ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు


ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు

ఈ

05-08-2022

తీస్తా సెతల్వాద్, మహ్మద్ జుబేర్, హిమాంశుకుమార్, రూపేశ్ కుమార్ ల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పొరాడాలని సీపీఐ మావోయిస్టు పిలిపినిచ్చింది. విశ్వ మూలవాసీ దినం అయిన ఆగస్టు9వ తేదీన దేశవ్యాప్తంగా గళమెత్తుతాదని మావోయిస్టు పార్టీ మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ ఓ ప్రకటనలో ప్రజలను కోరారు. ఆ ప్రకటన పూర్తి పాఠం...

హిందుత్వ శక్తుల కక్ష సాధింపు చర్యలలో భాగమే ప్రజాస్వామికవాదులకు శిక్షలు

కామ్రేడ్స్, మితృలు తీస్తా సెతల్వాద్, మహ్మద్ జుబేర్, హిమాంశుకుమార్, రూపేశ్ లు ఒంటరిగా లేరు. మీతో మేమంతా వున్నం .

గడిచిన రెండు మాసాలుగా దేశంలో కక్షసాధింపు చర్యలు వేగంగా జరిగిపోతున్నాయి. హిందుత్వ శక్తుల అసహిష్ణుతకు ఇవి తాజా వుదాహరణలు. ఒకవైపు 2002 లో గుజరాత్ లో వేలాది మంది ముస్లిం సోదరుల మారణకాండకు కారకులైన మోదీకి క్లీన్ చిట్ ఇచ్చి మరోవైపు దోషులను శిక్షించాలని కోర్టును కోరిన సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్ కు శిక్ష విధించడం, అలాగే 2009 ఆపరేషన్ గ్రీన్ హంట్ సమయంలో దంతెవాడ జిల్లాలో పోలీసులు ఒక బూటకపు ఎన్ కౌంటర్ లో 16 మందిని కాల్చి చంపిన నరసంహారంపై స్వతంత్ర దర్యాప్తును కోరిన ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ హితైషీ మితృలు హిమాంశు కుమార్ పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. అది చెల్లించని పక్షంలో ఆయన రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు విన్పించింది. ఆల్ట్ న్యూస్ జర్నలిస్ట్ మహమ్మద్ జుబేర్ 2018లో చేసిన ఒక ట్వీట్ మీద దాఖలు చేసిన కేసులో జూన్ లో జుబేర్ ను నాలుగేళ్ల తరువాత అరెస్టు చేశారు. ఇటీవలే ఝార్ఖండ్ లో స్వతంత్ర పాత్రికేయులు రూపేశ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యలన్నీ హిందుత్వ శక్తల కక్షసాధింపు చర్యలలో భాగంగా రాజ్యం కొనసాగిస్తున్నది. ఈ చర్యలను మా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మధ్య రీజినల్ బూరో తీవ్రంగా ఖండిస్తున్నది.

మితృలు హిమాంశు కుమార్ తాను నిర్దోశినని తన ఆత్మసాక్షిగా నమ్ముతున్నందుకే, ఆయన జుర్మానా చెల్లించకుండా తీవ్రమైన అనారోగ్య పరిస్థితులలో సైతం రెండేళ్ల జైలు శిక్షకు సిద్ధమయ్యాడు. ఆయన భారత పాలకవర్గాల ఆగడాలను ప్రశ్నిస్తున్నాడు. ఆయన వరుసగా తన ఫేస్ బుక్ డైరీలో పాలకవర్గాలను నిలదీస్తున్నాడు. ఈ దేశ మూలవాసులకు ఒక విశ్వసనీయమైన మితృడిగా వున్నాడు. ఆయన తనను జగ్గల్ పుర్ జైలులో ఆదివాసుల మధ్య వుంచాలనీ, తన శేష జీవితాన్ని వారి మధ్యనే గడిపే అవకాశాన్నివ్వాలని కోరుతున్నాడు.

కానీ, ఆయనను మనం కాపాడుకుందాం. ఆయన నిర్దోశి. ఈ దేశ మూలవాసులు ఇప్పటికే రాజ్యం కుట్రలకు విశ్వసనీయమైన ఆప్తున్ని ఫాదర్ స్టాన్ స్వామిని కోల్పోయారు.
హిమాంశును అలా కానివ్వకూడదు. ఆయనపై విధించిన సుప్రీం కోర్టు ఫైన్ ను రద్దు చేయాలనీ దంతెవాడ నుండి దిల్లీ వరకు గళమెత్తుతున్న వారితో మనమంతా సమైక్యమై విశ్వ మూలవాసీ దినం (9 ఆగస్టు) రోజు మరింత గట్టిగా నినదిద్దాం.

పాత్రికేయ మితృడు రూపేశ్ కుమార్ ఈ దేశపు అడవులు కార్పొరేటీకరణ, సైన్యీకరణకు నిలయంగా మారుతున్నాయనీ దానిని వ్యతిరేకించాలనీ దృఢంగా నిలిచి వుద్యమిస్తున్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా దేశంలో కొనసాగుతున్న ఆపరేషన్ సమాధాన్ సైనిక కేంపెయిన్ లో భాగంగా ఆదివాసీ శ్రేయోభిలాషులను తప్పుడు కేసులలో నిర్బంధించడం తీవ్రతరం, వేగవంతమవుతోంది. 2018లో గడ్ చిరోలీ జిల్లా (మహారాష్ట్ర)కు చెందిన మహేశ్ రావుత్ ను, నాగపుర్ కు చెందిన న్యాయవాది సురేంద్ర గడ్లింగ్, ఛత్తీస్ గఢ్ ఆదివాసీల పక్షాన దృఢంగా నిలిచిన సుధా భరద్వాజ్, ఝార్ఖండ్ మూలవాసులకు అత్యంత ఆప్తుడు ఫాదర్ స్టాన్ సామి మున్నగువారిని అనేక మందిని భీమా కోరేగాం తప్పుడు కేసులో ఇరికించి జైలు పాలు చేసిన విషయం విదితమే. ఈ దేశ అడవులను హస్తగతం చేసుకోవడానికి కార్పొరేట్ వర్గాలు చేస్తున్న కుట్రలను, దాడులను ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు వుద్యమించాలనీ, ఈ దేశ అడవులను, ప్రజలకు అండగా నిలిచిన ప్రజాస్వామిక శక్తులను, ఆదివాసీ శ్రేయోభిలాషులను కాపాడుకోవడానికి మరింత సమరశీల పోరాటాలకు నడుం బిగిస్తామని విశ్వ మూలవాసీ దినం నాడు నినదించాలనీ మా బ్యూరో మూలవాసీ ప్రజలకు పిలుపునిస్తున్నది.

విప్లవాభివందనాలతో

ప్రతాప్,
అధికార ప్రతినిధి
మధ్య రీజినల్ బ్యూరో,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : cpi maoist, himanshu kumar, rupesh kumar, teesta setalvad,mohammed zubair
(2022-09-26 00:46:35)No. of visitors : 692

Suggested Posts


జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ మృతి - అభయ్ ప్రకటన‌

14 ఆగస్టు, 2021 మనం కొద్ది రోజులలో జరుపుకోబోతున్న మన పార్టీ అవిర్భావ వారోత్సవాల ఉత్సాహభరిత రాజకీయ వాతావరణంలో అత్యంత విషాదకర వార్తను వినాల్సి వస్తోంది. ఇటీవలే మా యువ సీసీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ యాప నారాయణ అమరత్వ వార్త నుండి మనమింకా పూర్తిగా తేరుకోక ముందే మేం వెటరన్ కామ్రేడ్ అంబర్ ను కోల్పోయాం.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌

అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విప్లవకర పరిస్థితిని ఉపయోగించుకోవడం, విధ్వంసక సామ్రాజ్యవాదాన్ని నాశనం చేయడం, యుద్ధాలకు తావు లేని సోషలిజాన్ని స్థాపించడం ప్రపంచ శ్రామికవర్గం, మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ శక్తుల తక్షణ కర్తవ్యం

పార్టీ 17వ ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహించండి - మావోయిస్టుల‌ పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) 17 వ పార్టీ ఆవిర్భావ వారోత్సవాలను జరుపుకోబోతున్నది. మా పార్టీ కేంద్రకమిటీ దాదాపు నెల రోజుల క్రితమే సవివరమైన విప్లవ సందేశాన్ని అందజేసింది. ఈ సందర్భంగా కేంద్ర కమిటీ తరపున యావత్ పార్టీ శ్రేణులకు; పీఎల్‌జీఏ కమాండర్లకు, యోధులకు; విప్లవ ప్రజా నిర్మాణాల నాయకులకు, కార్యకర్తలకు; విప్లవ ప్రజా కమిటీల నాయకులకు, కార్యకర్తలకు; దేశం

Celebrate grandly the 17th Anniversary of CPI (Maoist) in revolutionary atmosphere!

CPI (Maoist) is about to celebrate its 17th Anniversary. The CC of our party gave a detailed revolutionary message almost one month back. On the occasion the CC conveys revolutionary

Search Engine

సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
పూంబాడ్ లో జరిగిన రాకెట్‌ దాడిపై ఆదివాసీల ఆగ్రహం
జైలులో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కబీర్ కళా మంచ్ కార్యకర్త సాగర్ గోర్ఖే
మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు
శాంతియుత సిలంగేర్ పోరాటానికి ఏడాది: ఇంకా నెరవేరని డిమాండ్లు
ప్రభుత్వం ఆదివాసులను హిందువులుగా గణించడానికి వ్యతిరేకంగా పోరాడండి - మావోయిస్టు పార్టీ పిలుపు
more..


ఈ