గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్దర్

గద్దర్ మరణం పట్ల సీపీఐ మావోయిస్టు సంతాపం వ్యక్తం చేసింది. గుండెకు ఆపరేషన్ ఫెయిల్ అయి మృతి చెందినట్లు మీడియా ద్వారా విన్నామని, తన మరణం రాష్ట్ర ప్రజలందరికి ఆవేదనను కలిగించిందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికారప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

జగన్ ప్రకటన పూర్తి పాఠం...

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.
నగ్జల్బరి, శ్రీకాకులం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వామ్య‌ వ్యతిరేక పోరాటాల నేపధ్యంలో పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాల్లో సమీకరించాడానికి సిపిఐ (ఎంఎల్) పార్టీ సాంస్కృతికి బృంధాన్ని ఏర్పర్చింది. మొదట్లో ఆర్ట్స్ ల‌వర్స్ ఆతరువాత 1972లో జన నాట్య మండలిని నిర్మించింది. జన నాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి వుంది. 1972 నుండి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగింది. 4 దశబ్దాలు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డాడు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)లో పార్టీ సభ్యుడిగా సాంస్కృతి రంగంలో పనిచేస్తూ. విప్లవోద్యమ నిర్మాణంలో విశేష కృషి చేశాడు. 1972 నుండి 2012 దాకా మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగాడు. తను జన నాట్య మండలిలో ప్రజల సాహిత్యాన్ని పాటల రూపంలో, కథల రూపంలో, నాటకల రూపంలో ప్రజలను చైతన్య పరుస్తూ భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో కదలించడలో తను కీలక పాత్ర పోషించాడు. అనేక పాటలు రచించారు. AILRC కార్యదర్శిగా కూడా కొద్ది కాలం పని చేశాడు. తెలంగాణ ప్రజా స్వామిక ఉద్యమాల్లో తొలి నాళ్ల నుండి మలి దశ వరకు పాల్గొన్నాడు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా పాటలు రాశాడు. దోపిడి పాలకులు ఎన్ కౌంటర్ లలో, బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా. చేసిన సందర్భంలో శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 80 దశకంలో నాలుగు సంవత్సరాలు దళం జీవితం కొనసాగించాడు. సాంస్కృతి రంగం యొక్క అవసరాన్ని పార్టీ గుర్తించి తనను బయటకు పంపి జన నాట్య మండలిని అభివృద్ధి చేసింది.
దోపిడి పాలక వర్గ తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో వుండగా చంద్ర బాబు హయాంలో విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రతిఘాతుక శక్తులతో నల్ల దండు ముఠాలను పోలీసుల ద్వారా ఏర్పర్చింది. వీరి ద్వారా ప్రజా సంఘాల్లో క్రియా శీలంగా పని చేస్తున్న అనేక మంది విప్లవ కారులపై నల్ల దండు ముఠాలతో కౄరమైన హత్యలు చేయించారు. అందులో భాగంగానే 1997లో గదర్ పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి గద్దర్ పై కాల్పులు చేశారు. ఐదు తూటాలు శరీరంలో దూసుకెళ్ళి ప్రాణ ప్రాయ స్థితి నుండి బయట పడినాడు.
తెలంగాణలో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న వర్గ పోరాటంలో ఎంతో మంది విప్లవ ప్రజానీకాన్ని, యువతి, యువకులను జన నాట్య మండలి పాటలతో ఉర్రూతలూగించిన గద్ద‌ర్ చివరి కాలంలో పార్టీ నింబంధనవళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలువడంతో మా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనితో 2012లో పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశాడు. దాన్ని మా పార్టీ ఆమోదించింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గద్ద‌ర్ ఆతరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నాడు.ʹʹ అని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

