ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ

ʹజులై

26-07-2022

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికారప్రతినిధి అభయ్ విడుదల చేసిన పత్రికా ప్రకటన పూర్తి పాఠం

2022 జులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండి!

భారత విప్లవ నిర్మాతలు, మహోపాధ్యాయులు, మన పార్టీ సంస్థాపక నాయకులు, కామ్రేడ్ చారు మజుందార్ 50వ వర్ధంతి, కామ్రేడ్ కన్హాయ్ చటర్జీ 40వ వర్ధంతిలను గొప్ప విప్లవ స్ఫూర్తి, విప్లవ సంకల్పంతో నిర్వహించండి!

భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేసే లక్ష్యంతో శత్రు వ్యూహాత్మక ʹసమాధాన్ʹ - ప్రహారీ దాడిని ఓడించండి!

ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా,

త్వరలో జులై 28 అమరుల స్మారకదినం సందర్భంగా మనం దేశ, ప్రపంచ పీడిత ప్రజల విముక్తి కోసం తమ అమూల్యమైన ప్రాణాలను ధారబోసిన అమరులందరినీ శ్రద్ధతో, గౌరవ భావంతో ఈ రోజు గుర్తు చేసుకోబోతున్నాం. ఈసారి దీని ప్రత్యేకత ఏమంటే మన భారత విప్లవ మహోపాధ్యాయులలో ఒకరు కామ్రేడ్ చారు మజుందార్ (సీఎం) 50వ వర్ధంతి. 1972 జులై 16వ తేదీన ఆయనను పోలీసులు కోల్ కతాలో ఒక ఇంటిలో అరెస్టు చేసారు. ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ప్రాణవాయువు అందకుండా చేయడంతో జులై 28వ తేదీన అయన అమరత్వం చెందారు. మన భారత విప్లవ మహోపాధ్యాయులలో మరొకరు కామ్రేడ్ కన్హయ్ చటర్జీ (కేసీ) తీవ్ర అనారోగ్యంతో 1982 జులై 18న మనలను శాశ్వతంగా వదిలివెళ్లారు. వీరిద్దరి అమరత్వంతో భారత విప్లవానికి అతి పెద్ద నష్టం జరిగింది. జులై 28 అమరుల స్మారక దినం సందర్భంగా కామ్రేడ్ సీఎం 50వ వర్ధంతి, కామ్రేడ్ కేసీ 40వ వర్ధంతులను పురస్కరించుకుని వీరితో పాటు నక్సల్బరీ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేటి వరకు భారత నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం అంతిమంగా సోషలిజం, కమ్యూనిజం స్థాపన లక్ష్యంగా అత్యున్నత త్యాగాలు చేసిన అమరులందరికీ కేంద్ర కమిటీ తలవంచి వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నది.

పెరూ కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కామ్రేడ్ గొంజాలోను సుదీర్ఘకాలం పాటు జైలులో బంధించిన అమెరికా- పెరూ ఫాసిస్టు పాలకులు చివరకు ఆయన ప్రాణాలను బలి తీసుకున్నారు. దీంతో ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం ఒక మహా నాయకుడిని కోల్పోయింది. ఫిలిప్పీన్స్ న్యూ పీపుల్స్ అర్మీ అధికార ప్రతినిధి కామ్రేడ్ కా ఓరిస్ ని అమెరికా-ఫిలిప్పీన్స్ ఫాసిస్టు పాలకులు హత్య చేసారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రజల ప్రియతమ నాయకులు కామ్రేడ్ గొంజాలోకు, ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు నాయకులు కామ్రేడ్ కా ఓరిస్ కు, ప్రపంచవ్యాప్తంగా విప్లవోద్యమాలలో, జాతీయ విముక్తి ఉద్యమాలలో అసువులు బాసిన వీరయోధులందరికీ కేంద్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి అశయాలను తుదకంటా కొనసాగిస్తామని ప్రతిన బూనుతున్నది.

