కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

కెసిఆర్

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.
రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పత్రిక ʹఉస్మానియాలో డేగకన్ను అని ఒక వార్త ప్రచురించింది. నలభై పైగా నిఘానేత్రాలు, ఆరు వందల సిసి కెమెరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని వేయికళ్లతో కనిపెడుతున్నాయని, ప్రతి ఒక్క విద్యార్థి, ఉపాధ్యాయడు డేగకన్ను నిఘాలో అధినేత ముక్కు కింద ఊపిరి బిగబట్టి మసలుకోవాల్సి వస్తున్నది అని దాని సారాంశం. ఉస్మానియా యూనివర్సిటీకి ఎన్కౌంటర్ల సరెండర్ల నిపుణుడైన ఒక ఐపిఎస్ అధికారి వైస్ ఛాన్సలర్ కావచ్చుననే వార్త కూడ వచ్చింది గానీ ఆయన అభిమానులు ఆయన విస్తృతిని అట్లా కుదించవద్దని అడ్డుపడుతున్నారు. అందువల్ల ఆగిపోయినా ఆయనకక్కడ పద్నాలుగు అభిమాన సంఘాలు ఉన్నాయంటారు. వాళ్లందరిని విప్లవం వైపు పోకుండా చూడడం ఆయన ఎంచుకున్న లక్ష్యం.
కనుక అనుకూలురులకు గరుత్మంతునిగా, ప్రతికూలురులకు డేగకన్నుగా కనిపిస్తున్న కెసిఆర్ రెండేళ్ల పాలన ఉస్మానియా విశ్వవిద్యాలయానికే పరిమితమై చూసినా రెండేళ్లయినా ఇంకెన్నో తెలంగాణ యూనివర్సిటీలతో పాటు వైస్ చాన్సలర్ లేని ಸ್ಥಿತಿ. యూనివర్సిటీ స్థలాన్ని చుటూ ఉన్న బస్తీ వాసులకు ఇస్తానని చెప్పి మాణికేశ్వర్నగర్ వాసులకు, విద్యార్థులకు పోటీలు, వైమనస్యాలు కల్పించిన స్థితి. కాంట్రాక్టు ఉద్యోగులకు, నిరుద్యోగులయిన విద్యార్థులకు ఫోట్రీ పెట్టిన ಸ್ಥಿತಿ. ఒకటేమిటి రెండేళ్లుగా ఆత్మహత్యలు చేసుకున్న వందలాది విద్యార్థుల ఆకాంక్షలన్నీ నెరవేరకుండానే ఆవిరయిపోతున్నాయి. ప్రైవేటు విశ్వవిద్యాయలయాలను, విదేశీ విశ్వవిద్యాలయాలను అనుమతించే విషయంలో మోదీ చంద్రబాబుల దేశభక్తికి తీసిపోనిదే చంద్రశేఖరరావు అభినివేశం కూడా. వైద్య కళాశాలలకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏ రాష్ట్రానికి Q9 రాష్ట్రం కాకుండా అఖిల భారత స్థాయిలో నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్) నిర్వహించాలని సుప్రీంకోర్టు ఎంతో పట్టుదలగా ఇచ్చిన తీర్పును వ్యతిరేకించడంలో, చివరకు ఒక సంవత్సరం కోసం వాయిదా వేయించగలగడంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రైవేటు లాబీల వెనుక ఎంత దృఢంగా నిలబడ్డాయో ఇంకా కొనసాగుతున్న ప్రహసనమే. ఈ క్రమంలో కొన్ని ఎంట్రెన్సులు నిర్వహించబడడం, మళ్లీ ఎంట్రెన్సులు రాయాల్సిరావడం, విద్యార్థులు ఎంత గందగోళానికి, ఒత్తిడికి గురయ్యారో చెప్పలేం. ప్రైవేటు ఇంజినీరింగు కాలేజీలలో ఫీజు రీఎంబర్స్ మెంట్ విషయంలో బోగస్ కాలేజీల విషయంలో ప్రభుత్వం చాల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే 3,500 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను ప్రైవేటు ఇంజినీరింగు కాలేజీల యాజమాన్యం కాగితాల మీద విద్యార్థుల అడ్మిషన్లు, లెక్చరర్ల నియామకాలు చూపి మాయచేసి ఇంత కాలం దండుకుంటున్నాయి. అయితే మరి ఈ ప్రైవేటు ఇంజినీరింగు కాలేజీలన్నింటినీ ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని వాళ్ల స్వంత ఆస్తులుగా మారిన భూములు, భవనాలు, ఇతర పరికరాలను విద్యార్థుల అందుబాటులోకి తెచ్చేందుకా, కేవలం యాజమాన్యాన్ని ప్రభుత్వం గుప్పిట్లోకి తీసుకొని అనుకూలంగా ఉంచుకోవడానికి అనేది ఇదమిత్థంగా తేలాల్సి ఉన్నది. ప్రైవేటు వైద్య కళాశాలల విషయంలో, ఆసుపత్రుల విషయంలో చూపుతున్న భక్తి, అనుకూల భావన చూస్తుంటే ఇదంతా నటన కావచ్చుననే అనిపిస్తున్నది.
ఇంకా ప్రాథమిక స్థాయి నుంచి విద్యా విధానంలోనయితే కెజి టు పిజి కామన్ విద్య అని అధికారంలోకి రావడానికన్న ముందునుంచి మాట్లాడుతున్న గంభీర వచనాలు ఇప్పటికైతే 4,600 స్కూళ్లు మూతపడడానికి మాత్రం దారి తీసాయి. దాదాపు ప్రభుత్వ ఉరూ మాధ్యమ పాఠశాలలన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల సంఖ్య ತೆನಿ, ఉపాధ్యాయులు లేని, వసతులు లేని పాఠశాలలన్నీ మూసివేయడమో మండల కేంద్రాలకు మార్చివేయడమో అనే పేరుతో 250 మండల స్థాయి గురుకుల పాఠశాలలు తెరవడానికి ప్రభుత్వ పాఠశాలలన్నీ మూసి వేస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీషును ప్రవేశపెట్టడంలో ఉన్న పట్టుదల ప్రతి ఊశ్లో బడి, కామన్ స్కూల్ పద్దతి, నేబర్హుడ్ పాఠశాల అనే విషయంలో లేదు. తెలుగు మాధ్యమంలోనే పాఠాలు చెప్పడానికి తగిన శిక్షణ, అర్హత ఉన్న ఉపాధ్యాయులు లేక విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో పడిపోతున్నది. ఇపుడు ప్రభుత్వ రంగంలోని పాఠశాలలన్నింటికీ ఇంగ్లీషు మాధ్యమంలో పాఠాలు చెప్పగల విజ్ఞానశాస్త్రం, సామాజిక శాస్త్రం అధ్యాపకులు, ఈ విద్యా సంవత్సరానికి ఎక్కడ దొరుకుతారు. పైగా డిఎస్సీ నిర్వహించక ఏళ్లు గడిచిపోవడమే కాదు ఇంక ఉపాధ్యాయుల నియామకాలు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికి పాఠ్య గ్రంథాలు లేవు. జూన్ నెలలో ప్రవేశిస్తున్నాం. రెండేళ్లు గడిచిపోయినా ప్రకటనలు, ప్రగల్భాలే తప్ప ప్రాథమిక విద్య విషయంలో నిర్దిష్టమైన చర్యలు, ఆచరణ ఏదీ కనుచూపు మేరలో లేదు.
ఎన్నో ప్రైవేటు విద్యాసంస్థలున్న వ్యక్తి, తెలంగాణ ఉద్మయంలో ఉస్మానియా విద్యార్థులకు ఎంతో అండగా నిలిచి స్వయంగా ఎన్నో కేసుల్లో ఇరికిన వ్యక్తి ఇపుడు ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్నాడు. మంత్రివర్గంలో ఉన్నవాళ్లలో ఒకరు దిల్సుఖ్నగర్ నుంచి కోదాడ
దాకా ఉన్న ప్రైవేటు విద్యాలయాల యాజమాన్యాలకు ఫెలోట్రావలర్. ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలకు నిజామాబాదు వింపి గౌరవ అధ్యక్షురాలు. ఉపముఖ్యమంత్రి, విద్యామంత్రి కూడ అయిన స్వయంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సదస్సులో పాల్గొని తాము ప్రైవేటు పాఠశాలలకు వ్యతిరేకం కాదని, పాఠశాలల్లో వాళ్ల పుస్తకాలు అమ్ముకోవచ్చునని, ప్రభుత్వం వాళ్లను నియంత్రించదని హామీ పడ్డాడు. నగరంలో చాలా ఉన్నత విద్యాలయాలు ప్రైవేటు రంగంలో నిర్వహిస్తున్న ఏకైక టిడిపి ఎంపి తెలంగాణ రాష్ట్ర అవతరణ రెండవ ఉత్సవాల్లో గులాబీ కండువా కప్పుకోబోతున్నాడు. పసుపు రంగు చాలా బలమైన రంగు. కాని పసుపు నుంచి వచ్చిన గులాబీ కోమలమైందేమీ కాదు. ఆ కోమలత్వం కింద డేగముక్కులాంటి తీవ్రమైన ముల్లు ఉన్నదని రాజకీయ, ఇతరేతర ప్రయోజనాలు లేనివాళ్లంతా గుర్తిస్తున్నారు. మోడీత్వంలో భారతీయం అంతా బ్రాహ్మణీయ హిందుత్వమైనట్లు తెలంగాణ అంటే తెరాస, అందులో ప్రభుత్వ ప్రైవేటు తేడాలేమన్నాయి. ప్రభుత్వమనేది చాలా నైరూప్య పదార్థం. నిజానికి దానికి రంగు పులుమడం రాజ్యాంగరీత్యా కుదరదు. దానికొక మూడు రంగుల జెండా, దానిమీద అశోకచక్రం - కొన్ని నియమాలు అవసరం. అంటే రాజకీయ పార్టే ప్రభుత్వమైతే, అందులోనూ ప్రతిపక్షం లేనిదయితే అది అంతా బుక్కా గులాల్ మయం. ఒక కరువు తోటలో, ఒక పోలీసు ముళ్లుకంచె వంటి కాన్సెంట్రేషన్ క్యాంపులో గులాబీలన్నీ తమ రేకుల కింద ముళ్లు పెట్టుకునే పూస్తే ఆకలి, దప్పి, రోగం, నిరక్షరాస్యత తీరుతాయనుకుంటే అది ఒక ఆత్మ వంచన. 29 నవంబర్ 2009న కెసిఆర్ సిద్ధిపేట తెలంగాణ అమరుల సూపం దగ్గర నిరాహార దీక్షకు కూర్చోవడం ఒక చారిత్రక సందర్భం. డెల్టా సంపన్న వర్గాల ఏజెంటయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించవలసిన పద్ధతిలోనే వ్యవహరించి - ఐదు సార్లు ఎంఎల్ఎగా, రెండుసార్లు ఎంపిగా, కేంద్రంలో మంత్రిగా చేసిన ఆయనను ఎంతో దుర్మార్గంగా అరెస్టు చేసి నిరాహార దీక్షను భగ్నం చేసి ఖమ్మం తీసుకుపోయి ఆసుపత్రిలో చేర్చారు. నిర్బంధానికి తలవొగ్గుతాడా లేదా అనే ఒక లిట్మస్ టెస్ట్. తెలంగాణ భగ్గుమన్నది. ముఖ్యంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం. మొత్తంగా విద్యార్థి లోకం 1968-69లో వలె మిలిటెంటుగా స్పందించింది. కెసిఆర్ ఇన్ని మంటలపై నీళ్లు చల్లినట్లుగా సాయంకాలానికి దీక్ష విరమించాడు. విద్యార్థులు, ప్రజలు మరింత స్పందించి - ఇది ద్రోహమన్నారు. చెన్నారెడ్డి కాలంలో వలె క్షమించే కాలం కాదన్నారు. భయపడిపోయి, బుద్ధి తెచ్చుకొని మళ్లీ దీక్ష ప్రారంభించాడు. ఇక నవంబర్ 29 నుండి డిసెంబర్ 9 వరకు - అవి ప్రపంచాన్ని కుదిపేసిన పది రోజులు. ఉస్మానియా కాకతీయ క్యాంపస్లలో గ్రేహౌండ్స్ దిగారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దిగింది. డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినం రోజు ఐదు లక్షల మంది విద్యార్థులు ʹచలో అసెంబ్లీ ద్వారా అసెంబ్లీని ముట్టడిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికది పెను సవాల్ అయింది. డిసెంబర్ 9 రాత్రి తెలంగాణ రాష్ట్రం ప్రకటించక తప్పలేదు. కాని పార్లమెంటులో చిదంబరం ప్రకటన చేసినా, అసెంబ్లీలో ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించకపోవడాన్ని బట్టి, అఖిలపక్షంలో అంగీకరించిన పార్టీలన్నీ ప్లేటు ఫిరాయించడాన్ని బట్టి అందులో తిరకాసు ఉన్నదనేది విద్యార్థులు అనుమానిస్తూనే ఉన్నారు. డిసెంబర్ 10న ఆర్ట్స్ కాలెజి ప్రాంగణంలో విజయోత్సవం పోలీసు నిర్బంధం మధ్యనే జరిగింది. ఆంధ్రలో కృత్రిమ కౌంటర్ ఉద్యమం ప్రారంభమైంది. డిసెంబర్ 23న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిన మాటను వెనక్కి తీసుకున్నది. గత చరిత్ర చెప్పడానికి కాదు ఈ ప్రస్తావన 2009, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 10 వరకు మళ్లీ విజృంభించిన విద్యార్థులు 2010 జనవరి 3న ఆర్ట్స్ కాలేజీ ముందు ఐదు లక్షల మంది విద్యార్థులతో, ఒకవైపు హైకోర్టు పెట్టిన SOSO వ్యవధిని గౌరవిస్తూనే నిర్వహించుకున్న సభ వరంగల్లో రైతు కూలీ సంఘం 1990 మే 5, 6 మహాసభలను తలపించింది. తెలంగాణ క్యాంపస్లలో నిర్బంధం, రాజ్యహింస గ్రీన్హంట్ ఆపరేషన్లో భాగమని విద్యార్థులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు అర్థం చేసుకోవడమే కాదు ఒక ప్రజాస్వామిక శక్తిగా స్వతంత్రంగా రూపొందుతున్నారని పాలక వర్గాలు భయపడిపోయాయి. 2010 జనవరి 5న కేంద్ర ప్రభుత్వం చిదంబరం (హోంమంత్రి) నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పాటు చేసిన ఎనిమిది పార్టీల సమావేశంలో ప్రొఫెసర్ జయశంకర్తో పాటు పాల్గొన్న కెసిఆర్ మొదలు అన్ని పార్లమెంటరీ పార్టీలు - ఉద్యమాన్ని పార్లమెంటేతర రాజకీయ శక్తుల చేతుల్లోకి పోనివ్వమని రహస్య ఒప్పందం చేసుకున్నారు. 2009 డిసెంబర్ 9 నుంచి 2010 జనవరి 10 వరకు ఈ తతంగమంతా తెర వెనుక నిర్వహించిన ఏకైక ఎంఎల్ఎ లోక్సత్తా డా. జయప్రకాశ్ నారాయణ్, సోనియా మన్మోహన్ కాలంలో ఆయన ఢిల్లీలోని అన్ని కీలక సలహా సంఘాల్లో సభ్యుడు. ఆ తర్వాత సహజంగానే తెలంగాణ ఉద్యమ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ చేతుల్లోకి పోయింది. తెచ్చేది ఎవరైనా ఇచ్చేది కాంగ్రెస్ అని తెరాస కూడా భావించింది గనుక పైగా మొదటి నుంచి కెసిఆర్ గురి లాబీయింగు కనుక సోనియా దగ్గరికి దూతను కూడ పంపి, ఆయన చివరి దాకా కాంగ్రెస్తో పొత్తుతోనే తెలంగాణ ఏర్పడినా ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటించగానే ఆయన సకుటుంబంగా వెళ్ళి సోనియాను కలిసి కృతజ్ఞతలు చెప్పాడు. ఎన్నికల సమయంలో పొత్తుతో ఏర్పడే ప్రభుత్వానికి కెసిఆర్ నాయకుడవుతాడనే హామీ కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వకపోవడం వల్ల ఆయన రిస్క్ తీసుకొని ఒంటరిగా పోటీ చేసాడు. ఈ జూదంలో ఆయన నెగ్గాడు. అది ఆయనకు అపరిమితమైన అధికారాన్ని ఇచ్చింది. ఆయన కడుపులో క్యాంపస్ నుంచి ఎదుర్కొన్న ఎన్నో అవమానాలున్నాయి. ముఖ్యంగా 9 నవంబర్ 2009 సాయంత్రం దీక్ష విరమించగానే విద్యార్థుల
నుంచి వచ్చిన తీవ్ర నిరసన, ద్రోహి అన్న ఆరోపణ - ఆయన మరచిపోలేదు.
