హత్యాయత్నం కేసులో నటుడు వినోద్ కుమార్ అరెస్టు


హత్యాయత్నం కేసులో నటుడు వినోద్ కుమార్ అరెస్టు

ప్రముఖ నటుడు, ʹసీతారత్నం గారి అబ్బాయిʹ, ʹమామగారుʹ సినిమా ల హీరో వినోద్‌కుమార్ ఓ హత్యాయత్నం కేసులో అరెస్టయ్యారు. తన మేనేజర్ సచిదానంద పై హత్యా ప్రయత్నం చేశాడన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్టు చేసి పుత్తూరు కోర్టులో హాజరు పర్చారు. కోర్టు మంగళవారం ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వినోద్‌కుమార్ అసలు పేరు వినోద్ అల్వా. వినోద్ కుమార్, ఆయన సహచరుడైన ఉదయ్ అనే వ్యక్తి తనను వాహనంతో ఢీకొట్టి చంపాలని చూశారని సచిదానంద పోలీసులకు పిర్యాదు చేశారు. తనను హత్యచేసి.. రోడ్డుప్రమాదంగా చిత్రీకరించేందుకు వారు ప్రయత్నించారని, ఈ రోడ్డుప్రమాదంలో తనకు గాయాలయ్యాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీంతో వినోద్‌కుమార్‌పై ఐపీసీ సెక్షన్లు 120 బీ (నేరపూరిత కుట్ర), 307 (హత్యాయత్నం) కేసులు నమోదుచేసి.. కోర్టు ఎదుట హాజరుపరిచారు. పుత్తూరు ఏఎస్‌పీ సీబీ రిశ్యాంత్‌ నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతున్నది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారని జిల్లా ఎస్పీ శరణప్ప తెలిపారు.

Keywords : Vinod Kumar, Arrested, Attempt to Murder case
(2018-06-17 14:15:23)No. of visitors : 767

Suggested Posts


రైతులు నక్సలైట్లవుతారు - నానా పటేకర్

మహారాష్ట్రలో రోజు రోజుకు పెరుగుతున్న రైతుల ఆత్మహత్యల పట్ల బాలీఉడ్ నటుడు నానా పటేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్తితి ఇలాగే కొనసాగితే రైతులు నక్సలైట్లవుతారని....

ఫ్యాన్స్ ముసుగులో... మూడు కులాలు - ముప్పై కొట్లాటలు

పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల కొట్లాట తో ప్రారంభమై న కుల గజ్జి కొట్లాటలు బాలయ్య అభిమానుల తో కొనసాగుతోంది. సినీ హీరోల అభిమాన దురద, కుల గజ్జి వెరసి ఆ పిచ్చి పట్టిన యువకులకు కులదురహంకార గనేరియా రోగం పట్టుకుంది.

Court movie:A Case of an Indian Court !

a singer cum activist Narayan kamble sings a song. That is what police say in their charge sheet. The song which suggest that a suicide is better than to clean a gutter in Mumbai is sung by....

Search Engine

ముస్లిం ఇంజనీర్ మాట్లాడాడని.. మతోన్మాదంతో రెచ్చిపోయిన మహిళ
బంధాలను నాశనం చేసిన నేటి వ్యవస్థ.. ఆర్థిక బంధాలకే ప్రాధాన్యం..!
Long live the national truck driversʹ strike!
గుర్రంపై ఊరేగుతున్న దళిత పెండ్లి కొడుకుపై అగ్రకులస్థుల దాడి
చెడ్డీ గ్యాంగ్ బరి తెగింపు.. లౌకికవాదులపై అనుచిత వ్యాఖ్యలు
సినిమాల్లో ʹస్త్రీʹ పాత్ర మారుతోంది..!
రాజ్యమే కుట్ర చేస్తే...
ఉద్యమ స్పూర్తి రగిలించిన ʹచేʹ
ఇదో దుర్మార్గం.. మతోన్మాదం ఒక ఆడపిల్లని పిచ్చిదానిలా చిత్రించింది..!
ఈ హత్యలకు అంతే లేదా..?
Bengaluru techie arrested for Maoist links
ఇక్కడ కవిత్వం కూడా తీవ్రవాదమేనా..?
Leftist Publisher Shot Dead as Blogger Deaths Return to Haunt Bangladesh
ʹదుర్గాప్రసాద్‌ను మధ్యాహ్నంలోగా కోర్టులో హాజరుపరచాలిʹ
ప్రధాని మోడీపై హత్యకు కుట్ర నిజంగానే జరిగిందా..?
పేదవాడి నిజమైన సమస్యను చర్చించిన ʹకాలాʹ..!
వరవరరావుపై ప్రభుత్వం కుట్ర.. ప్రజా, హక్కుల సంఘాల అణచివేతలో భాగమే - విరసం
ʹమోడీ హత్యకు కుట్రʹ అనేది ఓ బూటకం.... ప్రజా ఉద్యమాలను అణచడానికి పాలకులాడే నాటకం
రాజకీయ నాయకులా..? వీధి రౌడీలా..?
హక్కుల కార్యకర్తల అక్రమ అరెస్టులపై దేశవ్యాప్త నిరసనలు
పౌర హక్కుల నాయకుల అక్రమ అరెస్టుపై వెల్లువెత్తుతున్న నిరసన
భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల‌ అక్రమ అరెస్టు
Maharashtra Governmentʹs terror trail to protect HINDUDTVA TERRORISTS
నేటి భారతదేశం : ఆడపిల్లలకే కాదు.. ఆడపిల్ల తండ్రికి కూడా రక్షణ లేదు..!
తిరుమలలో పోగుబ‌డ్డ ఆస్తులెవరివి ?
more..


హత్యాయత్నం