ఖాకీ కుట్రలపై గళమెత్తిన కలం

ఖాకీ

కరీంనగర్ జిల్లా ముత్తారం మండల సాక్షి విలేకరి పొన్నం శ్రీనివాస్‌గౌడ్‌పై అక్రమ కేసు బనాయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(TUWJ), తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ యీనియన్(TEMJU) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తప్పుడు కేసు బనాయించిన గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని 57 మండల కేంద్రాల్లోనూ విలేకరులు నిరసన తెలపడంతోపాటు తహసీల్దార్లు, ఆర్డీవోలు, పోలీసు అధికారులకు వినతిపత్రాలను సమర్పించారు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట గంటన్నరపాటు ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ నీతూప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. సాక్షి విలేకరిపై పెట్టిన అక్రమ కేసును ఎత్తివేయడంతోపాటు గోదావరిఖని ఏఎస్పీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు పసునూరు మధు మాట్లాడుతూ... సాక్షి రిపోర్టర్‌పై అక్రమ కేసు బనాయించి, అరెస్టు చేయడంలో గోదావరిఖని ఏఎస్పీ అత్యుత్సాహం ప్రదర్శించారన్నారు.

తనపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పూర్తిగా కుట్రపూరితమని శ్రీనివాస్ వేడుకున్నా, అందుకు తగిన ఆధారాలను సమర్పించినా ఏఎస్పీ వినిపించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని అన్నారు. విలేకరి పోలీసుల తప్పిదాలను ఎత్తి చూపుతున్నారనే అక్కసుతో ఎస్టీ, ఎస్టీ కేసును అస్త్రంగా ఉపయోగించుకోవడం అప్రజాస్వామికమన్నారు. శ్రీనివాస్‌గౌడ్‌కు న్యాయం జరిగే వరకు జిల్లా జర్నలిస్టులు అండగా నిలువాలని కోరారు. కేసు పూర్వాపరాలను, ఏఎస్పీ వైఖరిని డీఐజీ మల్లారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మ దృష్టికి తీసుకెళ్లడంతో ప్రెస్ అకాడమీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి పూదరి వెంకటేశ్ మాట్లాడుతూతక్షణమే పోలీసు ఉన్నతాధికారులు స్పందించి కేసుపై సమగ్ర విచారణ జరపడంతోపాటు ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ జిల్లా నాయకులు బోనాల తిరుమల్, జేరిపోతుల సంపత్, చిప్పరి వెంకట్రాజు హెచ్చరించారు. సాక్షి టీవీ జిల్లా కరస్పాండెంట్ విజేందర్‌రెడ్డి మాట్లాడుతూ... ఎటువంటి సరైన విచారణ జరుపకుండా కేసుపెట్టి, అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. గతంలో ముత్తారంలోని హోటల్ యాజమాని మల్యాల రాజయ్య భూకబ్జాలపై శ్రీనివాస్‌గౌడ్ పలుమార్లు వార్తా కథనాలు రాశాడని, దానిని మనసులో పెట్టుకున్న రాజయ్య కక్షగట్టి తన వద్ద పనిచేసే మీనుగు రాములు చేత అక్రమ కేసు పెట్టించాడని అన్నారు. కేసుపై సమగ్ర విచారణ జరిపించి శ్రీనివాస్‌గౌడ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

మరో వైపు శ్రీనివాస్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జిల్లావ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్ల ముందు జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాలు నిర్వహించారు. అనంతరం అక్రమ కేసు ఎత్తివేయాలని ఎస్‌హెచ్‌వోలతోపాటు స్థానిక తహసీల్దార్లు, ఆర్డీవోలకు వినతిపత్రాలు అందజేశారు. మంథనిలో పోలీసుల తీరును నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

Keywords : journalists, TUWJ, Karimnagar, dharna, arrest, TEMJU
(2024-03-11 01:50:37)



No. of visitors : 1312

Suggested Posts


రాక్షస పోలీసులు.... దళిత మహిళను నడి రోడ్డు మీద బట్టలూడదీసి కొట్టారు

తమ ఇంట్లో దొంగతనం జరిగింది చర్య తీసుకోండంటూ వచ్చిన ఓ దళిత కుటుంభంతో పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తించారు. స్టేషన్ బైటికి గుంజుకొచ్చి నడి రోడ్డు మీద భార్య భర్తల బట్టలు ఊడదీసి కొట్టారు. ఉత్తరప్రదేశ్ లోని దన్ కౌర్ పోలీసు స్టేషన్ పరిదిలో సునీల్ గౌతమ్

డేరింగ్ కానిస్టేబుల్ !

