HCU లో ఏబీవీపీ అరాచకం - విద్యార్థిపై దాడి

హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీలో మ‌తోన్మాద గుండాల అరాచ‌కాల‌కు అంతులేకుండా పోతోంది. రోహిత్ వేముల మృతికి కార‌ణ‌మైన సుశీల్ కుమార్, బీజేపీ నాయ‌కుడైనా అత‌ని సోద‌రుడు మ‌రో ముప్పై మందితో క‌లిసి నిన్నరాత్రి యూనివ‌ర్సిటీలో విద్యార్థుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. గ‌త వారం ప‌ది రోజులుగా క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న మార‌ణ‌హోమానికి నిర‌స‌న‌గా , కాశ్మీర్ ప్ర‌జ‌ల పోరాటానికి సంఘీభావంగా శ‌నివారం సాయంత్రం యూనివ‌ర్సిటీలో విద్యార్థులు Thatʹs When I Threw Stones! కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఒక‌వైపు కార్య‌క్ర‌మం జ‌రుగుతుండ‌గానే ఏబీవీపీ వాళ్లు భార‌త్‌మాత‌కు జై అంటూ నినాదాలు చేస్తూ యూనివ‌ర్సిటీ అంతా ర్యాలీ నిర్వ‌హించారు. క‌శ్మీర్ ప్ర‌జ‌ల సంఘీభావ కార్య‌క్ర‌మం అనంత‌రం షాప్‌క‌మ్ నుంచి హాస్ట‌ల్‌కి వెళ్తున్న అమోల్ సింగ్‌ని ఎన్ఆర్ఎస్‌హెచ్ వ‌ద్ద‌ దాదాపు 30 మంది ఏబీవీపీ గుండాలు అడ్డ‌గించి దాడికి పాల్ప‌డ్డారు. బ‌య‌టి నుంచి వ‌చ్చి... ఇక్క‌డ కార్య‌క్ర‌మాలు చేస్తారారా? అంటూ.. విచ‌క్ష‌ణా ర‌హితంగా దాడి చేశారు. అనంత‌రం క‌శ్మీరీలు ఇక్క‌డ ఉన్నారంటూ... హాస్ట‌ల్స్‌లోకి చొర‌బ‌డి సోదాలు నిర్వ‌హించారు. మంచాల కింద‌, బీరువాల్లో సైతం చెక్ చేశారు. బాగా తాగి హాస్ట‌ల్స్ మీద దాడి చేసిన సంఘ్ ప‌రివార్ మూక‌లు.. భ‌యాన‌క వాతార‌ణాన్ని సృష్టించారు.

తీవ్రంగా గాయ‌ప‌డ్డ అమోల్‌ని విద్యార్థులు హెల్త్ సెంటర్ కి తీసుకువెళ్ల‌గా.. హెల్త్ సెంట‌ర్ అధికారులు బ‌య‌ట ఆసుప‌త్రికి తీసుకువెళ్లాల‌ని సూచించారు. దీంతో మ‌దీనా గూడ‌లోని ప్రాణం హా్స్పిట‌ల్ కి తీసుకువెళ్లారు. తిరిగి దాడికి పాల్ప‌డేందుకు ఏబీవీపీ గూండాలు హాస్పిట‌ల్ ముందు కాపుకాస్తుండ‌డం గ‌మ‌నార్హం. హాస్పిట‌ల్ వ‌ద్దే వీల్‌చైర్‌లో ఉన్న అమోల్‌పై సుశీల్‌కుమార్‌, బీజేవైఎం నాయ‌కుడైన అత‌ని సోద‌రుడు తిరిగి దాడికి పాల్ప‌డ్డారు. అక్క‌డ ఉన్న విద్యార్థులు అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసినా ఆగ‌లేదు. ఎమ‌ర్జెన్సీ వార్డులోకి సైతం దూసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నించాడు. చివ‌ర‌కు హాస్పిట‌ల్ త‌లుపులు లాక్ చేసి ఆమోల్‌కి చికిత్స చేయించారు.

క‌శ్మీర్ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల గురించి, వాళ్ల పోరాటం గురించి మాట్లాడ‌డం... ఆ త‌ల్లుల గ‌ర్భ‌శోకాన్ని గురించి మాట్లాడ‌డం ఈ ʹదేశ‌భ‌క్తులʹ ఆగ్ర‌హానికి కార‌ణం. భ‌ద్ర‌తా ద‌ళాల ప్ర‌త్యేక అధికారాలు బ‌లిగొంటున్న ప్రాణాలు ఈ దేశ ప్ర‌జ‌లి కావా? కాన‌ప్పుడు వాళ్ల కాళ్ల‌కింది నేల‌పై, వాళ్ల వ‌న‌రుల‌పై, వాళ్ల జీవితాల‌పై నీ పెత్త‌నం క‌చ్చితంగా ప్ర‌జ‌లు ప్ర‌శ్నిస్తారు

Keywords : HCU, Rohit vemula, abvp, students,attack, police, jnu, hindutva
(2024-04-24 21:24:11)



No. of visitors : 3513

Suggested Posts


గోరక్షకులా ? దోపిడి దారులా ? - NDTV స్టింగ్ ఆపరేషన్ లో వెలుగు చూసిన నిజాలు !

ఆవులనే కాదు ఎద్దులను, బర్రెలను, దున్నపోతులను... వేటినైనా సరే వాహనాల్లో తీసుకెల్తే వీళ్ళు ఆపుతారు. పోలీసుల సహకారంతో గోశాలలకు తరలిస్తారు. అక్కడి నుంచి వాటిని అమ్ముకుంటారు. పశువులను తరలించేవారు వీరితో ముందే ఒప్పందానికి వచ్చి డబ్బులు ముట్టజెప్తే ఆ వాహనాలను ఆపరు....

