డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు

డిసెంబర్

29-11-2023

డిసెంబర్ 2 నుండి 8 వరకు జరిగే PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రకమిటీ విడుదల చేసిన కరపత్రం పూర్తి పాఠం...

ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం 23వ వార్షికోత్సవాలను 2023 డిసెంబర్ 2 నుండి 8 వరకు రాష్ట్ర వ్యాప్తంగా విప్లవోత్సాహంతో జరుపుకోండి. వర్గ పోరాటంలో, గెరిల్లా యుద్ధంలో భాగస్వామ్యం కండి
శతృవు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడిని ఓడించండి

డిసెంబర్ 2 అనగానే ప్రజల రాజ్యాధికారం కోసం విప్లవ ప్రజలు చేత బూసిన ప్రజా ఆయుధం, ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (PLGA) ఆవిర్భావ దినం యాదికొస్తుంది, దోపిడి అణిచివేతల నుండి, శతృవు చేస్తున్న విధ్వంసం నుండి ప్రజల మాన, ప్రాణ, ఆస్థులను కాపాడడానికి, దోపిడి బానిసత్వం నుండి ప్రజలను విముక్తి చేయడానికి PLGA చేసిన సాహసోపేత ఘటనలు, విజయాలు గుర్తుకొస్తాయి.

ఈ డిసెంబర్ 2 నాటికి మన PLGA కు 23 యేండ్లు నిండుతాయి. PLGA 23 యేట డిసెంబర్ 2 నుండి 8 వరకు అటవి, మైదాన, పట్టణ ప్రాంతాలల్లో PLGA వార్షిక సంబరాలు విప్లవోత్సాహంతో ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట్ర కమిటి పిలుపునిస్తుంది. గత సంవత్సర కాలంగా విప్లవ ప్రతీఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడిలో భాగంగా శతృవు మన పార్టీ, PLGA పై, ప్రజలపై చేసిన దాడుల నుండి కాపాడడానికి శతృవు బలగాలను సాహసోపేతంగా ప్రతిఘటిస్తూ అసువులు బాసిన వీర గెరిల్లాలకు, బూటకపు ఎన్ కౌంటర్లలో, ఎన్ కౌంటర్లలో, విద్రోహాల్లో, దుర్ఘటనల్లో, అనారోగ్యాలతో అసువులు బాసిన అమర వీరులందరికీ, ప్రజలకు తెలంగాణ రాష్ట్ర కమిటీ తలవంచి వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తున్నది.

ఐదు దశాబ్దాల సాయుధ పోరాట సామాజిక చరిత్రను తెలంగాణ ప్రజలు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. గడి భూస్వామ్య పద ఘట్టనల క్రింద పడి నలిగిన దశలో జనం వారిపై కసితో దున్నే వారికి భూమి నినాదంతో భూమి కోసం, ప్రజా విముక్తి కోసం ప్రజల్లో ఉప్పొంగిన ఉద్రేకం పీడిత రైతాంగాన్ని సాయుధుల్ని చేసి రైతాంగ సాయుధ పోరాటాన్ని నడిపింది. ఈనాడు కాసింత భూమి లభించి తిండి, బట్ట, నీడ దొరుకుతుందంటే ఉరకలెత్తించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాల ఫలితమే. ఆనాడు వర్గ పోరాటంలో రైతాంగం, విద్యార్థులు, కార్మిక వర్గం చూపిన తెగువా నేటికి సాగుతున్న సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడి దారులు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలను నడుపుతూ తొలితరం నుండి నేటి విప్లవ కారుల వరకు కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు కా. కటకం సుదర్శన్, కా. అనిత(DVCM), కా. రాజేష్ (ACM), కా. అశోక్ (PM), మాచర్ల లక్ష్మీ (PM), మాచర్ల పోచన్న(PM), దాడి రాజన్న(PM) త్యాగాలు వర్గ పోరాటానికి సజీవ సంతకం. వారి ఆదర్శాలను పునికిపుచ్చుకొని త్యాగాల వారసత్వాన్ని కొనసాగించాలని తెలంగాణ విప్లవ ప్రజలకు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నాం.

నేడు అణిచివేత దోపిడి రూపాలు పార్లమెంట్ ప్రజాస్వామ్యం పేరుతో చట్టం ముసుగులో కొనసాగుతున్నాయి. దోపిడి దొంగలంతా పార్లమెంట్ వ్యవస్థలో గుమిగూడి దోపిడిని చట్టబద్దం చేసి దేశాన్ని అమ్మడానికి ప్రపంచ పటాన్ని ముందు పెట్టుకుంటున్నారు. దీన్నే దేశ అభివృద్ధి అంటున్నారు. ప్రజలను నమ్మించడానికి ప్రవేటీకరణను ఉద్యోగ, ఉపాధి కల్పన అంటున్నారు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తున్నామని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణలో దోపిడి పాలక ప్రభుత్వం బీఆర్ఎస్ అనుసరిస్తున్న కార్పొరేటీకరణ విధానాల వలన వ్యవసాయ రంగం సంక్షోభంలో పడింది. రైతులు వ్యవసాయ భూములను కోల్పోతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం అవుతున్నాయి. తద్వారా వున్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. నిరుద్యోగం లక్షల్లో పెరిగింది. మహిళలపై హత్యలు, అత్యాచారాలు పెరిగాయి. దళితులపై దాడులు, అణిచివేత, అవమానాలు పెరిగాయి. ఆదివాసీలు జల్, జంగల్,జమీన్ సర్వ అధికారాలు కోల్పోతున్నారు. మత మైనార్టీలపై బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజపు దాడులు కొనసాగుతున్నాయి. అన్ని సెక్షన్ల ప్రజల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలు పెరిగాయి. ఆకలి, దారిద్ర్యం పెరిగింది. ఫలితంగా తెలంగాణలో వర్గ వైరుధ్యాలు పెరుగుతున్నాయి. అన్ని రంగాల, సెక్షన్ల ప్రజలు సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ, భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా వర్గ పోరాటాలు క్రమంగా విస్తృతంగా పెరుగుతున్నాయి. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించమని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పర్చాలని, పంట నష్టానికి భీమా కల్పించమని, ఎరువులు కల్పించమని పోరాడుతున్నారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించమని, ఫర్మినెంట్ చేయమని, జీతాలు పెంచమని సింగరేణీ, ఆర్టీసీ కార్మికులే కాదు అన్ని రంగాల కార్మికులు, నిరుద్యోగులు, విద్యార్థులు, అంగన్ వాడి కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు బేసిక్ ఉద్యోగులు సమరశీల పోరాటాలు చేస్తున్నారు. మహిళలు, దళితులు, ఆదివాసీలు సామాజిక వివక్షకు, దోపిడి అణిచివేతలకు, అవమానాలకు, హత్యలు, అత్యాచారాలకు, ఆదివాసులను అడవుల నుండి బేదాఖల్ చేసే హరితహారంకు వ్యతిరేకంగా, పోడు భూముల రక్షణ కోసం, రాజ్యాంగం కల్పించిన చట్టాలు, హక్కులు అమలు కోసం పోరాడుతూనే జల్, జంగల్, జీమీన్, తమ అస్థిత్వ, అస్మిత, ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్నారు. అన్ని వర్గాల పోరాటాల్లో మహిళలే ముందు వరుసన వుంటున్నారు.

ఈ ప్రజా పునాదిపై ఆధారపడి పార్టీ, PLGA, ఐక్య సంఘటనల సంఘటీతీకరణ కృషి కొనసాగుతుంది. అయితే ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీ ఉద్యమమూ, దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడానికి, సామ్రాజ్యవాద ప్రపంచీకరణ చేయడానికి ప్రధాన అడ్డంకిగా వుండడంతో విప్లవోద్యమ నిర్మూలనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్, బీజేపి, బీఆర్ఎస్ కూటమి సంయుక్తంగా ఈ దాడిని కొనసాగిస్తున్నాయి. 2022 అక్టోబర్ నుండి విప్లవ ప్రతీఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడి దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇందులో కలంధారీ మావోయిస్టు, అర్బన్ నక్సలైట్ల పేర్లతో ప్రజాస్వామిక మేధావులపై, సామాజిక కార్యకర్తలపై పట్టణ, మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడిని సమస్త ప్రజలు ఐక్యమై ఓడించడానికి వర్గ పోరాటాన్ని తీవ్ర తరం చేయాల్సిన అవసరం వుంది. కనుక ప్రజల సంఘటితీకరణ కోసం కృషి చేయడం మన ముందున్న తక్షణ కర్తవ్యం.

