పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

పార్టీ

22-09-2023

2023 సెప్టెంబర్ 21 నుండి 27 వరకు పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో, దృఢసంకల్పంతో నిర్వహిద్దాం!
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడించండి!
అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ వర్గ పోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని సంఘటితం-విస్తృతం చేస్తూ పార్టీని బలోపేతం చేయండి!
పార్టీ సంఘటితీకరణ క్యాంపెయన్ ను విజయవంతం చేయండి!

ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా!

భారతదేశ నూతన ప్రజాస్వామిక విప్లవానికి నాయకత్వం వహిస్తున్న కార్మికవర్గ అగ్రగామి దళమైన మన పార్టీ – భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)ని స్థాపించి 2023 సెప్టెంబర్ 21 నాటికి 19 సంవత్సరాలు నిండుతాయి. ఈ సందర్భంగా మన పార్టీ కేంద్రకమిటీ, 19వ వార్షికోత్సవాలను దేశవ్యాప్తంగా అటవీ, మైదాన, పట్టణ ప్రాంతాల్లో విప్లవోత్సాహంతో, దృఢసంకల్పంతో నిర్వహించాల్సిందిగా పార్టీ శ్రేణులను, విప్లవ ప్రజా నిర్మాణాలను, విప్లవ ప్రజానీకానికి పిలుపునిస్తోంది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడించాల్సిందిగా, అనుకూల పరిస్థితులను ఉపయోగించుకుంటూ వర్గ పోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని సంఘటితం, విస్తృతం చేస్తూ పార్టీని బలోపేతం చేయాల్సిందిగా, పార్టీ సంఘటితీకరణ క్యాంపెయిన్ ను విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తోంది.
మార్క్సిజం-లెనినిజం-మావోయిజం వెలుగులో భారత విప్లవ నిర్మాతలు, మన పార్టీ సంస్థాపక నాయకులు, ఉపాధ్యాయులు కామ్రేడ్స్ చారుమజుందార్, కన్హయ్ చటర్జీలు రూపొందించిన దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంథాలో మన దేశంలో కుళ్లిపోయిన అర్ధవలస, అర్ధభూస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేసి, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని జయప్రదం చేసే, ప్రపంచవ్యాప్తంగా సోషలిజం- కమ్యూనిజాన్ని స్థాపించే మహత్తర లక్ష్యాల సాధనకై దృఢసంకల్పంతో మన పార్టీ కృషి చేస్తోంది. దేశంలో సామ్రాజ్యవాదులకు, దాని దళారీ పాలకవర్గాలకు పెనుసవాలుగా నిలిచింది. దీంతో మన పార్టీని, విప్లవోద్యమాన్ని రూపుమాపడం వారికి అనివార్యమైపోయింది. ఇందుకోసం వారు దశాబ్దాలుగా పలు విప్లవ ప్రతిఘాతక, వ్యూహాత్మక దాడులు చేసి విఫలమయ్యారు. దీంతో గత అక్టోబర్ నెలలో ʹసూరజ్ కుండ్ చింతన్ శిబిర్ʹలో మరో విప్లవ ప్రతిఘాతక పథకాన్ని రూపొందించారు. దేశంలోని పీడిత వర్గాలపై, సెక్షన్లపై, జాతులపై పాశవికంగా దాడులు చేస్తున్నారు. ఈ దాడులను ధైర్యసాహసాలతో ఎదుర్కొంటూ ఈ సంవత్సర కాలంలో 31 మంది మహిళా కామ్రేడ్స్ తో సహా 90 మంది కామ్రేడ్స్ అమరులైనారు. వీరిలో మన పార్టీ కేంద్రకమిటీ, పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ కటకం సుదర్శన్ (ఆనంద్, దూల), రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్స్ ఎల్.ఎస్.