రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

రాజ్యం

భారత కమ్యూనిస్టు పార్టీ - మావోయిస్టు
తెలంగాణ కమిటి పత్రికా ప్రకటన
___________________________________

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయిం! కిరాతక నయీం చావు పీడిత ప్రజలకు పండుగే!!

* నయీంను సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం
* నడిపించినవి వైఎస్ఆర్, రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు
* నయీం సామ్రాజ్యానికి కొంతకాలం అండగా ఉన్న కెసిఆర్ ప్రభుత్వం.
* సౌవ్రబుద్దిన్ బూటకపు ఎన్కౌంటర్ కేసు నుంచి అమిత్ షాను కాపాడేందుకు, మై హెూం రామేశ్వరరావుకు ప్రమాదం ఏర్పడినందుకే నయీం కాల్చివేత,
* నయీం మురా హత్యలు, అక్రమ దందాలతో ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉన్న వారి పాత్రలపై హైకోర్టుసిట్టింగ్ జడ్డి చేత విచారణ జరిపించాలి.
* నయీం నేర సామ్రాజ్యంలో పాత్రధారులు, ప్రయోజనం పొందిన వారి పేర్లు, ఆస్తుల వివరాలు అధికారికంగా బయట పెట్టాలి.
* ల్యాండ్ మాఫియా, హంతక ముఠాల ద్వారా అక్రమంగా సంపాదించిన భూములు, బంగారం, డబ్బు, బంగ్లాలు, వాహనాలు తదితర ఆస్తుల్ని ప్రభుత్వం జప్తు చేసి ప్రజల పరం చేయాలి.

ప్రియమైన ప్రజలారా!
హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్లు, ప్రజాస్వామ్యం పరిరక్షకులుగా, రాజ్యాంగ బద్దులుగా, చట్ట నిబద్దులుగా ఊదరగొడుతున్నకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అవి ఏ పార్టీలకు చెందినవైనా ప్రజలను వంచనకు గురిచేస్తూనే ఉన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాల ప్రోద్బలంతో, పోలీసు ఎస్ఐబి డైరెక్షన్లో మా పార్టీ నేతృత్వంలో సాగుతున్న విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలో వివిధ టైగర్ల, కోబ్రాల పేర్లతో నయీం నాయకత్వంలో హంతక మురాలు సృష్టించబడ్డాయి. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డిల ప్రభుత్వాలు, 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండు సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం, కెసిఆర్ పరిపాలన వరకు కూడా నయీం హంతక మురా అరాచకాలకు, హత్యలకు సహకారం అందిస్తూ వస్తూనే ఉన్నాయి. నయీం నాయకత్వంలోని హంతక ముఠా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బయటి రాష్ట్రాల్లో కూడా సాగిస్తూ వచ్చిన హత్యాకాండలు, దుర్మార్గాలన్నిటికీ ఈ ప్రభుత్వాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా సమర్ధిస్తూ వచ్చాయి.

నయీం నాయకత్వంలోని హంతక ముఠా రెండు దశాబ్దాలుగా ఏమి చేసింది అనేకంటే ఈ హంతక ముఠా చేత ఆయా పార్టీల పాలకులు, పోలీసు ఇంటిలిజెన్స్ , ఎస్ఐబి అధికారులు, విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులు ఏమేమి చేయించారు? వారి అండతో మరింతగా రెచ్చిపోతూ నయీం తన నేర సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించిండో పరిశీలిస్తే ఈ పాలకవర్గాల అసలు స్వభావం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యర్థులను, విప్లవోద్యమాలను, ప్రజా ఉద్యమాలను నిర్మూలించడానికి, దెబ్బతీయడానికి పాలక వర్గాలు, ప్రభుత్వాలు వాటి యంత్రాంగం ప్రత్యక్షంగాను, పరోక్షంగాను చట్టబద్ధంగాను, చట్టాలను అతిక్రమిస్తూ ఎంతటి హత్యాకాండనైనా, ఎన్ని దుర్మార్గాలకైనా, ఎంతటి దమనకాండకైనా సాగిస్తుంటారని వర్గ సమాజ చరిత్ర చెబుతూనే ఉంది. సామ్రాజ్యవాదులు, వారి దళారీ పాలకులు, బ్యూరోక్రాట్స్ తమ రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం బిన్ లాడెన్ నుంచి నయీం వంటి వారి నాయకత్వంలో హంతక ముఠాలను నడిపించి, హత్యలు, అత్యాచారాలు, అవినీతి, దుర్మార్గాలను సాగింపచేస్తారని, చివరకు పాలకులకే ఆటంకంగా, తమకు ప్రమాదకరంగా మారిన పక్షంలో అంతమొందిస్తారని తెలంగాణ రాష్ట్రంలో తాజాగా జరిగిన నయీం కాల్చివేత ఘటన రుజువు చేస్తుంది. మొత్తం తెలంగాణను శాసించేందుకు తానే ఒక ఆధిపత్య శక్తిగా నిరూపించేందుకు తహతహలాడుతున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ముఖ్యంగా తనకు ప్రధాన ఆదాయ వనరు తనకు గుండె కాయ అయిన మై హెూమ్ రామేశ్వరరావుకు, కొండా విశ్వేశ్వర్ రావు వంటి వాళ్లకు ప్రమాదం ముంచుకొస్తే తప్ప, తమ ప్రయోజనాలకు, లావాదేవీలకు ఆటంకం ఏర్పడుతున్నదని, తమ నేర చరిత్రంతా బహిరంగ పడే అవకాశం ఉన్నదనే ఆలోచనతో, భయంతోనే, ప్రధానంగా సౌవ్రబుద్ధిన్ ఎన్కాంటర్ నిందితుడు అమిత్ షా, నేడు దేశాన్ని ఏలుతున్న బిజెపి అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయనకు రాజకీయంగా ఇబ్బంది రావచ్చుననే భయంతోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ కనుసన్నల్లో నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ), ఎస్ఐబి లతో నయింను ఎన్కౌంటర్ పేరుతో అంతమొందించారు తప్పితే చట్టాలను, ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రజలు గుర్తించాలని కోరుతున్నాం.