6వ తేదిన గుమ్మడి విఠల్ రావు గద్దర్, గుండెకు ఆపరేషన్ ఫెయిల్ అయి మృతి చెందినట్లు మీడియా ద్వారా విన్నాము. తన మరణం రాష్ట్ర ప్రజలందరికి ఆవేదనను కలిగించింది. గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు వుండరు. గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.
నగ్జల్బరి, శ్రీకాకులం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వామ్య‌ వ్యతిరేక పోరాటాల నేపధ్యంలో పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్య పరిచి ఉద్యమాల్లో సమీకరించాడానికి సిపిఐ (ఎంఎల్) పార్టీ సాంస్కృతికి బృంధాన్ని ఏర్పర్చింది. మొదట్లో ఆర్ట్స్ ల‌వర్స్ ఆతరువాత 1972లో జన నాట్య మండలిని నిర్మించింది. జన నాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి వుంది. 1972 నుండి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగింది. 4 దశబ్దాలు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డాడు. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)లో పార్టీ సభ్యుడిగా సాంస్కృతి రంగంలో పనిచేస్తూ. విప్లవోద్యమ నిర్మాణంలో విశేష కృషి చేశాడు. 1972 నుండి 2012 దాకా మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగాడు. తను జన నాట్య మండలిలో ప్రజల సాహిత్యాన్ని పాటల రూపంలో, కథల రూపంలో, నాటకల రూపంలో ప్రజలను చైతన్య పరుస్తూ భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో కదలించడలో తను కీలక పాత్ర పోషించాడు. అనేక పాటలు రచించారు. AILRC కార్యదర్శిగా కూడా కొద్ది కాలం పని చేశాడు. తెలంగాణ ప్రజా స్వామిక ఉద్యమాల్లో తొలి నాళ్ల నుండి మలి దశ వరకు పాల్గొన్నాడు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశాడు. తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా పాటలు రాశాడు. దోపిడి పాలకులు ఎన్ కౌంటర్ లలో, బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా. చేసిన సందర్భంలో శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించాడు. 80 దశకంలో నాలుగు సంవత్సరాలు దళం జీవితం కొనసాగించాడు. సాంస్కృతి రంగం యొక్క అవసరాన్ని పార్టీ గుర్తించి తనను బయటకు పంపి జన నాట్య మండలిని అభివృద్ధి చేసింది.
దోపిడి పాలక వర్గ తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో వుండగా చంద్ర బాబు హయాంలో విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రతిఘాతుక శక్తులతో నల్ల దండు ముఠాలను పోలీసుల ద్వారా ఏర్పర్చింది. వీరి ద్వారా ప్రజా సంఘాల్లో క్రియా శీలంగా పని చేస్తున్న అనేక మంది విప్లవ కారులపై నల్ల దండు ముఠాలతో కౄరమైన హత్యలు చేయించారు. అందులో భాగంగానే 1997లో గదర్ పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి గద్దర్ పై కాల్పులు చేశారు. ఐదు తూటాలు శరీరంలో దూసుకెళ్ళి ప్రాణ ప్రాయ స్థితి నుండి బయట పడినాడు.
తెలంగాణలో ఉన్నత స్థాయిలో కొనసాగుతున్న వర్గ పోరాటంలో ఎంతో మంది విప్లవ ప్రజానీకాన్ని, యువతి, యువకులను జన నాట్య మండలి పాటలతో ఉర్రూతలూగించిన గద్ద‌ర్ చివరి కాలంలో పార్టీ నింబంధనవళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలువడంతో మా పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనితో 2012లో పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశాడు. దాన్ని మా పార్టీ ఆమోదించింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గద్ద‌ర్ ఆతరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నాడు.
జగన్,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటీ,
సిపీఐ (మావోయిస్ట్)

Keywords : gaddar, cpi maist, jagan, telangana,
(2024-04-26 05:51:47)

No. of visitors : 2252

Suggested Posts

పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍

ఉత్తర తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ లో వర్గపోరాట ప్రభావంతో, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాల అమలుతో వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో జరిగిన మార్పులను 2008 నుండి 2012 మధ్య విస్తారంగా, లోతుగా అధ్యయనం చేసి ఆ ప్రాంత వ్యవసాయ రంగంలో వక్రీకరించిన పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు ఏర్పడ్డాయని విశ్లేషించారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..

గద్దర్