అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా


అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అబద్దాలు

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు. ఈ రోజుల్లో కూడా ఇంతలా వృత్తి పట్ల అంకిత భావం ప్రదర్శించే వారుంటారా అనే వారికి అతడి లేఖ ఓ కనువిప్పు అవుతుంది. వివరాల్లోకి వెళితే... జమ్మూ కాశ్మీర్‌కు చెందిన నజీర్ అహ్మద్ అల్లాటప్పా జర్నలిస్టు కాదు. జీ న్యూస్ నెట్‌వర్క్‌లో 16 ఏళ్లు పనిచేశాడు. ఆ తర్వాత 2014 నవంబర్‌లో నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఐబీఎన్7 హిందీ న్యూస్ చానెల్‌లో చేరాడు. నెట్‌వర్క్ 18 గ్రూప్‌లో ఈ ఛానల్ ఒకటి. ఇది హిందీలో వార్తలు అందిస్తుంది.
నజీర్ అహ్మద్ రాసిన రాజీనామా లేఖ ప్రకారం జులై మాసంలో జమ్మూ కాశ్మీర్‌లో బుర్హన్ వనీ మరణించిన తర్వాత ఐబీఎన్7 ఎడిటోరియల్ బోర్డు నజీర్‌పై ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. బుర్హాన్‌కు వ్యతిరేకంగా కల్పిత కథనాలు రాయాలని ఆదేశించింది. అంతేకాక అక్కడి వాస్తవాలను వక్రీకరిస్తూ వార్తలు ఇవ్వాలని కోరింది. అయితే అలాంటి వార్తలు ఇవ్వడానికి నజీర్ నిరాకరించడు. దాంతో జమ్మూ రిపోర్టర్‌కు ఆ పని పురమాయించింది ఎడిటోరియల్ బోర్డు. ఇంకేముంది జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించి ప్రజలను పక్కదారి పట్టించే వార్తలు చానల్‌లో పుంఖానుపుంఖాలుగా ప్రసారం కాసాగాయి. అదే సమయంలో ఓల్డ్ శ్రీనగర్ సిటీలో సీఆర్పీఎఫ్ బలగాలు జరిపిన పెల్లెట్ల దాడిలో మరణించిన ఏటీఎం గార్డు గురించి ఒక స్టోరీని టెలికాస్ట్ చేయడానికి టీవీ చానెల్ నిరాకరించింది. దీంతో నజీర్ దిగ్భ్రాంతి చెందాడు. అదేమని అడిగితే బదులుగా కాశ్మీర్‌లో గాయపడిన భద్రతా సిబ్బంది ఎవరైనా కనిపిస్తే వాళ్ల మీద ఒక స్టోరీ రాయమని అతడ్ని కోరింది. అంతేకాక నజీర్ పంపించిన ప్రతి వార్తా కథనాన్ని వక్రీకరించి ప్రసారం చేయడం ఒక అలవాటుగా చేసుకుంది సదరు టీవీ చానెల్. దీంతో తీవ్రమైన ఆవేదనకు గురైన నజీర్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సదరు చానల్ వాస్తవాలను వక్రీకరించి, మూర్ఖ జాతీయవాద ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నందుకు నిరసనగా ఉద్యోగాన్ని వదులుకుంటున్నట్టు నజీర్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నాడు. ఒక వర్గం ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి కల్పిత కథనాలను ప్రసారం చేస్తోందని వాపోయాడు. అలాంటివారి కోసం తప్పుడు వార్తలు అందించడానికి తన అంతరాత్మ అంగీకరించలేదని పేర్కొన్నాడు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేశానని తెలిపాడు. కాశ్మీర్ విషయానికి వచ్చేసరికి... నూటికి తొంభై తొమ్మిది శాతం భారతీయ వార్తా చానెళ్లు వక్రీకరించిన వాస్తవాలను జనం నెత్తిన రుద్దుతున్నాయి.

Keywords : kashmir, Journalist, ibn7, net work 18, burhan wani, killings
(2019-08-22 01:14:37)No. of visitors : 3042

Suggested Posts


మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

కాశ్మీరీ చిన్నారుల విషాదం - ʹచదువన్నాఆగుతుంది కానీ చావు ఆగదు..ʹ

ʹమా కోసం చదువన్నా ఆగుతుంది కానీ చావు ఆగదు. ఓ ఇండియా... నీకోసం సింధు వెండిని తీసుకొస్తే.. ఇక్కడ(కాశ్మీర్‌లో) నీకోసం బంగారమే ఉందిʹ అని హిష్మా నజీర్ పలికింది. ఇలాంటి వ్యాఖ్యలతో సంజీవ్ సిక్రి డైరెక్ట్ చేసిన వీడియో....

