నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు

నిజాలు

10-12-2023

కేరళలో పక్షపాత ధోరణితో ముస్లిం యువకులను నిర్బంధించడంపై వార్తా నివేదిక రాసినందుకు రెజాజ్ ఎం షీబా సిద్ధిక్ అనే జర్నలిస్టుపై పోలీసులు కేసు పెట్టారు. దానిని నిరసిస్తూ ఆయన , అతని మిత్రుడు మహ్మద్ హనీన్ లు కరపత్రాలు పంచుతున్నందుకు ఆయనపై, హనీన్ పై సీపీఎం నాయకులు, కార్యకర్తలు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. అనంతరం ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై రెజాజ్ ఎం షీబా సిద్ధిక్ తన ఫేస్ బుక్ వాల్ పై చేసిన పోస్ట్....

చెవిటివారికి వినబడాలంటే, శబ్దం బిగ్గరగా ఉండాలి. వ్యవస్థీకృత హింసను, పోలీసుల దౌర్జన్యాలను దాచిపెట్టే కథనాలను వడ్డించే ప్రభుత్వం చేత మోసపోయిన సామాన్య ప్రజలు చాలా మంది సీపీఐ(ఎం) సానుభూతిపరులుగా  ఉన్నారు.
పక్షపాత ధోరణితో ముస్లిం యువకులను నిర్బంధించడంపై వార్తా నివేదిక రాసినందుకు నాపై ఐపిసి సెక్షన్ 153 కింద నమోదైన కేసు గురించి ప్రజలకు తెలియజేయడానికి, పత్రికా స్వేచ్ఛపై కేరళ ప్రభుత్వం చేసిన దాడిని నిరసిస్తూ, నాపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ (డీఎస్ఏ) పేరిట కరపత్రాలు  పంచడానికి  నేను, హనీన్ నిన్న ఎర్నాకులంలోని మెరైన్ డ్రైవ్లో సాయంత్రం 6 గంటలకు జరిగే నవ కేరళ సదస్సు (ʹప్రభుత్వం ప్రజల దగ్గరకుʹ అనే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, మంత్రులు హాజరవుతారు)కి వెళ్లాము.

మొదట యూనిఫారం, సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు నన్ను గమనించి తమతో రావాలని అడిగారు. నేను  అందుకు  నిరాకరిస్తూ  "ఇంక్విలాబ్ జిందాబాద్, జర్నలిజం నేరం కాదు" అని నినాదాలు చేస్తూ కరపత్రాలను గాలిలోకి విసిరాను. ప్రజలు కరపత్రాన్ని చదవడం ప్రారంభించారు. హనీన్  కూడా కరపత్రాలు పంచాడు. మమ్మల్ని పోలీసులు తీసుకెళ్తుండగా, సీపీఐ(ఎం) గూండాలు మూకుమ్మడిగా మాపై దారుణంగా దాడి చేశారు.

నన్ను నేలపై పడేసి తన్నారు, నా ముఖంపైన  చాలాసార్లు  తొక్కారు. నా పొట్ట, చేతులపైన, తలపైన కూడా కొట్టారు.  చేతిలో వున్న తాళం చెవివంటివాటితో పొడిచారు. హనీన్పై కూడా పాశవికంగా దాడి చేశారు. పోలీసులు నా చేతులు పట్టేసుకోవడంతో, నన్ను నేను రక్షించుకోలేకపోయాను.

CPIM గూండాలు ఏ మాత్రం సానుభూతి చూపకుండా పోలీసులు, పిల్లల సమక్షంలో మాపై దాడిని కొనసాగించారు. నన్ను చంపమని కూడా అన్నారు. పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు  నేను గేటు మధ్య ఇరుక్కుపోవడంతో  నాపై దాడి చేయడానికి సీపీఐ(ఎం) వాళ్ళకు మరింత సమయం దొరికింది.

ఈ దాడిలో మధ్య వయస్కులు, వృద్ధులు వున్నారు. నన్ను తీసుకెళ్లిన సివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు, ఆపమనేంత వరకు నన్ను అసభ్య పదజాలంతో తిడుతూనే వున్నారు. చాలా దూరంలో ఉన్న పోలీసు జీపులోకి మమ్మల్ని తీసుకెళ్లినప్పుడు కూడా, సీపీఐ(ఎం) గూండాలు చుట్టుముట్టి మమ్మల్ని తమకు అప్పగించాలని పోలీసులను  అడిగారు.

