పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు

పాండు

12-09-2022

నాగ్ పూర్ జైల్లో అనారోగ్యం పాలైన ఆదివాసీ యువకుడు పాండు నొరోటిని సరైన చికిత్స అందించకుండా జైలు అధికారులు హత్య చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ నెల 13న నొరోటీ హత్యకు నిరసనగా, రాజకీయ ఖైదీల విడుదలకై దేశ‌వ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని సీపీఐ మావోయిస్టు మధ్య రీజినల్ బ్యూరో అధికారప్రతినిధి ప్రతాప్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

ప్రతాప్ ప్రకటన పూర్తి పాఠం....

అస్థిత్వ పోరాటంలో మరో యువకుడికి జైలు శిక్ష, జైలులో హత్య

పాండు నొరోటి ఒక ఆదివాసీ నవయువకుడు. ఆయనపై పోలీసులు మోపిన నేరం గడ్చిరోలీ జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నాడనేది. ఆ నేరానికి గడ్చిరోలీ జిల్లా న్యాయమూర్తి పాండు నొరోటికి జీవిత ఖైదు శిక్ష విధించాడు. నిజానికి ఇంతకన్నా తీవ్రమైన శిక్షే విధించాలని తీర్పు సందర్భంగా ఆ జడ్డీ వ్యాఖ్యానించాడు. అంటే ఆ యువకుడు తమ అడవులలో తాము ఆరాధ్య దైవంగా భావించే కొండలను లాయిడ్ మెటల్స్ కు లీజ్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకించడమే జడ్జి గారి దృష్టిలో ఉరిశిక్ష విధించాల్సినంతటి నేరంగా మారింది. ఈ దేశపు న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా ఈ దేశపు దోపిడీదారుల కొమ్ముకాస్తున్నారనే విషయాన్ని మరోమారు రుజువు చేసుకుంటే, ఆ తీర్పులను అమలు చేసే పోలీసు, జైళ్లు నిర్దోషులైన ఖైదీల పట్ల అంతకన్నా దారుణమైన వైఖరిని అనుసరిస్తున్నారనీ నాగపుర్ సెంట్రల్ జైలులో పాండు నొరోటికి అవసరమైన చికిత్స అందించకుండా ఆగస్టు 25 నాడు హత్య చేసి నిరూపించుకున్నారు. జైలులో ఖైదీల పట్ల అనుసరిస్తున్న అమానవీయ, అప్రజాస్వామిక, చట్ట వ్యతిరేక వైఖరిని మా పార్టీ మధ్య రీజినల్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ అమరుడు పాండు నొరోటికి జోహర్లు అర్పిస్తున్నది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతోంది. పాండు అనారోగ్యం గురించి ఆయన కుటుంబానికి కానీ, ఆయన తరఫున నిలిచిన వకీలుకు కానీ చట్టబద్ధంగా తెలుపకుండా హత్య చేయడాన్ని మా పార్టీ ఖండిస్తున్నది. పాండు హత్యకు కారకులైన అధికారులను విచారించి శిక్షించాలనీ డిమాండ్ చేస్తున్నది.


(పాండు నొరోటీ)

పాండు నొరోటీ గడ్ చిరోలీ జిల్లా ఏటపల్లి తాలూకా మురెవేడ గ్రామంలో జన్మించిన 33 ఏళ్ల యువకుడు. ఆ ప్రాంతంలో గడచిన మూడు దశాబ్దాలకు పైగా ప్రజలు సుర్జాగఢ్ కొండలలో ఇనుప గనుల తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రజల పోరాటానికి దేశంలోని నిజమైన దేశభక్తులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, న్యాయవాదులు, ఆదివాసీ శ్రేయోభిలాషులు అండగా నిలిచారు. వారంతా మన దేశ వనరులను సామ్రాజ్యవాదుల పెట్టుబడులకు అమ్మడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, 2014లో మహారాష్ట్రలో అధికారాన్ని చేపట్టిన హిందుత్వ శక్తులు జిల్లాను పోలీసు నిలయంగా మార్చివేసి ఆఘమేఘాల మీద గనుల తవ్వకాలను ప్రారంభించాలనీ చర్యలు చేపట్టింది. వాటిలో భాగంగానే దానిని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలతో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యులు సాయిబాబా సహ 6గురిని అరెస్టు చేశారు. అనతికాలంలోనే వారిలో 5గురికి జీవిత ఖైదు శిక్ష విధించారు. తప్పుడు ఆరోపణలపై కఠిన శిక్షలు విధించడం, వారిని జైలు పాలు చేసి జైలులోనే హత్య చేయడం గత 8 ఏళ్లుగా దేశంలో చూస్తున్నాం. ఈ చర్యలన్నీంటిని మా పార్టీ ఖండిస్తున్నది.