దేశ వ్యాప్తంగా 2022 డిసెంబర్ నుండి 2023 డిసెంబర్ వరకు గడిచిన సంవత్సర కాలంలో మన పార్టీ నాయకత్వంలో PLGA, దేశ వ్యాప్తంగా వివిధ గెరిల్లా జోన్లలో, ఎర్ర ప్రతిఘటనా ప్రాంతాల్లో దాదాపు 150 గెరిల్లా యుద్ధ చర్యలు నిర్వహించింది. ఈ చర్యల ద్వారా శతృవు పోలీసు, పారా మిలిటరీ, కమాండో, వాయుసేన, భారతసేన బలగాలకు చెందిన సుమారు 70 మందిని నిర్మూలించి, 151 మందిని గాయ పర్చింది. వారి నుండి 3 ఆయుధాల్ని, వందలాది తూటాల్ని ఇతర యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకుంది. 21 మంది పోలీసు ఇన్ఫార్మర్లను, 10 మంది ప్రజా వ్యతిరేక బీజేపి, తదితర బూర్జువా రాజకీయ నాయకులను, ముగ్గురు ప్రజా శతృవులను, ఇద్దరు ప్రతీఘాతుక ద్రోహులను నిర్మూలించింది, అనేక చోట్ల కార్పొరేటీకరణను - సైనికీకరణలను వ్యతిరేకిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులను, దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల ఆస్తులను ధ్వంసం చేసింది. 100కు పైగా ఎన్ కౌంటర్లలో, పోలీసు దాడుల్లో పోలీసు, పారా మిలిటరీ కమాండో, వాయుసేన, భారత సేన బలగాల దాడులను PLGA తిప్పికొట్టింది. విప్లవ రాజకీయాలతో ఆదివాసీలు, గైరాదివాసీ ప్రజలు జల్, జంగల్, జమీన్ ను కాపాడుకునేందుకు, తమ అస్థిత్వాన్ని, అస్మితను, ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు వీరోచితంగా జీవన, మరణ పోరాటాలు చేస్తున్న ప్రజలకు రక్షణగా, అండగా నిలబడింది. ప్రజలు సైతం వర్గ పోరాటాల్లో పాల్గొంటూనే PLGAకు అండగా నిలుస్తున్నారు. ప్రజా మిలీషియా కూడా గెరిల్లా యుద్ధంలో, క్రియాశీలంగా, సమరశీలంగా పాల్గొని ప్రజల విజయాల్లో పాలుపంచుకుంటుంది. దోపిడి పీడనల నుండి ప్రజలు తమను తాము విముక్తి చేసుకోవడానికి త్యాగాలకు వెరవకుండా వర్గ పోరాటాల్లో-గెరిల్లా చర్యల్లో పాల్గోవడమనేది అనన్యసామాన్యం.

విప్లవ ప్రజలు సృష్టిస్తున్న కొత్త చరిత్ర నుండి కార్మికులు, రైతాంగం, విద్యార్థులు, ఉద్యోగులు మేధావులు, ప్రజాస్వామిక వాదులు, మహిళలు సమస్త సెక్షన్ల ప్రజలు యావత్తు రాష్ట్ర ప్రజలంతా స్ఫూర్తిని పొందుతూ సమరశీల పోరాటాల్లో ముందునిలువండి. పోరాడితే పోయేది ఏమి లేదు బానిస సంకెళ్ళు తప్ప. దోపిడి వర్గాలకు వారి ప్రయోజనాల భద్రత కోసం బూర్జువా సైన్యాలు వున్నాయి. కాని బలమైన శతృవును ఓడించడానికి మనకు కోట్లాది పీడిత ప్రజల సంఘటిత సైన్యం వుంది. యావత్తు పీడితులంతా ఐక్యం కావడమే మన బలమైన వ్యూహం. ప్రజల పోరాటాలు, సాధించిన విజయాలు నిలుపుకోవడానికి ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం వుంది. దానికి అన్ని వైపుల మద్దతును, సహాయ సహకారాలను అందించి బలోపేతం చేసి, బలమైన ఆయుధంగా తయారు చేద్దాం. మనల్ని మనం రక్షించుకుందాం. దోపిడి నుండి విముక్తి పొందుదాం.
తెలంగాణలో మన పార్టీ తాత్కాలిక వెనకంజను అధికమించి విప్లవోద్యమాన్ని పురోగమింప చేయడమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం. దానిని సాధించాలంటే వర్గ పోరాటాల్లో (సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ బూర్జువా వర్గ, భూస్వామ్య వ్యతిరేక పోరాటాల్లో పాల్గొంటూ తీవ్రతరం చేయాలి. పీడిత ప్రజలు పార్టీని, ప్రజా సైన్యాన్ని, విప్లవకర ఐక్య సంఘటనను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. మావోయిస్టు పార్టీని సమూలంగా నిర్మూలించే లక్ష్యంతో పాలకులు కొనసాగిస్తున్న సూరజ్ కుండ్ వ్యూహాత్మక దాడిని ఓడించడానికి విప్లవ ప్రజలంతా గెరిల్లా యుద్ధంలో భాగస్వామ్యం కావాలి. గెరిల్లా యుద్ధాన్ని కొనసాగిస్తున్న PLGAకు మద్దతుగా ప్రజల వంతు సహాయాన్ని అందించాలి. ఓటమి లేని బలమైన ప్రజా సైన్యాన్ని తయారు చేయడానికి ప్రతి ఇంట ఒక గెరిల్లాను తయారు చేసి PLGAలోకి భర్తీ చేయాలి. ప్రజల ప్రత్యామ్నాయ రాజకీయాధికార విప్లవ ప్రజా ప్రభుత్వాలను నెలకొల్పే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలి.

