అమెరికా ఆధిపత్యం ముక్కు మీద మహమ్మద్ అలీ పిడిగుద్దు - వరవరరావు

అమెరికా

నాకు ఆటల గురించి ఎక్కువగా తెలియదు. ఆసక్తి తక్కువే, ప్రమేయం తక్కువే. బాక్సింగ్ గా ఇప్పుడు అందరికీ అర్థమయ్యే మల్లయుద్ధం అంటే మాత్రం భయం కూడా. ఒక స్ప్రింగ్ రింగ్ చుట్టిన ఆవరణలో ఇద్దరు పహిల్వాన్లు ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు కురిపిస్తుంటే ప్రేక్షకులు కేరింతలు కొడుతుంటారు. కాని వాళ్లేమో ఒకరి మీద ఒకరు బుసలు కొడుతుంటారు. నాకిదేమి క్రీడ అని అనిపిస్తుంది.
కాని, ఎందుకో మహమ్మద్ అలీ ఎదుటివాని ముక్కు మీద తన శక్తినంతా కూడదీసుకొని ఒక పిడిగుద్దు గుద్దితే అది నాకు అమెరికా ఆధిపత్యం ముక్కు మీద, ఒడుపుగా డొక్కలో గుద్దితే అది అమెరికా ఆయువుపట్టు మీద కొట్టినట్టు అనిపించేది. ఆయన క్రీడను ఒక కళగా, ప్రాపంచిక దృక్పథంగా ప్రదర్శించి జీవిత కాలంలోనే లెజెండ్ (వీరగాథ) అయిపోయాడు.

ఆయన పేరు కాషియస్ క్లే, అది తన తల్లిదండ్రులు పెట్టిన పేరు. అట్లా ఇవ్వబడిన పేరు అని దానిని ఆయన మహమ్మద్ అలీగా మార్చుకున్నాడు.

క్లేకు శబ్దార్థం మట్టి. తనలోని నైసర్గిక సారాన్ని కాపాడుకునే విషయంలో ఈ మట్టిని తన పాదాల కింద అణచివేసి, తొక్కి ఆ మట్టినే తన కాళ్లుగా మలుచుకున్న ఒక మహారాక్షసి"తో కార్ల్ మార్క్ సామ్రాజ్యవాదాన్ని పోల్చాడు. కాషియస్ క్లే అట్లా 1964లో మహమ్మద్ అలీ అయ్యాడు.

ఆ కాలం చాలా విషయాలలో ప్రపంచవ్యాప్తంగా పీడితులకు, పోరాట ప్రజలకు గొప్ప సవాలుగా ప్రారంభమైంది. 1960లు, 70లు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వియత్నాం విప్లవ కాలం. ప్రతి ఒక్కరూ తమ పేరు వియత్నాం అని భావించుకున్న కాలం. సత్యజిత్ రే సినిమా ప్రతిద్వంద్విలో ఉద్యోగార్థం ఇంటర్వ్యూకు వెళ్లిన ఒక విద్యార్థిని సెలెక్షన్ కమిటీ ఈ దశాబ్దపు గొప్ప మానవ విజయం ఏమిటి అని అడుగుతారు. అతడు వెంటనే వియత్నాం విజయంʹ అంటాడు. వాళ్లు మనిషి చంద్రమండలం మీదికి పోవడం కాదా అని ఆశ్చర్యపోతారు. అది ఒక వైజ్ఞానిక శాస్త్ర విజయం. మానవ విజయం అన్నప్పుడు అది తప్పకుండా వియత్నాం ప్రజల విజయమే అని చెపుతాడు. 1964 నాటికి అమెరికాకు వియత్నాం అనుకూలతయే దేశద్రోహ భావన అయింది.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధం జరుగుతుండగానే చార్లీ చాప్లిన్ గ్రేట్ డిక్లేటర్ సినిమాలో సైనికులను యుద్ధం చేయవద్దని హెచ్చరిస్తాడు. తీవ్రంగా యుద్ధం జరుగుతుండగా కూడా ఆ చిత్రం నడిచింది. దాన్ని ఎవరూ నిషేధించలేదు. సైన్యంలో చేరేవారిని వద్దని చెపుతూ కవిత్వం రాస్తే కూలిపోయే విషమ దశలో ఉన్నదా ఆంధ్ర ప్రభుత్వం! ఇలాంటి చర్యలు చూస్తే ఈ దేశాన్ని ఏ మతిమాలిన వాళ్లు పరిపాలిస్తున్నారో అర్థం కాదు. రుంఝʹలో సైన్యంలో చేరవద్దని ఒక కవిత ఉన్నదనే ఆక్షేపణతో దాన్ని నిషేధించిన సందర్భంలో కొడవటిగంటి కుటుంబరావు గారు రాసిన వాక్యమిది. అయితే రెండో ప్రపంచం యుద్ధం నాటికి, ముఖ్యంగా తొలిదశలో అమెరికా వియత్నాం కాలపు మొనగాడి దశకు చేరుకోలేదు. వియత్నాం కాలానికి అంత అసహనానికి కారణం అది.

