కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
23-10-2023
ప్రముఖ విప్లవ కవి, రచయిత వరవరరావుకు ఒక కంటికి కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకునేందుకు వారం రోజులపాటు హైదరాబాద్ రావడానికి బోంబే హైకోర్టు అనుమతి ఇచ్చింది.
న్యాయమూర్తులు ఏఎస్ గడ్కరీ, శ్యామ్ చందక్‌లు మరో కంటికి శస్త్ర చికిత్స చేయించుకునేందుకు ట్రయల్ కోర్టు నుంచి మళ్లీ అనుమతి తీసుకోవాలని రావును కోరారు.
శస్త్ర చికిత్స కోసం ప్రత్యేక NIA కోర్టు వరవరరావుకు అనుమతిని నిరాకరించడంతో ఆయన నవంబర్ 2022లో హైకోర్టును ఆశ్రయించారు.
మావోయిస్టు లింకులు ఉన్నాయన్న ఆరోపణలపై వీవీ UAPA కింద ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆగస్టు 10, 2022న సుప్రీంకోర్టు అతనికి శాశ్వత వైద్యపరమైన బెయిల్ మంజూరు చేసింది. అయితే గ్రేటర్ ముంబై నగర పరిధిలోనే ఉండాల్సిందిగా షరతు విధించింది. అయితే, హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతి కోసం సంబంధిత ఎన్‌ఐఏ కోర్టును ఆశ్రయించేందుకు కోర్టు అతనికి స్వేచ్ఛ ఇచ్చింది.
ఆ తర్వాత హైదరాబాద్‌కు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని, మూడు నెలల పాటు అక్కడ ఉండేందుకు ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. దాంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
వీవీ తరపున న్యాయవాది ఆర్ సత్యనారాయణన్ వాదించిన దరఖాస్తులో రావుకు 83 ఏళ్లు, కంటిశుక్లం శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని, అందుకు తగిన స్థలం హైదరాబాద్ అని వాదించారు. పిటిషన్ ప్రకారం, ప్రత్యేక కోర్టు బెయిల్ తిరస్కరించడానికి రెండు కారణాలను ఇచ్చింది - i) అతను ముంబైలో చికిత్స పొందవచ్చు ii) డిశ్చార్జ్ కోసం వాదనలు ప్రధాన కేసులో కొనసాగుతున్నాయి.
అయితే వీవీకి శస్త్రచికిత్స చేయకపోతే, అతను దృష్టిలోపంతో సహా తీవ్రమైన పరిణామాలకు గురవుతారని దరఖాస్తు వాదించింది. అతను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ కాబట్టి హైదరాబాద్‌లో ఉచితంగా చికిత్స పొందవచ్చని వీవీ తరపు లాయర్ కోర్టుకు తెలిపారు.
ముంబైలోని ప్రభుత్వ ఆసుపత్రులతో వీవీ అనుభవం చాలా భయంకరమైనదని, ప్రైవేట్ ఆసుపత్రులు చాలా ఖర్చుతో కూడుకున్నవని, అందువల్ల అతను ముంబైలో క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకోలేరని అందువల్ల ఆపరేషన్ ను హైదరాబాద్‌లో చేసుకోవడానికి అనుమతి ఇవ్వవలసిందిగా లాయర్ కోర్టును కోరారు.
ఒక్కో కంటి ఆపరేషన్ కు పది చొప్పున ఇరవై రోజులు అనుమతి ఇవ్వాలని వీవీ తరపు లాయర్ కోరగా, ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది సందేశ్ పాటిల్ అభ్యంతరం తెలుపుతూ మూడు రోజులు మాత్రమే గడువు ఇవ్వాలని అన్నారు.
కాగా, ఆ ఉత్తర్వును అప్‌లోడ్ చేసిన తేదీ నుండి ఏడు రోజుల పాటు హైదరాబాద్‌కు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకునేందుకు కోర్టు వరవరరావుకు అనుమతి ఇచ్చింది. అతని మరో కన్ను ఆపరేషన్ విషయానికొస్తే, ట్రయల్ కోర్టు నుండి అనుమతి తీసుకోవచ్చని కోర్టు తెలిపింది.
వరవరరావు తన శస్త్రచికిత్స వివరాలను NIAకి సమర్పించాల్సి ఉంటుంది.
Keywords : varavararao, bombay high court, hyderabad,
(2024-10-09 07:49:52)
No. of visitors : 1244
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |