ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?

ప్రమాదం

02-10-2023

ఎన్ఐఏ కేసులు చేయడం నేరమా? దానికి శిక్ష........ ఇంటిపై దాడులా? ఏమిటి దౌర్జన్యం?
మనలని మనం రక్షించుకుందాం.! మన నిరసనను ప్రకటించుకుందాం. !
మన ఐక్యమత్యాన్ని లోకానికి విధితం చేద్దాం.!

రేపు బార్ అసోసియేషన్ నిర్వహించే నిరసన దీక్షా శిబిరాన్ని విజయవంతం చేద్దాం. !
నల్ల రిబ్బన్ లతో మన నిరసన ను ప్రకటిద్దాం. !

మనమందరము రకరకాల కేసులు చేస్తూ ఉంటాం. కొన్ని ఇష్టంగా చేస్తాం మరికొన్ని కష్టంగా చేస్తాము. మన శక్తి యుక్తులు అన్నీ కలిపి గెలవాలని ప్రయత్నిస్తాం. ఓటమిని భరిస్తాం . మళ్లీ విజయం నిచ్చెన ఎక్కాలని ప్రయత్నిస్తాం. ఇదే మన వృత్తి. ఈ వృత్తిలో మనకు ఎన్ని కష్టాలో.
మనం మన కక్షిధారూడు తరపున గట్టిగా కేసు చేస్తూ ఉన్నప్పుడు ఒక్కోసారి అవతల కక్షీదారుడు మన పైన దాడులు చేసిన సంఘటనలు ఎన్నో. ఎవరో ఏదో అనుమానాలు పెడితే కొన్నిసార్లు మన కక్షిధారుడే మన పైన దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. పోలీసులకు వ్యతిరేకంగా నిలబడితే మన క్లైంట్ కోసం మనం కష్టపడితే మన మీద పోలీసులు చేసిన దాడులు ఎన్నో ఎన్నెన్నో. ప్రమోదాలు ఎన్నో తెలీదుగానీ చుట్టూ ప్రమాదాలు.

