మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ

మణిపూర్

02-08-2023

9 ఆగస్టున ప్రపంచ ఆదివాసీలంతా విశ్వ మూలవాసీ దినం జరుపుకోబోతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా మూలవాసీలందరికీ మావోయిస్టు పార్టీ మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ అభినందనలు తెలియజేశారు. మణిపూర్ లో కుకీల పై జరుగుతున్న మారణహోమం పాలకుల ప్రాయోజితమని ప్రతాప్ తన ప్రకటనలో ఆరోపించారు

ప్రతాప్ ప్రకటన పూర్తి పాఠం....

మూలవాసీ ప్రజల డిగ్నిటీతో కూడిన జీవితాలకు పరమ ప్రమాదకరమైన బ్రాహ్మణీయ హిందుత్వను పాతెరయడానికి పూనుకోవాలి

అతి త్వరలోనే ప్రపంచ ఆదివాసీలంతా 9 ఆగస్టు విశ్వ మూలవాసీ దినం జరుపుకోబోతున్నారు. ఆ సందర్భంగా మా పార్టీ సీపీఐ (మావోయిస్టు) మధ్య రీజినల్ బ్యూరో వారికి అభినందనలు తెలుపుతోంది. గత సంవత్సరకాలంలో తమ ఐడెంటిటీ, అస్థిత్వం, ఆత్మగౌరవం కోసం, తమ న్యాయమైన అధికారాల కోసం పోరాడుతూ అమూల్యమైన త్యాగాలు చేస్తూ రాజ్యహింసలో అసువులు బాసిన ప్రపంచ వ్యాపిత మూలవాసీ వీరయోధులు, వీరాంగనలకు ముందుగా విప్లవ జోహార్లర్పిద్దాం.

భారత దోపిడీ పాలకవర్గాలు మన దేశ అపారమైన ప్రాకృతిక వనరులను సామ్రాజ్యవాద బహుళ జాతుల కార్పొరేషన్ లకు, మన దేశ కార్పొరేషన్ కంపెనీలకు యధేచ్ఛగా దోచిపెట్టడానికి అడవులపై ప్రత్యేకించి మూలవాసీ ప్రాంతాలకు సైన్యాలను, భద్రతా బలగాలను తరలించి ఖాకీ వనాలుగా మారుస్తున్నాయి. మూలవాసీ ప్రాంతాలన్నీ వేలాది ఖాకీ బలగాలతో నిండిపోయాయి. వారి జీవితాలకు భద్రత లేకుండా పోయింది. ఛత్తీస్ గడ్ లోని దంతెవాడ, బీజాపుర్, కాంకేర్, నారాయణ్ పుర్, కొండగాం, సుక్మా, బస్తర్ జిల్లాలలోని అడవులు; ఝార్ఖండ్ లోని కొల్హాన్, సారండా; ఒడిశాలోని నియంగిరి, సున్నబేడా, మాలి, దేవమాలి; మధ్యప్రదేశ్ లోని కొడ్తో ప్రాంతం సహ శిల్పి కొండలు, మహారాష్ట్ర లోని గడ్ చిరోలీ, చంద్రపుర్, రత్నగిరి జిల్లాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మున్నగు అనేక ఆదివాసీ ప్రాంతాలలో అభివృద్ధి పేరుతో 6-8 లేన్ల విశాలమైన రహదారులు, రైల్వే లైనులు, భారీ నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, గనుల తవ్వకాలు, రకరకాల పరిశ్రమలు నెలకొల్పుతూ ఆదివాసీల మనుగడనే ప్రశ్నార్థకంగా తయారు చేస్తున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నారు. కేవలం ఇది కేవలం మన భారతదేశ మూలవాసుల సమస్యే కాదు. సామ్రాజ్యవాదుల పెట్టుబడులు సంచయనంలో భాగంగా యావత్ప్రపంచ మూలవాసులు ఎదుర్కొంటున్న సమస్య. ప్రపంచ వ్యాపితంగానే మూలవాసులు ప్రాకృతిక వనరుల లూటీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అన్ని దేశాలలోని మావోయిస్టులు వారికి అండగా వుంటూ వారి పోరాటాలకు నాయకత్వం వహిస్తున్నారు. వారి పోరాటాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేయడానికి మావోయిస్టుల ఏరివేత పేరుతో భద్రతా బలగాలు ఉద్యమకారులైన మూలవాసులను కాల్చి చంపుతున్నాయి. ఫిలిప్పీన్స్, భారతదేశ అడవులలోని మూలవాసులపై డ్రోన్ లతో బాంబులు కురిపిస్తున్నారు. ఆకాశ దాడులను తీవ్రం చేస్తున్నారు. పెద్ద ఎత్తున నరసంహారానికి పాల్పడుతున్నారు. గతేడాది కాలంలో ఫిలిప్పీన్స్ లో దాదాపు 100మందికి పైగా ప్రజలను హత్య చేశారు. ఇలాంటి హత్యలకు వ్యతిరేకంగా, సైనిక మొహరింపులకు వ్యతిరేకంగా, ఆకాశదాడులను నిలిపివేయాలనే, వనరుల తరలింపును ఆపివేయాలనే తమ పోరాటాలను మరింత సమరశీలంగా కొనసాగిస్తామనీ 9 ఆగస్టు రోజు మూలవాసీ ప్రజలంతా దృఢ దీక్ష పూనాలి.

మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత వైభవంగా వైబ్రంట్ సమ్మేళనాలు జరుపుతున్నాయి. ప్రపంచ వ్యాపిత మదుపుదారులకు ఎర్ర తివాచీలు పరిచి ఆహ్వనిస్తున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రభుత్వాలతో యం.ఓ.యూలు కుదురుతున్నాయి. ఒక్క ఒడిశాలోనే 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాటిలో దాదాపు 60 శాతం గనుల రంగంలోనే జరిగినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వమే తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్,ఉత్తరప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలలో పాలకులు వైబ్రంట్ సమ్మళనాల సంబురాలు జరుపుకుంటున్నారు. నిజానికి అవి ఎంత మాత్రం ప్రజల వైబ్రంట్ కావు. ప్రపంచ పెట్టుబడులకు దాసోహం అంటూ దేశ వనరుల వేలం పాటలకు అమ్మకం కేంద్రాలుగా నిలుస్తున్నాయనీ గుర్తించి వాటిని బహిష్కరించకుండా దేశ వనరులను కాపాడుకోలేం. సామ్రాజ్యవాదుల దోపిడీని అడ్డుకోలేం. పర్యావరణ వినాశనాన్ని అరికట్టలేం. కాబట్టి, ఇలాంటి సమ్మేళనాలు ఏ రాష్ట్రంలో జరిగిన బహిష్కరించాలనీ, అందులో మూలవాసులు ముందుండాలనీ మా పార్టీ పిలుపునిస్తున్నది.

