ఆ చిన్నారి గాయాల వల్లే మరణించింది - కేంధ్రానికి షాకిచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్
ఢిల్లీలో షాకూర్ బస్తీ కూల్చివేతల్లో మరణించిన చిన్నారి తీవ్ర గాయాలవల్లనే చనిపోయిందని పోస్ట్ మార్టం రిపోర్ట్ స్పష్టం చేసింది. చిన్నారి మరణం ఇళ్ల కూల్చివేత కంటే ముందే జరిగిందని పార్లమెంటులో కేంధ్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో పోస్ట్ మార్టం బహిర్గత పర్చిన నిజాలు అటు కేంధ్రప్రభుత్వానికి ఇటు రైల్వే, రెవెన్యూ శాఖ అధికారులకు షాక్ కల్గించాయి. తీవ్ర గాయాల వల్లే చిన్నారి మరణించిందని ఢిల్లీ సంజయగాంధీ ఆస్పత్రి వైద్యులు ఇచ్చినపోస్ట్ మార్టం నివేదిక తేల్చి చెప్పింది. దీంతో కూల్చివేతలకు, చిన్నారి మరణానికి సంబంధం లేదని ప్రకటించిన మంత్రివర్యులు, రైల్వేశాఖ అధికారులు ఇరకాటంలో పడ్డారు.
షాకూర్ బస్తీ కూల్చివేతల్లో మరణించిన చిన్నారి మృతదేహానికి మంగళవారం పోస్ట్ మార్టం పూర్తయింది. సంజయ్ గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ నిపుణుల వైద్య బృందం తన నివేదికను సమర్పించింది. చిన్నారి తలకు బలమైన గాయమైందని అలాగే రెండు నుండి నాలుగు పక్కటెముకలు విరిగిపోయాయని తెలిపింది. తీవ్ర రక్తస్రావం జరిగినట్టుగా తమ పరీక్షలో తేలిందని, పాప చనిపోయి సుమారు 30 గంటలు అవుతుందని తన నివేదికలో పేర్కొంది. ఛాతీ, తలపైన తీవ్ర గాయాలు, రక్తస్రావం, షాక్ వల్ల పాప చనిపోయివుండవచ్చని అభిప్రాయపడింది.
కాగా ఈ ఘటనపై మరోవైపు ఢిల్లీ హైకోర్టు కూడా సీరియసయ్యింది. గడ్డకట్టకుపోయే చలిలో పేదల నివాసాలను కూల్చడం అన్యాయమని న్యాయస్థానం ఆక్షేపించింది. ఈ వ్యవహారంలో అధికారులందరూ కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. జాతీయ మావనహక్కులు సంఘం ఢిల్లీ ప్రభుత్వానికి, రైల్వే బోర్టుకు నోటీసులు జారీ చేసింది.
Keywords : Central Government, demolish, postmortem, blunt force, toddler death, suresh prabhu,
(2019-02-16 19:43:26)
No. of visitors : 1245
Suggested Posts
| ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు.... |
| లెనిన్ ఎవరూ..!?భగత్‌సింగ్ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్ యూనియన్ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్ రిపబ్లిక్ అసోషియేషన్ʹ |
| కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడిఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.... |
| నా బిడ్డకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు - నిర్భయ తండ్రిʹʹనా బిడ్డకు న్యాయం జరగ లేదు., జరుగుతుందన్న నమ్మకం కూడా లేదుʹʹ ఇవి మూడేళ్ల క్రితం సామూహిక అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయిన ʹనిర్భయʹ తండ్రి దుంఖంతో అన్నమాటలు. ఈ దారుణం జరిగి మూడేళ్లయినా నిందితుల్లో ఇంకా నలుగురికి ఉరిశిక్ష అమలుచేయలేదని, మరో నిందితుడిని త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని..... |
| ఏబీవీపీకి భయపడను - అమర జవాను కూతురుʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్.... |
| ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. |
| ఈ దేశం మతోన్మాదులదేనా ? మనుషులకు బతికే హక్కులేదా?గుర్మెహర్ పై కాశాయ కసాయి మూకలు నీచమైన దాడి చేస్తున్నాయి రేప్ చేస్తామంటూ బెధిరించారు..అయినా సరే తన నిరసనను కొనసాగిస్తానని ప్రకటించిన గుర్మెహర్ కౌర్ చివరకు కేంధ్రమంత్రులు కూడా ఏబీవీకి మద్దతుగా ఆ అమ్మాయిపై దాడికి దిగడంతో .తన నిరసనను ఇక్కడితే ఆపేయనున్నట్లు... |
| Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ. |
| మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్‌యూ ప్రత్యేకత - ఉమర్ ఖలీద్మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. |
| ʹప్రేమను పంచే తండ్రిని ఇవ్వలేను.. కాని సోదరుడిని ఇవ్వగలనుʹకాశాయ కసాయి మూకల ముప్పేట దాదిని ఎదుర్కొంటున్న లేడీ శ్రీరాం కాలేజ్ విద్యార్థిని , కార్గిల్ యుద్దంలో అమరుడైన జవాను కూతురు గుర్మెహర్కౌర్ కు ప్రజలు, ప్రజాస్వామికవాదులనుండి మద్దతు... |
| రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
|
| బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
|
| కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి || |
| కలత నిద్దురలోనూ దండకారణ్యమే |
| బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
|
| చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వాలి |
| వీవీ, గాడ్లింగ్ లపై మరో తప్పుడు కేసు - ఖండించిన విరసం |
| వరవరరావు, గడ్లింగ్ ల మీద మరొక అబద్ధపు కేసు
|
| stand against the threat of imminent arrest of Prof. Anand Teltumbde - Students, Faculty and Alumni of IIT Kharagpur |
| Health of imprisoned DU Professor G.N. Saibaba is seriously deteriorating |
| Drop the false charges against Prof. Anand Teltumbde Immediately: Trade Unions |
| ఆపరేషన్ సమాదాన్ కు నిరసనగా భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించిన మావోయిస్టులు...31న బంద్ కు పిలుపు |
| రిపబ్లిక్ డే ఉత్సవాలను బహిష్కరించిన ఈశాన్య రాష్ట్రాలు |
| పుణె కోర్టులో నాలుగోసారి కలలూ కన్నీళ్లూ |
| నల్గొండలో... ఫిబ్రవరి 9,10 తేదీల్లో విరసం సాహిత్య పాఠశాల |
| COSTISA demands quashing of fabricated FIR against Prof. Anand Teltumbde! |
| దేశద్రోహం కేసు : JNU విద్యార్థి నేతలపై చార్జ్ షీట్ తిరస్కరించిన కోర్టు |
| Dragging Anand Teltumbde into ʹterroristʹ allegations and raiding his house is an attack on freedom of expression : Swami Agnivesh |
| మీ మద్దతు నాకిప్పుడు కావాలి - ఆనంద్ తెల్తుంబ్డే |
| Immediate and Complete Withdrawal of all Charges against Dr. Anand Teltumbde |
| ʹపాకిస్తాన్ జిందాబాద్ʹ అని అరిచింది ఏబీవీపీ విద్యార్థులే.. సంచలన వాస్తవాలు బయటపెట్టిన మాజీ నాయకులు |
| మనను ఆక్రమిస్తున్న ఈ వ్యాధిని ప్రతిఘటిద్దాం- అరుంధతీ రాయ్
|
| A Statement by Umar Khalid and Anirban Bhattacharya in the context of the Chargesheet |
| ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ ను తొలిగించడమే ఆరెస్సెస్-బీజేపీ అసలు లక్ష్యం...జిగ్నేష్ మెవాని |
more..