మనిషిని వెతుక్కుంటూ అతను వెళ్ళి పోయాడు...

అది... ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) క్యాంపస్. వసతి గృహాలకు దూరంగా... దట్టమైన చెట్లపొదలు. ఓ చెట్టు కొమ్మకు ఏవో ప్లాస్టిక్ సంచులు వేలాడుతున్న‌యి. చెట్టు కింద... నిండా కంబలి కప్పుకొని నిద్రిస్తున్న మనిషి ఒకరు. పక్కన ఖాళీ సిగరేట్ పెట్టెలు. పక్షుల కిచకిచ శబ్ధాల నడుమ అతను నిద్రలేచాడు. ముడతలు పడిన శరీరం.... మురికి బట్టలు... బక్కపలచని దేహం. అతను గడిచిన మూడు దశాబ్ధాలుగా ఆ చెట్టు కిందే జీవిస్తున్నాడు. పేరు రాం శంకర్ యాద‌వ్‌(విద్రోహి). వయసు 50ఏళ్లపైనే ఉంటుంది. విద్యార్థులు ఉండే విశ్వవిద్యాలయంలో ఇతనేం చేస్తున్నాడనుకునేరు. ఆయన నిరంతర విద్యార్థి. 80ల్లో విద్యార్థిగా విశ్వవిద్యాలయంలో అడుగుపెట్టాడు. జీవితమంటే చదువొక్కటే కాదు... పోరాటం కూడా అని నమ్మాడు. చివరి వరకూ న‌మ్మిన‌దాన్నే ఆచరించాడు. అవును... ఆ విద్యాలయంతో మూడు పదుల అనుబంధాన్ని చాలించుకొని డిసెంబ‌ర్ 8న‌ తుదిశ్వాస విడిచాడు.

విద్రోహి సాధారణ విద్యార్థి మాత్రమే కాదు.. అతనో కవి.. సాంస్కృతిక కార్యకర్త. క్యాంపస్ లోప‌ల, బయట... ఎక్కడ ఏ పోరాటం జరిగినా అక్కడ ప్రత్యక్షమవుతాడు. కవితా ప్రవాహాన్ని వెంట మోసుకెళ్తాడు. అలుపెరగని ఆ కవితాఝురికి ʹబ్రెయిన్ డెడ్ʹ బ్రేక్ వేసింది.

అతని కవిత్వం.. వివక్షను సవాల్ చేస్తుంది. సమాజపు వెకిలితనాన్ని వెక్కిరిస్తుంది. అవును.. కుల, మత, లింగ అణచివేతకు వ్యతిరేకంగా అతను కవితాగానం చేస్తాడు. ʹఆమెʹ కన్నీటిని ఆవేదనపూరితంగా ఆలపిస్తాడు. కుల వ్యవస్థను నిలదీస్తాడు. శ్రమజీవితాల్ని కీర్తిస్తాడు.

ఎక్ ఔర‌త్ కి జ్వ‌లీ హుయి లాష్ క‌విత‌లో...
ʹప్ర‌తి నాగ‌రికత పునాది మీద కాలిన ఒక స్త్రీ శ‌వం ఉంది
ఇంకా చెదిరిన మాన‌వ ఎముక‌లు
ఆ శ‌వం త‌గ‌ల‌బ‌డ‌లేదు.. ఎవ‌రో త‌గ‌ల‌బెట్టారు
ఆ ఎముక‌లు వాటిక‌వే విరిగిపోలేదు.. ఎవ‌రో విరిచేశారు
ఆ అగ్ని దానిక‌దే రాజుకోలేదు... ఎవ‌రో రాజేశారు
ఆ యుద్ధం దానిక‌దే ఆరంభం కాలేదు.. ఎవ‌రో ఆరంభించారు
క‌విత్వం కూడా అంతే.... దాన్ని ఎవ‌రో రాశారు
ఆ క‌విత్వం ప్ర‌జ‌ల‌దైన‌ప్ప‌డు... ఆ మంటలు మ‌రింత ఎగిసిప‌డ‌తాయి
న‌న్ను ఆ మంట‌ల నుంచి కాపాడ‌మ‌ని అడుగుతున్నాను ప్ర‌జ‌లారా

