రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్

రైతుబంధు

11-12-2023

తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ ఓటమిపాలై కాంగ్రెస్ విజయం సాధించి అధికార౦ చేపట్టిన సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికారప్రతినిధి జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన పూర్తి పాఠం...

తెలంగాణలో ఒక దశాబ్ద కాలం పాటు ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన కొనసాగించిన బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించిన ప్రజలు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి చెత్త కుప్పలో విసిరేశారు. దీనితో నూతనంగా కాంగ్రేస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రేస్ అధికారంలోకి వస్తే మంచి పాలన అందిస్తుందనో, లేదా కాంగ్రేస్ పార్టీ ప్రకటించిన మేని ఫెస్టోనో, ఆయా సెక్షన్ల ప్రజలకు ప్రకటించిన డిక్లేరేషన్లను నమ్మో వారికి ఓట్లు వేసి గెలిపించ లేదు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లే కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహద పడ్డాయి. వాస్తవానికి పోరాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్ళు, నిధులు, నియమకాలను ఆశించిన ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో లభించలేదు. అంతకంటే ముఖ్యమైంది ప్రజా స్వామ్యాన్ని ద్వంసం చేసి ప్రజలను నిస్సహాయ స్థితిలోకి నెట్టారు.

ఈ పదేళ్ళ కాలంలో కనీస చట్టబద్ద పాలన కాదు కదా కేంద్రీకృత, నిరంకుశ అణిచివేత పాలనను కొనసాగించారు. ప్రశించిన గొంతులను నొక్కేశారు. క్రింది ఉద్యోగులపై దౌర్జన్య పూరిత విధానాలను అమలు చేస్తూ వారిపై పని భారాన్ని పెంచారు. సామ్రాజ్యవాదుల, బడా కార్పోరేట్ల, భూస్వాముల, దోపిడి పాలకుల ప్రయోజనాల కోసం నీళ్ళు, నిధులను, నియమకాలను అక్రమంగా దారి మళ్ళించారు. ప్రైవేటీకరణకు ప్రాధాన్యతను కల్పించి ఇప్పటి వరకు ఉద్యోగ నియయమకాలు చేపట్టలేదు. అందువలన ఫోస్టు గ్రాడ్యుయేట్ చేసిన నిరుద్యోగులే 25 లక్షలపైగా పెరిగారు. నీళ్ళ కోసం వెచ్చించిన నిధుల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడడం కాక గోదావరి పై నిర్మించిన ప్రాజెక్టు వలన పేద, మద్య రైతాంగ వ్యవసాయ సాగు భూములకు నీళ్లు అందించలేక పోయారు. మొత్తంగా తెలంగాణ ఏర్పడిన తరువాత బడా బడా కార్పోరేట్ సంస్థలు, కాంట్రాక్టర్లు, కేసిఆర్ కుటుంబం. వారి ప్రభుత్వంలో కొనసాగుతున్న కొద్ది మంది తాబే దారులు, కలిసి నీళ్ళను, నిధులను, భూములను అక్రమంగా కాజేశారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన దోపిడి కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మరింత ఎక్కువగా దోపిడి జరిగింది. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రధానంగా కేసిఆర్, కేసిఆర్ కుటుంబంపై అన్ని రంగాల్లో, అన్ని సెక్షన్ ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో రగిలిన ప్రజా వ్యతిరేకత, అసంతృప్తి, కోపం, ఓట్ల రూపంలో కేసిఆర్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడారు. అదేవిధంగా మూడవ సారి అధికారం కోసం దేశంలో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీతో రహస్య రాజకీయ అక్రమ సంబంధాన్ని కలిగి వుండడాన్ని ప్రజా ఉద్యమాలతో చైతన్యమైన సెక్యులర్ ప్రజలు మరింతగా బీఆర్ఎస్ ను అసహించుకున్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఆర్ధిక, రాజకీయ ప్రలోభాలు ఎన్ని పెట్టినా ప్రజలు ఛీ కోట్టడంతో ఓటమి నుండి తప్పించుకోలేక పోయింది. ప్రజా వ్యతిరేక దోపిడి అణిచివేత విధానాలను అమలు చేసినా ఏ పార్టీ అయినా ప్రజా తీర్పుకు చెత్త కుప్పలోకి విసిరేస్తూ వుంటారు కాని ప్రజల ప్రత్యామ్నాయ మార్గం లేక మార్చి మార్చి అవే పార్టీలను అధికారంలోకి తీసుక రావడం అనేది విషాదకరం.

ప్రజలారా! కాంగ్రేస్ అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు అనేక హమీలనిచ్చి అధికారాన్ని చేపట్టింది. ప్రజాస్వామ్యాన్కి గ్యారంటినిస్తామని కూడా హమీనిచ్చింది. అందుకే ప్రజల మౌళిక సమస్యలన్నింటిని పరిష్కరించమని అధికార పార్టి కాంగ్రేస్ ను అడగండి. అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే జాబ్ క్యాలెండర్ ప్రకటించి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్న హామీని ప్రభుత్వ రంగ సంస్థల్లో అవకాశాలు కల్పించమనండి. ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులకు విద్య అవకాశాలను ఉచితంగా కల్పించమనండి.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం ప్రెస్ మీట్ లో ప్రజలే పాలకులు, మేము సేవకులం అంటూ కాంగ్రేస్ పాలన ప్రజాస్వామ్య పాలన అన్నట్లుగా మాట్లాడారు. ఏ పాలకులైనా ప్రజలను నమ్మించడానికి పడి కట్టు పదాలను వాడుతారు తప్ప ఇందులో ఎంత మాత్రం వాస్తవం వుండదు. ప్రజాస్వామ్యం పేరుతో ప్రజలతో ఓట్లు వేయించుకున్న పాలకులు మళ్ళీ ఎన్నికలు వచ్చేంత వరకు వారిని నిష్క్రియ ప్రేక్షకులుగానే పరిమితం చేస్తారు తప్ప. ప్రజలకు రాజకీయ అధికారంతో ఏ మాత్రం భాగస్వామ్యం వుండదనే విషయాన్ని ప్రజలు గమనించాలి. కాంగ్రేస్ పాలన ప్రజాస్వామిక పాలనే అయితే ప్రజల ప్రజాస్వామిక రాజకీయ నినాదాలను పరిష్కరించమని ప్రజలు కోరుతున్నారు.

ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రభుత్వాలను అడగడమనేది రాజ్యంగం కల్పించిన ప్రాధమిక హక్కు. ప్రజలే పాలకులు అని చెపుతున్న కాంగ్రేస్ పార్టీని ప్రజాస్వామ్యం గురించి అడుగుదాం. అధికారం చేపట్టిన వెంటనే ఇంటలిజెన్స్, కౌంటర్ ఇంటలీజెన్స్, యాంటి నక్సల్స్ ఇంటలీజెన్స్, ఎస్ఐబీ, గ్రేహౌండ్స్ లో పని చేసి నేర పూరిత అనుభవం కలిగి వున్నా అదనపు డిజీ శివధర్ రెడ్డిని రాష్ట్ర ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించారంటేనే రేపటి ఉద్యమాలను అణిచివేయడానికే అనేది స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను ప్రజలు కోరుకుకుంటున్నారు. ఎన్ కౌంటర్లు లేని తెలంగాణను నిర్మించడం సాధ్యమవుతుందా? జైళ్ళలో యేండ్ల తరబడి మగ్గుతున్న రాజకీయ ఖైధీలను విడుదల చేయమని ప్రజల కోరుతున్నారు. విడుదల చేయగలరా? ప్రజా ఉద్యమకారులపై అర్బన్ నక్సలైట్లు, కలంధారి మావోయిస్టులంటూ ముద్ర వేస్తూ వారిని అక్రమ కేసుల్లో ఇరికించి ఊపా చట్టం, ఎన్ఐఏ దాడులు కొనసాగుతున్నాయి వాటిని నిలిపి వేయండి. వారిపై ఇప్పటి వరకు పెట్టిన అక్రమ కేసులను కొట్టి వేయండి. ధర్నా చౌక్ ను ఎలాంటి ఆంక్షలు లేకుండా పునరుద్దరించండి. పౌర హక్కులకు, స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగని కనీసం చట్టబద్ద పాలన అయినా కొనసాగించమని ప్రజలు కోరుతున్నారు.

భూమి లేని వారికి భూమి కల్పించాలి. రుణాలు మాఫీ, రైతు బంధు పేరిట ప్రజా ధనాన్ని భూస్వాములకు పంచే విధానాన్ని నిలిపి వేసి పేద, మధ్య తరగతి రైతులకు, కౌలు రైతులకు రైతు బంధు వర్తింప చేయాలి. రైతు పండించిన పంటలకు మండీలు ఏర్పర్చి న్యాయమైన ధర కల్పించాలి. భూస్వాములకు అనుకూలమైన ధరణీ పోర్టును రద్దు చేయాలి, రాష్ట్రంలో మిగులు భూములను, ప్రభుత్వ, బంజరు భూములను వ్యవసాయ కూలీలకు పంచాలి. ప్రాజెక్టుల పేరుతో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని ప్రజల నిర్వాసిత సమస్యను పరిష్కరించాలి. ఆదివాసీ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి, జల్-జంగల్-జమీన్ పై పూర్తిగా ఆదివాసులకే అధికారం కల్పించాలి. పెసా చట్టాన్ని, 5వ, 6వ షెడ్యూల్డ్ చట్టాలను,1 ఆప్ 70 చట్టాన్ని. జీవో నెంబర్ 3ని అమలు చేయాలి. ఆదివాసీల చట్టాలకు విరుద్ధంగా ఏర్పరుస్తున్న పోలీస్ క్యాంపులను ఎత్తియాలి. హరిత హారాన్ని రద్దు చేసి ఆదివాసులపై వున్న కేసులను ఎత్తివేయాలి. ఆదివాసులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు 2006 అటవి హక్కుల చట్టం ప్రకారం లబ్ది దారులకు పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వ రంగ సంస్థలను రద్దు చేసి ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పాలి. ఆర్టీసి ప్రవేటీ కరణను నిలిపి వేయాలి. ఓపెన్ కాస్టులను రద్దు చేయాలి. ఉత్పత్తి రంగాల్లో కాంటాక్టు కార్మికులను, ఔట్ సోర్సింగ్ కార్మికులను, క్యాజువల్ కార్మికులను పర్మినెంట్ చేయాలి, డిపెండెంట్ ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలి, కార్మికుల నిజా వేతనాలు పెంచాలి. వస్త్ర కార్మికులు, చిన్న తరహా ఉత్పత్తి దారుల హక్కులను, చిన్న తరహా మ్యానుఫాక్చరింగ్ రంగాల హక్కులను కాపాడాలి. కాజిపేట్ లో రైలు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలి. ఇవేవో ప్రజలు కోరుకునే గొంతమ్మ కోరికలు కాదు. చట్ట పరిధిలో ప్రభుత్వాలు అమలు చేయాల్సిన న్యాయమైన రాజ్యంగ హక్కులు మాత్రమే.

