 1337
Suggested Posts
| జంపన్నలేఖకు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
జూన్ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన |
| PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటనపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు |
| పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీసీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబుమావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని |
| మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనఅనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ మృతి - అభయ్ ప్రకటన14 ఆగస్టు, 2021 మనం కొద్ది రోజులలో జరుపుకోబోతున్న మన పార్టీ అవిర్భావ వారోత్సవాల ఉత్సాహభరిత రాజకీయ వాతావరణంలో అత్యంత విషాదకర వార్తను వినాల్సి వస్తోంది. ఇటీవలే మా యువ సీసీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ యాప నారాయణ అమరత్వ వార్త నుండి మనమింకా పూర్తిగా తేరుకోక ముందే మేం వెటరన్ కామ్రేడ్ అంబర్ ను కోల్పోయాం. |
| ప్రపంచ విప్లవ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ ప్రకటన
అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విప్లవకర పరిస్థితిని ఉపయోగించుకోవడం, విధ్వంసక సామ్రాజ్యవాదాన్ని నాశనం చేయడం, యుద్ధాలకు తావు లేని సోషలిజాన్ని స్థాపించడం ప్రపంచ శ్రామికవర్గం, మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ శక్తుల తక్షణ కర్తవ్యం |
| Celebrate grandly the 17th Anniversary of CPI (Maoist) in revolutionary atmosphere!CPI (Maoist) is about to celebrate its 17th Anniversary. The CC of our party gave a detailed revolutionary message almost one month back. On the occasion the CC conveys revolutionary |
| పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల పిలుపుభారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17 వ పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోబోతున్నది. మా పార్టీ కేంద్రకమిటీ దాదాపు నెల రోజుల క్రితమే సవివరమైన విప్లవ సందేశాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ తరపున యావత్ పార్టీ శ్రేణులకు; పీఎల్జీఏ కమాండర్లకు, యోధులకు; విప్లవ ప్రజా నిర్మాణాల నాయకులకు, కార్యకర్తలకు; విప్లవ ప్రజా కమిటీల నాయకులకు, కార్యకర్తలకు; దేశం |
| బస్తర్ పై 12 గంటల పాటు డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేసిన సైన్యం - సాక్ష్యాలతో బైటపెట్టిన మావోయిస్టు పార్టీదండకారణ్యంలోని సౌత్ బస్తర్లో మరోసారి ఏరియల్ బాంబు దాడి జరిగిందని మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. |