1964கு? మహమ్మద్ అలీగా క్రీడారంగంలోకి వచ్చి అప్పటి చాంపియన్ ఎర్నీ టెర్రెల్తో తలపడి గెలిచిన ఆ మల్లయోధుడిని అమెరికా ప్రభుత్వం వియత్నాం యుద్ధంలోకి సైనికుడిగా చేరమని తాఖీదు పంపిస్తుంది. ఆ కాలం అన్ని రంగాల నుంచి యువకులను అమెరికా బలవంతంగా వియత్నాంపై యుద్ధానికి పంపుతున్న కాలం. ఆయన అందుకు నిరాకరించాడు. తాను మళ్లీ బానిస కాదల్చుకోలేదన్నాడు. ప్రభుత్వం ఆయన బిరుదును తొలగించింది. నాలుగు సంవత్సరాల పాటు ఏ మల్లయుద్ధ అవకాశాలు ఇవ్వలేదు. మిలియన్ల, బిలియన్ల డాలర్లు కోల్పోయే స్థితి వచ్చింది. కాని ఆయన అటలంగా నిలబడ్డాడు.

మహమ్మద్ అలీ నేనెందుకు వియత్నాం ప్రజల మీద యుద్ధానికి వెళ్లాలి? వాళ్లు తమ దేశానికి నన్ను బానిసను చేసి తీసుకెళ్లలేదు. నా కాళ్ల కింది మట్టిని, ఆ మట్టి కింది సంపదను దోచుకోలేదు. ఆ దోచుకోవడంలో నన్నే ఒక వెట్టి బానిసగా వాడుకోలేదు. నన్ను చిత్రహింసలు పెట్టలేదు. బానిసగా చూడలేదు. అవమానించలేదు. నా స్త్రీలను చెరచలేదు. నా పిల్లలను చంపలేదు. నా తోటి నల్లవాళ్లను చంపలేదు. నా స్వేచ్ఛకు ఎన్నడూ వాళ్లు అడ్డు చెప్పలేదు. నేనెందుకు ఈ అమెరికా పాలకజాతి కోసం ఈ యుద్ధంలో పాల్గొనాలి?" అని నిరాకరించాడు.

1975లో వియత్నాం ప్రజలు ఇరవై ఏళ్ల అమెరికన్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో గెలిచి, వియత్నాం ఏకీకరణ జరిగింది. 1984 నాటికి మహమ్మద్ అలీ ఒక పెద్ద విజయగాథగా తన జీవిత కాలంలోనే తానొక చరిత్రగా మారాడు. వాస్తవానికి గత ముప్పై ఏళ్లుగా పార్కిన్సన్ వ్యాధితో ఆయన ప్రచార ప్రపంచానికి దూరంగానే ఉన్నాడు. కాని ప్రపంచం ఆయనను మరచిపోలేదు.

జూన్ 9న ఆయన అంత్యక్రియల్లో ఇరవై రెండు వేల మంది ప్రజలు పాల్గొన్నారు. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లీ స్వేచ్చా మందిరాని (ఫ్రీడం హౌస్)కి ఆయన పార్ధివ దేహాన్ని ఇస్లాం సంప్రదాయాల ప్రకారం తీసుకువచ్చినప్పుడు ఇరవై మూడు మైళ్ల పొడవున ప్రజలు నిలబడ్డారు. ఆయన ఎవరెవరిని ధిక్కరించారో వాళ్లందరూ ఆయన ముందు తలలు వంచారు. అది కెఎఫ్సి సెంటర్. మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఆయన స్తుతి ప్రసంగం చేశాడు.

అక్కడ ఎంతో పెద్ద రహస్య పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్ ఇప్పుడు వాళ్ల అధ్యక్ష అభ్యర్థి. కనుక అక్కడ క్లింటన్ను, కెఎఫ్సిని సీక్రెట్ సర్వీస్ను చూడడం బాధాకరమైన విషయమే.

