ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు
గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.
మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో జూన్ 18 న జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని ఆయన ఆరోపించారు. ఇన్ఫార్మర్ ఇచ్చిన సమాచారంతో తెలంగాణ గ్రేహౌండ్స్, మహారాష్ట్రా సీ6 బలగాలు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ లో జిల్లా కమిటీ సభ్యుడు కామ్రేడ్స్ చార్లెస్, ఏరియా కమిటీ సభ్యుడు ముఖేష్, దినేష్ లను చుట్టుముట్టి కాల్చిచంపారని, పార్టీ పనిమీద వెళ్తున్న ముగ్గురు సభ్యులతో కూడిన టీంను అరెస్టు చేసే అవకాశమున్నప్పటికీ నిరాయుధయులపై వందలాది మంది బలగాలు చుట్టుముట్టి ఏకపక్షంగా కాల్పులు జరిపి హత్య చేశారని జగన్ మండిపడ్డారు. ఈ బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న అన్నివర్గాల ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, వ్యాపార సంస్థలు సంపూర్ణ బంద్ ని పాటించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ʹʹకామ్రేడ్స్ చార్లెస్, ముఖేష్, దినేష్ లు సామ్రాజ్యవాదులు, భూస్వామ్యులు, పెట్టుబడిదారుల ప్రయోజనాలను ఈడేర్చుతున్న ప్రభుత్వ… విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసినారు. పాలకులు ఆదివాసీలను అంతం చేయడమే వారి విధానంగా దాడులకు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే సుక్మా జిల్లా గుంపాడు గ్రామానికి చెందిన ఆదివాసీ యువతిపై అత్యాచారం చేసి హత్య… చేసి, ఆలీవ్ గ్రీన్ దుస్తులు తొడిగి శవాన్ని కాల్చి ఎన్ కౌంటర్ కట్టుకథ అల్లారుʹʹ అని జగన్ పేర్కొన్నారు.
ʹʹఅడవినే నమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్న ఆదివాసీలు జల్ – జంగల్ – జమీన్ – ఇజ్జత్ కోసం తమ జీవితమే యుద్ధంగా ఆయుధాన్ని పట్టుకొని పోరాడుతున్నారు. కామ్రేడ్స్ చార్లెస్, ముఖేష్, దినేష్ లు కూడా ఆదివాసీలే. ఆదివాసీల మనుగడ కోసం సాయుధమై పోరాడుతున్నారు. ఆదిలాబాద్ లో ఆదివాసీల సంపదను కొల్లగొట్టడానికి, ఆదివాసీలను అడవి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నంలో భాగంగానే కవ్వాల్ టైగర్ జోన్ ప్రాజెక్టు, గోదావరి నదిపై భారీనీటి ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఆదివాసీలను నిర్వాసితులను చేస్తూ అడవులను, గుట్టలను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆ ఆదివాసీ యువకులు ప్రజలను సంఘటితం చేస్తున్నందుకే వాళ్లను టార్గెట్ చేసి నిరాయుధులైన మా సభ్యులను విచక్షణా రహితంగా కాల్పులు జరిపి చంపివేశారు. తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వం మావోయిస్టులను నిర్మూలించడమనే అత్యుత్సాహంతో రాష్ట్రాల సరిహద్దులను కూడా దాటి, గ్రేహౌండ్స్ బలగాల సహకారంతో దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులను తప్పకుండా తిప్పికొడతాం. నెత్తుటి బాకీని తప్పకుండా తీర్చకుంటాంʹʹ అని జగన్ హెచ్చరించారు.
Keywords : jagan, maoists, fake encounter, adilabad, maharashtra, police, telangana, kcr, trs
(2021-01-23 11:31:52)
No. of visitors : 9306
Suggested Posts
| శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావువరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు.... |
| అది ఎన్‌కౌంటర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజనిర్థారణ బృందంహిడ్మే ఒంటిపై దుస్తులను తొలగించి... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శరీర భాగాలన్నింటినీ కత్తులతో కోశారు. ఆ తరువాత చాతీపై, కడుపులో తూటాల వర్షం కురిపించారు. మృతదేహాన్ని సుక్మా పట్టణానికి తరలించారు. 14వ తేది విషయం తెలుసుకున్న గ్రామస్తులు.... |
| రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు... |
| శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి.... |
| చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్నప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా |
| ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను..... |
| నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపునేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు..... |
| ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం.... |
| జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ (వీడియో) మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్బరీ వేడుకలు ప్రపంచానికి ఇప్పడు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్కరిద్దరు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్రజా విముక్తి గెరిల్లాలతో కలిసి కదంతొక్కారు. |
| ఆ శవాలు మాట్లాడుతున్నవి...శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి..... |
| ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
|
| నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా |
| వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె |
| ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
|
| అదానీపై కథనానికి అరెస్టు వారెంట్ ! |
| వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
|
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
|
| అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
| ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
| వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
| సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
|
| పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
|
| సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
|
| తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
| యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
| రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
| ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు
|
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
|
| ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
|
| మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
|
| రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
|
| రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
| హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
| రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
more..