భారత పాలక వర్గాల దోపిడీ విస్తరణవాద విధానాల ఫలితంగా గత ఏడు దశాబ్దాలకు పైగా ఈశాన్యం భారత సైనిక బలగాల పదఘట్టణల కింద నలిగిపోతోంది. అక్కడ సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం వికటాట్టహాసం చేస్తున్నది. 2023 మే నుండి భయం కొలిపే, సభ్య ప్రపంచం తలదించుకునే వార్తలు మణిపుర్ నుండి వింటున్నాం, చూస్తున్నాం. అక్కడి కుకీ, నగా తెగలు నివసించే చర్ చంద్ పుర్, చందేల్, ఉక్రూల్ జిల్లాల కొండ ప్రాంతాలలో నికెల్, సున్నపురాయి, ప్లాటినం గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ (పీజీఈ), క్రోమైట్ సహ అనేక రకాల విలువైన గనులున్నవి. 2017 నవంబర్ 21-22 తేదీలలో ఇంఫాల్ లో జరిగిన వైబ్రంట్ సమ్మేళనంలో ప్రభుత్వం వాటి అమ్మకానికై గనుల కంపెనీలతో అనేక యంఓయూలు కుదుర్చుకుంది. ఇపుడు వాటి అమలు కోసం కేంద్రం అందిస్తున్న సైన్యం సహా అన్ని రకాల అండదండలతో రాష్ట్ర ప్రభుత్వం కుకీ ప్రజలను ఊచకోత కోస్తున్నది. కుకీ మహిళలపై అమానవీయైన రీతిలో పాశవిక లైంగిక దాడులు జరుగుతున్నాయి. కుకీ మహిళలను నగ్నంగా చేసి ఊరేగిస్తున్నారు. కార్పొరేటీకరణ కోసం, భారత సైన్యాలు చేస్తున్న హింస, అత్యాచారాలు, సృష్టిస్తున్న అగ్నికాండ, పాల్పడుతున్న మానభంగాలకు హిందుత్వ శక్తులు మతం ముసుగు వేస్తున్నాయి. అక్కడి ఛాందసవాద వైష్ణవ సంస్థలు మైతీ లీపున్, అరంబై టెంగోల్ లాంటివి పోలీసు స్టేషన్ లపై బడి వేలాది తుపాకులు స్వాధీనం చేసుకొని, సాయుధ బలగాల చేతులలోని తుపాకులను లాక్కొని హత్యలకు అత్యాచారాలకు పాల్పడుతున్నారంటే ఇవి నిస్సందేహంగా ప్రభుత్వ ప్రయోజిత దాడులే. కార్పొరేటీకరణ, సైన్యకరణ, హిందూకరణ కూటమి జరుపుతున్న బీభత్సం కేంద్రం ఆశిస్సులతోనే జరుగుతున్నందున ప్రధానీ, హోం మంత్రి మౌనం పాటిస్తున్నారు.

ఈ విపత్కర పరిస్థితులలో మణిపుర్ కుకీ ఆదివాసీ ప్రజలకు ప్రపంచం అండగా నిలవాలి. వారిని కాపాడుకోవాలి. వారిపై కొనసాగుతున్న దారుణాలు పాలక హిందుత్వ శక్తులు మినహ ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తున్నది. విశ్వ మూలవాసీ దినం రోజు మణిపుర్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తామనీ శపథం చేయాలి.

మన దేశంలో యేటేటా ఆదివాసీలపై హిందుత్వ శక్తుల అకృత్యాలు పెచ్చరిల్లుతున్నాయి. జూన్ లో మధ్య ప్రదేశ్ లోని సిద్ది జిల్లాలో హిందుత్వ గూండా ప్రవేశ్ శుక్లా కోలాం ఆదివాసీ రైతు దశమన్ పై అత్యంత అమానవీయంగా మూత్ర విసర్జన చేయడం యావత్ ప్రజలను నిర్ఘాంతపరిచింది. ఆ అమానుష చర్యను ఖండిస్తూ భోజ్ పురి గాయికా నేహా రాఠోర్ కార్టున్ వేసినందుకు పోలీసులు ఆమెపై ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు. ఇపుడు ఇండోర్, గ్వాలియర్ లలో ఆదివాసీ మహిళలపై అక్రుత్యాలు జరుగుతున్నాయి. బుర్జన్ పుర్ జిల్లాలో ఆదివాసీల హక్కులకై పోరాడుతున్న సామాజిక కార్యకర్త మాధురీని పోలీసులు జిల్లా బహిష్కరణకు గురి చేశారు. మహారాష్ట్ర లోని గడ్ చిరోలీ జిల్లాలో స్థానిక యం.ఎల్.ఏ. రాష్ట్ర ఆహార-ఔషధ మంత్రి అహెరీ రాజు తన అహం దెబ్బ తిందనీ ఆత్రం ధర్మారావు ఒక ఆంగన్ వాడీ కార్యకర్తను వందలాది మంది ఆదివాసీల మధ్య అవమానించాడు. కాలం చెల్లిన 110 ఆక్ట్ కింద జిల్లా ఆదివాసులను నిరంతరం వేదిస్తున్న పోలీసులను అడ్డుకోని యం.ఎల్.ఏ పేద ఆంగన్ వాడి ఆడపడచును అవమానించడం ఖండనార్హమైనది. దేశవ్యాప్తంగా ఆదివాసీలుగా గుర్తిస్తున్న ఉరావ్ తెగను మహారాష్ట్రలో గుర్తించడం లేదు. తమకు ఆ గుర్తింపును ఇవ్వాలనీ డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఆదివాసీల హక్కులకై పోరాడుతున్న సామాజిక కార్యకర్తలపై పాశవికమైన చట్టాలను ప్రయోగిస్తూ జైలు పాలు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలపై భీమాకోరేగాం కేసులో ఐదేళ్లుగా జైలు పాలైన సామాజిక రాజకీయ కార్యకర్తలు అనేక యాతనలను అనుభవిస్తున్నారు. మరోవైపు మూలవాసులు అస్థిత్వాన్ని రూపుమాపడానికి, దేశ వైవిధ్యాన్ని నాశనం చేయడానికి సమానత్వం పేరుతో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం యూసీసీను ముందుకు తెస్తున్నది. ఇలాంటి చర్యలన్నీ ఎదుర్కొంటామనీ డిగ్నిటీతో కూడిన జీవితం కోసం మూలవాసులమంతా సమైక్యంగా పోరాడుతామనీ విశ్వ మూలవాసీ దినం రోజు దీక్ష పూనాలనీ మా పార్టీ పిలుపునిస్తున్నది.

దేశ వ్యాపిత ఆదివాసీ ప్రజలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, పర్యావరణవాదులు, విశ్రాంత అటవీ శాఖ అధికారులు, ఉద్యమ సంస్థలు అటవీ సంరక్షణ చట్టం 1980కి మోదీ ప్రభుత్వం రూపొందించిన సవరణలపై తమ తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తూ వ్యతిరేకించారు. ఆ సవరణలను సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. జులై చివరి వారంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వ సవరణలకు తన ఆమోదాన్ని తెలిపింది. ఫలితంగా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ఆ సవరణలతో కూడిన బిల్లు చట్టసభలలో ఆమోదానికి పెట్టనున్నారు.

వాస్తవంగా ఆ సవరణ 1996లో సుప్రీంకోర్టు ʹఅడవి" కి ఇచ్చిన నిర్వచనాన్ని, 2006 అటవీ హక్కుల చట్టం స్పష్టం చేసిన నిర్వచనాన్ని పూర్తిగా మార్చివేస్తున్నది. జులై 25 నాడు జైవ వివిధత సవరణల బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో రానున్న అటవీ సంరక్షణ చట్ట సవరణలు సమాజానికి, పర్యావరణానికి అత్యంత ఘాతుకంగా తయారవుతాయి. ఇలాంటి మూలవాసీ వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా మూలవాసులమంతా సమైక్యంగా పోరాడుతామనీ విశ్వ మూలవాసీ దినం రోజు దీక్ష పూనాలనీ మా పార్టీ పిలుపునిస్తున్నది.

సంకల్పదిన అభినందనలతో,
ప్రతాప్,
అధికార ప్రతినిధి,
మధ్య రీజినల్ బ్యూరో,
సీపీఐ (మావోయిస్టు)

Keywords : CPI Maoist, pratap, abhay, manipur, adivasi,
(2024-07-15 23:55:36)No. of visitors : 1451

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మణిపూర్