జర్నలిస్టులకు ఆత్మహత్యలే గతా?

ఇక్కడ ఫంక్షన్ అవడం లేదు.. వీళ్ళంతా వారంరోజులుగా నిద్రాహారాలు మాని తమ బతుకు కోసం కొట్లాడుతున్నారు. ఇంట్లో ఆకలితో పడుకున్న భార్యాపిల్లలు.... ఆరునెలలుగా జీతాలు లేక ఇంటి కిరాయీలు కట్టక సామాన్లు బైటపడేస్తామంటూ ఓనర్ల బెధిరింపులు భరిస్తూ.... కిరాణా షాపు అతనికి అప్పు తీర్ఛలేక ఇంట్లో సామాన్లు తేలేక తల్లడిల్లుతూ.... పిల్ల స్కూల్ ఫీజులు కట్టలేక ఆ చిన్నారులను స్కూళ్ళకు పంపలేక ఏడుస్తూ.... టైఫాడ్ వచ్చి భార్య ను ఆస్పత్రికి తీసుకెళ్ళలేక ఒకరు.... తల్లి మంచాన పడితే మందులు కొనలేక ఒకరు.... ఇక్కడ ఒక్కొక్కరివి ఒక్కో బాధలు.... వీళ్ళు జర్నలిస్టులు... ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంభం... జీతాలు లేక ఆదుకునే నాదుడు లేక బోరుమంటున్న వేతనాలు లేని వేతన జీవులు..మీరిక్కడ చూస్తున్నదీ సీవీఆర్ ఛానెల్ ఉద్యోగులు. ఆరు నెలలుగా జీతాలు లేని బక్క జీవులు... కోటానుకోట్ల రూపాయలు ఆస్థులు సంపాదించుకొని , అనేక బిజినెస్ లు చేస్తూ ఛానెల్ బిజినెస్ కూడా చేపట్టిన సీవీఆర్ యాజమాన్యం. ఛానెల్ ప్రారంభించిన కొద్దిరోజులు తప్ప ఎన్నడూ సరిగ్గా జీతాలు ఇవ్వలేదు. ప్రతినెలా బతిమాలుకోవడమే. ప్రతినెలా కొట్లాటే... ఇప్పుడైతే ఏకంగా ఆరునెలలుగా జీతాలు లేవు. కష్టలు భరించి భరించి ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకి పోయి చివరకు ఆందోళనే శరణ్యమనుకొని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ TUWJ నాయకత్వంలో పోరుబాట పట్టారు. రాత్రి. పగలూ వారంరోజులుగా ఛానెల్ ఆఫీస్ లోనే ఉంటూ తమకు జీతాలు ఇచ్చిందాకా కదలబోమని శపథంపట్టారు. వాళ్ళ జేబుల్లో ఉన్న పదీ పరక పోగుచేసుకొని TUWJ యూనియన్ చేసిన కొద్దిమొత్తంఆర్దిక సహాయంతో రోజుకు ఒక్క పూటే తింటూ నూటయాబై మంది ఉద్యోగులు ఒక్క నెల జీతమైనా వస్తుందా అని ఆశగా ఎదిరి చూస్తున్నారు. అలా ఆఫీస్ లోనే భోజనం చేస్తున్నప్పుడు ఇంట్లో ఆకలితో ఉన్న పిల్లలు...టైఫాడ్ తో ఆస్పత్రిలో ఉన్న భార్య గుర్తుకొచ్చి భోరుమంటున్నాడు ఈ జర్నలిస్టు మిత్రుడు. ఇది ఒక్క సీవీఆర్ పరిస్థితి కాదు. దాదాపు పది ఛానల్లలో ఇదే పరిస్థితి. అందరికీ చాలా గొప్పగా కనిపించే ఈ జర్నలిస్టుల చీకటి జీవితాల్లో వెలుగు నిండే మార్గంలేదా.

Keywords : channel, hyderabad, telangana, cvr, tv9, abn, ntv, tv5, salary, pending, no pay no salary, employees, journalists, strike, cvr live, cvr news, protest
(2024-04-24 21:21:12)



No. of visitors : 7105

Suggested Posts


అరుణ్ సాగర్ అమర్ రహే !

తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా రంగం లో వినూత్న ఒరవడులకు కారకుల్లో అగ్రగామిగా నిలిచిన అరుణ్ సాగర్ మృతి మీడియా రంగానికి తీరని లోటు. ప్రజా ఉద్యమాల పట్ల అరుణ్ సాగర్ సునిశిత పరిశీలనా వైఖరి, ప్రజా పక్షపాత దృక్పథం, అణగారిన వర్గాలపట్ల ఆయన కమిట్ మెంట్ అనిర్వచనీయమైంది....

ఇప్పుడు కావాల్సింది ఇలాంటి జర్నలిస్టులే !

మీడియా గురించి మాట్లాడుతున్నప్పుడు, కొన్ని మీడియా సంస్థలు అమ్ముడైపోతున్న తీరును బట్టబయలు చేసిన వార్తలు, కొందరు విలేకరులు ధైర్యసాహసాలతో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న వార్తల నేపథ్యంలో గణేష్ శంకర్ విద్యార్థి పేరు స్మరించుకోవడం

పత్రికా స్వేచ్ఛపై దాడులను వ్యతిరేకిస్తూ జర్నలిస్టుల నిరసన ప్రదర్శన

పత్రికా స్వేచ్ఛపై, అసాంఘిక, సంఘ విద్రోహ చర్యలను వ్యతిరేకిస్తూ రచనలు చేసిన పాత్రికేయులపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ దేశరాజధానిలో బుధవారం జర్నలిస్టులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.

ఢిల్లీలో జరిగిన దాడుల కుట్రలను బైటపెట్టిన కారవాన్ పత్రిక....ఆ పత్రిక జర్నలిస్టులపై దాడి, లైంగిక వేధింపులు

మధ్యాహ్నం 2 గంటలకు ఈ దాడి ప్రారంభమైంది, స్థానికులైన పురుషులు,మహిళలు జర్నలిస్టులను చుట్టుముట్టారు, దాడి సమయంలో, మహిళా జర్నలిస్ట్ ఒక గేట్ ద్వారా పక్క సందులోకి పారిపోగానే ఆ ముఠా గేటును లాక్ చేసి, మిగతా ఇద్దరు జర్నలిస్టులను లోపల బంధించింది. ఆ మహిళా జర్నలిస్ట్ తన సహచరులను విడిచిపెట్టమని వేడుకొంటే ఒక వ్యక్తి ఆమె దుస్తులు పట్టుకొని మళ్ళీ గేటు లోపలికి లాగడానికి

ʹగౌరీ లంకేష్ ను గుర్తుకు తెచ్చుకోʹ - జర్నలిస్టు రానా అయూబ్ కు హత్య, రేప్ బెదిరింపులు

ప్రముఖ జర్నలిస్టు, రచయిత రానా అయూబ్ ను హత్య చేస్తామని, అత్యాచారం చేస్తామని సోషల్ మీడియాలోబెదిరింపులకు దిగారు కొందరు దుర్మార్గులు. ఈ విషయంపై ఆమె పోలీసులకు పిర్యాదు చేసింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జర్నలిస్టులకు