మహమ్మద్ ෂඹී యవ్వన కాలంలో ఒక ధిక్కార ప్రకటన చేస్తూ ఇక్కడ నడిచాడు. నన్ను సులభంగా లక్ష్యం చేసుకోవచ్చు. నేనంతటా ఉన్నాను. అందరూ నన్ను పోల్చుకోగలరు. నేనీ వీథుల్లో రోజూ నడుస్తుంటాను. నాకెవ్వరూ అంగరక్షులు లేరు. నా దగ్గర ఏ ఆయుధమూ లేదు. పోలీసు ఎట్లాగూ నాకు అండగా ఉండదు. కనుక ఎవరైనా దుర్మార్డులు నన్ను చంపదల్చుకుంటే వచ్చి నా మీద సవాలు విసరవచ్చు. కాని నేను దైవాన్ని దైవాన్ని ఎవ్వరూ చంపలేరు. బుల్లెట్ను నియంత్రించేది కూడా దైవమేʹ అని ప్రకటించేవాడు. ఇది అతిశయంగా కనిపించవచ్చు. లేదా మతవిశ్వాసంగా కనిపించవచ్చు. కాని మహమ్మద్ అలీ విషయంలో అది ఆయన ఆత్మ విశ్వాసం, అది ఆయన జీవన విధానం.

అక్కడ బిల్ క్లింటన్ ఉండడం పెద్ద విరోధాభాసం. తన కాలపు అమెరికా నేర శిక్షా స్మృతి రాసినవాడు. ఇరాక్ మీద ఆంక్షలు విధించి వేల, లక్షల మంది మధ్యప్రాచ్య శిశువులను చంపినవాడు. మహమ్మద్ అలీకి ఆఖరు వీడ్కోలు చెప్పడానికి ఆయన వచ్చాడు. మహమ్మద్ అలీ అంటే సామ్రాజ్యవాదాన్నీ జాతివివక్షనూ, యుద్ధాన్నీ ధిక్కరించడానికి ప్రతీక. ఇవన్నీ మహమ్మద్ అలీని నియంత్రించడానికి ప్రయత్నం చేశాయి. నిశ్శబ్దించడానికి ప్రయత్నించాయి. నిషేధించడానికి, నిర్బంధించడానికి ప్రయత్నం చేశాయి. ఇప్పడు ఆయన మౌనం ధరించాక ఆయన స్తుతి స్తోత్రాలు పాడడానికి వచ్చాయి. ఆయన మిలిటరీలో చేరడానికి నిరాకరించినప్పడు ఈ లూయిస్విల్లీలో అధికారంలో ఉన్నవాళ్లు ఆయన మీద విరుచుకుపడ్డారు. ఆయన అప్పడు ఈ ప్రపంచానికి రాజును అని ప్రకటించాడు. ఇప్పుడు అది వాళ్లు తమ నోట నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు. అయితే వాళ్లాయన భావాలను అంగీకరించారని కాదు. ఆయన ఇక లేడనే ధైర్యంతో ఈ పని చేస్తున్నారు. ఆయన పీడవదిలి పోయిందని, ముఖ్యంగా అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల ముందు ఆయన మృతదేహం ಮಿಟ್ಟು ఆయనతో ఉన్నట్లు కనిపించడం తమకు అనుకూలమని నటిస్తున్నారు.

అక్కడ ఉన్న బిల్ క్లింటన్ ఆయన ఒక్కడే కాదు, గెరాల్డ్ ఫోర్డ్ నుంచి లిండే జాన్సన్, రిచర్డ్ నిక్సన్ వరకు అలీ వెన్ను విరువాలని ప్రయత్నించిన వాళ్లే. అది వాళ్లవల్ల కాలేదు. ఇప్పడు ఆయన మౌనంలో వాళ్ల నిటూర్పులు వెతుక్కోవడానికి వచ్చారు. ఇప్పడు అలీని తమలో కలుపుకోవడానికి వచ్చారు. ఇది ఒక రకంగా ఒక కవి సమయం. ఒక రాజకీయ సందర్భం. రేపు హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలైనా, అవే విధానాలు, కొంత మాయజలతారు ఆచ్ఛాదనతో, డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైతే చెప్పనకర్లేదు. అమెరికాలోకి ముస్లింలు ప్రవేశించకుండా నిషేధిస్తానన్నాడు. తాను ముస్లింలు లేని అమెరికా చూడాలనుకుంటున్నాడు. హిల్లరీ, ట్రంప్లు ఇద్దరూ మధ్యప్రాచ్యంలో అన్నిరకాల అమెరికా సైన్య దురాక్రమణలను బలపరచిన వాళ్లే బహుశా మధ్యప్రాచ్యంలో ప్రవహిస్తున్న చమురు అంతా, నిక్షిప్తమై ఉన్న ఖనిజాలన్ని తన రక్తమాంసాల్లో సారభూతం చేసుకున్న మహమ్మద్ అలీ అనే ఒక మానవుడు ఒక ముస్లింలా నిప్ర్కమించడంలో ఈ దురాక్రమణదారులు అమెరికా నుంచి ముస్లింల నిప్రుమణ దురాశను ప్రకటిస్తున్నారేమో?