క్యాంపస్లపై ఆయన కక్షకింత నేపథ్యం ఉంది. క్యాంపస్లకు ఆర్ఎస్యు, పిడిఎస్ యు దళిత్, ఆదివాసీ, బిసి విద్యార్థి సంఘాల నేపథ్యం ఉంది. ఎబివిపిపై కూడ పూర్తిగా ఆధారపడలేడు. ఆయనకంటూ విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో లాయలిస్టులులేరు. ఆయన స్వయంగా రాజకీయ పార్టీల జెవిసికి చైర్మన్గా చేసిన తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు బ్రి ఫెసర్ కోదండరామ్ పట్ల ఆయనకు విశ్వాసం లేదు. విశ్వవిద్యాలయాల్లో ఎంతో కొంత పలుకుబడి ప్రాబల్యం ఉన్న ప్రజా గాయకుడు గద్దర్, టిపిఎఫ్లు ఆయనకు చుక్కెదురే. తెలంగాణ ఏర్పడి ముఖ్యమంత్రి అయ్యాక కూడా రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడవుతాడని ఎన్నో సార్లు వాగ్గాన భంగం చేసినందుకు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి బిజెపి, టిడిపి, కాంగ్రెస్లతో లాలూచీ పడినందుకు ఆదివాసులకు అండగా ఉన్న ప్రజాస్వామ్య శక్తులు, విద్యార్థులు చాల ఆగ్రహంగా ఉన్నారు. కనుక తెలంగాణ రాష్ట్రంలో క్యాంపస్లన్నీ పక్కలో బల్లెంగా ఉండాయనే స్పష్టత ఆయనకుంది. కనుక క్యాంపస్ల విషయంలో కర్ర - పెండలం (క్యారట్ అండ్ స్టిక్) విధానాన్ని సామ భేద దండోపాయాలను ప్రయోగించాలనుకున్నాడు. విద్యార్థి సంఘాలను, విద్యార్థులను 2010 జనవరి 5 నుంచే పెద్ద ఎత్తున చీల్చడం ప్రారంభించాడు. అట్లాగే కొరుకుడు పడని విద్యార్దులపై నిర్బంధాలు, నిఘాలు అమలు చేసాడు. తెలంగాణ ఏర్పడే నమ్మకం కుదిరాక విద్యార్థి నాయకులు ఈ నిర్ణయమైన అధికారానికి, ప్రలోభానికి కొందరైనా లోనయ్యారు.
ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వ కాలంలో చిత్రహింసలకు గురయిన యాకూబ్రెడ్డి అనే కెయు రీసెర్చ్ స్కాలర్కు తెరాస నుంచి ఏ సమర్థనా లభించకపోవడమనే ఒక్క ఉదాహరణ చాలు - అట్లాగే మిలియన్ మార్చ్, సాగరహారం - వంటి ఎన్నో బహిరంగ ప్రజా పోరాటాల సందర్భంగా, చలో అసెంబ్లీల సందర్భంగా, విద్యార్థులపై పెట్టిన కేసులు - అంతెందుకు కెసిఆర్ నిరాహార దీక్ష నిమ్స్లో కొనసాగుతున్నపుడు ఆయనకు అనుకూలంగా మిలిటెంట్ ప్రదర్శనలు చేసిన విద్యార్థులపై పెట్టిన క్రిమినల్ కేసులు కూడ ఆయన ప్రభుత్వం చాలాకలం దాకా ఎత్తివేయలేదు. కేసులు, జైళ్ళు విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వంలో కూడా తప్పలేదు.
ఎన్కౌంటర్లు లేని, నెత్తురు పారని తెలంగాణ హామీ పడిన తెరాస - కాంగ్రెస్తో పొత్తులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా ప్రభుత్వం నుంచి బయటికి వచ్చిందిగానీ తానుగా పూర్తి మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత రెండేళ్లలో పన్నెండు ఎన్కౌంటర్లతో పదిహేను మందిని చంపింది. వీటిలో లంకపెల్లి ఎన్కౌంటర్లో అమరులయిన సోని, కమల, వివేక్లలో వివేక్ తన 15వ ఏట నుంచి 19వ ఏట దాకా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న విద్యార్థి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసిన టివివి విద్యార్థులతో తిరిగి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలన్నా ఆదివాసులకు జల్ జంగల్ జమీన్లు దక్కాలన్నా, అది వాళ్లకు సత్తా (అధికారం) వస్తేనే సాధ్యమని భావించిన ఆయన విప్లవోద్యమంలోకి వెళ్లాడు. ఆయన కోసమే దారికాచి ఖమ్మం - బీజాపూర్ సరిహద్దుల్లో తెలంగాణ గ్రేహౌండ్స్ వాళ్లను పట్టుకొని చంపారు. విద్యార్థి లోకం తీవ్రంగా స్పందించి సూర్యాపేట, హైదరాబాదులు మొదలు రాష్ట్రంలోనే కాదు, ఎపిలో కూడా సభలు, నిరసనలు నిర్వహించింది. కాని వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ప్రభుత్వం అటువంటి సభను క్యాంపస్లో కాదు కదా, హాస్టల్లో కూడా నిర్వహించనివ్వలేదు. వివేక్ర్ పార్టీలోకి విద్యార్థులను రిక్రూట్ చేస్తున్నాడని, ఇంకా ఇరవై ఇద్దరు మావోయిస్టు పార్టీలో చేరారని, రకరకాల ప్రచారాలతో ఆరోపణలతో తీవ్ర నిర్బంధాన్ని క్యాంపస్లో అమలు చేసారు. అనుమానమున్న ప్రతి విద్యార్థిని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారు. కేసులు పెట్టారు. జూన్ 12 2015 నుంచి జరిగిన ఎన్కౌంటర్లలో విద్యా రంగం నుంచి పోయిన వాళ్లు ఉండడం యాదృచ్ఛికం కాదు. 2015 సెప్టెంబర్ 15న అయితే ఇంక నటన లేకుండా, తెలంగాణ గడ్డమీదనే వరంగల్ జిల్లా మొదుగుట్ట (మేడారం) అడవుల్లో శ్రుతి (ఎంటెక్ విద్యార్థి), సాగర్ (కెడిసి విద్యార్థి)లను పట్టుకొని చిత్రహింసలు పెట్టి, శ్రుతిపై అత్యాచారం చేసి చంపేసారు. ఈ ఇద్దరూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎంతో క్రియాశీలంగా పాల్గొన్నా విద్యార్థులు. శ్రుతి వడ్డేపల్లి, హనుమకొండ, వరంగల్లో మహిళా ఉద్యమాల్లోనూ, విద్యార్థి ఉద్యమాల్లోనూ రాటుదేలి హైదరాబాదులో ఎంటెక్ చదువుతూ విప్లవోద్యమంలోకి పూర్తి కాలపు వృత్తి రాజకీయాలతో వెళ్లింది. విప్లవ రచయిత, అధ్యాపకుడు సుదర్శన్, రమల కూతురు. సాగర్ కెడిసి విద్యార్థిగా ప్రత్యేక ভটও০০YেP৪৯ ఉద్యమంలో పాల్గొని, పార్టీలోకి వెళ్లి మూడేళ్లు అజ్ఞాత జీవితంలో గడిపి అనారోగ్యంతో బయటికి వచ్చి పెద పెండ్యాలలో ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక పోరాటంలో ఎన్నో ఆదర్శవంతమైన, సృజనాత్మకమైన ఉద్యమాలు చేపట్టాడు. ఈ ఎన్కౌంటర్ తెలంగాణ సమాజాన్నే కాదు, దేశాన్ని ప్రపంచాన్ని కూడా కుదిపేసింది. దేశంలోనే అపూర్వంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలకే పది రాజకీయ పార్టీలు, 370 ప్రజాసంఘాలతో తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తెరాస ప్రభుత్వ నిర్బంధానికి, రాజ్యహింసకు వ్యతిరేకంగా ఏర్పడింది. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం, ఎన్కౌంటర్లకు, రాజ్యహింసకు, స్త్రీలపై లైంగిక అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన పోరాటం ʹచలో అసెంబ్లీ తర్వాత రైతుల ఆత్మహత్యలపై కూడ స్పందించి బంద్ పిలుపు ఇచ్చిన సందర్భంలో తమ పరువు కాపాడుకోవడానికి విడిగా కాంగ్రెస్, బిజెపి, టిడిపిలు కూడా ఈ బంద్ పాటించక తప్పలేదు, విద్యార్థి లోకం, ఇతర ప్రజాస్వామిక శక్తులు ఇట్లా తెరాస ప్రభుత్వాన్ని ఏకాకిని చేయగలిగాయి. విప్లవోద్యమాన్ని అణచే క్రమంలో పొరుగున ఉన్న టిడిపి ప్రభుత్వం, ఇరుగుపొరుగు మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్ బిజెపి ప్రభుత్వాలు, ఒరిస్సా నవీన్ పట్నాయక్ ప్రభుత్వం, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సరేసరి