మాజీ ఎంఎల్ఎలు, మాజీ మంత్రులు, ఎంపిలు నయీం ముఠా చేత ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు పెట్టుకొని ప్రయోజనం పొందినవారు ఇప్పటివరకు బహిరంగ రహస్యమే కదా. ఇప్పుడు అయితే డాక్యుమెంట్స్ రికార్డ్స్, డైరీలు సాక్ష్యంగా దొరుకుతున్నాయన్న వార్తలు మీడియాలో వస్తున్నాయి కదా. వాటిని ప్రజల ముందుకు పెట్టి వీరిని శిక్షించాలని పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ నయిం హంతక ముఠా స్థాపనకు, వాటి కార్యకలాపాలకు సూత్రదారులు, నేడు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నుంచి మొదలు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపిలు, ఎంఎల్యేలు, ఎంఎల్సీలు, డిజిపిలు, ఐపిఎస్ అధికారుల వంటి ఉన్నత స్థానంలో ఉన్న వాళ్లను శిక్షించాలంటే కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన సిట్తో కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్డి చేత స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలని, ప్రజలు, ప్రజాస్వామికవాదులు డిమాండ్ చేస్తూ ఉద్యమించాలని మా పార్టీ పిలుపునిస్తుంది. వేలాది ఎకరాలను ప్రజల నుంచి కబ్జా పెట్టిన భూమిని, బాధితుల్లో పేద,మధ్యతరగతి ప్రజలకు వారికి తిరిగి ఇప్పించాలి అని డిమాండ్ చేయాలి. వేల కోట్ల ఆస్తులను, మిగతా అక్రమ ఆస్తులను, నయిం బినామీలైన వారు ఏ స్థాయిలో ఉన్నా వారి ఆస్తులను జప్తు చేసి ప్రజల పరం చేయాలి. సూత్రధారులు, పాత్రధారులైన రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, ఎస్ఐబి ఇతరత్రా ప్రభుత్వాధికారులు, కాంట్రాక్టర్లు పెట్టుబడిదారులు, తదితర నేర సామ్రాజ్యపు భాగస్టులందరిని అరెస్టు చేసి శిక్షించాలని ప్రజాస్వామిక వాదులంతా డిమాండ్ చేయాలి. ల్యాండ్ మాఫియా, హంతక ముఠాల ద్వారా అక్రమంగా సంపాదించిన భూములు, బంగారం, డబ్బు, బంగ్లాలు, వాహనాలు తదితర ఆస్తుల్ని ప్రభుత్వం జప్త చేసి ప్రజల పరం చేయాలి. నయింతో సంబంధం ఉన్న వాళ్లు ఏ పదవుల్లో ఉన్నా వారందరిని తొలగించి శిక్షించాలి. నయిం నేర సామ్రాజ్యంలో పాత్రధారులు, ప్రయోజనం పొందిన వారి పేర్లు, ఆస్తుల వివరాలు అధికారికం బయట పెట్టాలి. రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక, హంతక, అవినీతి కార్యకలాపాలు సాగింపచేస్తూ వస్తున్న వారందరూ శిక్షకు గురి కావాల్సిందే అని డిమాండ్ చేయాలి. అక్రమాలు అరికట్టబడాలని, హత్యాకాండలు, అవినీతి ఆగిపోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఏ మాత్రం చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నా నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న పోలీసు ఇంటిలిజెన్స్ ఎస్ఐబి డిపార్ట్మెంట్ల ద్వారా కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్డి ద్వారా నిష్పాక్షిక దర్యాప్త జరిపించాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు ముక్తకంఠం తో డిమాండ్ చేయాలని మా పార్టీ పిలుపునిస్తుంది. నయిం హంతక ముఠా ద్వారా రాజకీయ హత్యలు చేయించిన పోలీసు అధికారులనే కాకుండా, ఆయా హత్యల్లో నయిం ముఠా సభ్యులతో సివిల్ దుస్తులతో ప్రత్యక్షంగా పాల్గొంటూ హత్యలు చేసిన పోలీసులపై కూడా కేసులు నమోదు చేసి శిక్షించాలి.

కరీంనగర్ జిల్లాలో మోహన్ రెడ్డిని ముందు పెట్టి పెద్ద ఎత్తున ప్రజల ఆస్తులు, భూములను కాజేసిన, ప్రజలను బెదిరింపులకు, వారు ఆత్మహత్యలకు పాల్పడేలా భయభ్రాంతులకు గురిచేస్తున్నపోలీసు అధికారులను, అలాగే తెలంగాణలోని ఆయా జిల్లాల్లో ల్యాండ్ మాఫియా నడిపిస్తున్న పోలీసు అధికారులపై చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలి. నయీం ముఠా సాగించిన హత్యలు, అక్రమ దందాలలో ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉండి ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవడం కాకుండా నిష్పక్షపాతంగా అరెస్టు చేసి నేరస్తులను శిక్షించాలి. నయిం మురా కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఇతర రాష్ట్ర పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, మాజీ, మాఫీయాల పేర్లన్నీ బయటపెట్టి వెంటనే అరెస్టు చేసి శిక్షించాలి.

