నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు


నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నక్సల్బరీ

భారత్ సహా ప్రపంచ చరిత్రలో కమ్యూనిస్టులు మరిచిపోలేని నాలుగు ముఖ్య చరిత్రాత్మక ఘట్టాలున్నాయని, ఈ ఘట్టాల వార్షికోత్సవాలను పురస్కరించుకొని మార్క్సిజం-లెనినిజం-మావోయిజానికి మావోయిస్టులందరు పునరంకితం కావాలని సీపీఐ (మావోయిస్టు) సెంట్రల్ కమిటీ తరఫున ప్రధాన కార్యదర్శి గణపతి బహిరంగ లేఖలో ప్రజలకు, పార్టీ కాడర్ కు పిలుపునిచ్చారు.

చైనాలో అర్ధ భూస్వామ్య, అర్ధ పెట్టుబడిదారి వ్యవస్థకు తిలోదకాలిచ్చి కమ్యూనిస్టు పాలనకు తెరలేపిన గొప్ప శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం (గ్రేట్ ప్రొలిటేరియన్ కల్చరల్ రెవెల్యూషన్-జీపీసీఆర్) 50వ వార్షికోత్సవాన్ని, భారత్లో ఉవ్వెత్తున ఎగిసిపడిన నక్సల్బరీ సాయుధ పోరాటం 50వ వార్షికాత్సవాన్ని, ప్రపంచాన్నే కుదిపేసిన రష్యా సోషలిస్ట్ విప్లవం శతవార్షికోత్సవాన్ని, కాలం ప్రసవించి కారల్ మార్క్స్ కని రెండు శతాబ్దాలు అవుతున్న సందర్భమే ఈ నాలుగు ప్రధాన చరిత్రాత్మక ఘట్టాలని, ఈ వార్శికోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవాన్ని, 50వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది మే 16వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు (గడిచిపోయిన కాలం), దేశంలో నక్సల్బరి సాయుధ తిరుగుబాటు 50వ వార్షికోత్సవాన్ని వచ్చే ఏడాది 23మే నెల నుంచి మే 29వ తేదీ వరకు, రష్యా సోషలిస్టు విప్లవం శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది నవంబర్ ఏడు నుంచి 13వ తేదీ వరకు, కారల్ మార్క్స్ ద్విశత జయంతిని పురస్కరించుకొని 2018, మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ ప్రజా సంఘటిత కార్యక్రమాలను నిర్వహించాలని మావోయిస్టు నేత గణపతి పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల తాను సూచించిన తేదీల్లో వార్షిక వారోత్సవాలను నిర్వహించడం కుదరకపోతే అనువైన తేదీల్లో నిర్వహించాలని ఆయన సూచించారు.

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు. దేశంలో జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రంగాలను శక్తులను కూడగట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ విప్లవ‌ లక్ష్యానికి దూరం వెళ్లకూడదని చెప్పారు. విప్లవాన్ని ఏదోరకంగా సమర్ధించే శక్తులతోనే మమేకం కావాలని అన్నారు.

నేడు ప్రపంచవ్యాప్తంగా నయా పెట్టుబడిదారి విధానం రాజ్యమేలుతున్న కారణంగా ప్రజల్లో అసహన పరిస్థితులు, కొన్ని చోట్ల తిరుగుబాటు పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. కమ్యూనిజానికి, సోషలిస్టు విప్లవాలకు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి సమాజం దుష్ర్పచారం సాగిస్తోందని, తాను చెప్పిన నాలుగు కమ్యూనిస్టు చారిత్రక ఘట్టాలను పురస్కరించుకొని ఎదురుదాడికి దిగాలని ఆయన సూచించారు. మేధోపరంగా, రాజకీయంగా, ప్రజా ఉద్యమాలపరంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

Keywords : ganapati, maoists, marxism, naxalbari, naxalite, china, revolutuion
(2020-03-28 14:58:37)



No. of visitors : 11721

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

Search Engine

ʹఈ సామాజిక దూరం నాకేమీ కొత్తది కాదుʹ
వలసకూలీలపై పోలీసుల అమానుషం...క్షమాపణ చెప్పిన అధికారులు...కానిస్టేబుల్ డిస్మిస్!
పాటించాల్సింది సామాజిక దూరం కాదు, భౌతిక దూరం మాత్రమే!
లాక్ డౌన్ ఎఫెక్ట్: పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. యువకుడి మృతి !
చింత గుప్ప ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ఆడియో ప్రకటన ..అమరుల అంత్యక్రియల ఫోటోలు విడుదల‌
ఈ పిల్లవాడి కన్నీళ్ళను తుడిచేవాళ్ళు కావాలి !
కరోనా: కనిపించని విషాదాలెన్నో
కరోనా: వైద్య సిబ్బందికి ʹపర్సనల్‌ ప్రొటెక్షన్ ఎక్వీప్‌మెంట్ʹ కొనివ్వలేని స్థితిలో ఉందా మన ప్రభుత్వం ?
అతడూ అర్బన్ నక్సలైటే
మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
ఒకవైపు జనతా కర్ఫ్యూ .... షాహీన్ బాగ్ నిరసన ప్రదేశంలో పెట్రోల్ బాంబులతో దాడి
FREE ALL POLITICAL PRISONERS OF CONSCIENCE
కరోనా వైరస్: అపోహలు - నిజాలు ... డాక్టర్ ప్రశ్నలు, జవాబులు
ఉరి శిక్షలను ఆపేయండి - ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్యసమితి పిలుపు!
CPI Maoist Unleash Propaganda Offensive Against Policies Of Fascist Modi Government
CAA,NRC,NPRలకు వ్యతిరేకంగా ఒడిషాలో 402 గ్రామాల‌ తీర్మానం
పేరుకోసం, పదవుల కోసం తనపై తానే దాడి చేసుకున్న ʹహిందూ మక్కల్ కచ్చిʹ నాయకుడు
గొగోయ్ ని రాజ్యసభకు నామినేట్ చేయడంపై ʹసుప్రీంʹ లో పిల్ దాఖలు చేసిన మోడీ మద్దతుదారు
కోవిడ్ కాదు కోవింద్.. గోగోయ్ రాజ్యసభ సీటుపై టెలీగ్రాఫ్ సంచలన కథనం .. పీసిఐ నోటీసులు
ఆవుమూత్రం తాగి ఆస్పత్రిపాలైన వ్యక్తి... మూత్రాన్ని పంచిన బీజేపీ నేతను అరెస్టు చేసిన పోలీసులు
రంజన్ గోగోయ్ తుచ్ఛుడే, మరి మీరేం చేస్తున్నారు మిలార్డ్ - మార్కండేయ కట్జూ
క్విడ్ ప్రో క్వో !
సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుల ఫోటోలతో పోస్టర్లు - సుప్రీంకోర్టులో యూపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ‌
స్వాతంత్ర్య సమర యోధుడు, గాంధేయవాదిపై బీజేపీ దుర్మార్గ దాడి !
CAA,NRC నిరసనలు: జాతీయబ్యాంకుల నుండి తమ డిపాజిట్ లను ఉపసంహరించుకుంటున్న ఖాతాదారులు
more..


నక్సల్బరీ