మీరు న‌న్ను కాపాడండి
ఈ నెత్తుటి పిర‌మిడ్ల నుంచి
ఈ గోడ‌లు, ఈ స్మార‌క క‌ట్ట‌డాల నుంచి న‌న్ను కాపాడండి
ఎందుకంటే... న‌న్ను కాపాడితే ఆమెను కాపాడిన‌ట్లే
ఎవ‌రి శ‌వ‌మైతే మొహంజ‌దారో చెరువు అంచున ప‌డివుందో
ఆమెను కాపాడిన‌ట్లే ... ʹ అంటాడు.

ఆయ‌న ప్ర‌జా క‌వి. జ‌న జీవిత‌పు క‌ష్ట సుఖాల్ని త‌న క‌విత్వంలోకి ఒంపి.... గానం చేస్తాడు. క్యాంటీన్‌లో చాయ్ తాగుతూ... మ‌ధ్య మ‌ధ్య‌లో గుప్పు గుప్పున ఓ సిగ‌రేట్ కాల్చేసి త‌న క‌వితాలోకంలో మునిగిపోతాడు. క్యాంప‌సే అత‌ని ప్ర‌పంచం. బాదిత ప్ర‌జ‌లు, వాళ్ల పోరాటాలే అత‌ని క‌వితా వ‌స్తువులు. చ‌రిత్ర‌ను త‌వ్వి తోడి దోషిగా నిల‌బెడ‌తాడు. ʹఅది భార‌త్ కావ‌చ్చు... బ్రిట‌న్ కావ‌చ్చు... అమెరికా కావ‌చ్చు... ఇరాన్ కావ‌చ్చు. రాజ్యం ఎక్క‌డైనా... రాజ్య‌మే. ప్ర‌జ‌ల ప‌ట్ల అది క‌ర్క‌షంగానే ఉంటుందిʹ అంటాడు.

అత‌ని క‌విత్వంలో కాలానికి హ‌ద్దులు లేవు. అత‌డు... మొహంజోదారో నుంచి ఆధునిక కాలం దాకా ప్ర‌యాణం చేస్తాడు. మాన‌వ స‌మాజ ప‌రిణామ‌క్ర‌మం నుంచి ఎక్క‌డైనా.. ఎప్పుడైనా అణ‌చివేయ‌బ‌డిన స‌మూహం ప‌క్షమే అత‌డు. దేశ విభ‌జ‌న‌పై రాసిన‌ ʹనూర్ మియాన్ కా సుర్మాʹ అనే తన కవితలో.... ʹమాకు కొత్త ప్రపంచం కావాలి... ఎక్కడ మనిషి మనిషిగా జీవించగలడో... మాట్లాడగలడో... సహించగలడో... అలాంటి ప్రపంచం కావాలిʹ అంటాడు. రోజువారి వ్య‌వ‌హారిక ప‌ద‌బంధాల‌తోనే బ‌ల‌మైన క‌విత్వాన్ని అల్ల‌డం అత‌ని ప్ర‌త్యేక‌త‌. జ‌ల‌పాతంలాంటి మాట‌ల ప్ర‌వాహంలో మ‌న‌ల్ని ముంచెత్తుతాడు.

తనదైన ప్రత్యేక శైలితో విద్యార్థుల ప్రేమను చూరగొన్న కవి అతను. తానెప్పడు కలం పట్టుకొని కవిత్వం రాసి ఎరగడు. ఏ క్యాంటీన్ దగ్గరో... ఏ నిరసనలోనో తాను ప్రవాహమై కనిపిస్తాడు. ఆసువుగా కవిత్వం కురిపిస్తాడు. 2011లో నితిన్ పమ్నాని విద్రోహిపై రూపొందించిన ʹమై తుమ్హారా కవి హూ..ʹ అనే డాక్యుమెంటరీ చిత్రం విద్రోహీ జీవితాన్ని, కవిత్వాన్ని కళ్లకు కట్టింది. 42 నిమిషాల ఈ చిత్రం.. విద్రోహి ఆలోచనల లోతును పట్టిస్తుంది. కవితా ప్రపంచంలోకి మనల్ని నడిపిస్తుంది. వాస్తవాన్ని నిర్భయంగా ప్రకటించే ధైర్యాన్నిస్తుంది. ప్రపంచాన్ని తడిమి చూపిస్తుంది. వీలైనంత విలాసంగా బతకాలనుకునే మధ్యతరగతి నడమే ఇలాంటి మనుషులు కూడా ఉన్నారని గుర్తుచేస్తుంది.

1983లో విద్రోహి విద్యార్థి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న కారణంగా యూనివర్సిటీ నుంచి రెస్టికేట్ అయ్యాడు. కానీ అతను క్యాంపస్ వదిలి వెళ్లలేదు. ʹనా ఆత్మ ఇక్కడే ఉంది. నా ప్రేక్షకులూ ఇక్కడే ఉన్నారుʹ అంటూ తాను అక్కడే ఉండిపోయాడు. అతనికి క్యాంపస్లో ప్రతి ఒక్కరూ పరిచయం. విద్యార్థులు, అధ్యాపకులు అతనికి ఎంతో కొంత సాయం చేస్తుండేవారు. అలా క్యాంపస్నే తన ప్రపంచంగా మార్చుకున్న విద్రోహి... చాయ్, సిగరేట్, ప్రొయెట్రీతో.... ఎన్ని వేల రాత్రులు గడిపాడో అక్కడ. ఎన్నెన్ని హృదయాల్ని తట్టిలేపాడో. అలాంటి ఉద్యమ కవిని కోల్పోవడం నిజంగా బాధాకరం. కవీ... నీ జ్ఞాపకం శాశ్వతం. నీ గానం అజరామరం.
- క్రాంతి

Keywords : I am your poet, vidrohi, jawaharlal nehru university, Delhi
(2024-04-24 22:11:41)



No. of visitors : 5760

Suggested Posts


Solidarity with the women complainants of SRFTI,JNU in their fight against sexual harassment

On behalf of JNUSU and undersigned organizations we extend our solidarity and revolutionary greetings to the women complainants of SRFTI Kolkata, who have been fighting against cases

పోలీసుల దుర్మార్గం - విద్యార్థులు, ప్రొఫెసర్లపై దుర్మార్గమైన దాడి.. ఫోటోలు తీసిన‌ మహిళా జర్నలిస్టుకు లైంగిక వేదింపులు

విద్య ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, విద్యార్థినులపై లైంగికవేధింపులకు పాల్పడుతున్న‌ ప్రొఫెసర్‌ అతుల్‌ జోహ్రీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులు చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌పై పోలీసులు దుర్మార్గంగా విరుచుకుపడ్డారు.

దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య మరో ఏడుగురు కశ్మీరీ విద్యార్ధులపై రాజద్రోహం కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన చార్జ్ షీట్ ను కోర్టు తిరస్కరించింది.

జ‌నం ప‌క్షాన నిల‌బ‌డ్డవాడు దేశ‌ద్రోహి అయ్యాడా : ఉమ‌ర్ ఖలీద్ తండ్రి ఎస్‌క్యూఆర్ ఇల్యాసీ

ఏ మ‌నిషి త‌న జీవిత‌మంతా దేశం కోసం ఆలోచించాడో... ఏ మ‌నిషి ద‌ళితుల కోసం, ఆదివాసీల కోసం నిల‌బ‌డ‌డ్డాడో... ఏమ‌నిషి దేశం కోసం ప‌నిచేయాల‌ని విదేశీ స్కాల‌ర్‌షిప్ ని సైతం వ‌దులు కున్నాడో... ఏమ‌నిషైతే పాస్‌పోర్ట్ కూడా తీసుకోలేదు.. ఇప్పుడా మ‌నిషి పాకిస్తాన్‌కి వెళ్లాడ‌ని నింద‌లు వేస్తున్నారు. ఏ మ‌నిషి ద‌ళితుల ప‌క్షాన పోరాడుతున్నాడో... ఏ మ‌నిషి రైతుల కోసం..

జేఎన్యూ పై మళ్ళీ ఎర్రజెండా రెపరెపలు... విద్యార్థి సంఘం ఎన్నికల్లో లెఫ్ట్ ఘనవిజయం

ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీపై మళ్ళీ లెఫ్ట్ ఫ్రంట్ తన జెండా ఎగిరేసింది. పాలకుల మద్దతుతో సంఘీల విద్యార్థి సంఘం ఏబీవీపీ చేసిన కుట్రలను ఓడించిన జేఎన్యూ విద్యార్థులు మళ్ళీ SFI, DSF, AISA, AISF లతో కూడిన లెఫ్ట్ ఫ్రంట్ నే గెలిపించారు.

JNUపై 50 మంది ముసుగులు ధరించిన గూండాల దాడి,విద్యార్థులు,ప్రొఫెసర్లకు తీవ్ర గాయాలు - ఇది ఏబీవీపీ పనే అని విద్యార్థుల ఆరోపణ‌

ఢిల్లీలోని జవహర్ లాల్ యూనివర్సిటీలోకి చొరబడి 50 మంది ముసుగులు ధరించిన గూండాలు జేఎన్యూ విద్యార్థులపై, ప్రొఫెసర్లపై రాడ్లతో, కర్రలతో, రాళ్ళతో దుర్మార్గమైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అనేక మంది తీవ్ర గాయాలయ్యాయి.

Proud of Kanhaiya, Khalid, Anirban, says Prof Saibaba

ʹI am proud of my students Kanhaiya Kumar, Umar Khalid and Anirban Bhattacharya, who are striving for the people of the countryʹ beamed alleged naxal think-tank Prof G N Saibaba...

A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet

the people of the country have been dealing with these sanghi Thugs of Hindustan long enough now. Itʹs been five years, nearly. They know by now that it would be raining lies as it gets closer to the elections

ʹఈ రోజు నా కూతురిపై దాడి జరిగింది... రేపు మీ పైనా జరుగుతుందిʹ

ʹఈరోజు నా కూతురిపై దాడి జరిగింది. రేపు మిమ్మల్ని కూడా కొడతారు. నాపై కూడా దాడి జరగొచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులు పొంచి ఉన్నాయి. మాకు చాలా భయంగా ఉందిʹ అంటూ జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఆయిషీ ఘోష్‌ తండ్రి ఆందోళన వ్యక్తం చేశారు.

మీడియా దుర్నార్గం: జేఎన్యూ విద్యార్థి ఐసిస్ సింపతైజర్ అని మొదటిపేజీలో.. అది ఫేక్ న్యూస్ అని లోపలి పేజీల్లో..

మీడియా ద్వారా సంఘ్ పరివారం మరో నీచమైన కుట్రకు తెరలేపింది. నజీబ్ వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. జీ టీవీ , టైమ్స్ ఆఫ్ ఇండియా మరికొన్ని మీడియా సంస్థలు నజీబ్ గురించి అబద్దపు కథనాలు ప్రచురించి బురదచల్లే ప్రయత్నం చేశాయి. లేని పోలీసు రిపోర్ట్ ను ఉన్నట్టు నమ్మించే ప్రయత్నం చేశాయి....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మనిషిని