మహలక్ష్మీ, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, యవ వికాసం, చేయూత ఆరు గ్యారంటీల ఉచితాలు ప్రకటించారు. వీటి వెనక వున్న ఉచితాల అంతర్యంను మనం అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుంది. పేదరికంలో మగ్గుతున్న వారి ఆధాయ వనరులు పెంచి పేదరికాన్ని నిర్మూలించి జీవిత భద్రతకు గ్యారంటి ఇవ్వకుండా ఇప్పటికే 5 లక్షల్లో కోట్ట అప్పుల్లో వున్న రాష్ట్రంలో ఉచిత స్కిమ్ లను అమలు చేస్తామంటున్నారు. వీటికి ఎక్కడి నుండి నిధులు సమకూర్చుతారనేది ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి పథకాలు చూడడానికి ఆకర్శణీయంగా ఉంటాయి కాని పన్నుల రూపంలో వాటి భారం ప్రత్యేక్షంగా, పరోక్షంగా ప్రజలపైన్నే వేస్తారు. ఈ పథకాల నిధుల కోసం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం, నిత్యవసర సరుకుల ధరలు పెంచడం లేదంటే సామ్రాజ్యవాదులు, దేశ, విదేశ బడా కార్పోరేట్ల వద్ద ఒప్పందాలతో లక్ష కోట్ల రూపాయలు అప్పులు తీసుక రావడం, వారి ప్రయోజనాల కోసం నయా ఉదారవాద విధానాలను అమలు చేయడం వంటి దోపిడి అణిచివేత విధానాలు రూపొందించి ప్రజల ఆస్తులను, ఖనిజ సంపదలను తెగనమ్మేస్తారు. తద్వారా ప్రజా ఉద్యమాలు ముందుకొస్తాయి. కార్పోరేట్ల దోపిడి ప్రయోజనాలకు ఆటంకంగా మారిన ఉద్యమాలను అణిచివేయడానికి పూనుకుంటారు. ఇక్కడే ప్రజల ప్రజాస్వామిక హక్కులను, స్వచ్ఛను పాలక ప్రభుత్వాలు చట్టాల రూపంలో కాలరాస్తున్నాయి.

నేటి సమాజం సామ్రాజ్యవాదుల, దళారీ నిరంకుశ బూర్జువా వర్గాల, బడా భూస్వాముల పునాదులపై ఆధారపడి ఈ రాజ్య వ్యవస్థ నిర్మితమై వుండి దోపిడి స్వభావం కలిగి వుంటుంది కనుక ఆదికారంలోకి పాలక పార్టీలు ఎన్ని మారినా వాటి స్వభావం మారదు. నూతనంగా అధికారాన్ని చేపట్టిన కాంగ్రేస్ పార్టీ పారదర్శకంగా ఏమి అధికారంలోకి రాలేదు. డబ్బు, మద్యంతో ప్రజలను ప్రలోభ పెట్టిన సంగతి జగమెరిగిన సత్యం. ఇంతటి అవినీతితో పార్టీలు అధికారాన్ని చేపట్టిన పార్టీ భవిష్యత్తులో ఎంతటి అవినీతికి పాల్పడ బోతుందో ప్రజలు అర్ధం చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని ప్రకటించుకుంది. ఇందిర రాజ్యం దోపిడి రాజ్యం అనే విషయం, ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ విధించి దేశాన్ని ఎంత అల్లకల్లోలం సృష్టించిందనే విషయం భారత ప్రజలందరికి తెలియంది కాదు. అందుకే ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ప్రజల రాజకీయాధికారం అనేది ప్రజల ప్రత్యామ్నాయం తప్ప మరొక్కటి లేదు.

జగన్
అధికార ప్రతినిధి
సీపీఐ (మావోయిస్టు)

Keywords : Telangana, BRS, Congress, Revanth Reddy, CPI Maoists, jagan, abhay
(2024-04-26 16:53:00)



No. of visitors : 885

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


రైతుబంధు