గడ్చిరోలీ మూలవాసీ ప్రజల పోరాటాలకు అండగా నిలిచిన ప్రజా రచయిత సుదీర్ దాన్లే, ప్రముఖ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, సామాజిక కార్యకర్తలు మహేశ్ రావుత్, అరుణ్ ఫరేరా, వర్నన్ గొంజాల్విస్, సోమాసేన్ (వీరంతా మహారాష్ట్ర కు చెందినవారే)లను నిరాధారంగా భీమా కోరేగాం కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. గడ్ చిరోలీ ప్రజా పోరాటాలకు అండగా నిలిచిన ప్రముఖ రచయిత వరవరరావు, న్యాయవాది సుధా భరద్వాజ్ లను కూడ ఆ కేసులో ఇరికించారు. ఆ కేసులో ముద్దాయిగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని పోలీసులు 2021 జూలై 5 నాడు చికిత్స అందకుండా చేసి జైలులోనే హత్య చేశారు. గడ్చిరోలీ ప్రజలకు జీవితాంతం సేవ చేసిన విప్లవకారిణి కామ్రేడ్ నర్మదను ముంబాయి జైలులోనే హత్య చేశారు. ఈ రకంగా ప్రజల కోసం నిలిచిన వారిని జైలు పాలు చేయడం, జైళ్లలో హత్య చేయడం హిందుత్వ శక్తుల ఫాసిస్టు విధానాలకు పరాకాష్ట. మరోవైపు అమానవీయ పద్ధతులలో గుజరాత్ లో ముస్లిం మహిళ బిల్కిస్ బానోపై అత్యాచారం జరిపి ఆమె చిన్నారి కూతురును కుటుంబ సభ్యులను హత్య చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్న హంతకులను నిస్సిగ్గుగా ʹస్వతంత్ర వేడుకలʹ సందర్భంగా విడుదల చేయడం, దానికి భిన్నంగా తన అస్థిత్వం కోసం పోరాడిన పాండును హత్య చేయడం ఈ వ్యవస్థ స్వభావాన్ని నగ్నంగా బట్టబయలు చేస్తున్నది.

కామ్రేడ్ పాండు నొరోటీ హత్యను ఖండిస్తూ రాజకీయ ఖైదీల విడుదలకై పోరాడుతున్న వ్యక్తులు, సంస్థలు సెప్టెంబర్ 13 నాడు దేశంలోని సమస్త రాజకీయ ఖైదీల విడుదలకు మరింత సమరశీల పోరాటాలకు ఉద్యమించాలనీ మా పార్టీ ప్రజాహిత శక్తులకు పిలుపునిస్తున్నది. కామ్రేడ్ పాండు హత్యను ఖండిస్తూ ముందుకు వచ్చిన వారంతా ఈ దేశంలోని ప్రజాహిత శక్తులను కటకటాలపాలు చేసి అణచివేయచూస్తున్న ఫాసిస్టు పాలకుల చర్యలను దృఢంగా ఎదుర్కొంటూ వారిని కాపాడుకోవడానికి మరింత సమరశీల పోరాటాలకు పూనుకో వాలనీ మా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.

దేశంలోని రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా విడుదల చేయాలి
కామ్రేడ్ పాండు నొరోటీ హత్యకు కారకులైన పోలీసు, జైలు అధికారులను కఠినంగా శిక్షించాలి.

ప్రతాప్,
అధికార ప్రతినిధి,
మధ్య రీజినల్ బూరో,
సీపీఐ (మావోయిస్టు)

Keywords : cpi maoist, pratap, abhay, pandu noroti, nagpur jail, political prisoners,
(2024-05-19 22:53:45)No. of visitors : 1306

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పాండు