బుర్హాన్ వని ఎన్ కౌంటర్ పై సారీ చెప్పండి - పోలీసులకు సీఎం ఆదేశం

కాశ్మీర్ లో బుర్హాన్ వని ఎన్‌కౌంటర్‌పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబాబూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రోడ్లు, వీధుల్లో కూడా పోలీసులు కనిపించరాదంటూ ఆమె ఆదేశాలిచ్చినట్టు....

టీఆర్పీ రేటింగ్స్‌ కోసమే కశ్మీర్‌లో చిచ్చు - మీడియా పై ఓ ఐఏఎస్ ఆగ్రహం

ʹరాజ్యం తన పౌరుల్ని తానే చంపడం.. గాయపర్చడం.. తనను తాను గాయపర్చుకొని.. స్వీయవిధ్వంసం చేసుకోవడమేʹ అని ఓ ఐఏఎస్ ఆఫీసర్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ మీడియా తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు, ప్రజల్లో విభజన....

Search Engine

నరనరాన కుల బలుపు....దళితుడి మృతదేహాన్నీ అడ్డగించిన కులోన్మాదులు
పిల్లల అక్రమ రవాణా కేసులో బీజేపీ నాయకురాలు అరెస్ట్ !
క‌శ్మీరీ విద్యార్థుల క‌న్నీటి గాథ‌లు
ఆర్మీపై నేను చేసిన ఆరోపణలకు సాక్ష్యాలున్నాయి...షెహ్లా రషీద్
తెలంగాణ సాయుధ పోరాటం నుండి నక్సల్బరీ వరకు... ఎమ్ టీ ఖాన్ జీవితం
ఖాన్ సాబ్ - వివి - ఓ జ్ఞాపకం...!!
ఆస్పత్రి సిబ్బంది దుర్మార్గం...కారిడార్ లోనే మహిళ ప్రసవం...రక్తపు మడుగులో నిస్సహాయ మహిళ‌
పదునెక్కుతున్న హిట్లర్ పాలన కోరలు - ఎన్.వేణుగోపాల్
జర్నలిస్ట్ ను హత్య చేసిన లిక్కర్ మాఫియా
కశ్మీర్ లో ఆంక్షల మధ్యే గిలానీ ట్వీట్స్... సహకరించారని ఇద్దరు బీఎసెనెల్ ఉద్యోగులు సస్పెండ్ !
Protest Prime Minister Modiʹs visit to the United Nations...Coalition Against Fascism in India
మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు
కేటీఆర్ కు సడెన్ గా ప్రజాస్వామ్యం ఎందుకు గుర్తొచ్చింది ?
ʹబంగారం లేదు వజ్రాలు లేవు ఈ కట్టు కథలన్నీ యురేనియం కోసమేʹ
సత్యం కోసం నిలబడటమే ఆయన నేరం...ఐపీఎస్ సంజీవ్ భట్ కు అండగా నిలబడదాం !
కశ్మీర్‌లో పర్యటించిన ఆర్థికవేత్త ʹజీన్ డ్రీజ్ʹ ఇంటర్వ్యూ..!
ʹఆర్టికల్ 370 రద్దు పరిష్కారమాʹ అనే అంశంపై ‍ సభ‌
KASHMIR CAGED – A REPORT FROM THE GROUND
పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!
బీజేపీ ఎమ్మెల్యేపై ఉన్న మతకలహాల కేసులు ఎత్తి వేయడానికి రంగం సిద్దం
నిజాలు చెప్పడానికి ప్రెస్ క్లబ్ లో కూడా అడ్డంకులా ?
లొంగిపోయి పోలీసుగా మారిన అన్నకు... మావోయిస్ట్ కమాండర్ అయిన చెల్లె లేఖ‌ !
కస్టడీలో ముద్దాయిని ఎలా కొట్టి చంపాడో వివరించిన మాజీ డీసీపీ
ఈ భూమిని వారికి అమ్మకపోతే వాళ్ళు తుపాకులతో సహా రాగలరు...ప్రముఖుడికి లేఖ
ఈ కశ్మీరీ పండిట్ చెప్పేది ఒకసారి విందామా !
more..


అబద్దాలు