నయీం ఏనాటికైనా ప్రజల చేతుల్లో ఖతం అయ్యేవాడే నయిం మా ఉద్యమంలో పనిచేసి దిగజారిపోయి, కోవర్టుగా మూరి పార్టీకి తీవ్ర నష్టం చేసి, భువనగిరి నుంచి మొదలు పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గడ్, ఒడిశాలలో కూడా పార్టీకి నష్టం కలిగించడానికి ఎస్ఐబి డైరెక్షన్లో మాజీలతో చాలా మంది లొంగిపోయిన వారిని చేరదీసి, రాయపూర్, జగదల్పూర్, సుకుమా, నవరంగ్ పూర్లలో కేసులు ఏర్పాటు చేశాడని మాకు సమాచారం ఉంది. ఈ పని గురించి చాలా మంది లొంగిపోయిన వారిని వాడుకుంటూ, వారి కుటుంబాలతో సహా ఈ బేస్లలో మామూలు కుటుంబాలుగా దించాడు. వారు మా పార్టీ కార్యకర్తల కార్యకలాపాలు సేకరించే క్రమంలో ఉన్నారు. వీళ్లకు ఎకెలు, కార్బైన్లు, రివాల్వర్లు, పిస్టల్ వంటి ఆయుధాలను ఎపి, తెలంగాణ, ఛత్తీస్గడ్, ఒడిశా పోలీసు ఉన్నతాధికారులు సమకూర్చారు. వీరు ఎక్కువగా నారాయణముండా ప్రదేశంలో ఆకాక్ హెూటల్ ఎదురు గల్లి, సాయిబాబా గుడికి దగ్గర, ఆదగల్పూర్ ఇనం. 64, మోడల్ సిటీ, దుండా, కమల్ విహార్ కొత్త వెంచర్, క్రిష్ణా స్కూల్కు దగ్గర రాయ్ పూర్, సుకుమా కలెక్టర్ ఆఫీస్, సుకుమా టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ దగ్గర, సుకుమా. నయీం ఎక్కువగా జదగల్పూర్, సుకుమా బేస్లలో తిరిగేవాడు. అప్పుడప్పుడు రాయ్ పూర్, నవరంగ్ పూర్ స్థావరాలలో కూడా వచ్చి వెళ్లేవాడు. ఈ ఆపరేషన్ కు ఛత్తీస్గడ్ స్థానిక వాహనాలు కొని వాడుతున్నాడు. ఈ క్రమంలో మా చేతిలో ఖతం అయ్యేవాడే నయి అనుచరులు ఛత్తీస్గడ్లో వాడే వాహనాలు - మహేంద్ర ఎస్యూవి - సిజీ-0ఎఫ్ఎ 7919 (వైట్ కలర్) ఇండికా విస్టా - సిజి 04 ఎచ్.బి 6080 (వైట్ కలర్) నయిం ఎక్కువగా క్రోమ్ బండి, ఎండీవర్, మారుతి ఆల్టో కార్లలో ఈ బేస్లలో తిరిగేవాడు. మారుతి ఆల్టో కారులు, బైక్లు సిజి04 కెయు 6322 ఎవెంజర్, ఇంకా సూచీలు, హెూండా ఆక్టివాలు వాడుతున్నారు. వీరంతా వెంటనే ఈ కార్యకలాపాలకు స్వస్తి చెప్పి సామాన్య జీవితం గడపాలి. లేకుంటే ప్రజల చేతుల్లో ఇలాంటి వారు ఖతం కాక తప్పరని హెచ్చరిస్తున్నాం. ఈ దోపిడీ వర్గాలు అవసరం ఉన్నంత వరకు నయీంలను వాడుకొని, అవసరం తీరాక వారే అంతమొందిస్తారని నయీం సంఘటనతో మరోసారి రుజువైంది.
కాబట్టి మరొకరు ఎవరూ ఈ దోపిడీ వర్గాలు ఉపయోగ పడవద్దని హెచ్చరిస్తున్నాం.

విప్లవాభివందనాలతో

- జగన్ అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ
సిపిఐ (మావోయిస్టు)

Keywords : maoists, police, nayeem, kcr, chandrababu, ysr, encounter, telangana
(2024-04-26 06:27:28)



No. of visitors : 18862

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రాజ్యం