దోపిడి పాలకులు మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా వర్ణిస్తున్నారు. కానీ మనం అప్పుల్లో వున్నట్లుగానే, మన దేశం, రాష్ట్రం కూడా అప్పుల్లో వుంది. దేశ సంపద అంబానీ, అదానీ, మోదీ, కేసీఆర్, కేటీఆర్ మెగా కృష్ణారెడ్డి, మురళి దివి కుటుంబం, P. పిచ్చిరెడ్డి, PV. కృష్ణారెడ్డి, B. పార్థ‌సారథి రెడ్డి కుటుంబం, రాంప్రసాద్ రెడ్డి, C. ప్రతాప్ రెడ్డి కుటుంబం, మైహోం రామేశ్వర్రావు లాంటి కొద్ది మంది దోపిడి దారుల చేతుల్లో పోగుపడి వుండగా, జీవితాంతం కష్టపడి దారిద్ర్యాన్ని అనుభవిస్తూ దిన దినం గండంగా అన్నట్లు కాలం వెళ్ళదీస్తున్న వాళ్ళు కోట్లల్లో వున్నారు. కుబేరులు అనుభవిస్తున్న సంపదంతా వాళ్ళు కష్టపడి సంపాదించింది కాదు. శ్రామికులు తమ జీవిత కాలమంతా కష్టపడి సృష్టించిన సంపద. మానవ శ్రమను, ప్రజా ధనాన్ని, ప్రకృతి వనరులను అక్రమంగా కొల్లగొట్టడం మూలంగా కుబేరులుగా మారారు, వీరి ప్రయోజనాల కోసం పాలకులు అమలు చేస్తున్న విధానాల వలన గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచ పెట్టుబడి-సామ్రాజ్యవాద వ్యవస్థ ఆర్ధిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ, ఆహార, ఇంధన, వలస తదితర వ్యవస్థలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయి వున్నాయి. ఈ సంక్షోభాలకు కారణం పెట్టుబడిదారీ-సామ్రాజ్యవాద వ్యవస్థ అనుసరిస్తున్న ఆర్ధిక, రాజకీయ విధానాలే.

అందుకే ప్రజలారా! వ్యవసాయ రంగాన్ని, భూములను కాపాడుకోవడం కోసం సాయుధ రైతాంగ పోరాటాలకు సిద్ధం కావాలి. కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానం పేరుతో చేస్తున్న కార్పొరేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా, శాస్త్రీయ విద్యా విధానం అమలు కోసం విద్యార్థులంతా మిలిటెంట్ పోరాటాలు చేపట్టాలి. దేశ పారిశ్రామిక, సేవా రంగాలన్నింటిని, అసంఘటిత రంగాన్ని కార్పొటీకరించడానికి వ్యతిరేకంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు, చిన్న, మధ్య తరహా పెట్టుబడి దార్లు, చిన్న వ్యాపారులంతా సమైకంగా పోరాడాలి. అడవుల కార్పొరేటీకరణను చట్టబద్దం చేసిన అటవీ సంరక్షణ చట్టం-2023 రద్దుకై జల్, జంగల్, జమీన్ పై సర్వాధికారం కోసం, తమ అస్థిత్వం, అస్మిత, ఆత్మగౌరవం కోసం పోరాడాలి. పౌర సమాజంలో పౌర హక్కులు కాలరాయబడ్డాయి వాటి పరిరక్షణ కోసం మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు కదిలి ఉద్యమాలు చేపట్టాలి. దళితులు, మహిళలు, మత మైనార్టీలు ఆయా సెక్షన్ల ప్రజలు ఎదుర్కొంటున్న మౌళిక సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాల ప్రజలు కలిసి కట్టుగా ఉద్యమాలు చేపట్టాలి. సమాజ మార్పు కోసం సాగుతున్న విప్లవంలో భాగస్వామ్యం కావాలి. పీడిత ప్రజల విముక్తి కోసం దీర్ఘకాలిక ప్రజా యుద్ధ పంథాలో నిస్వార్థంగా పని చేస్తూ వీర మరణం పొందిన వీర గెరిల్లా యోధుల ఆదర్శాలతో, దృఢ సంకల్పంతో వర్గ పోరాటాన్ని- గెరిల్లా యుద్ధాన్ని విస్తృతం-తీవ్రతరం చేయడంలో పీడిత ప్రజలంతా భాగస్వామ్యం కావల్సిందిగా పిలుపునిస్తున్నాం.

తెలంగాణ రాష్ట్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : CPI Maoist, Telangana, State committee, abhay, PLGA,
(2024-04-21 13:10:59)No. of visitors : 912

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


డిసెంబర్