గడచిన సంవత్సర కాలంలో భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే లక్ష్యంతో దీర్ఘకాల ప్రజాయుద్ధంలో తమ వంతు పాత్ర పోషిస్తూ 124 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. ఈ కాలంలో భారత దళారీ పాలకవర్గాల క్రూరమైన దాడి, సామ్రాజ్యవాద వ్యవస్థ సృష్టించిన అనారోగ్య వాతావరణంలో రోగాల బారిన పడి మన కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలకు తీవ్రమైన నష్టం జరిగింది. కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ తాపస్ దా (పతిత్ పావన్ హల్దార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి),
కామ్రేడ్ చింతన్ దా (నరేంద్రసింగ్), కామ్రేడ్ అంబర్ దా/గగన్ దా/సాహేబ్ దా (పూర్ణేందు శేఖర్ ముఖర్జీ), కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ రామకృష్ణ/సాకేత్ దా (అక్కిరాజు హరగోపాల్), ఈ
కాలంలో అమరులయ్యారు. కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ దీపక్ దా (మిలింద్ బాబూరావ్ తేల్ తుంబ్లే) మటోలా-పారెవా ఎన్ కౌంటర్ లో శత్రు బలగాలతో గంటల తరబడి హోరా హోరీ పోరాడుతూ 26 మంది పీఎల్ జీఏ సాహసికయోధులతో పాటు అమరులయ్యారు.

వీరితో పాటు బీహార్-ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ రూపేష్ దా/విజయ్ యాదవ్ (సందీప్ యాదవ్), తూర్పు బిహార్-ఈశాన్య ఝార్ఖండ్ సాక్ సభ్యులు కామ్రేడ్ లాలా దా/అగ్ని (సహదేవ్ రాయ్ మాంఝీ), 2యు సాక్ సభ్యులు కామ్రేడ్ నకుల్ వేర్వేరు శత్రు కోవర్ట్ ఆపరేషన్లలో అమరులయ్యారు. పార్టీ సీనియర్ కార్యకర్త కామ్రేడ్ అలూరి లలిత, డీకే ఎస్ జెడ్ సీ సెక్రటేరియట్ సభ్యురాలు కామ్రేడ్ నర్మద (ఉప్పుగంటి నిర్మల), అఖిల భారత విప్లవ సాంస్కృతికోద్యమ నాయకుడు కామ్రేడ్ రాజ్ కిశోర్, పార్టీ సీనియర్ కార్యకర్త, ఆంధ్రప్రదేశ్ జననాట్యమండలి కళాకారుడు కామ్రేడ్ డప్పు రమేష్ తుదిశ్వాస విడిచారు. బిహార్ రీజనల్ కమిటీ సభ్యులు బుదేశ్వర్ ఒక బూటకపు ఎన్ కౌంటర్ లో అమరులయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు కా. త్యాగీజీ/బాబా (శివ్ శంకర్ రజక్) అనారోగ్యంతో కన్నుమూసారు.

