త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌

త్వరలో...అమరులైన

26-07-2023

అమరులైన భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుల జీవిత చరిత్రలను -ఇంగ్లిష్, హిందీ, తెలుగు భాషల‌లో రెండు సంపుటాల సంకలనాలను త్వరలో విడుదల చేయనున్నట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆ ప్రకటన పూర్తి పాఠం....

అమరుల రక్తంతో అరుణారుణమైన మార్గంలో
కదం తొక్కుతూ ముందుకు పయనిద్దాం

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ ʹఅమరులైన సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యుల జీవిత చరిత్రల రెండు సంపుటాల సంకలనాలʹను మూడు భాషలో -ఇంగ్లిష్, హిందీ, తెలుగులలో విడుదల చేస్తున్నది. 1967లో జరిగిన నక్సల్బరీ తిరుగుబాటు నాటి నుంచి ఇప్పటి వరకు మా పార్టీ నిర్మాతలు, భారత విప్లవ మహా నాయకులు కామ్రేడ్ సీఎం, కామ్రేడ్ కేసీలు నెలకొల్పిన దీర్ఘకాల ప్రజాయుద్ధ పంథాను పరిరక్షించడం, దాన్ని ముందుకు తీసుకెళ్లడం, సంపద్వంతం చేయడం కోసం దేశవ్యాప్తంగా 14,800 మంది పైగా కామ్రేడ్స్ తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసారు. వీరిలో 1,169 మంది మహిళా కామ్రేడ్స్ ఉన్నారు. ముఖ్యంగా గత 18 సంవత్సరాలలో ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగంగా భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసే లక్ష్యంతో 4,576 మంది కామ్రేడ్స్ అమరులయ్యారు. వీరిలో 856 మంది మహిళా వీరయోధలు ఉన్నారు. ఈ సందర్భంగా అమరులకు వినమ్రంగా విప్లవాంజలి ఘటిస్తూ, దోపిడీ, పీడనలు లేని నూతన సమాజాన్ని - కమ్యూనిజాన్ని స్థాపించేందుకు వారు కన్న కలల్ని సాకారం చేయడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తామనీ, చివరి నెత్తుటిబొట్టు వరకు పోరాడుదామని మా సీసీ శపథం చేస్తోంది.
మార్సిజం-లెనినిజం-మావోయిజం (ఎంఎల్ఎం)ను భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించి విప్లవకర సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణపరమైన పునాదులు వేయడంలో కామ్రేడ్ సీఎం, కేసీలు మహత్తర, అగ్రగామి పాత్ర నిర్వహించారు. నక్సల్బరీ సాయుధ వ్యవసాయ విప్లవ పోరాటం భారతదేశ సమాజంలోని ప్రతి ఒక్క రంగాన్ని ప్రభావితం చేసింది, దాని చారిత్రక గమనాన్ని మార్చివేసింది. భారత నూతన ప్రజాస్వామిక విప్లవ క్రమంలో అమరులైన కేంద్రస్థాయి నాయకత్వ కామ్రేడ్స్లో కామ్రేడ్ చారు మజుందార్, కామ్రేడ్ కన్హాయ్ చటర్జీలతో పాటు 41 మంది కేంద్రకమిటీ సభ్యులు, ప్రథమ శ్రేణి కామ్రేడ్స్ ఉన్నారు. 2004 సెప్టెంబరులో పార్టీ ఏర్పాటు నాటి నుంచి అమరులయిన కేంద్ర కమిటీ సభ్యుల జీవిత చరిత్రలు ఉన్నాయి. ఐక్య పార్టీ పతాకం కింద మొత్తంగా రెండు వేల మంది తమ ప్రాణాలు అర్పించారు.
మొత్తంగా చూసుకుంటే, భారత సాయుధ వ్యవసాయ విప్లవ యుద్ధ పతాకానికి ముందు పీరీన ఉండి దాని పతాకను ముందుకు తీసుకువెళ్లేందుకు తమ యావజ్జీవితం నిర్విరామంగా కృషి చేసిన అనేక తరాల విప్లవకారులకు ప్రతినిధులు వాళ్లు. మహత్తర నక్సల్బరీ తిరుగుబాటు కాలం నుంచి భారతదేశంలో నక్సల్బరీ కమ్యూనిస్టు ఉద్యమానికి ముందు, తరువాతా పాజిటివ్ అంశాల వారసత్వాన్ని అందుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అవిర్భావం వరకూ అ తరువాతా వాళ్లు నిరంతరం నాయకత్వం అందించారు.
1970 ప్రారంభంలో వెనుకంజతో విప్లవోద్యమంలో విచ్ఛిన్నత, చీలికల తరువాత స్వతంత్ర మార్గం చేపట్టిన వివిధ విప్లవ ధారలకు చెందిన వాళ్లు ఈ కామ్రేడ్స్. అందువల్ల అమరులయిన కేంద్ర కమిటీ సభ్యులు ఐక్య, అఖిల భారత మావోయిస్టు పార్టీగా, భారత విప్లవ ఏకైక మార్గదర్శక కేంద్రంగా ఒక మహా శక్తిగా అవిర్భవించి భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)గా రూపొందిన భారతదేశ నిజమైన కమ్యూనిస్టు విప్లవ ధారల ఐక్యతకు ప్రతీకగా నిలిచి ఉంటారు. ఈ జీవిత చరిత్రలు అధ్యయనం చేయడం ద్వారా మనం దేశంలో వివిధ ప్రాంతాలలో ఉద్యమ అభివృద్ధిలో వివిధ దశలను గురించి వాటి నిర్దిష్ట లక్షణాలతో సహా తెలుసుకోగలుగుతాం. కాబట్టి విప్లవాభిమానులంతా వీటిని తప్పక అధ్యయనం చేయాలనీ, ఈ దేశ విముక్తి కోసం తమ నెత్తుర్లను ధారపోసిన వీరుల త్యాగాలను తెలుసుకోవాలనీ కోరుతున్నాం.

అభయ్
అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : maoists, abhay, cpi maoists, CC Members, Martyrs, book,
(2024-07-26 04:45:43)



No. of visitors : 1463

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


త్వరలో...అమరులైన