విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం

విడుదల

20-08-2022

UAPA వంటి క్రూర చట్టాన్ని సిపిఎం మాటల్లో వ్యతిరేకిస్తుంది కానీ తన పార్టీ నాయకత్వంలో వున్న కేరళ‌ రాష్ట్రంలోని పభుత్వం మాత్రం తరచుగా ఆ చట్టాన్ని ఉపయోగించి నిరసనలను అణచివేయడానికి ప్రయత్నిస్తుంది.

నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సభ్యుడని చెబుతున్న వ్యక్తిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద చేసిన ఆరోపణలను తిరిగి పెట్టాలని కేరళ ప్రభుత్వం కొన్ని వారాల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో, ఈ క్రూరమైన చట్టం కింద విచారణ లేకుండా జైలులో ఉన్న వేలాది మంది తమ విడుదలకు వున్న కొద్ది అవకాశాన్ని కోల్పోయారు.

యూఏపిఏ (సిఫార్సులు, విచారణ అనుమతి) నియమాలు-2008 కింద, నిర్ణీత కాలపరిమితిని ఉల్లంఘించినందువల్ల, టి.ఆర్. రూపేష్‌పై విచారణ చేయడానికి మంజూరు చేసిన అనుమతి చెల్లుబాటు కాదని వాదిస్తూ, అతనిపై ఉన్న మూడు కేసుల్లోని ఆరోపణలన్నింటినీ కేరళ హైకోర్టు మార్చిలో రద్దు చేసింది.

నిందితుడిపై విచారణ కొనసాగించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోడానికి సాక్ష్యాధారాలపై నివేదికను స్వీకరించిన ఏడు రోజుల సమయాన్ని మాత్రమే చట్టం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. కేరళ ప్రభుత్వం ఆరు నెలలకు పైగా ఏమీ చేయకపోవడంతో ఇంత సమయం తీసుకోవడం చట్టవిరుద్ధమని చెప్పి కేరళ హైకోర్టు రూపేష్‌పై పెట్టిన యుఎపిఎ అభియోగాలను రద్దు చేసింది.

కాలపరిమితి తప్పనిసరి కాదని, ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

సెప్టెంబరు 19న విచారణకు వచ్చినప్పుడు కేరళ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరిస్తే కనక, అది కేవలం రూపేష్‌ కేసులని మాత్రమే ప్రభావితం చేయదు. ఈ కఠినమైన చట్టంలో వున్న, నిందితులకు ఉపయోగపడే అరుదైన నిబంధనలలో ఒకదానిని ఇది పలుచన చేస్తుంది కూడా.

దుర్వినియోగాన్ని నివారించడానికి ఒక చర్య

బెయిల్‌ను యివ్వకుండా నిందితులను సుదీర్ఘకాలం జైలులో ఉంచడానికి దారి తీస్తుంది అనేది యూఏపిఏ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన విమర్శలలో ఒకటి. యూఏపిఏ కేసుల్లో ʹనిబంధన ప్రకారం బెయిల్ʹ వర్తించదని 2018లో NIA vs జహూర్ అహమ్మద్ షా వతాలీ కేసులో సుప్రీం కోర్టు ప్రకటించింది. సుదీర్ఘ నిర్బంధం, నెమ్మదిగా సాగే విచారణా ప్రక్రియే ఒక శిక్షగా మారుతుంది.

ఐదేళ్లు జైల్లో వున్నాక 121 మంది ఆదివాసీలను నిర్దోషులంటూ ఛత్తీస్‌గఢ్‌లోని ట్రయల్ కోర్టు జూలైలో విడుదల చేసింది. యూఏపిఏ ఆరోపణల కింద 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జైలులో ఉన్న నిందితులను నిర్దోషులుగా ప్రకటించిన సందర్భాలు చాలా తరుచుగా చూస్తున్నాం. అప్పీల్‌ వల్ల కొట్టివేసిన కేసుల్లో రూపేష్ ఆరేళ్లకు పైగా విచారణ లేకుండానే జైలులో ఉన్నారు.

ప్రభుత్వం అనుమతి ఇచ్చేవరకు యూఏపిఏ లోని 4వ, 6వ అధ్యాయాలలో పేర్కొన్న నేరాలను విచారణకు తీసుకోరాదని చట్టంలోని సెక్షన్ 45 నిర్దేశిస్తుంది. ఈ అధ్యాయాలు తీవ్రవాద సంస్థలకు మద్దతు ఇవ్వడం, ఉగ్రవాద చర్యల కోసం నిధుల సేకరణ వంటి అనేక కార్యకలాపాలకు సంబంధించినవి. ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వచ్చో లేదో పరిశీలించేటప్పుడు అనుసరించాల్సిన విధానాన్ని, కాలపరిమితిని నిర్దేశిస్తుంది. దర్యాప్తు ద్వారా సేకరించిన సాక్ష్యాధారాలను స్వతంత్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వం నియమించిన వారితో కూడిన శిఫారసు అథారిటీని ఏర్పాటు చేయాలి. ఈ అథారిటీ ఇచ్చిన నివేదికను, కేసు ఫైల్‌ను పరిశీలించిన తర్వాత విచారణకు అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అటువంటి అనుమతి లభించిన తర్వాతనే విచారణ కొనసాగాలి.

2008లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణ ద్వారా ఈ కాలపరిమితి నియమాన్ని చట్టంలో చేర్చారు. యూఏపిఏ పూర్వం వున్న ఉగ్రవాద- విధ్వంస కార్యకలాపాల (నివారణ) చట్టం, తీవ్రవాద నిరోధక చట్టం కూడా విచారణ ప్రారంభించడానికి ముందస్తు అనుమతి అవసరాన్ని నిర్దేశించాయి.

అటువంటి క్రూరమైన చట్టాల దుర్వినియోగాన్ని నిరోధించే చర్యగా విచారణకు అనుమతిని పొందాలనే నియమాన్ని రూపొందించారు. పోలీసులకు ఇతర సందర్భాల్లో సాధారణంగా లభించని అధికారాలను ఈ చట్టాలు ఇస్తాయి. వీటిపై పర్యవేక్షణ లేకపోతే, దుర్వినియోగం వల్ల తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే అటువంటి చట్టాలకింద నమోదు చేసే నేరాలను పరిగణలోకి తీసుకోవడానికి కోర్టు ద్వారా ముందస్తు అనుమతి పొందాలని నిర్దేశించాయి. చట్టం దుర్వినియోగం అవకుండా నిరోధించడానికి విచారణ కోసం అనుమతి పొందవలసిన అవసర ప్రాముఖ్యత గురించి కోర్టులు చాలా తరచుగా చెబుతున్నాయి.

తర్వాత వచ్చిన చట్టాలలో మంజూరు ప్రక్రియ మరింత స్వతంత్రంగా, కఠినంగా మారింది.

టాడా కింద, రాష్ట్ర ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని అనుమతినిచ్చే అధికారిగా నియమించారు. కానీ ఇలా చేయడం సాధారణ మానవ హక్కుల ఉల్లంఘనను నివారించడంలో సహాయపడలేదు. అందుకే ఉగ్రవాద నివారణా చట్టం- 2002 ప్రకారం, ఆ అధికారాన్ని పోలీసు వ్యవస్థ నుండి తొలగించి ప్రభుత్వానికే అప్పగించారు. అయినా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. ఇది సవరించిన యూఏపిఏలో రెండు-దశల పరీక్ష, సమయ పరిమితులను ప్రవేశపెట్టడానికి దారితీసింది.

తనిఖీ చేసి, నిందితులను ఖైదులో వుంచవచ్చా, అభియోగాలు నిజమైనవేనా కాదా అని చూడటానికి విచారణకు అనుమతించాలా వద్దా అని పరిశీలించే నిబంధన ఒక అవకాశాన్నిచ్చింది.

అంతేకాకుండా, ఈ కేసులలో అనవసరమైన జాప్యాన్ని నివారించాలని న్యాయ పాలన నిర్దేశిస్తుంది కానీ విచారణా విధానాలలో విపరీతమైన జాప్యం జరుగుతుంది. ఈ జాప్యం జరగడం విచారణా ఖైదీల హక్కులను రాజ్యం పూర్తిగా ఉల్లంఘించడమే. ప్రాసిక్యూషన్ కోసం అనుమతిని కాలపరిమితితో మంజూరు చేయాలనే నిబంధన విచారణలో జాప్యాన్ని నివారించడంలో సహాయపడటానికి కూడా ఉద్దేశించబడింది. అయితే, కేరళలోని సీపీఎం తరచూ యూఏపీఏను ఉపయోగించి నిరసనలను అణచివేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ చట్ట ఉపయోగాన్ని వ్యతిరేకిస్తూ విస్తృతంగా 2017లో నిరసనలనెదుర్కొన్న మొదటి పినరయి విజ‌యన్ ప్రభుత్వం, యూఏపిఏ కేసులపై సమీక్ష చేస్తానని ప్రకటించింది. చట్టం ద్వారా నిర్దేశించబడిన ఒక సిఫార్సు చేసే అథారిటీ ద్వారా సాక్ష్యాధారాలను పరిశీలించడమే దీని అర్ధం అని తరువాత స్పష్టమైంది.

యూఏపిఏని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించుకున్న తన వైఖరికి విరుద్ధంగా ఆ పార్టీ చర్యలు ఉన్నాయి. నిందితుడు ఈ క్రూరమైన చట్టం బారి నుండి బయటపడే చిన్న అవకాశాలను కూడా తొలగించడానికి కేరళ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, వారి పార్టీ చట్టాన్ని రద్దు చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రచారాలను నిర్వహించింది.

- తుషార్ నిర్మల్ సారథి, కేరళ హైకోర్టులో న్యాయవాది.
(తెలుగు అనువాదం: పద్మ కొండిపర్తి)

Keywords : kerala, uapa, court, pinaraivijayan, cpm
(2024-04-14 21:47:42)



No. of visitors : 1333

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

దళిత నటి విషాద గాథ‌ !

అప్పుడే రెండో ఆట చూడడానికి.. తనను తాను తెర పై చూసు కోడానికి వచ్చిన రోజీపై దాడి చేశారు. భయంతో పరుగులు తీసి రోజీ ఒక పూరి గుడిసెలో ఆశ్రయం పొందింది. ఆమె ధైర్యం తమ కులాధిపత్యానికి చేటు కలిగిస్తుందనే మూర్ఖులు... ఆమెని వెంబడించి ఆ ఇంటిని దహనం చేశారు. ఇంటివాళ్ళు ప్రాణభయం తో పారిపోయారు

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


విడుదల