వీరితో పాటు ఈ కాలంలో అమరులైన వారిలో సెంట్రల్ రీజనల్ కంపెనీ-2లో నలుగురు కామ్రేడ్స్, బిహార్-ఝార్ఖండ్ (బీజే)లో 8 మంది, తూర్పు బిహార్-ఈశాన్య ఝార్ఖండ్ (తూ.బి. - ఈ.ఝా.)లో 13 మంది, దండకారణ్యం (డీకే)లో 69 మంది, ఆంధ్ర-ఒడిశా బార్డర్ (ఏఓబీ)లో ముగ్గురు, ఓడిశాలో ఒకరు, మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్ గఢ్ (ఎమ్ఎమ్ సీ)లో 8 మంది, తెలంగాణలో 13 మంది, ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు కామ్రేడ్స్ వున్నారు. వీరిలో 34 మంది మహిళా కామ్రేడ్స్ వున్నారు. 9 మంది డీవీసీ/సీవైపీసీ స్థాయి కామ్రేడ్స్ - కామ్రేడ్ సుక్ లాల్ (రాంసాయి పర్చామి, ఉత్తర గడ్చిరోలి డీవీసీ కార్యదర్శి, డీకే), కామ్రేడ్ మంటు ఖైరా (జడ్ సీఎం, బీజే), కామ్రేడ్ మహేష్ (శివాజీ గోటా, ఉత్తర గడ్చిరోలి డివిజనల్ కమాండర్ ఇన్ చీఫ్, డీకే), కామ్రేడ్ లోకేష్ (జోగాల్ పొడియం, కంపెనీ-4 సీవైసీఎమ్, డీకే), కామ్రేడ్ దిలీప్ తులావి (కంపెనీ-4 సీఐసీఎమ్, డీకే), కామ్రేడ్ ధర్మూ (మంగు కల్ము, కంపెనీ-4 సీఐసీఎమ్, డీకే), కామ్రేడ్ సన్ను (ఉత్తర గడ్చిరోలి ఆల్టర్నేట్ డీవీసీఎం, డీకే), కామ్రేడ్ అరుణ్ (ఉరసం కమ్లా, ఉత్తర గడ్చిరోలి ఆల్టర్నేట్ డీవీసీఎం, డీకే), కామ్రేడ్ సాకేత్ (కంపెనీ-6 కమాండర్, సీవైపీసీఎం, డీకే); 32 మంది ఏసీ/పీపీసీ సభ్యులు, 32 మంది పార్టీ పీఎల్ జీఏ సభ్యులు, 21 మంది కామ్రేడ్స్ విప్లవ ప్రజా నిర్మాణాల నాయకులు/కార్యకర్తలు (ఆర్పిసీ అధ్యక్షులు/సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజా మిలీషియా కమాండర్లు/సభ్యులు), 8 మంది విప్లవ సానుభూతిపరులు, విప్లవ ప్రజలు వున్నారు. వీరిలో 69 మంది కామ్రేడ్స్ ఎన్‌కౌంటర్లలో, 19 మంది బూటకపు ఎన్‌కౌంటర్లలో, 27 మంది అనారోగ్యాలతోనూ, ముగ్గురు కామ్రేడ్స్ జైళ్లలో అధికారుల నిర్లక్ష్యంతో సరైన వైద్యం అందకపోవడం వల్లనూ, నలుగురు కామ్రేడ్స్ దుర్ఘటనలలోనూ అమరత్వాన్ని పొందారు. ముగ్గురు కామ్రేడ్స్ అమరత్వపు వివరాలు అందలేదు. 17 మంది కామ్రేడ్స్ వివరాలు అందాల్సి వుంది. వీరే కాకుండా దేశవ్యాప్తంగా బహిరంగ ఉద్యమాలలో పని చేస్తున్న పలువురు విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామిక ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, మేధావులు, విప్లవ సానుభూతిపరులు, మిత్రులు ఈ సంవత్సర కాలంలో కన్నుమూసారు.

వర్గ పోరాటంలో, ప్రజాయుద్ధంలో అమరత్వం అనివార్యం. ప్రజా వీరుల త్యాగాలు లేకుండా పార్టీ సాధించిన విజయాలను ఊహించుకోలేం. ప్రస్తుతం అంతర్జాతీయంగా, దేశీయంగా విప్లవ పరిస్థితులు పెంపొందుతున్నాయి. అమరుల ఆదర్శవంతమైన, స్ఫూర్తిదాయకమైన గొప్ప విప్లవ జీవితాలు పెంపొందుతున్న విప్లవ పరిస్థితిని వినియోగించుకొని పురోగమించటానికి పార్టీకీ, యావత్తు విప్లవ శక్తులకు తగిన శక్తినందిస్తాయి.

ఈ అమరులందరి స్మృతిలో 2022 జులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని వారి త్యాగాల స్ఫూర్తితో, విప్లవ సంకల్పంతో జరుపుకోవాలనీ, ఈ సందర్భంగా భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేసే లక్ష్యంతో వ్యూహాత్మక ʹసమాధాన్ʹ-ప్రహార్ దాడిని ఓడించాల్సిందిగా పార్టీ శ్రేణులకు, పీఎల్ జీఏ బలగాలకు, విప్లవ ప్రజా నిర్మాణాలకు, కార్మిక, కర్షక, విద్యార్థి, యువజన, మేధావులకు సమస్త పీడిత వర్గాల, ప్రత్యేక సామాజిక సెక్షన్ల ప్రజలకు పిలుపునిస్తున్నది.

అభయ్
అధికార ప్రతినిధి
కేంద్ర కమిటీ
సీపీఐ మావోయిస్టు)

Keywords : cpi maoist, charu majundar, kanhay chetarjee, abhay
(2024-06-24 08:12:57)No. of visitors : 1814

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹజులై