మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2
Part 2
4
భారతదేశంలో 1857 నుండి జరుగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవ పోరాటాలు ` కొన్ని ప్రాంతాల్లో, కొంత పరిమిత కాలంలో ` పరిమాణాత్మక దశల్లో అనేకచోట్ల వందలాదిగా జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. ఇలాంటి పోరాటాల్లో అనివార్యంగా లక్షలాది మంది ప్రజలు పోరాడి అమరులయ్యారు. ఇంకా చాలా చోట్ల ఇప్పటికీ ఇలాంటి పోరాటాలు ఉత్పత్తి శక్తుల వికాసం కోసం జరుగుతున్నాయి. కానీ అవి శాస్త్రీయ అవగాహనతో వర్గపోరాటాలుగా ఎదగలేదు.
ఇలాంటి స్థితిని 1967 నక్సల్బరీయే మొట్టమొదటిసారిగా గుర్తించింది. అర్ధవలస, అర్ధభూస్వామిక దేశంలో ప్రధాన వైరుధ్యంగా భూస్వామ్యానికి`అశేషపీడిత ప్రజానీకానికి గల వైరుధ్యమే ప్రధాన వైరుధ్యంగా గుర్తించి ` సాయుధ పోరాటం ద్వారా కార్మిక, కర్షక ప్రభుత్వాన్ని ఏర్పరిచి ` నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేయాలని చెప్పింది. భారతదేశంలో అతిపురాతన భూస్వామ్యాన్ని సమూలంగా నిర్మూలించి `నూతన ప్రజాస్వామిక పోరాటం తర్వాత సోషలిజానికి పరివర్తన చెందడమే విప్లవమని నిర్వచించింది. అందులో భాగంగా దేశవ్యాపిత విప్లవోద్యమాలు నిర్మాణమయ్యాయి.
వర్గపోరాటాన్ని నిర్మించడమంటే వర్గ, కుల, మత, లింగ, ప్రాంతీయ వైరుధ్యాలను ఘర్షణ, ఐక్యత ద్వారా పరిష్కరించుకుంటూ ప్రజలు పురోగమించడం. ఈ లక్ష్యంగా విప్లవోద్యమం పనిచేయనారంభించింది. అందువల్ల మునుపెన్నడులేని విధంగా విప్లవోద్యమం మీద బ్రాహ్మణీయ భూస్వామ్య ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వేలాది మంది కార్యకర్తలు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు. వేలాది మంది జైళ్ల పాలయ్యారు. కుట్ర కేసులు పెట్టి మేధావులను వేధించారు. చివరకు 1975లో అత్యవసర పరిస్థితి పెట్టి కాంగ్రెసు ప్రభుత్వం దేశాన్ని పెద్ద జైలుగా మార్చింది. ʹప్రభుత్వం పోరాడుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించజాలని స్థితికి చేరుకున్నప్పుడు ` తానే ఏర్పరిచిన చట్టాలను కూడా ఖాతరు చేయకుండా ఫాసిజంగా మారుతుందిʹ అనే అంబేడ్కర్ మాట నిజమైంది.
దేశవ్యాపితంగా అనేక పరిమాణాత్మక పోరాటాలు ఉవ్వెత్తున లేస్తున్న 1967 నుండి 1977 పది సంవత్సరాల కాలంలో ` నక్సల్బరి పంథా అనేక చర్చోపచర్చలకు, సంఘర్షణలకు లోనయ్యింది. వర్గశత్రు నిర్మూలన ` కొంత మంది వీరులే చరిత్ర నిర్మాతలు అన్న అవగాహన నుండి ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే అవగాహనతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రమేయంతో విప్లవోద్యమాలు నిర్మించాలనే గుణాత్మక దశకు చేరుకున్నది. భారతదేశ విప్లవోద్యమాల కాలంలో ఇలాంటి పది సంవత్సరాల కాలం ఒక విప్లవోద్యమం నిలదొక్కుకోవడం ` ఇదే మొదటిసారి. పెద్ద గెంతు. ఒక స్పష్టమైన వ్యూహం, ఎత్తుగడలు ` రాజకీయ తీర్మానం ఏర్పరుచుకోవడం కూడా ఈ పదేండ్ల కాలంలో జరిగిన పెను మార్పు.
ఇలాంటి మొత్తం సంఘర్షణాత్మక స్థితిలో చెరబండరాజు రాజకీయ ఉద్యమ కార్యకర్త ` రచయిత. ఉద్యమానికి ఊపిరి అయిన పాటగాడు. కనుకనే ఆయన సాహిత్యం ఈ పది సంవత్సరాల సంఘర్షణ కాలానికి కొత్తపాతల భీకర పోరాటపు భావోద్వేగాల సృజనాత్మక వ్యక్తరూపం.
ఉత్పత్తి శక్తుల మార్పు క్రమం వర్గ పోరాటంతో ఆరంభమౌతుంది. అదే స్థాయిలో చైతన్యంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వర్గపోరాటం లేని చైతన్యం అంతిమంగా రొమాంటిసిజంగా వ్యక్తమౌతుంది. చైతన్యస్థాయిని ఉత్పత్తి శక్తులు మారే క్రమం, వర్గపోరాటం నిర్ణయిస్తాయి. ఇది ఈ పది సంవత్సరాల రాజకీయాల్లోనూ, చెర సాహిత్యంలోనూ వ్యక్తమయ్యాయి. వర్గపోరాటం ఆకాశం నుంచి ఊడిపడేది కాదు. ఇలంటి ఘర్షణ నుంచే రూపుదిద్దుకుంటుంది.
మావో చెప్పినట్లుగా ` ఇది స్వీయాత్మక ఉత్తేజంతో పని చేసే కాలం. వర్గపోరాటం మార్క్సిస్టు`లెనినిస్టు పద్ధతిలోకి మారినప్పుడు వాస్తవాల నుండి సత్యాన్ని గ్రహించగల్గుతాం. భౌతికంగా ఉన్న వస్తువులు వాస్తవాలే ` వాటి అంతర్గత సంబంధాలను నిర్దేశించే సూత్రాలే సత్యం. ఈ సత్యాన్ని గ్రహించడమే అధ్యయనం. ఇలాంటి అధ్యయనం నుంచి వెలువడిరదే చెర సాహిత్యం.
మన దేశం, మన గ్రామం, జిల్లాలోనూ బయట వున్న వాస్తవ పరిస్థితుల నుంచి మొదలు పెట్టి ఊహాజనిత సూత్రాలను విడిచిపెట్టి వాస్తవ పరిస్థితుల్లో అంతర్గతంగా ఉన్న సూత్రాలను ఆచరణకు మార్గదర్శకంగా చేసుకోవాలి. అంటే మన చుట్టూ జరుగుతున్న సంఘటనలలోని ఆంతరంగిక సంబంధాలన్నీ కనుక్కోగలగాలి. ఇలాంటి గతితార్కిక పద్ధతిని అర్థం చేసుకొనే క్రమంలోనే చెర సాహిత్యం రాశారు. చెర నవలలు, కథల్లో గ్రామీణ, పట్టణ జీవితంలోని ఆంతరంగిక సంబంధాల అన్వేషణే ప్రధాన వస్తువు.
పరిస్థితులను తెలుసుకోవడమంటే ప్రపంచాన్ని తెలుసుకోవడం ` సిద్ధాంతం మీద పట్టు సాధించడమంటే ప్రపంచాన్ని మార్చడం. ఈ మార్పు క్రమానికి ఆరంభం చెర సాహిత్యం.
ఈ ప్రక్రియ సరళంగా జరిగేది కాదు. లెనిన్ చెప్పినట్లు..ఒక రాజకీయ పార్టీ ఎంత నిజాయితీ గలదో, ఆచరణలో తన వర్గం యెడల కష్టజీవుల ప్రజాస్వామ్యం యెడల తన బాధ్యతను ఎలా నెరవేరుస్తుందో తెలుసుకోవాలంటే అది ప్రధానమైన కచ్చితమైన పద్ధతి, ఆ పార్టీ తను చేసే పొరపాట్ల యెడల ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో చూడ్డం. ఏదైనా తప్పు చేస్తే దాపరికం లేకుండా ఒప్పుకోవడం, అందుకు కారణాలేమిటో తెలుసుకోవడం, ఏ పరిస్థితుల ఆ తప్పుకు దారి తీశాయో పరిశీలించడం, దాన్ని సరిదిద్దుకునేందుకు ఏమేమి చేయాలో కూలంకషంగా చర్చించడం, ఇది సిసలైన రాజకీయ పార్టీ అవలంబించవల్సిన విధానం. తన విధులను నెరవేర్చవల్సిన పద్ధతి. తన వర్గాన్ని, ప్రజలను సురక్షితంగా తర్ఫీదు చేయవల్సిన మార్గంʹʹ. విప్లవపార్టీ ఆత్మవిమర్శ రిపోర్టు రాసుకొని ` ఈ పది సంవత్సరాల కాలాన్ని విశ్లేషించుకొని ` తన తప్పును సరిదిద్దుకొని ` 1977 తరువాత క్షేత్రస్థాయి అధ్యయనంతో ` నిర్మాణంతో ఆదిలాబాదు, కరీంనగర్ రైతాంగ పోరాటాలుగా ఆరంభమై ` పీపుల్స్‌వార్ పార్టీగా ` మావోయిస్టు పార్టీగా గత యాభై అయిదు సంవత్సరాలుగా మూడు తరాలుగా పోరాడుతున్న సంగతి భారతీయ ప్రజలందరికీ తెలుసు. అనేక పరిణామాత్మక దశలను గుణాత్మక దశలుగా పురోగమించడం తెల్సిందే.
దేశవ్యాపిత విప్లవోద్యమంగా ఎదిగే క్రమంలో అనేక ఒడిదుడుకులు అనుభవిస్తూనే ఉంది. భారతదేశంలోని అన్ని పల్లెల్లో, ఆదివాసీ ప్రాంతాల్లో విస్తరించి, పట్టణాలను చుట్టుముట్టి ` కర్షక, కార్మిక రాజ్యం స్థాపించే దిశగా నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం కొనసాగుతోంది.
వరవరరావు గారన్నట్లు ` తన చరిత్రను తను నిరంతరం అధ్యయనం చేయకుండా దీర్ఘకాలిక విప్లవోద్యమం ముందుకు సాగదు.
ఇప్పుడు మరింత తీవ్రమైన ఉత్పత్తి శక్తుల పోరాటాలను పరిష్కరించే శక్త్తిలేని ప్రభుత్వం ` అనివార్యంగా దేశ విదేశ దోపిడీదారులకు సమస్తం దోచిపెడుతూ ఫాసిస్టుగా మారింది. విప్లవోద్యమం జాతీయ అంతర్జాతీ స్థాయిలో దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలందరినీ సంఘటిత పరిచిగా దేశ వ్యాపితంగా పురోగమించవల్సిన తరుణంలో మూడోతరం చెరబండరాజు రచనలు అధ్యయనం చేయడం అవసరం అనివార్యం.
వర్గ, కుల, మత, లింగ, ప్రాంతీయ అసమానతల భావోద్వేగ వ్యక్తరూపాలుగా పరిమాణాత్మక పోరాటాలు అనేక త్యాగాలతో పదునెక్కి గుణాత్మక పోరాటాలుగా మారిన క్రమాన్ని మూడోతరం ముఖ్యంగా యువత అధ్యయనం చేయడానికి చెరసాహిత్యం అవసరం. ఈనాటికి వ్యక్తమౌతున్న అనేక భావోద్వేగాల పునాదిని అర్థం చేసుకోవడానికి చెర సాహిత్యం దారి చూపుతుంది. అందుకే విరసం మరోసారి ఆయన సాహిత్య సర్వస్వాన్ని పునర్ముద్రిస్తోంది.
కవి, గాయకుడు, రచయిత ` విప్లవోద్యమ నాయకుడు చెరబండరాజు నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమం కోసం ` తన సమస్త శక్తులతో ` అరెస్టులు, జైళ్లు, అనారోగ్యం, ఆర్థిక సమస్యలు ధిక్కరించి చివరి దాకా పోరాడి అమరులయ్యారు. అలాంటి వీరుడు, సాహిత్యకారుడు మనందరికి, ముఖ్యంగా యువకులకు మార్గదర్శి.
కామ్రేడ్ చెరబండరాజు అమర్ హై !
` మంచిర్యాల
14.6.2022
కిందికి రోల్ చేస్తే 1వ భాగం ఉంటుంది
Keywords : chera, cherabanda raju, allam rajayya, virasam
(2023-11-28 03:31:47)
No. of visitors : 936
Suggested Posts
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1విశ్వవ్యాప్తంగా సామ్రాజ్యవాదం పూర్తిగా విస్తరించి ` తను ఆర్థిక మాంద్యంలో కూరుకపోయి స్థానిక ఉత్పత్తి శక్తుల మీద ` ఉత్పత్తి సంబంధాల మీద తీవ్రమైన ప్రభావం చూపిన కాలమది. అన్ని దేశాలల్లో దోపిడీ, హింసా, నిరుద్యోగం పెరిగిపోయాయి. |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
more..