ఇస్తున్న మద్దతుతో కెసిఆర్ ప్రభుత్వం మరింత రాజ్యహింసకు పూనుకున్నది. 2016 మార్చ్ 1న బొట్టెతోగులో జరిగిన ఏకపక్ష దాడిలో అమరులైన తొమ్మిది మందిలో కూడ ముగ్గురు విద్యార్థి రంగం నుంచి వచ్చిన వాళ్లు. వారిలో గుంటూరు జిల్లాకు చెందిన గొట్టిముక్కల రమేశ్ - హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తూ ఆర్ఎస్ యు నాయకుడుగా ఎదిగి 1993లో విప్లవోద్యమంలోకి వెళ్లి దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడయ్యాడు. ఆయన సహచరి యూసఫ్ బీ మెదక్ జిల్లా నుంచి విప్లవంలోకి జిల్లా నాయకత్వానికి ఎదిగింది. అమరుల బంధు మిత్రుల సంఘం ఉపాధ్యక్షురాలు శాంత కూతురు, వరంగల్ జిల్లా విప్లవోద్యమ నాయకుడు అమరుడు జన్ను చిన్నాలు మేనకోడలు సృజన విప్లవంలోకి విద్యార్థి రంగం నుంచే వెళ్లింది. వరంగల్లో, హైదరాబాదులో ఇంటర్మీడియేట్ చదువుతూ, కాలేజీలో హాస్టల్లో ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ కోసం విద్యార్థులను సంఘటితం చేసింది. ఆదివాసీ రైతాంగ పోరాటాలతో పెనవేసుకున్న ఈ విద్యార్థి నేపథ్యం గల విప్లవకారులు ఏ ప్రభుత్వానికైనా ముఖ్యంగా విధ్వంసక అభివృద్ధి నమూనాను అమలు చేసే ఏ పాలక వర్గానికైనా చంపదగిన శత్రువులే. కెసిఆర్ ఆ టిడిపి తాను నుంచి వచ్చిన ముక్కనే. వరంగల్ జుడిషియల్ కస్టడీ నుంచి తెస్తూ ఆలేరు రోడ్డుపై చంపేసిన వికారుద్దీన్, అతని సహచరులు నలుగురు కూడ. హైదరాబాదు పాతనగరం విద్యార్థి, యువజన జీవిత నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లే. ఆదివాసీ, దళిత, ముస్లిం సమాజాలతో మమేకమయ్యే విద్యార్థుల పట్ల కెసిఆర్ ప్రభుత్వానికున్న కక్ష ఈ ఎన్కౌంటర్ సంఘటనల సందర్భంలో కన్నా పాతపెల్లి దళితుల శిబిరం నిర్వహించిన పోరాటం, రోహిత్ వేముల వేదిక వెలివాడ సెంట్రల్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న పోరాటం సందర్భంగా మనం ఒక స్పష్టంగా అర్థం చేసుకోవచ్చును. హైదరాబాదు విశ్వవిద్యాలయం కేంద్ర విశ్వవిద్యాలయమంటునప్పటికీ అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో రెండేళ్లుగా ముస్లింలపై జరుగుతన్న దాడులు హత్యలు, ఒకవైపు ముస్లిం యువతులను సామూహికంగా లైంగిక అత్యాచారానికి గురి చేసి, మరొకవైపు ఆ యువతులు ఉరివేసుకొని చనిపోయారని చిత్రిస్తున్న అన్ని రాజకీయ పార్టీలలోని జాట్ల దురంతాలను చిత్రిస్తూ నకుల్ అనే సుప్రసిద్ధ డాక్యుమెంటరీ సినిమా నిర్మాత ముజఫర్ నగర్ బాకీ హై అని తీసిన డాక్యుమెంటరీ ఢిల్లీ యూనివర్సిటీలో ప్రదర్శించబోతే ఎబివిపి విద్యార్థులు అడ్డుకున్నారు. డియు విద్యార్థులకు సంఘీభావంగా హైదరాబాదు యూనివర్సిటీలో అంబేద్కర్ సూడెంట్స్ అసోసియేషన్, టివివి తదితర ప్రగతివాద విద్యార్థులు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి యాకూబ్ మెమన్ను ఉరితీసిన తీరును కూడా ఖండిస్తే దేశద్రోహిని టెర్రరిస్టును స్మరించుకున్నారని ఎబివిపి అధ్యక్షుడు, సుశీల్ కుమార్ ఎఎస్ఎ విద్యార్థులను గూండాలని ఫేస్ బుక్ లో పేర్కొన్నాడు. దానిని రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల నాయకత్వంలో విద్యార్థులు ప్రశ్నించారు. అతడు క్షమాపణ చెప్పాడుగానీ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. స్థానిక బిజెపి ఎంఎల్సి రామచంద్రరావు బిజెపి మంత్రితో కేంద్ర మానవ వనరుల శాఖామంత్రికి ఎచ్సియులో దేశద్రోహి సంస్మరణ సభ పెట్టారని, ఎచ్సియు దేశద్రోహుల అడ్డా అయిందని లేఖ రాయించాడు. కేంద్ర విద్యామంత్రి స్మృతి ఇరానీ ఈ విషయమై యూనివర్సిటీ అధికారులకు వరుసగా ఐదు ఉత్తరాలు రాసి గతంలో పది మంది దళిత విద్యార్థులను రస్టికేట్ చేయించిన అప్పారావును వైస్ చాన్సలర్గా పంపింది. ఆయన వచ్చి ఐదుగురు ఎఎస్ఎ విద్యార్థులను సస్పెండ్ చేసి హాస్టల్ నుంచి, మెస్ నుంచి, నలుగురు కూడే చోట్ల నుంచి వెలివేసాడు. విద్యార్థులు వెలివాడ ఏర్పాటు చేసుకొని పోరాట శిబిరాన్ని నిర్వహించారు. ఇదంతా 2015 డిసెంబర్లో ప్రారంభమైంది. డిసెంబర్ 18న రోహిత్ వేముల అప్పారావుకు దళిత విద్యార్థులనిట్లా వేధించడం కన్నా పది మిల్లీ గ్రాముల విషం, ఉరితాడు లివ్వమని లేఖ రాసాడు. అప్పారావు దాని మీద ఏ చర్య తీసుకోలేదు. ఆ లేఖను ఎవరి దృష్టికీ తేలేదు. తల్లికి, సోదరునికి