ఎన్. మూర్తి (ఆంధ్రప్రదేశ్), చండీ సర్కార్ (పశ్చిమ బంగ్), బిహార్ - ఝార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యులు కామ్రేడ్స్ గౌతమ్ పాశ్వాన్, చార్లీలు వున్నారు. దండకారణ్యంలో విప్లవ ప్రజా కళాకారుడు కామ్రేడ్ శంకర్ రావు, ఆయుధాల తయారీ రంగంలో నిపుణుడు కామ్రేడ్ వసంత్ అమరులయ్యారు. వీరితో పాటు మరో ముగ్గురు డీవీసీ/సీవైపీసీ సభ్యులు, నలుగురు సబ్ జోనల్ కమిటీ సభ్యులు, 17 మంది ఏసీ/పీపీసీ సభ్యులు, పార్టీ/ పీఎల్ జీఏ సభ్యులు 22 మంది, ప్రజా నిర్మాణాల కార్యకర్తలు, పార్టీ సానుభూతిపరులు, ఇతరులు 32 మంది, వీరితో పాటు దేశవ్యాప్తంగా బహిరంగ ప్రజా ఉద్యమాలలో పని చేసే పలువురు విప్లవ, ప్రగతిశీల, ప్రజాస్వామిక ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు, మేధావులు, విప్లవ సానుభూతిపరులు, మిత్రులు విప్లవోద్యమాన్ని పురోగమింపజేసే లక్ష్యంతో కృషి చేస్తూ కన్నుమూసారు. పార్టీ 19వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజల విముక్తి కోసం ప్రాణాలను త్యాగం చేసిన అమరులందరికీ కేంద్రకమిటీ తలవంచి వినమ్రంగా విప్లవ జోహార్లర్పిస్తున్నది.
అంతర్జాతీయంగా, ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీ సంస్థాపక చైర్మన్ కామ్రేడ్ జోన్ మారియా సిసాన్ అనారోగ్యంతో అమరులయ్యారు. ఫిలిప్పీన్స్ కమ్యూనిస్టు పార్టీ కేంద్రకమిటీ ఎగ్జిక్యుటివ్ కమిటీ చైర్మన్ కామ్రేడ్ లాన్ (బెనిటో టియాంజోన్), పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఐగోంగ్- టావో (విల్మా ఆస్ట్రియా )లను శత్రువు పక్కా సమాచారంతో ఎనిమిది మంది సహయోధులతో పాటు పట్టుకొని హత్య చేసాడు. ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యుడు ఎంపోగ్ (ఇమ్యాన్యువల్ ఫెర్నాండెజ్) అనారోగ్యంతో కన్నుమూసారు. శత్రు డ్రోన్ దాడిలో ఆ పార్టీ కేంద్రమిటీ సభ్యురాలు కామ్రేడ్ ఎలే (హెలినికా పర్దాలిస్)తో పాటు ఐదుగురు కామ్రేడ్స్ అమరులయ్యారు. వారి అమరత్వం ఫిలిప్పీన్స్ విప్లవోద్యమానికి, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి చాలా నష్టాన్ని కలిగించింది. గ్రీసు కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు-లెనినిస్టు) ప్రధాన కార్యదర్శి ఆండ్రి ఒగియాజోలవ్, ఆఫ్ఘనిస్తాన్ (మావోయిస్టు) కమ్యూనిస్టు పార్టీ కేంద్రకమిటీలో ముఖ్యమైన సభ్యుడు కామ్రేడ్ సలీం, రీజనల్ కమిటీ సభ్యుడు కామ్రేడ్ ఫర్హద్ అనారోగ్యంతో కన్నుమూసారు. మార్క్సిస్టు-లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీ (టర్కీ/కుర్జిస్తాన్) కేంద్రకమిటీ సభ్యుడు కామ్రేడ్ అహ్మెట్ సోర్స్ (జెకీ గుర్బుజ్), కుర్దిస్తాన్ సాయుధ విప్లవ దళాల యువ కమాండర్ కామ్రేడ్ ఫిరాత్ నేవాల్ (ఒజగుర్ నమోగ్లూ) శత్రు డ్రోన్ దాడిలో అమరులయ్యారు. ఈ గొప్ప కార్మికవర్గ నాయకులతో పాటు ప్రపంచ సోషలిస్టు విప్లవంలో భాగంగా వివిధ దేశాలలో కొనసాగుతున్న నూతన ప్రజాస్వామిక, సోషలిస్టు విప్లవాలలో, వివిధ సామ్రాజ్యవాద వ్యతిరేక, జాతి విముక్తి పోరాటాలలో, ప్రజాతంత్ర, దేశభక్తి ఉద్యమాలలో ప్రాణాలను త్యాగం చేసిన యోధులందరికీ కేంద్రకమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంది. అమరులు నెలకొల్పిన కార్మికవర్గ ఆదర్శాల నుండి ప్రేరణ పొందుతూ, వారి నిస్వార్థ త్యాగాలను ఎత్తిపడుతూ, వారు నడచిన విప్లవ మార్గంలో దృఢంగా నిలబడి అంతిమ లక్ష్యం సాధించే వైపుగా ముందుకు సాగుతూ చివరి శ్వాస వరకు పోరాడుదామని శపథం చేద్దాం.

