అరుణ్ సాగర్ అమర్ రహే !


అరుణ్ సాగర్ అమర్ రహే !

అరుణ్

సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ సాహితీ వేత్త అరుణ్ సాగర్ హఠాన్ మరణం పట్ల తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నల్స్ట్స్ యూనియన్ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. యూనియన్ అనుబంధ వీడియో జర్నలిస్టుల అసోసియేషన్, డెస్కు జర్నలిస్టుల ఫోరం, ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్, సినిమా జర్నలిస్టుల అసోసియేషన్, న్యూస్ ప్రెజెంటర్స్ అసోసియేషన్, మహిళా జర్నలిస్టుల శాఖ, ఉర్దూ జర్నలిస్టుల యూనియన్, చిన్న మధ్య తరహా పత్రికల యూనియన్, ఆన్లైన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, వీడియో ఎడిటర్స్ అసోసియేషన్, ఆన్ లైన్ జర్నలిస్ట్స్ యూనియన్ అరుణ్ సాగర్ మృతి పట్ల సంతాపం ప్రకటించాయి.
తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగం లో వినూత్న ఒరవడులకు కారకుల్లో అగ్రగామిగా నిలిచిన అరుణ్ సాగర్ మృతి మీడియా రంగానికి తీరని లోటని, ప్రజా ఉద్యమాల పట్ల అరుణ్ సాగర్ సునిశిత పరిశీలనా వైఖరి, ప్రజా పక్షపాత దృక్పథం, అణగారిన వర్గాలపట్ల ఆయన కమిట్ మెంట్ అనిర్వచనీయమైనదని, ఆయన మరణం సాహితీ రంగం తో బాటు వివిధ ఉద్యమాలను సమర్థించే శక్తులకు తీరని లోటని ఆయా జర్నలిస్టు సంఘాలు ఓ ప్రకటనలో పేర్కొన్నవి. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ప్రజా ఉద్యమ సహచరునికి నివాళులర్పించింది. అరుణ్ సాగర్ కుటుంభానికి అన్ని విధాల అండగా నిలుస్తామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) రాష్ట్ర అధ్యక్షులు, ప్రెస్ అకాడమీ చైర్మెన్ అల్లంనారాయణ, యూనియన్ ప్రధానకార్యదర్శి క్రాంతికిరణ్, ఉపాధ్యక్షులు పల్లె రవి కుమార్ ప్రకటించారు.

Keywords : arun sagar, journalist, union, death, telangana
(2019-03-24 23:26:53)No. of visitors : 1091

Suggested Posts


జర్నలిస్టులకు ఆత్మహత్యలే గతా?

ఇక్కడ ఫంక్షన్ అవడం లేదు.. వీళ్ళంతా వారంరోజులుగా నిద్రాహారాలు మాని తమ బతుకు కోసం కొట్లాడుతున్నారు. ఇంట్లో ఆకలితో పడుకున్న భార్యాపిల్లలు.... ఆరునెలలుగా జీతాలు లేక ఇంటి కిరాయీలు కట్టక సామాన్లు బైటపడేస్తామంటూ ఓనర్ల బెధిరింపులు భరిస్తూ....

పత్రికా స్వేచ్ఛపై దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల నిరసన ప్రదర్శన

పత్రికా స్వేచ్ఛపై, అసాంఘిక, సంఘ విద్రోహ చర్యలను వ్యతిరేకిస్తూ రచనలు చేసిన పాత్రికేయులపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ దేశరాజధానిలో బుధవారం జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.

ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !

మీడియా గురించి మాట్లాడుతున్నప్పుడు, కొన్ని మీడియా సంస్థలు అమ్ముడైపోతున్న తీరును బట్టబయలు చేసిన వార్తలు, కొందరు విలేకరులు ధైర్యసాహసాలతో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వార్తల నేపథ్యంలో గణేష్ శంకర్ విద్యార్థి పేరు స్మరించుకోవడం

Search Engine

The worse health deterioration of Prof G.N. Saibaba
ముస్లిం కుటుంబంపై మూక దాడి.... పాకిస్తాన్ వెళ్ళిపోండి అని బెదిరింపు
అన్నీ దోపిడీ దొంగ పార్టీలే - బూటకపు ఎన్నికలను బహిష్కరించండి : మావోయిస్టు పార్టీ
ఒక సంఘీభావ ప్రదర్శన – ఒక విచారం – ఒక ఉత్తేజం
జమ్మూ కాశ్మీర్ - ʹపండితులుʹ
పుణె తాజా నివేదిక – ఆశాభంగాలూ విద్యుల్లతలూ..!
ఈ డెడ్ బాడీలు ఉగ్రవాదులవే...ఫేక్ ఫోటోలతో అబద్దపు ప్రచారం...
యూపీలో కాశ్మీరీలపై దాడులకు తెగబడ్డ కాషాయ మూక‌
నిరుద్యోగం గురించి మాట్లాడినందుకు విద్యార్థిని చితకబాదిన ʹదేశభక్తʹ మూక‌ !
Why is the operation ʹgreen huntʹ a genocidal operation?
ఉన్మాదుల దృష్టిలో గంగూలీ కూడా దేశ ద్రోహేనా..?
లైన్ ఆఫ్ నో కంట్రోల్ - భారత మీడియా
వెనుజులా సంక్షోభానికి అమెరికా ఆజ్యం - ఎ.నర్సింహ్మారెడ్డి
భగ్న సభోత్తేజం ‍- పాణి
చత్తిస్ గడ్ ఎన్కౌంటర్ లో చనిపోయింది మావోయిస్టులు కాదు గ్రామస్తులే
మోడీ కాళ్ళు కడుగుతాడు..యోగీ దేశద్రోహం కేసు పెడతానని బెదిరిస్తాడు
కనకాభిషిక్తులు ఇనాక్‌గారు | పాణి |
సామూహిక గాయానికి 29 ఏండ్లు...
సంఘ్ పరివార్ ఆగడాలను ఖండించినందుకు విద్యార్థులపై దేశద్రోహం కేసు పెట్టిన సీపీఎం ప్రభుత్వం
బ్రెహ్ట్ అంబేద్కర్ లాగా మాట్లాడితే... గోపాల కృష్ణ గాంధీ
రాజ్యహింసను ప్రశ్నిస్తే రాజద్రోహమేనా..?
బీమా కోరేగావ్ కేసు దురుద్దేశాలతో, సాహసిక పరిశోధన లాగ జరుగుతోంది : వీవీ
కవి రూపొందిన ఒంటరి జైలు గది || పాణి ||
కలత నిద్దురలోనూ దండకారణ్యమే
బీమా కోరేగావ్ కేసు.. అంతర్జాతీయ మేధావుల బహిరంగ లేఖ
more..


అరుణ్