కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!


కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!

కామ్రేడ్

02-01-2023

డిశంబర్ 16న మరణించిన ఫిలిప్పీన్ కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ జోసే మేరియా సిసాన్ కు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) విప్లవ నివాళులు అర్పించింది. మనం మన కాలానికి చెందిన గొప్ప మార్క్సిస్టు మేధావీ, విప్లవ నాయకుడిని కోల్పోయాం.అని మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ అంతర్జాతీయ వ్యవహారాల బాధ్యులు అమృత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీ ఇచ్చిన పిలుపుననుసరించి జనవరి 16ను జోసే మేరియా సిసాన్ స్మృతిలో విప్లవాంజలులు ఘటించడానికి అంకితం చేద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.

అమృత్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....

ప్రియమైన కామ్రేడ్స్

ఫిలిప్పీన్ కమ్యూనిస్టు పార్టీ సంస్థాపక చైర్మన్, ప్రతిభావంతమైన అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ నేతలలో ఒకరు కామ్రేడ్ జోసే మేరియా సిసాన్ ( 8-2-1939 -16-12-2022) డిసెంబర్ 16నాడు నెదర్ లాండ్స్ లోని ఉట్రిచ్ నగర ఆస్పత్రిలో మరణించారు. గొప్ప విప్లవ నాయకుడు, ఆలోచనాపరుడు, దేశభక్తుడు అన్నిటికి మించి అంతర్జాతీయవాదికి మనం విప్లవ నివాళులు అర్పిద్దాం. ఆయనను హేయంగా ఒక ఉగ్రవాదిగా, రక్త పిపాసిగా ప్రచారం చేస్తున్న బూర్జువా మీడియా ప్రచారాన్ని ఖండిద్దాం.

మనం మన కాలానికి చెందిన గొప్ప మార్క్సిస్టు మేధావీ, విప్లవ నాయకుడిని కోల్పోయాం. కామ్రేడ్ సిసాన్ మరణించాడు కానీ ఆయన విప్లవ వారసత్వం సదా వర్ధిల్లుతోంది. జాతీయ స్వతంత్రత, ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షల సాధన కోసం, దేశ చరిత నిర్మాణానికై ఆయన ఫిలిప్పినో ప్రజలను విప్లవోన్ముఖులను చేశాడు. ఆయన 26 డిసెంబర్, 1968నాడు ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీని (సీ.పీ.పీ) పునర్నిర్మాణం చేశాడు. ఫిలిప్పైన్స్ నూతన ప్రజాస్వామిక విప్లవ సాధనకై ఆయన 29 మార్చ్, 1969 నాడు నూతన ప్రజాసైన్యాన్ని (ఎన్.పీ.ఏ) నిర్మించాడు. 1973లో నూతన ప్రజాతంత్ర వేదిక (ఎన్.డీ.ఎఫ్)ను ప్రారంభించి దేశ వ్యాప్తంగా దావానలంలా ప్రజాయుద్ధాన్ని విస్తరింపచేశాడు.

1977లో కామ్రేడ్ సిసాన్ ను ఫెర్డినాండ్ మార్కోస్ నియంతృత్వం అరెస్టు చేయడంతో ఆయన తొమ్మిది సంవత్సరాలు అనేక యాతనలు అనుభవిస్తూ మార్కోస్ పాలన అంతమయ్యాకనే 1986లో విడుదలయ్యాడు. 1988లో, కామ్రేడ్ సిసాన్ ఉపన్యాసాలు ఇవ్వడానికి విదేశీ పర్యటనలో వుండగా ఆయన పాస్ పోర్టును ఫిలిప్సీన్స్ ప్రతిఘాతుక ప్రభుత్వం రద్దు చేయడంతో ఆయన డచ్ ప్రభుత్వం నుండి 1992లో రాజకీయ శరణార్థిగా ఆశ్రయం పొంది నెదర్లాండ్స్ లోనే గత 35 సంవత్సరాలుగా గడుపుతున్నాడు. ఫిలిప్పీన్స్ లో ప్రజాయుద్ధం కొనసాగుతుండగా, ఆయనపై విదేశాలలో సైతం పలు హత్యా కేసులను నమోదు చేశారు. కానీ, సరైన సాక్ష్యాధారాలు లేవనీ 2007లో వాటిని డచ్ కోర్టు కొట్టివేసింది. 2009లో ఆయన యూరోపియన్ కోర్టు ముందు తనపై నున్న తప్పుడు కేసుపై పోరాడి యూరప్ లోని ఉగ్రవాదుల జాబితా నుండి తన పేరును తొలగింపచేసుకున్నాడు. కామ్రేడ్ సిసాన్ తన జీవన సహచరి కామ్రేడ్ జూలీ డి లీమా సహ నలుగురు సంతానం, మనుమలతో నెదర్లాండ్స్ లోని ఉట్రెచ్ లో ఫిలిప్పీన్స్ నుండి వెళ్లిన వలస కార్మికులు, విప్లవ సమర్థకులు, శ్రేయోభిలాషుల మద్య జీవించాడు.

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక గొప్ప మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టుగా కామ్రేడ్ జోమా ఒక నూతన దశకు వారధిగా నిలిచాడు. కామ్రేడ్ జోమా ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీ 1992లో చేపట్టిన రెండవ చారిత్రక దిద్దుబాటు ఉద్యమానికి ప్రధాన మార్గదర్శకుడి భూమిక పోషిస్తూ ఆ పార్టీ విప్లవ పంథానుండి వైదొలగకుండా నిలిపాడు.

సీపీపీ పేర్కొన్నట్టు " ఫిలిప్పినో ప్రజలను మేల్కొల్పి పోరాడేలా చేయడంలో ఫిలిప్పీన్ చరిత్రలోనే కామ్రేడ్ జోమా పోషించిన పాత్రను ఎవరూ అధిగమించలేరు. దేశ వ్యాప్తంగానున్న లక్షలాది కార్మికులు, రైతులు, పెట్టీ బూర్జువా మేధావులు, సాధారణ వుద్యోగులు, వృత్తికారులు ముందుకు వచ్చి ఎర్ర జెండా కింద సంఘటితులై, అరుణారుణ బాటలో సమైక్యమయ్యారు. దేశ పరిస్థితులను, చరిత్రను అత్యంత సమగ్రంగా విశ్లేషించిన "ఫిలిప్పైన్స్ సమాజం, విప్లవం" (పీ.ఎస్.ఆర్.) రచనతో సమస్త జాతీయ-ప్రజాస్వామిక శక్తులు, విప్లవ యోధులు, పార్టీ శ్రేణులు చైతన్యవంతులై సమరానికి సమాయత్త మయ్యారుʹ.

కామ్రేడ్ జోమా అనేక విధాలుగా దేశ, ప్రపంచ విప్లవోద్యమానికి కంట్రిబ్యూట్ చేశాడు. వాటిలో ముఖ్యంగా ఫిలిప్పీన్ సమాజం, కళా, సాహితీ-సంస్కృతి పై, మార్క్సిజం-లెనినిజం-మావోయిజం తత్వశాస్త్రంపై, ఫిలిప్పీన్ ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై విమర్శ, ప్రజల ప్రజాస్వామిక విప్లవంపై, 1968-1999 ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీపై, 2000-2022 ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీపై, ప్రజాయుద్ధంపై, ఐక్య సంఘటనపై, జీ.ఆర్.పీ-ఎన్.డీ.ఎఫ్.పీ శాంతి చర్చలపై, సోషలిజం: ప్రతిఘటన పునరావిర్భావం, మార్కొస్ ఫాసిస్టు నియంతృత్వంపై రాసిన కామ్రేడ్ జోమా తన మరణానికి కేవలం ఒక నెల రోజుల ముందు ప్రపంచ సామ్రాజ్యవాదంపై అమూల్యమైన వ్యాసాన్నిరాసి మనకు అందించాడు. ఆయన మార్క్సిజం, ఫిలిప్పైన్స్, ప్రపంచ విప్లవోద్యమం గురించి అనేక ఉపన్యాసాలు, ఇంటర్వ్యూలు, చర్చల ద్వారా అన్ని కోణాలలో, ఎంతో సమగ్రమైన విషయాలు అందించాడు. ఆయన మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావోల కంట్రిబ్యూషన్స్ ను ఎత్తిపడుతూ సామ్రాజ్యవాదులు, వాళ్ల దాడుల నుండి కాపాడాడు. కామ్రేడ్ జోమా ఐ.ఎల్.పీ.ఏ; ఐ.ఎల్.పీ.ఎస్.లాంటి పలు అంతర్జాతీయ సంస్థలకు నాయకత్వం వహిస్తూ మార్గదర్శకత్వం అందించాడు. ఆయన తుదివరకూ విప్లవం కోసమే జీవించాడు. కానీ, మనం ఆయనను భౌతికంగా కోల్పోయాం. అయినప్పటికీ, ఆయన అందించిన అమూల్యమైన కంట్రిబ్యూషన్స్, ఆయన సృష్టించిన గొప్ప వారసులు ఫిలిప్పైన్స్ విప్లవోద్యమాన్ని ప్రజాయుద్ధాన్ని పురోగమింపచేయడానికి మన ముందున్నారు.

భారత ప్రజాయుద్ధ అంతర్జాతీయ సంఘీభావ కమిటీ ఇచ్చిన పిలుపుననుసరించి జనవరి 16ను మనం ఆ గొప్ప నాయకుడి స్మృతిలో విప్లవాంజలులు ఘటించడానికి అంకితం చేద్దాం. విప్లవోద్యమం కోసం అరుణ పతాకాన్ని రెపరెపలాడించే దృఢ సంకల్పంతో మనం సమైక్యంగా నిలవడానికి ఈ సందర్భాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఆ రోజు మనం ఆయన విప్లవ సేవల స్మరణలో సెమినార్లు, సభలు, సమావేశాలు నిర్వహించి మన కాలం గొప్ప నాయకుడిని పీడిత తాడిత ప్రజలకు పరిచయం చేద్దాం. ఆయన విప్లవ సేవలను విశాల ప్రజారాశులలోకి తీసుకెళ్లడానికి కరపత్రాలు, బుక్ లెట్స్ ను అచ్చువేసి ప్రపంచానికి అందిద్దాం. ఆయన విప్లవ సేవలను కొనియాడుతూ పాటలు, కవితా పఠనం, నాటకాలతో సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వాలి. ప్రజాసైన్యాలు మార్చింగ్ ద్వారా ఆయనకు తలవంచి వినమ్రంగా విప్లవ జోహార్లర్పించాలి. సామ్రాజ్యవాదులకు వారి తొత్తులకు వ్యతిరేకంగా ముఖ్యంగా ప్రస్తుతం మూడవ ప్రపంచ యుద్ధానికి/అణు యుద్ధ ప్రమాదానికి వ్యతిరేకంగా సమైక్యం కావడానికి నడుం బిగిద్దాం.

విప్లవాభివందనాలతో
అమృత్,
అంతర్జాతీయ వ్యవహారాల బాధ్యులు,
కేంద్రకమిటీ,
సీపీఐ (మావోయిస్టు)

Keywords : cpi maoist , jose maria sison, maoists, abhay,
(2023-03-27 05:25:13)



No. of visitors : 723

Suggested Posts


జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ మృతి - అభయ్ ప్రకటన‌

14 ఆగస్టు, 2021 మనం కొద్ది రోజులలో జరుపుకోబోతున్న మన పార్టీ అవిర్భావ వారోత్సవాల ఉత్సాహభరిత రాజకీయ వాతావరణంలో అత్యంత విషాదకర వార్తను వినాల్సి వస్తోంది. ఇటీవలే మా యువ సీసీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ యాప నారాయణ అమరత్వ వార్త నుండి మనమింకా పూర్తిగా తేరుకోక ముందే మేం వెటరన్ కామ్రేడ్ అంబర్ ను కోల్పోయాం.

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌

అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విప్లవకర పరిస్థితిని ఉపయోగించుకోవడం, విధ్వంసక సామ్రాజ్యవాదాన్ని నాశనం చేయడం, యుద్ధాలకు తావు లేని సోషలిజాన్ని స్థాపించడం ప్రపంచ శ్రామికవర్గం, మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ శక్తుల తక్షణ కర్తవ్యం

Search Engine

అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
more..


కామ్రేడ్