ఇదే పరిస్థితి ఈరోజు మనకు దాపురించింది. మన సీనియర్ న్యాయవాదులు అయిన పిచ్చుక శ్రీనివాసులు టి ఆంజనేయులు సివిలు క్రిమినల్ కేసులు చేస్తుంటారు సలహాలిస్తుంటారు.
అన్ని కేసుల్లాగానే ఎన్ఐఏ కేసుల్లో కూడా న్యాయవాదిగా ఆ పనులు చేస్తున్నారు. వీరితోపాటు సుంకర రాజేంద్ర ప్రసాద్గారు అలాగే గుంటూరు న్యాయవాది పి రాజారావు గారు కూడా ఎన్ ఏ కేసులు డిఫెన్స్ చేస్తున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సంస్థకు ఆ చట్టం కింద అపరిమితమైన అధికారాలు ఉన్నాయి. ఆ అపరిమితమైన అధికారాలు వినియోగించుకుని ఇవాళ ఉదయం ఐదు ఆరు గంటల మధ్యలో హడావుడిగా తలుపులు కొట్టి బెల్లులు కొట్టి ఇంట్లో వాళ్ళు ను నిద్ర లేపి ఇంట్లో వంటగది నుంచి బాత్రూం దాకా సమస్తం వెతికి హడావుడి చేశారు. ఎందుకు చేశారు అంటే చెప్పరు.ఏ క్రైమ్ కింద,ఏ ఎఫ్ ఐ ఆర్ ఏమిటి అనేది కూడా చెప్పరు. Fir చూపించరు.ఒక సెర్చ్ సీజర్ నోటీసు మాత్రం ఇచ్చారు. గంటల కొలది ప్రశ్నించారు. పిచ్చుక శ్రీనివాస్ ఇంటి దగ్గర అయితే ఇంట్లో వాళ్ళు బయటికి పోకుండా బయట వాళ్ళు ఇంట్లోకి రాకుండా కనీసం ఎవరికైనా తెలిసిన వాళ్ళకి విషయం చెప్పనివ్వకుండా ఫోన్లో మాట్లాడినివ్వకుండ ఫోన్లన్నీ సీజ్ చేసుకుని భయభ్రాంతులు చేశారు. చుట్టుపక్కల వాళ్ళందరికీ ప్లీడరు గారు ఏమైనా మర్డర్ చేశారేమో అన్న అనుమానాలు కల్పించారు. బార్ అసోసియేషన్ రెస్క్యూ కమిటీ తరపున వాళ్ళింటికి వెళితే ఇద్దరు గన్మెన్లు అడ్డంగా నుంచుని లోపలికి వెళ్లడానికి వీల్లేదు అని అడ్డు పెడుతున్నారు. బాబు ఏ చట్టం కిందది మీ వాదన అంటే చట్టం గిట్టం జాంతానై ఇవి ఎన్ఐఏ వారి ఆదేశాలు అంటున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడులో 44 డి కింద పోలీసు వారు విచారణ జరుగుతూ ఉంటే న్యాయవాది సాయం పొందే హక్కు ఆ విచారణ చేయబడే వ్యక్తికి పూర్తిగా ఉంది. ఆ అమెండ్మెంట్కు ముందుగానే నందిని శతపతి వర్సెస్ స్టేట్ లో సుప్రీంకోర్టు పోలీసులు విచారించేటప్పుడు పక్కన న్యాయవాదులును ఉంచుకునే హక్కు విచారణకు గురైన ఆ వ్యక్తికి ఉంటుంది అని చెప్పింది. శకునాలు చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు అందరికీ హక్కుల గురించి చెప్పే న్యాయవాదికి ఆ హక్కులు వర్తించకుండా చేశారు. దీన్ని చట్టం అనరు దౌర్జన్యం అంటారు. పైగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్ఐఏ పెట్టిన కేసులకు డిఫెన్స్ చేసే అందరూ న్యాయవాదుల పైన ఈ దాడులు ఏకకాలంలో జరిగాయి. పైగా వీళ్ళందర్నీ విచారణకు హైదరాబాదుకు రమ్మని తాఖీదులు. అందరికీ తలో తేదీ ఇచ్చి రాక తప్పదని హెచ్చరించి వెళ్లారు. కారణం చెప్పకుండానే న్యాయవాదులు సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఇది మా కు రోజు అవసరముబాబు అని చెప్పినా వినకుండా మూట కట్టుకెళ్ళారు.

సరే వీరు అందరూ కూడా ఎన్నయ్యే కేసులు చేయడం మానేస్తారు ఆనుకుందాం. అప్పుడు ఇది ఒక ప్రీసిడెంట్గా మారుతుంది. మరో క్రిమినల్ కేసులోనూ లేదా సివిల్ కేసులోనూ చట్టాన్ని తమ చుట్టంగా మార్చుకుని న్యాయవాదుల్ని బెదిరించి కేసులు చేయకుండా చేస్తారు. ఇది శ్రీనివాస్ సమస్య కాదు ఇది ఆంజనేయులు సమస్య కాదు. ఇది మన వృత్తి సమస్య. ఇది మన భవిష్యత్తు సమస్య. మన కళ్ళ ముందు పెడుతున్న భవిష్యత్ చిత్రపటం.
వదిలేద్దామా?
మాదాకా రాదులే అనిఆగి పోదామా?

బెజవాడ బార్ అసోసియేషన్ ఒక వీర భూమి. హక్కుల కోసం కలబడి నిలబడే న్యాయవాదుల జన్మభూమి. అందుకోసమే రేపు ఉదయం 9:30 కల్లా మన బార్ అసోసియేషన్ ప్రాంగణంలో నిరసన దీక్ష శిబిరంలో మనం కలుద్దాం. మన ఐక్యతను చాటుదాం. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుదాం. వీలైతే అన్ని బార్లతో కలిసి బుధవారం బాయ్ కట్ చేద్దాం. మిత్రులారా ఇప్పుడు మాట్లాడ లేకపోతే ఎప్పటికీ మాట్లాడలేం.

కలిసి కలిసి నడుద్దాం. అన్యాయాన్ని ఎదురిద్దాం.

Keywords : NIA, advocates , vijayawada, bar association, lawyers, attack on democracy ,
(2024-04-26 05:54:23)



No. of visitors : 857

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


ప్రమాదం