ఇటీవల డోనాల్డ్ ట్రంప్ ఒబామా గురించి అతను నలుపు మాత్రమే కాదు, అతను సగం ముస్లిం కూడా అని అనుమానం ఉన్నది అన్నాడు. ఎన్నికల కోసం ఆ మాట అన్నాడేమో కానీ, అది ఆయన మనసులో మహమ్మద్ అలీ గురించి ఉన్న మాట. జాక్ జాన్సన్ గురించి ఆయన క్షమార్షం కాని నల్లదనం వలన ద్వేషింపబడిన మహత్తర మల్లయోధుడుʹ అని పేరుంది. బహుశా మళ్లీ ఇప్పడది మహమ్మద్ అలీకి వర్తిస్తుంది. ఏ శక్తీ చెరిపేయజాలని, మలిపేయజాలని, తుడిచేయజాలని ఆయన నల్లదనం ఎళ్లకాలం కోసం అందరూ గుర్తుపెట్టుకుంటారు.

మహమ్మద్ అలీ వియత్నాం యుద్ధంలో సామ్రాజ్యవాదం తరఫున సైన్యంలో చేరడానికి నిరాకరించినప్పడు చెప్పిన మాటలను ఆచరించడమే ఇప్పడు సామ్రాజ్యవాదాన్ని దాని దళారీ పాలనని ప్రతిఘటించే ప్రతి ప్రజాస్వామ్యవాది, కళాకారులు, బుద్ధిజీవులు ఎంచుకోవలసిన కర్తవ్యం. ముఖ్యంగా ఇది బుద్ధిజీవులు తీసుకోవలసిన సందేశం.

ప్రపంచవ్యాప్తంగా రామాయణ, మహాభారత యుద్ధం కాలం నుంచి గానీ, గ్రీకు, రోమన్ యుద్ధం కాలం నుంచి గానీ యుద్ధాల్లో పాల్గొనక తప్పని ప్రజలు బడుగువర్గాలే. ఇవ్వాటికీ దళిత, ఆదివాసీ, బడుగువర్గాలకు, భూమి లేని నిరుపేద ప్రజలకు ఉపాధి అయినా, ఉద్యోగం అయినా దొరకగల అవకాశం పోలీసు, సైన్యం లోనే ఉన్నది. అవి ప్రాణాంతకమైన ఉద్యోగలైనా జానెడు పొట్టకోసం అందులోనే చేరక తప్పడం లేదు. దేశభక్తి వంటి ప్రకటిత ప్రేరణ, ఇతర అప్రకటిత కారణాలు మినహాయిస్తే బుద్ధిజీవులకు అటువంటి అగత్యం මීඨ. బుద్ధిజీవుల విషయంలో వియత్నాం యుద్ధంలో మహమ్మద్ అలీ వంటి వాళ్ల మీద ఉన్న ఒత్తిడి కూడా ఇవ్వాళ ప్రపంచంలో ఎక్కడా లేకపోవచ్చు. నిజానికి ఇవాళ సమస్య అది కూడా కాదు. ఇవ్వాటి సమస్య సైన్యంలో చేరడం కాదు. కార్పొరేట్ శక్తుల, పాలకవర్గాల సాంస్కృతిక సైన్యంలో చేరడం. చైతన్యపూర్వకంగా అది నిర్ణయించుకునే అవకాశం బుద్ధిజీవులకు ෂීජුද්‍රිෂීඨ.

ఇవ్వాళ వివక్షకు, దోపిడీకి, అణచివేతకు, పీడనకు గురవుతూ, న్యాయమైన పోరాటం చేస్తున్న ప్రజలందరూ, ముఖ్యంగా ఆదివాసీ, దళిత, ముస్లిం ప్రజలందరూ మహమ్మద్ అలీ ఆనాడు అక్కున చేర్చుకున్న వియత్నాం ప్రజల వంటి వాళ్లేనని ఈ బుద్ధిజీవులు గుర్తించడమే మహమ్మద్ అలీ వంటి సామ్రాజ్యవాద వ్యతిరేక యోధుల నుంచి గ్రహించగల సందేశం

Keywords : muhammad ali, varavara rao, usa, amerika, boxing, struggle
(2024-04-24 21:26:16)



No. of visitors : 3070

Suggested Posts


20 Million Muslims March Against ISIS And The Mainstream Media Completely Ignores It

In one of the largest organized marches in the history of the world, tens of millions of Muslims made an incredibly heartening statement, by risking their lives to travel through war-stricken areas to openly defy ISIS. This massive event that would have undoubtedly helped to ease tensions in the West was almost entirely ignored....