మమ్మల్ని మొదట ఎర్నాకులం సెంట్రల్ పోలీస్ స్టేషన్కి, ఆ తరువాత మెడికల్ చెకప్ కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా శరీరంపై స్పష్టంగా గాయం గుర్తులు కనిపిస్తునప్పటికీ మాకు ఎటువంటి వైద్యమూ చేయలేదు కేవలం సమాచారం తీసుకున్నారు. తర్వాత స్టేషన్కి తీసుకెళ్లి భోజనం పెట్టకుండా గంటల తరబడి నిర్బంధించారు. మా అరెస్టును నమోదు చేశాక బెయిల్ మీద బయటికి వచ్చాం.

దురదృష్టవశాత్తు ఒక సీపీఐ(ఎం) పార్టీ సభ్యుడిని నిరసనకారుడిగా పొరబడి, సీపీఐ(ఎం) గూండాలు తీవ్రంగా దాడి చేసి మాతో పాటు నిర్బంధించారు. సీపీఐ(ఎం) స్థానిక నేత బెయిల్ తీసుకున్నప్పటికీ అతనిపై కేసు నమోదైంది.
మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పైన కూడా సీపీఐ(ఎం)  గూండాలు దాడి చేసారు. సివిల్ డ్రెస్ వేసుకున్నందుకు దాడికి గురైన మరో పురుష అధికారితో పాటు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

మా జిల్లాకు చెందిన సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు అయిన బంధువు నా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. స్టేషన్కు రావడమూ, అందులోనూ  తాళం వేసిన సెల్ లాంటి గదిలో కూర్చున్న నన్ను చూడటం మా అమ్మకు  మొదటి అనుభవం. స్టేషన్లో ఉద్వేగానికి లోనైన మా అమ్మ ఇంటికి చేరిన తర్వాత ʹఈ సారి ఓట్లు అడగటానికి ఇంటికి రానీʹ అని కోపంగా అన్నది. సీపీఐ(ఎం) తనను తాను ప్రజల ముందు బట్టబయలు చేసుకొంది. భిన్నాభిప్రాయాలు, ప్రజాస్వామ్యం అంటే తనకు ʹపడదు (అలెర్జీ)అనేʹ  విషయాన్ని  అమ్మలాంటి సామాన్య ప్రజలకు తెలియచేసింది.

మేము ఏ నేరం చేయలేదు లేదా ఏ అణగారిన వ్యక్తిపైనా  దాడి చేయలేదు. ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు త్యాగం అనివార్యం కాబట్టి కన్నీళ్లు, రక్తం కారతాయి. నేను 2017 నుండి 2020 వరకు SFI, DYFI లో ఉన్నాను.  SFI  అంగమాలి  ప్రాంత తాత్కాలిక అధ్యక్షుడిగా, వైటిల్ల ఏరియా SFI సెక్రటేరియట్లో, ఎడపల్లి SFI స్థానిక కార్యదర్శిగా, మా కాలేజీ యూనిట్ సెక్రటరీతో సహా SFIలో వివిధ పదవులను నిర్వహించాను. ఆ సమయంలో నేను స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం అంటూ నినాదాలు చేసేవాడిని.

ప్రియమైన కామ్రేడ్స్, సిపిఐ(ఎం) ప్రజాస్వామ్యం తాను ప్రతిపాదించిన నియమాలు, షరతులతో కూడుకొని వుంటుంది. అసమ్మతివాదులపై హింసను  ప్రయోగించడానికి వారు పోలీసులను, తమ పార్టీ  సభ్యులను ఉపయోగిస్తారు!
సీపీఐ(ఎం) ఒక సామాజిక ఫాసిస్టు!!!
(Rejaz M Sheeba Siddique )

Keywords : kerala, CPIM, Police, attack on journalist, (Rejaz M Sheeba Siddique
(2024-04-22 04:26:20)



No. of visitors : 432

Suggested Posts


ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడు

ఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో..

తన తల్లిని క్రిమినల్ గా చూయించిన‌ సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం

తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు....

కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులు

కేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు.....

Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protest

CPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi. The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces.

The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central Committee

We send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic....

Four districts in Kerala on high alert as Maoists form new combat unit

The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction....

మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో

కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి.....

మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలు

అక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వ‍ందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌ‍ంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో...

దళిత నటి విషాద గాథ‌ !

అప్పుడే రెండో ఆట చూడడానికి.. తనను తాను తెర పై చూసు కోడానికి వచ్చిన రోజీపై దాడి చేశారు. భయంతో పరుగులు తీసి రోజీ ఒక పూరి గుడిసెలో ఆశ్రయం పొందింది. ఆమె ధైర్యం తమ కులాధిపత్యానికి చేటు కలిగిస్తుందనే మూర్ఖులు... ఆమెని వెంబడించి ఆ ఇంటిని దహనం చేశారు. ఇంటివాళ్ళు ప్రాణభయం తో పారిపోయారు

Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu Devaraj

Human right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


నిజాలు