కూడ తెలియచేయలేదు. వాళ్లిద్దరూ అపుడు హైదరాబాదులోనే ఉంటున్నారు. జనవరి 17న రోహిత్ వేముల ఒక మిత్రుని గదిలో ఉరి పెట్టుకొని చనిపోయాడు. ఆనాడు ప్రారంభమైన పోరాటం ప్రపంచ వ్యాప్త దళితస్వీయ గౌరవ ఉద్యమమైంది. అక్కడి నుంచి అది కేవలం ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయ సమస్య కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చరీసుకోవాల్సిన శాంతి భద్రతల సమస్య అయింది. అయినా కెసిఆర్ ప్రభుత్వం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు, కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర అణచివేతను విద్యార్థుల మీద అమలు చేసే విషయంలో సహకరించిందే గానీ ప్రశ్నించలేదు. ముఖ్యంగా తమ పోరాటం ద్వారా అప్పారావును, ఆ తర్వాత వచ్చిన మరొక విసిని విద్యార్థులు దీర్ఘకాలిక సెలవుపై బయటికి పంపించగలిగినా మార్చ్ 22న అప్పారావు తిరిగి వచ్చి తనను విసిగా ప్రకటించుకున్నపుడు సైబరాబాద్ పోలీసు యంత్రాంగాన్ని మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, విసి అప్పారావు చేతిలో పెట్టింది. మార్చ్ 22న అప్పారావు సైబరాబాద్ పోలీసు కమీషనరేట్కు వచ్చి వెంకయ్య నాయుడు స్వయంగా మాట్లాడిన పోలీసు అధికారులను వెంట బెట్టుకొని తన ఎబివిపి నాయకులను విసి లాడ్డి దగ్గర ఏర్పాటు చేసుకొని గానీ ఎచ్సియలో ప్రవేశించలేదు. విసి లాడ్డిపై దాడి వెంకయ్యనాయుడు అప్పారావు సంయుక్త స్వీయరచన - అది నెపంగా పోలీసులు యూనివర్సిటీలో ప్రవేశించి విద్యార్థులను, ప్రొఫెసర్లను చితకబాది 45 మందిపై కేసులు పెట్టి జైలుకు పంపారు. అందులో ఇద్దరు ప్రొఫెసర్లు ఉన్నారు. మహిళా విద్యార్థులను కూడ అసహ్యకరమైన దాడులకు గురిచేసి భయభీతావహుల్ని చేసారు. విరసం సభ్యుడు, విద్యార్థి జెఎసి నాయకుడు ఉదయభూనును పోలీసు వ్యాన్లో తీసుకొని వెళ్లి ఏడడుగుల బౌలర్ శరీరమంతా హూనం చేసాడు. మర్మాంగాలపై తన్నాడు. చంపుతానని హెచ్చరించి వదిలేసాడు. భాస్కర్ అనే రీసెర్చ్ స్కాలర్ను చిత్రహింసలు పెట్టి
విసిరేసారు. ఇదంతా యూనివర్సిటీ అధికారులు కరెంటు, నీళ్లు బంద్ చేసి మెస్లు మూసేస్తే విద్యార్థులు చెట్ల కింద వండుకోవడానికి ప్రయత్నిస్తే క్యాంపస్లో పోలీసులు ప్రవేశించి చేసిన నిర్వాకం.
ఈ విషయాన్ని శాసన సభలో ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా ఎంఐఎం సభ్యులు ప్రస్తావిస్తే అప్పారావును వెనక్కి తీసుకొమ్మని కేంద్ర ప్రభుత్వానికి చెప్తానని, పోలీసుల దాడుల గురించి విచారిస్తానని హామీ పడిన కేసీఆర్ ఏ చర్యా తీసుకోలేదు. ఇపుడు ఎచ్సియులోకి విద్యార్థులు, టీచర్లు, గుర్తింపు కార్డులు లేకుండా బయటి వాళ్లు ఎవరూ పోవడానికి లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ను కూడా అనుమతించలేదు. రోహిత్ వేముల వేదికను, వెలివాడను కూల్చివేయడమే కాదు అంబేద్కర్ బొమ్మను కూడ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణ నుంచి తొలగించారు.
ఇంగ్లీషు, విదేశీ భాషల విశ్వవిద్యాలయంలో కూడ వైస్ చాన్సలర్ సునయనా సింగ్ గవర్నర్ నుంచి, కేంద్రం నుంచి ఉన్న బలాన్ని చూసుకొని విద్యార్థులను నానా అవస్థలకు ?ෆට් చేస్తున్నది. క్యాంపస్ను పోలీసు క్యాంప్గా మార్చింది. బుదుడు, అంబేద్కర్ల బొమ్మలు లైబ్రరీ ముందు నుంచి తొలగించింది. అక్కడి రీసెర్చ్ స్కాలర్, కళాకారుడు కునాల్ దుగ్గల్ను అంబేద్కర్ జయంతి రోజు క్యాంపస్లోకి రాకుండా నిరోధించి ప్రవేశాన్ని నిషేధించింది. సతీశ్, మోహన్ అనే విద్యార్థులను హాస్టల్ నుంచి బయటికి వెళ్లకొట్టింది. హైకోర్టుకు వెళ్లినా క్షమాపణ చెప్పలేదని రెండేళ్లు రెస్టికేషన్ అనుభవించేలా చేసింది. ఇదంతా ఆమె రాష్ట్ర పోలీసుల పూర్తి మద్ధతుతోనే చేయగలుగుతున్నది. ఒక కశ్మీరీ విద్యార్థిని హాస్టల్ నుంచి ఆయన రూమ్మేట్ ఫిర్యాదు చేసాడనే నెపం మీద అంబర్ పేట పోలీసు స్టేషన్కు తీసుకపెళ్లి ඩ් చిత్రహింసలు పెట్టారో, ఏమని బెదరించారో తెలియదు. ఆయన తిరిగి వచ్చి గదిలో ఉరిపెట్టుకొని చనిపోయాడు. యు ఇపులో ఈ దారుణాలపై ఎచ్సియు విషయంలో ఉన్నంత స్పందన కూడ ఉండదు. కశ్మీరి విద్యార్థి ఆత్మహత్యపై స్పందన ఉంటే ఇంతదూరం వచ్చేది కాదు.
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొన్ని కోర్సులు తొలగించినపుడు విద్యార్థులు ఉద్యమిస్తే కూడ పోలీసులు ఇటువంటి దాడులే చేసారు. జెఎన్టియలో కూడ ఇటువంటి సంఘటనలెన్నో అధికారం లేని అటానమీ అధికారానికి అడుగులకు మడుగులొత్తుతున్న స్థితి.
ఈ సందర్భంగా తెరాస ప్రభుత్వం అని అంటున్నప్పటికీ ముఖ్యంగా ఏక వ్యక్తి లేదా కుటుంబ పాలనగా సాగుతున్న రెండేళ్ల పాలనలో ఇందుకు కెసిఆర్ నే బాధ్యుణ్ని చేయాలి. రియాజ్ ఎన్కౌంటర్ను నిరసిసూ వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి రాష్ట్రంలో ఎనిమిది మంది మంత్రులు రాజీనామా చేసిన సందర్భంలో కేంద్రంలో మంత్రులుగా ఉన్న కెసిఆర్, నరేంద్రలు రాజీనామా చేయలేదనే విషయం మనం గుర్తు చేసుకుంటే అధికారంలో ఉన్నపుడు ప్రజాస్వామిక ఉద్యమాలపై బిజెపి, కెసిఆర్ల వైఖరికి, అవగాహనకు ఏమాత్రం తేడా లేదనేది మనకు స్పష్టమవుతుంది.
వైసిఆర్ సంకీర్ణ ప్రభుత్వానికి, మావోయిస్టు పార్టీకి చర్చలు జరిగినప్పడు (అక్టోబర్ 2004) ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆ చర్చలకెంత దూరంగా ఉన్నాడో, ఎంత పట్టనట్లున్నాడో, ఢిల్లీలో కేంద్ర మంత్రులుగా ఉన్న కెసిఆర్, నరేంద్రలు అట్లాగే ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో పీపుల్స్వార్ ఎజెండా అమలు చేస్తానన్న కెసిఆర్ సంకీర్ణ అధికారం నాటికే తన స్వభావాన్ని ప్రదర్శించాడు. ఆయన దృష్టి అంతా తనకు నలభై ఏళ్ల ముందే మిలిటెంటు విద్యార్థి ఉద్యమం ద్వారా 1969లో ప్రత్యేక తెలంగాణ పోరాటానికి దారివేసిన విప్లవ రాజకీయాల నుంచి, విద్యార్థుల చొరవ నుంచి ఎన్నికల రాజకీయాల గుప్పిటిలోకి తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ ఎజెండాను తెచ్చుకోవడం.
అది గ్రహించిన తెలంగాణ విద్యార్థి వేదిక మీద, తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ ఆయన అమలు చేస్తున్న నిఘా, నిర్బంధం, నిషేధాలు టివివి నలగొండ మహాసభల సందర్భంగా నగ్నంగా బయటపడినాయి. ఆ సభలకు అనుమతి ఇవ్వకుండా దాడి చేసి సర్వ సభ్య సమావేశాన్ని మొత్తం వీడియో తీశారు. టివివి అంటేనే జనరల్ విద్యార్థులు భయభీతావహులకు గురయ్యే స్థితిని పోలీసులు తమ దుప్రచారం ద్వారా ఒక పథకంగా అమలు చేస్తున్నారు. టిడిఎఫ్ చలో అసెంబ్లీ రోజు కూడ టివివి నాయకత్వాన్ని లక్ష్యంగా ఎంచుకుని అరెస్టులు, వేధింపులకు గురి చేయడమే కాకుండా టివివి అధ్యక్షుడు మహేశ్ను ఒంటరిగా విడుదల చేసి, కొద్ది అడుగుల దూరాన కిడ్నాప్ చేసి నగరమంతా ఒక వాహనంలో ముసుగు వేసి గ్రేహౌండ్స్ తిప్పతూ చావు అంచులకు తీసుకొని వెళ్లి బెదిరించి వదిలేసారు. మే 24న వరంగల్లో షరతులతో కోర్టు అనుమతించిన టిడిఎఫ్ బహిరంగ సభ తర్వాత ఆసిఫాబాద్ పోలీసులు టివివి విద్యా సంఘ నాయకత్వాన్ని పోలీసు స్టేషన్కు పిలిపించి బలవంతంగా టిడిఎఫ్ సిపిఐ (మావోయిస్టు) అనుబంధ సంస్థ అని రాయించుకున్నది. గనుక ప్రభుత్వానికీ, పోలీసులకూ విద్యార్థి ఉద్యమాలను అణచివేసే విషయంలో ఎటువంటి కుట్రపూరిత పథకాలు ఉన్నాయో స్పష్టమే.
పాలకులకు ఎవరి వలన అధికారం వచ్చిందో వాళ్ల నుంచి ఎప్పడూ పిక్క బెదరే ఉంటుంది. కెసిఆర్ విషయంలో అది ఉద్యమంలోని సబ్బండరాశులు ప్రజలను తెచ్చిన విద్యార్థుల చొరవా శక్తి పట్ల ఉండే భయం.

Keywords : kcr, trs, telngana, varavara rao, revolutionary writer, students, unions
(2024-06-23 19:41:07)No. of visitors : 5438

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

ʹనీ బాంచెన్ దొరా కాల్మొక్తʹ

జిల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ ఖిల్లాలో తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు పాదాభివందనం చేస్తున్నానంటూ ...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కెసిఆర్