ఆ కానిస్టేబుల్ సాహసానికి సెల్యూట్ చేయాల్సిందే ! అతను 20 అడుగుల ఎత్తున్న బ్రిడ్జ్ పై నుంచి దూకి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడాడు. అందుకోసం ఆయన తన ప్రాణాలగురించి కూడా ఆలోచించలేదు.

వాట్సప్ అడ్మిన్ లూ... జర జాగ్రత్త !

వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేయడం, దానికి అడ్మిన్ గా ఉండటం, అందులో ఫ్రెండ్స్ అందరినీ చేర్చడం చాలా మందికి ఇష్టం. అయితే అడ్మిన్ గా ఉండటం అంత ఈజీ కాదు....

వాళ్ళు పోలీసులు....!

కొందరు తాగితే మనుషులు కాదు.... కొందరికి కోపమొస్తే మనుషులు కాదు.... కానీ వీళ్ళు యూనిఫామ్ తొడిగితే మనుషులు కాదు. వాళ్ళ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు.....

యజమానురాలి అక్కసు... పోలీసుల కర్కషత్వం... ఓ యువతిపై థర్డ్ డిగ్రీ

తన ఇంట్లో పని మానేసినందుకు ఓ యజమానురాలికి పని మనిషిపై కోపమొచ్చింది. అమెను తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేసింది. పోలీసులేమో తమ చేయి దురద తీర్చుకునేందుకు ఓ మనిషి దొరికిందనే పైశాచికానందంలో ఆ పని మనిషిని చితకబాదారు.....

HCU విద్యార్థినులను అత్యాచారం చేస్తామని బెధిరించిన పోలీసులు - నిజ నిర్దారణ కమిటి రిపోర్ట్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో వర్శిటీలో నిరసనలు జరుగుతున్న వేళ, వాటిని అణచి వేయడమే లక్ష్యంగా విరుచుకుపడ్డ పోలీసులు విద్యార్థినులపై అత్యాచారం చేస్తామని బెదిరించారని, యువతులను ఇష్టానుసారం....

మానవ మృగాలు !

కామంతో కళ్లు మూసుకుపోయిన ముగ్గురు కీచకులు ఓ దళిత యువతి (20)ని చెరబట్టారు.. అన్నా... దండం పెడతా.. కాళ్లు మొక్కుతా.. నన్ను వదిలిపెట్టండి.. లేకుంటే నేను చచ్చిపోతా.. అని దీనంగా వేడుకున్నా....

మృత దేహం మెడకు తాడు కట్టి ఈడ్చుకెళ్ళిన పోలీసులు !

సీసీ ఫుటేజ్ ద్వారా బయట పడ్డ బీహార్ పోలీసుల అమానుషత్వం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బీహార్ వైశాలి జిల్లాలో గల గంగానదిలో తేలిన ఓ వ్యక్తి శవాన్ని గుర్తించిన గ్రామస్థులు బాడీని బయటకు....

రామోజీ హోటల్ పేకాట స్థావరం !

ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు కు చెందిన హోటల్ జూదగాళ్ళకు అడ్డాగా మారిందా ? కొంత కాలంగా ఆ హోటల్లో పేకాట జోరుగా సాగుతోందా ? పోలీసు వర్గాలు అవుననడమే కాదు మంగళవారం నాడు ఆహోటల్ పై దాడి చేసి...

హింసా రాజ్యం !

నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా ఒక ముసలి అతన్ని గూండాలు కర్రలతో కొట్టి చంపారు. అహమ్మదాబాద్ లో ఓ ఎనిమిదిమంది యువ గూండాలు ఓ పాన్ షాప్ దగ్గరకు వెళ్లి అక్కడ తమకు కావల్సిన....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఖాకీ