భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే!
04-06-2023
భారత విప్లవోద్యమ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ కటకం సుదర్శన్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన అమరత్వంపై సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ మీడీయా ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...
భారత విప్లవోద్యమ నాయకుడు, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యుడు కామ్రేడ్ ఆనంద్ (కటకం సుదర్శన్) అమర్ రహే!
జూన్ 5 నుండి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా కామ్రేడ్ ఆనంద్ స్మారక సభలను నిర్వహించండి !!
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సీనియర్ సభ్యుడు కామ్రేడ్ అనంద్ (కటకం సుదర్శన్) తీవ్రమైన అనారోగ్య కారణంతో 2023, మే 31 నాడు పగలు 12:20 గంటలకు దండకారణ్య గెరిల్లాజోన్ లో తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, డయాబెటిస్, అధిక రక్తపోటు సమస్యలతో అయన గత కొద్ది సంవత్సరాలుగా బాధపడుతున్నారు. వీటి కారణంగా చివరికి గుండెపోటు వచ్చి అయన అమరుడయ్యాడు. వందలాది మంది పార్టీ, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పీఎల్ఏ) కార్యకర్తలు, నాయకులు, కమాండర్లు స్మారక సభలో పాల్గొని విప్లవ సాంప్రదాయాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన అమరత్వం పట్ల సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ తీవ్ర సంతాపాన్ని తెలుపుతోంది, ఆయనకు విప్లవ జోహార్లర్పిస్తోంది. అయన జీవిత సహచరికి, ఆయన కుటుంబ సభ్యులకు, బంధు మితృలకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని, సంవేదనను తెలియజేస్తోంది.
జూన్ 5 నుండి అగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, స్కూలు- కాలేజ్, యూనివర్సిటీల్లో, పారిశ్రామిక, సేవారంగాల్లోని పని స్థలాలన్నింటిలో కామ్రేడ్ అనంద్ స్మారక సభలు నిర్వహించి భారత విప్లవోద్యమానికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవాల్సిందిగా, ఆయన అమరత్వాన్ని ఎత్తిపట్టాల్సిందిగా దేశ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం.
69 సంవత్సరాల క్రితం ఆయన బెల్లంపల్లి పట్టణంలో కార్మిక కుటుంబంలో జన్మించారు. మహత్తర నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల ప్రేరణతో అయన 1974వ సంవత్సరంలో మైనింగ్ డిప్లొమా విద్యార్థిగా వుంటూ విప్లవోద్యమంలో అడుగుపెట్టారు. 1975వ సంవత్సరంలో రాడికల్ విద్యార్థి సంఘ ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషించారు. తదనంతర కాలంలో బెల్లంపల్లి పార్టీ సెల్లో సభ్యుడయ్యి సింగరేణి కార్మికోద్యమ, రాడికల్ విద్యార్థి యువజన ఉద్యమాల్లో ముఖ్యమైన పాత్ర పోషించారు. 1978లో లక్సెట్టిపేట-జన్నారం ప్రాంతాల్లో పార్టీ అర్గనైజర్గా బాధ్యతలు చేపట్టి రైతాంగాన్ని విప్లవోద్యమంలో సమీకరించారు. 1980లో అదిలాబాద్ జిల్లాకమిటీ సభ్యుడయి దండకారణ్య ప్రాంతంలోకి విప్లవోద్యమాన్ని విస్తరింపజేయడానికి పార్టీ చేపట్టిన కృషిలో భాగమయ్యారు. అందులో భాగంగానే అదిలాబాద్ జిల్లా ఆదివాసీ రైతాంగాన్ని విప్లవోద్యమంలో సమీకరించారు. తదనంతర కాలంలో ఆయన ఆ జిల్లాకమిటీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. ఇంద్రవెల్లి అదివాసీ రైతాంగ ఉద్యమానికి ఆయన ప్రత్యక్ష్య నాయకత్వాన్ని అందించారు. 1987లో దండకారణ్య ఫారెస్టు కమిటీలోకి ఎన్నికయ్యి దండకారణ్య విప్లవోద్యమ నిర్మాతల్లో ఒకరిగా కీలక భూమిక పోషించారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. అదే సంవత్సరం అఖిల భారత ప్రత్యేక కాన్ఫరెన్స్ లో (ఏఐఎస్సీ)లో కేంద్రకమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2001లో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ (పీపుల్స్ వార్) 9వ కాంగ్రెస్ లో మరోమారు కేంద్రకమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యి, పొలిట్ బ్యూరో సభ్యుడయ్యారు. దేశవ్యాప్త విప్లవోద్యమాన్ని సమన్వయంతో నడపడం కోసం అనాడు పార్టీ రీజినల్ బ్యూరోల్ని ఏర్పాటు చేసినపుడు కామ్రేడ్ అనంద్ సెంట్రల్ రీజినల్ బ్యూరో (మధ్య రీజియన్ బ్యూరో) కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. 2004లో భారత కమ్యూనిస్టు పార్టీ (పీపుల్స్ వార్), మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ అఫ్ ఇండియా (MCCI) రెండూ కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) ఆవిర్భవించింది. 2007లో ఐక్యతా కాంగ్రెస్-9వ కాంగ్రెస్ జరిగినపుడు మరోమారు ఆయన కేంద్రకమిటీలోకి ఎన్నికయి పోలిట్ బ్యూరో సభ్యుడిగా, మధ్య రీజినల్ బ్యూరో కార్యదర్శిగా కొనసాగుతూ వచ్చారు. 2001 నుండి 2017 వరకు ఆయన మధ్య రీజినల్ బ్యూరో (సీఆర్బీ) కార్యదర్శిగా కొనసాగారు. అనారోగ్య కారణాలతో స్వచ్చందంగా తనే సీఆర్బీ కార్యదర్శి బాధ్యతల నుండి వైదొలగి సీఅర్బీ మీడియా ప్రతినిధిగా, గత రెండు సంవత్సరాలుగా కేంద్రకమిటీ మీడియా ప్రతినిధిగా సమర్థవంతంగా పనిచేశారు.
నక్సల్బరీ, శ్రీకాకుళ పోరాటాల అనంతర కాలపు తొలితరం విప్లవోద్యమ నాయకుల్లో ఒకరిగా ఆయన దాదాపు 5 దశాబ్దాల సుదీర్ఘ విప్లవోద్యమ ప్రస్థానంలో అనేక కీలకమైన బాధ్యతల్ని చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. సింగరేణి, ఉత్తర తెలంగాణ-ఆంధ్రప్రదేశ్, దండకారణ్య, భారత విప్లవోద్యమ నిర్మాతల్లో ఒకరిగా అయన చేసిన కృషి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, PLGA యోధులకు, కమాండర్లకు, మొత్తం విప్లవ శిబిరానికి సదా గొప్ప ప్రేరణదాయకంగా నిలిచివుంటుంది. అదిలాబాద్ జిల్లా విప్లవోద్యమ నిర్మాణం కోసం ఆయన లక్సెట్టిపేట ప్రాంతంలో భూ సంబంధాల్ని అధ్యయనం చేసారు. 1990లో మా పార్టీపై రాష్ట్రప్రభుత్వం అప్రకటిత నిషేధం ఎత్తివేసిన కాలంలో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా భూస్వాముల భూముల అక్రమణ పోరాటాలకు పార్టీ పిలుపునిచ్చింది.
ఆ పోరాటాల కాలంలో అదిలాబాద్ జిల్లాలోని భూ సంబంధాలను అధ్యయనం చేసారు. ఉత్తర తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లో వర్గపోరాట ప్రభావంతో, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల అమలుతో వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో జరిగిన మార్పులను 2008 నుండి 2012 మధ్య విస్తారంగా, లోతుగా అధ్యయనం చేసి ఆ ప్రాంత వ్యవసాయ రంగంలో వక్రీకరించిన పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు ఏర్పడ్డాయని విశ్లేషించారు. ఆ విశ్లేషణ ఆధారంగా మారిన సామాజిక పరిస్థితుల్లో చేపట్టాల్సిన వ్యవసాయిక విప్లవ వర్గపోరాట కార్యక్రమాన్ని రూపొందించారు. 2007 నుండి తాత్కాలిక వెనకంజకు గురైన ఉత్తర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంత (ఏఓబీ) ఉద్యమాలను తిరిగి పురోగమింపచేయడం కోసం చేపట్టాల్సిన ఎత్తుగడల రూపకల్పనలో కేంద్రకమిటీ సభ్యుల, సీఆర్బీ సభ్యులతో కూడిన టీముతో కలిసి సీఆర్బీ కార్యదర్శిగా సైద్ధాంతిక, రాజకీయ నాయకత్వాన్ని అందించారు. మలిదశ ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక, రాజకీయ నాయకత్వాన్ని అందించారు. మారిన సామాజిక పరిస్థితుల్లో, తాత్కాలిక వెనకంజ కాలంలో తెలంగాణ, ఏపీ, ఏఓబీ ఉద్యమాల పురోగమన లక్ష్యంతో ఐక్యసంఘటన రంగానికి సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ మార్గదర్శకత్వాన్ని అందించే సీసీ/సీఆర్బీ సభ్యుల టీంతో కలిసి కృషి చేసారు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా కేంద్రకమిటీ చేపట్టిన కృషికి తగిన విధంగా వేర్వేరు ఐక్యసంఘటన వేదికల్ని నిర్మించి, నడిపించడంలో కీలకమైన పాత్ర పోషించారు. పీపుల్స్ వార్ పార్టీలో 1985, 1991ల్లో సంక్షోభాలు తలెత్తినపుడు ʹఅతివాద, మితవాద అవకాశావాద పంథాలను ఓడించడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 2018లో సెంట్రల్ రీజియన్లో చేపట్టిన బోల్షివీకరణ క్యాంపెయిన్ కు సైద్ధాంతిక, రాజకీయ మార్గదర్శకత్వాన్ని అందించారు. ఈ మధ్యకాలంలో పార్టీ రూపొందించిన ʹభారతదేశ ఉత్పత్తి సంబంధాల్లో మార్పులు-మన కార్యక్రమం, జాతుల సమస్య-మన వైఖరి, కుల సమస్య-మన వైఖరి, కేంద్ర రాజకీయ-నిర్మాణ సమీక్ష డాక్యుమెంట్లʹ రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 2004 నుండి వేర్వేరు కాలాల్లో క్రాంతి, ఎర్రజెండా, పీపుల్స్ వార్, పీపుల్స్ మార్చ్ పత్రికలకు సంపాదకుడిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. అదిలాబాద్ జిల్లా కమిటీ, ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ, సీఆర్బీ కార్యదర్శిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి పార్టీ కమిటీల్లో కేంద్రీకృత ప్రజాస్వామ్యాన్ని అమలు చేయడంలో మంచి నమూనాను నెలకొల్పారు.
కామ్రేడ్ ఆనంద్ తన ఐదు దశాబ్దాల విప్లవోద్యమ కృషి ద్వారా భారతదేశంలో సామ్రాజ్యవాదాన్ని, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానాన్ని, భూస్వామ్యాన్ని నిర్మూలించి దేశంలో నిజమైన జాతీయ స్వాతంత్య్రాన్ని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి అహర్నిశలు ఉత్తమ కార్మికవర్గ పుత్రుడిగా కృషి చేసారు. పార్టీ మౌలిక పంథాపై ఆధారపడి భారత నూతన ప్రజాస్వామిక విప్లవానికి ఆయన మార్క్సిజం-లెనినిజం-మావోయిజాన్ని అన్వయించి సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ, ఐక్యసంఘటన రంగాలకు మార్గనిర్దేశం చేసిన సైద్ధాంతికవేత్త, రాజకీయ వేత్త, సమర్థవంతమైన కమిటీ కార్యదర్శి/ఆర్గనైజర్, సమర్థవంతమైన పత్రికా సంపాదకులు కామ్రేడ్ అనంద్. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం దేశానికి పెనుముప్పుగా మారిన స్థితిలో, భారత విప్లవోద్యమాన్ని పురోగమింపజేయడానికి యావత్తు పార్టీ కృషి చేస్తున్న సమయంలో కామ్రేడ్ అనంద్ అమరత్వం విప్లవోద్యమానికి తీవ్రమైన నష్టం, అయన లేని లోటు త్వరలో పూడ్చుకోలేనిది.
విప్లవోద్యమ నాయకులకు, కార్యకర్తలకు మందులు, వైద్య చికిత్స, సప్లయిలు అందకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఫాసిస్టు దాడి ఫలితంగానే కామ్రేడ్ అనంద్ అమరుడయ్యాడు. తీవ్రమైన అనారోగ్యంతో మా పార్టీ, PLGA కార్యకర్తలు, నాయకులు వైద్యం కోసం పట్టణాలకు వెళ్తే పట్టుకుని హత్యలు చేస్తూ, తమకు సరెండర్ అవుతే మెరుగైన వైద్యం అందజేస్తామని హంతక పోలీసులు ప్రకటించడం కౄరమైన పరిహాసం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విప్లవ ప్రతిఘాతక సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకపు దాడిని ఓడించడం ద్వారానే విప్లవోద్యమ నాయకులను, కార్యకర్తలను అకాల మరణాల నుండి కాపాడుకోగలుగుతాం.
కామ్రేడ్ ఆనంద్ భౌతిక నిష్క్రమణ దుఃఖదాయకం, బాధాకరం, తీవ్రమైన నష్టమే అయినప్పటికీ ఐదు దశాబ్దాల సుదీర్ఘ విప్లవ కృషి ద్వారా సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ, ఐక్యసంఘటన రంగాల్లో ఆయన భారత విప్లవోద్యమానికి అందించిన సేవలు (కంట్రిబ్యూషన్స్) యావత్తు పార్టీకీ, పీఎల్ జీఏ, ప్రజా సంఘాలకు, ప్రజా ప్రభుత్వాలకు (జనతన సర్కార్లకు), యావత్తు విప్లవ శిబిరానికి సదా మార్గదర్శకంగా వెలుగొందుతూ వుంటాయి, ప్రేరణదాయకంగా వుంటాయి. అయన బోధనలతో, విప్లవ కృషితో ప్రేరణ పొంది విప్లవోద్యమ పురోగమనానికి సాగుతున్న కృషిలో భాగస్వాములు కావాల్సిందిగా దేశంలోని యావత్తు కార్మికులకు, రైతాంగానికి, మధ్యతరగతికి, చిన్న పెట్టుబడిదార్లకు, దళిత, అదివాసీ, మతమైనారిటీ సముదాయాలకు, మహిళలకు, పీడిత జాతులకు పిలుపునిస్తున్నది.
అభయ్
మీడియా ప్రతినిది,
సీపీఐ (మావోయిస్టు),
కేంద్రకమిటీ
తేది: 2-6-2023.
Keywords : cpi maoist, katakam sudarshan, abhay, heart attack, martyr, dandakaranya
(2025-01-08 15:10:34)
No. of visitors : 2313
Suggested Posts
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటనవిడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు. |
| జంపన్నలేఖకు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
జూన్ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన |
| PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటనపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా. |
| పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీసీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబుమావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది. |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము. |
| మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనఅనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి, |