ఈ సంవత్సర కాలంలో విప్లవ ప్రతిఘాతక శత్రు దాడులను వీరోచితంగా ఎదుర్కొంటూ, వాడి పథకాలను వమ్ము చేస్తూ యుద్ధ రంగంలో గాయపడిన వీర యోధులందరి పట్ల కేంద్రకమిటీ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తోంది. వారు వీలైనంత తర్వగా కోలుకుని ప్రజాయుద్ధ మైదానంలోకి దుముకుతారని ప్రగాఢంగా విశ్వసిస్తోంది. పలువురు నాయకత్వ కామ్రేడ్స్ తో పాటు అనేక మంది కామ్రేడ్స్ శత్రు చేతికి చిక్కి చిత్రహింసలు అనుభవించి, తప్పుడు కేసులు మోపబడి జైళ్లలో బంధించబడినారు. వీరంతా కారాగారాలలో సైతం విప్లవ పతాకను సమున్నతంగా ఎత్తిపడుతున్నారు. ఆ కామ్రేడ్స్ అందరికీ విప్లవ జేజేలు చెబుతోంది. వారు త్వరగా జైళ్ల నుండి విడుదలయ్యేలా వీలైన అన్ని ప్రయత్నాలు చేస్తామని భరోసా ఇస్తోంది.
కేంద్రకమిటీ గత యేడాది పార్టీ 18వ వార్షికోత్సాల సందర్భంగా వివిధ ప్రాంతాలలో నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవ ప్రతిఘాతక శత్రు దాడిని ఎదుర్కొంటూ విప్లవోద్యమాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాజకీయ నిర్మాణ సమీక్షలో చేపట్టిన కేంద్ర కర్తవ్య సాధన కోసం ఐదు కర్తవ్యాలను రూపొందించింది: సమాధాన్-ప్రహార్ దాడిని ఓడిస్తూ ఉద్యమాన్ని పురోగమింపజేసే లక్ష్యంతో పార్టీ సంఘటితీకరణ క్యాంపెయిన్ ను కొనసాగించడం; సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటాలను తీవ్రతరం చేయడం; పీ.ఎల్.జీ.ఏ.ను బలోపేతం చేయడం; బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా, నూతన ప్రజాస్వామిక భారతదేశం కోసం పెద్దయెత్తున ప్రజా ఆందోళనలను నిర్మించడం; అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమాన్ని బ‌లోపేతం చేసే లక్ష్యంతో కృషిని కొనసాగించడం. ఈ కర్తవ్యాల సాధనలో గడచిన సంవత్సర కాలంగా విభిన్న రంగాలలో మన పార్టీ గొప్ప ప్రగతిని సాధించింది.

ప్రియమైన కామ్రేడ్స్, ప్రజలారా!
మన పార్టీనీ, విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి భారత హిందుత్వ ఫాసిస్టు పాలకులు ఫాసిస్టు దాడులు చేస్తున్నప్పటికీ అది వారికి అసాధ్యం. దోపిడీ, పీడన, అసమానత, వివక్ష వున్నంత వరకూ అది వారి తరం కాదు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యను సాయుధంగా పరిష్కరించలేమని వారికి కూడా తెలుసు. అందువల్లనే ప్రజల మధ్య ఐక్యతను చీలదీసి, ఒక సల్వాజుడుం, ఒక సేంద్ర, ఒక నాగరిక్ సురక్షా సమితి లాగా ప్రజల మధ్యనే అంతర్యుద్ధం సృష్టించి విధ్వంసం సృష్టించే లక్ష్యంతో రోజు రోజుకూ హిందుత్వ ఫాసిజాన్ని రెచ్చగొడుతున్నారు. ప్రజలలోని సున్నితమైన మతపరమైన విశ్వాసాలను ఉపయోగించుకుని సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య దోపిడీని కొనసాగించేందుకు కులతత్వాన్ని పెంచి పోషించడం, దేశాన్ని మతపరంగా విభజించడం వారికి నిత్యకృత్యంగా మారిపోయింది. మిగతా పార్లమెంటరీ పార్టీలలో కూడా హిందుత్వ భావజాలమే ఆధిపత్యంలో వుంది. ఫలితంగా దానికి వ్యతిరేకంగా అవి దృఢంగా పోరాడలేవు. కనుక బ్రాహ్మణీయ హిందుత్వ భావజాలం వలన కలుగుతున్న ప్రమాదాన్ని ప్రజలకు అర్థం చేయించాలి. నాలుగు పీడిత వర్గాల కార్మికులు, రైతాంగం, మధ్యతరగతి, జాతీయ బూర్జువా వర్గం, పీడిత సామాజిక సెక్షన్ల, పీడిత జాతుల ప్రజలనందరినీ దానికి వ్యతిరేకంగా కూడగట్టాలి. విశాల ప్రాంతాలలో కార్మికవర్గ నాయకత్వంలో, జాతీయ, ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాల సాధన కోసం కార్మిక - కర్షక మైత్రిపై ఆధారపడి విశాల ప్రజా ఆందోళనలను, ప్రజా ప్రతిఘటనా పోరాటాలను, దీర్ఘకాలిక ప్రజాయుద్ధాన్ని పెంపొందించి అభివృద్ధి చేయాలి. నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసి ప్రజల ప్రజాస్వామ్యానికి గ్యారంటీ కల్పించి నూతన ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించడం ద్వారా మాత్రమే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని
ఓడించగలం.
* దండకారణ్యం, బిహార్-ఝార్ఖండ్, తూర్పు బిహార్-ఈశాన్య ఝార్ఖండ్ లను విముక్తి ప్రాంతాలుగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ముందుకు సాగుదాం!!
* ప్రజాపునాదిని, పార్టీ, పీ.ఎల్.జీ.ఏ., విప్లవ ప్రజా నిర్మాణాలను బలోపేతం చేద్దాం! * వర్గ పోరాటాన్ని-గెరిల్లాయుద్ధాన్ని- దీర్ఘకాల ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం-విస్తృతం చేద్దాం! * దీర్ఘకాల ప్రజాయుద్ధాన్ని తీవ్రతరం చేసేందుకు మైదాన, పట్టణోద్యమాలను పెంపొందిద్దాం!
* ప్రతిఘాతక వ్యూహాత్మక ʹసూరజ్ కుండ్ʹ పథకాన్ని తిప్పికొడదాం!
* బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని ఓడిద్దాం, దాని నుంచి దేశాన్ని, ప్రజలను కాపాడుదాం!
* బూటకపు ʹన్యూ ఇండియా కాదుʹ, నూతన ప్రజాస్వామిక ఇండియా కావాలి! * సామ్రాజ్యవాద వ్యతిరేక, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక వర్గపోరాటాన్ని తీవ్రతరం-విస్తృతం చేద్దాం!
* భారత నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి! * ప్రపంచ సోషలిస్టు విప్లవం వర్ధిల్లాలి! * భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) వర్ధిల్లాలి!
* మార్క్సిజం-లెనినిజం-మావోయిజం వర్ధిల్లాలి!

కేంద్రకమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : cpi maoist, central committee, abhay, charumajundar, kanhay chatarjee,
(2024-04-26 16:51:08)



No. of visitors : 1174

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


పార్టీ