బాలికల అక్రమ తరలింపు - బైటపడ్డ ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు రంగు

ఆర్‌ఎస్‌ఎస్‌ అసలు ఎజెండా ఏంటి అనేది బహిర్గతమైంది. తన మతోన్మాద ఎజెండాను అమలుచేయడంలో భాగంగా బాలికల అక్రమ తరలింపుకు సిద్దపడింది. జాతీయ, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఆదివాసీ బాలికలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనాన్ని ఔట్ లుక్ పత్రిక బహిర్గతపర్చింది....

బీఫ్‌ తినడం నేరం కాదు - మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు

గో మాంసంపై మద్రాస్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బీఫ్‌ తినడం నేరం కాదని, ప్రజల ఆహార అలవాట్లలో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. పళని ఆలయ పరిసరాల్లో ముస్లింలు నిర్వహిస్తున్న దుకాణాలను తొలగించాలని దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది...

హిందూ మతోన్మాదం మోడి,యోగి - డా. కత్తి పద్మారావు

ఆర్ఎస్ఎస్ మూలవాసుల సంస్కృతికి వ్యతిరేకి. ముస్లిం మైనార్టీలకు శత్రువు. ఎంతో నెత్తురు హిందూ, ముస్లిం ఘర్షణల్లో భరత ఉపఖండంలో ఇంకిపోరుుంది. అందుకే అంబేడ్కర్ దళితులను బౌద్ధ మత స్వీకారం చేయమని బోధించాడు. బౌద్ధ మత స్వీకారం ఒక్కటే హిందూ మతం పునాదులను కదిలించగలుగుతుందని అంబేడ్కర్ విశ్వసించాడు....

ఫిదా సినిమా... జాతీయ గీతం - తుమ్మేటి రఘోత్త‌మ్ రెడ్డి

నేను తెలుగు సినిమా చూడాల్సి వచ్చింది! చాలా కాలం తరువాత! సంవత్సరాల తరువాత.... ఏం చెయ్యను? ఖర్మ! నాలుగురోజుల క్రితం, మాదగ్గరి బంధువు పోన్ చేసాడు! ఒకసారిʹఫిదాʹసినిమా చూడగలరా? మీతో చర్చించాలని ఉంది అన్నాడు! దగ్గరి బంధువు! సినిమా రంగంలో భవిష్యత్తును నిర్మించుకుంటున్నవాడు! కాదనలేని స్ధితి!

ఇప్పటి దేశ పరిస్థితుల్లో రాడికల్ ఉద్యమ అవసరం ఉందా?

వ‌ర్త‌మాన సామాజిక‌, రాజ‌కీయ‌, ఆర్థిక విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడూ స‌రైన అవ‌గాహ‌నను అందిస్తూ, ప్ర‌జ‌ల ప‌క్షాన గొంతును వినిపించే లామ‌కాన్, ముగ్గురు ప్ర‌ముఖ ఉద్య‌కారుల‌ను ఒకే వేదిక‌మీదికి తీసుకువ‌స్తోంది. ఆగ‌స్టు 15 సాయంత్రం 7 గంట‌ల‌కు లామ‌కాన్‌లో నిర్వ‌హించే.....

ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ బాకీ హై

22 రాష్ట్రాలు, 44 ప‌ట్ట‌ణాలు, 50 ప్ర‌ద‌ర్శ‌న‌లు... ఇది బాహుబ‌లి సినిమా కాదు... మ‌తోన్మాద రాజ‌కీయాల్నిన‌గ్నంగా నిల‌బెట్టిన డాక్యుమెంట‌రీ చిత్రం. వ‌ర్త‌మాన చ‌రిత్ర‌కు సాక్ష్యం.....

మోడీలు, మోహన్ భగవత్ లు బూట్లు తొడుక్కొని జెండాలు ఎగరేయొచ్చు... అదే ఓ ముస్లిం చేస్తే దాడులు చేస్తారా !

మోడీ, అమిత్ షాలు బూట్లు తొడుక్కొని స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండాకు వందనాలు చేయొచ్చు. మోడీ అయితే ఏకంగా జాతీయ జెండాతో చెమటను తుడుచుకోవచ్చు.... కానీ ఓ కాలేజీ ప్రిన్సిపాల్... ముస్లిం అయినందుకు జెండా ఎగరేయ కూడదు. ఎగిరేసినందుకు ఆయన కాశాయ మూక చేతుల్లో దాడికి గురవుతాడు.....

వాళ్ళు హంతకులు : మనుషులనే కాదు గోవులనూ చంపుతారు.

ఛత్తీస్‌గడ్‌లోని దుర్గ్‌ జిల్లాలోని జమూల్‌ నగర్‌ నిగమ్‌ గ్రామానికి చెందిన బీజేపీ నేత హరీశ్‌ వర్మ ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో ఏడు సంవత్సరాలుగా రాజ్‌పూర్‌ గ్రామంలో ఓ గోశాలను నడుపుతున్నారు. అయితే ఆయన సొమ్మును దిగమింగి ఆ ఆవులను ఊరి మీదికి వదిలేస్తాడనే ఆరోపణలు

BJP may lose Gujarat if polls are held today: RSS internal survey

BJP may not do well and lose Gujarat if elections are held in state in the present circumstances, a fresh internal survey conducted by partyʹs ideological mentor RSS has concluded...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


HCU