RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం

RSS,

28-05-2023

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోరాడుతున్న రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా ప్రజలు ఉద్యమించాలని పిలుపునిస్తూ దండకారణ్య విప్లవ ఆదివాసీ మహిళా సంఘం ఇచ్చిన ప్రకటన పూర్తి పాఠం...

మహిళా రెజ్లర్లపై లైంగిక దోపిడీకి పాల్ప‌డిన బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి!

మహిళా రెజ్లర్లపై లైంగిక దోపిడీకి కారణమైన రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద రెజ్లర్లు నిరసన దీక్ష చేస్తున్నారు. ఈ రెజ్లర్ల పోరాటానికి రెవల్యూషనరీ ట్రైబల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్ (KAMS), దండకారణ్య మద్దతు ఇస్తోంది. దోషి బ్రజ్ భూషణ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మాత్రమే కాకుండా, అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్రున్నది. మహిళా మల్లయోధుల ఈ పోరాటానికి మద్దతుగా అన్ని సామాజిక సంస్థలు, మహిళా సంఘాలు, మానవహక్కుల సంస్థలు, విద్యార్థులు-యువత, ప్రజలు ముఖ్యంగా అన్ని తరగతులు, వర్గాల మహిళలు ముందుకు రావాలని పిలుపునిస్తున్నాము.

కేంద్ర ప్రభుత్వ పితృస్వామ్య దురహంకారపు మహిళా వ్యతిరేక వైఖరిని బట్టబయలు చేస్తూ, మల్లయోధుల పోరాటానికి మద్దతు తెలుపుతూ, సమావేశాలు నిర్వహించాలని, పోస్టర్లు, కరపత్రాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని కార్మికులకు KAMS పిలుపునిస్తున్నది. ఈ ఏడాది జనవరి 18న మొదటిసారిగా, లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్ సింగ్ దుశ్చర్యలపై చర్య తీసుకోవడానికి జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆపై దర్యాప్తు కోసం క్రీడా మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది, అయితే ఆ కమిటీ బ్రిజ్ భూషణ్ సింగ్ అకృత్యాలను కప్పిపుచ్చింది. మూడు నెలలుగా దోషులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, కానీ ఈ రెజ్లర్లకు, వారి కుటుంబ సభ్యులకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఇంత జరిగినా, వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నారు. ఇది ప్రశంసనీయమైనది.

మణిపూర్‌లో క్రీడా మంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు తమకు ఎదురైన కష్టాలను విలేకరులకు చెప్పారు. అయ్తే మోడీ క్రీడా మంత్రుల సమావేశంలో తమ‌ ఎంపీపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై విచారణ గురించి కానీ, మహిళా క్రీడాకారులపై జరిగిన అఘాయిత్యాల గురించి కానీ ఏమీ మాట్లాడలేదు.

ఇలాంటి సున్నితమైన అంశంపై బీజేపీ మౌనం వహించడానికి కారణం వారి మహిళా వ్యతిరేక మనువాద ఆలోచనే. నిజానికి కేంద్రంలో రెండోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మహిళలపై రకరకాల అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనే లక్ష్యంతో బీజేపీ, సంఘ్ పరివార్ కలిసి చేస్తున్న కుట్రల‌ ఫలితం. వీళ్ళు కుల ఆధారిత, పితృస్వామ్య సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారు. ఒకవైపు స్త్రీలను భోగ వస్తువులుగా, సరుకులుగా చూపిస్తూ పురుషులకు బానిసలుగా జీవించే సంస్కృతిని వ్యాప్తి చేస్తూనే మరోవైపు స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న స్త్రీలపై విషం చిమ్ముతున్నారు.మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించి అనేక కేసులు నమోదైన తర్వాత కూడా ప్రభుత్వం,పాలనా యంత్రాంగం పూర్తి సహాయంతో బిజెపికి చెందిన చాలా మంది ఎంపిలు, ఎమ్మెల్యేలను కోర్టులు నిర్దోషులుగా విడుదల చేస్తున్నాయి. ప్రస్తుతం ఇందుకు చాలా ఉదాహరణలు కనిపిస్తున్నాయి.

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోను చిత్రహింసలకు గురి చేసి అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులను ఆరుగురిని హత్య చేసిన 11 మందిపైనేరం రుజువు కావడంతో జీవిత ఖైదు విధించబడినప్పటికీ 2022లో గుజరాత్ ప్రభుత్వం వారిని జైలు నుండి విడుదల చేసింది. ఇదంతా గుజరాత్ బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో దళిత బాలిక మనీషాను దారుణంగా హింసించి చంపిన నలుగురు అగ్రవర్ణాల ఠాకూర్ యువకుల్లో ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. దేశంలోని శాసనసభ, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు బ్రాహ్మణ ఆధిపత్య హిందూత్వ శక్తులతో నిండిపోయాయి.దీని కారణంగా దళితులు, గిరిజనులు, పేద వర్గాలకు చెందిన వారు ప్రతిరోజూ దేశంలోని మతవాదుల చేతుల్లో హత్యలకు గురవుతున్నారు.భౌతిక, లైంగిక వేధింపులు, సాంస్కృతిక దాడులు, మైనారిటీలపై ముఖ్యంగా ముస్లిం మహిళలపై దౌర్జన్యాలు
జరుగుతున్నాయి.

ఇలాంటి సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో మహిళా రెజ్లర్ల‌ పోరాటం నిరంకుశ, గూండాలు, బ్రిజ్‌భూషణ్‌ వంటి పురుషాధిక్య పార్లమెంటేరియన్లపైనే కాకుండా హిందూ దేశాన్ని ఏర్పాటు చేయాలనే కుట్రలకు వ్యతిరేకంగా ఉండాలి. కుస్తీలోనే కాదు అన్ని క్రీడల్లోనూ పితృస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా మహిళా క్రీడాకారులు గళం విప్పాలి. మహిళా వ్యతిరేకులుగా మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేరస్వభావాలున్న యావత్‌ ప్రభుత్వ యంత్రాంగంపై పోరాటం చేయడం అందరి కర్తవ్యం. దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దోపిడీ, దౌర్జన్యాలు, దాడులకు వ్యతిరేకంగా ధైర్యంగా, దృఢ సంకల్పంతో పోరాడాలని విప్లవ గిరిజన మహిళా సంఘం అన్ని తరగతుల, వర్గాల, ప్రాంతాల మహిళలు ముందుకు రావాలని పిలుపునిస్తున్నది.

*మహిళా క్రీడాకారులకు, వారి కుటుంబాలకు పూర్తి భద్రత కల్పించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి!
*ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు, నిరంకుశ బీజేపీ ఎంపీ బిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను కఠినంగా శిక్షించాలి!

*RSS, BJP లకు హిందూ రాష్ట్ర కుట్రలకు వ్యతిరేకంగా భారీ ప్రజా ఉద్యమం సృష్టించండి!

రాంకో హిచామి
ప్రతినిధి
రివల్యూషనరీ ట్రైబల్ ఉమెన్స్ ఆర్గనైజేషన్
దండకారణ్యం

Keywords : KAMS, Revolutionary Tribal Womenʹs Organization, dandakaranya, BJP MP, Wrestling Federation, President, Brij Bhushan Sharan Singh, RSS,
(2024-04-24 22:21:54)



No. of visitors : 1106

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


RSS,