సౌదీ అరేబియా జైలులో కరీంనగర్ వాసి మృతి

సౌదీ అరేబియా జైలు లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందారు. బతుకు తెరువు కోసం సౌదీ వెళ్లి 25 ఏండ్లుగా ప్లంబర్‌గా పనిచేస్తున్న కొమ్ము లింగయ్య అనే వ్యక్తి జైలు లో మరిణించినట్టు అతని కుటుంభ సభ్యులకు....

ʹనన్ను గెలిపిస్తే ఇండియన్స్ ను వెళ్ళగొడతాʹ - డొనాల్డ్ ట్రంప్

తనను అధికారంలోకి తీసుకురావాలని ఓ వైపు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే... అలా చేస్తే భారత్ నుంచి ఇక్కడకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నవారిని వెనక్కి పంపిస్తానంటూ శపథాలు చేస్తున్నాడు.....

చేగువేరా కూతురు డాక్టర్ అలీదా గువేరా తో ఇంటర్వ్యూ

అమెరికా దేశం ప్రజల సామూహిక శక్తిని నామరూపాలు లేకుండా చేయడానికి యుద్ధాన్ని ఉపయోగించుకుంటుంది. కాని, క్యూబా ఒక ప్రముఖమైన విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. మేము ఈ భూ మండలం మీదనే అత్యంత శక్తివంతమైన దేశానికి 90 మైళ్ల దూరంలో నివసిస్తుంటాం. అయితే అది మమ్మల్ని నాశనం చేయలేకపోయింది.

After 28 years, Vaiko releases Prabhakaran’s letter to DMK chief

His (Vaikoʹs) love for Tamils and his courage make us feel that we can die a thousand times for the cause of our people and language. We have respect for your party of selfless cadres....

ʹమమ్ములను రేప్ చేసే,మా అవయవాలను అమ్ముకునే లైసెన్స్ సైన్యానికుందిʹ

ʹʹమమ్మల్ని చంపడానికి, మామీద అత్యాచారాలు చేయడానికి, హింసించడానికి, మా శరీరాల్లోని అవయవాలను తొలగించి, అమ్ముకోవడానికి సైన్యానికి లైసెన్స్ ఉంది. సైన్యం మా ప్రజల అవయవాల వ్యాపారం చేస్తోంది....ʹʹ

మానవత్వానికే మచ్చ తెచ్చిన ఆ దుర్మార్గుడితో కలిసి ఉండలేను... విడాకులు ఇప్పించండి

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్‌ ప్లాయిడ్ ను కాలుతో తొక్కి చంపిన తెల్ల‌జాతీయుడైన‌ పోలీస్‌ అధికారి డెరెక్ చౌవిన్ భార్య కీలై విడాకులు కోరింది. నల్ల జాతీయులపై వివక్ష చూపుతూ, మానవత్వానికే మచ్చ తెచ్చిన‌ చౌవిన్‌తో తను ఇక ఎంత మాత్రమూ కలిసి ఉండలేనని ప్రకటించిన ఆమె తమ‌ వివాహాన్ని రద్దు చేయాలని కోర్టుకు ఎక్కారు.

Paris Museum Displays Beheaded Africans

There is a museum in Paris with 18 000 human heads of people killed by the french colonial troops and missionaries. Itʹs called Musee d Histoire Naturelle de Paris.

అమెరికాను ఇలా బూడిద చేస్తాం - వీడియో విడుదల చేసిన ఉత్తర కొరియా

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ తన చెప్పుచేతుల్లో ఉంచుకునేఅమెరికాకు ఇప్పుడు ఉఅత్తర కొరియా సవాల్ విసురుతోంది. అమెరికా అంటేనే మండిపడే ఉత్తర కొరియా...

నరహంతక పాలన.. మహిళా గెరిల్లాల మర్మాంగాల్లో కాల్చండని ఆర్మీకి ఆదేశం !

వాడో నరహంతకుడు వేలాది మందిని హత్యలు చేయించినవాడు ముగ్గురిని నేను కాల్చి చంపాను అని బహిరంగంగానే ప్రకటించినవాడు. తల్చుకుంటే నా అంత గూండా మరొకడు ఉండడు అని బహిరంగ వేదికల‌ మీదే చెప్పినవాడు. ఉగ్రవాదులకన్నా నేను పరమ దుర్మార్గుణ్ణి....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అమెరికా