మహాజనాద్భుత సాగరహారానికి నాలుగేళ్ళు

మహాజనాద్భుత

కళ్లున్నందుకు చూసి తీరవలసిన దృశ్యం అది. హృదయం ఉన్నందుకు పొంగిపోవలసిన అనుభవం అది. దేహం ఉన్నందుకు ఆ బహు శతసహస్ర భూమిపుత్రుల దేహాల సంరంభాన్ని అనుభవించవలసిన సందర్భం అది. తెలంగాణ బిడ్డ అయినందుకు సంపూర్ణంగా సంలీనం కావలసిన సన్నివేశం అది. తెలంగాణ బిడ్డ కాకపోయినా న్యాయం కోసం గళమెత్తుతున్న ఆ లక్షలాది గొంతులలో కలగలిసి ముక్తకంఠం కావలసిన వేళ అది.
ఆదివారం సాయంకాలం హుస్సేన్ సాగరతీరంలో అనేక ఆంక్షలనూ, ఆటంకాలనూ, నయవంచనలనూ, హామీల ఉల్లంఘనలనూ అధిగమించి జరిగిన సాగరహారం జీవితంలో అత్యంత అరుదుగా అనుభవమయ్యే మహాద్భుత ఉద్వేగభరిత జన కావ్యం. నిజంగా అది ఒక మహాకావ్యానికి వస్తువు. అక్కడ ఎగసిన భావోద్వేగాలు ఒక రోమాంచకారి నవలా ఇతివృత్తం. మూడు నాలుగు ప్రత్యేకమైన అనుభవాలను మాత్రం పంచుకోవాలి.
అక్కడ రాజకీయపక్షాల జెండాలు కనబడి ఉండవచ్చు, రాజకీయవాదుల గళాలూ నినాదాలూ వినబడి ఉండవచ్చు. కాని రాజకీయాలంటే ఎన్నికల రాజకీయ పక్షాలనే అర్థంలో చూస్తే అది ప్రధానంగా రాజకీయ ప్రదర్శన కాదు. అది తెలంగాణ బిడ్డల స్వచ్ఛంద ప్రదర్శన. తెలంగాణ తల్లికి నీరాజనాలు సమర్పించడానికి, సగౌరవ హారతి ఎత్తి పట్టడానికి తమంతట తామే లక్షలాది తెలంగాణ బిడ్డలు కూడిన మహా సందోహం. ఒక జాతర. ఒక పండుగ. ఒక అంగడి. ఒక బతుకమ్మ. ఒక జమ్మిఆకు యాత్ర. ఒక ఉత్సవం.
అది రాజకీయ పక్షాల సభ కాదంటే రాజకీయ పక్షాలు ప్రజలను తోలుకు వచ్చిన సభ కాదని. నిజానికి ఒక రాజకీయ పక్షం సాగరహారం పట్ల ఒకింత దూరాన్ని పాటించింది. అయినా జనం కదిలివచ్చారు. మూడు రాజకీయపక్షాలు అంతా తామేనన్నట్టు, ఒక మనిషి, రెండు జెండాలుగా హడావుడి చేశాయి. కాని వాటిలో ఒక రాజకీయపక్షం పదమూడేళ్ల కింద చేసిన మోసాన్ని ప్రజలు ఇంకా మరచిపోలేదు. మరి రెండు రాజకీయపక్షాలు ఇప్పుడు కొత్తమురిపెంలో పొద్దెరగనట్టు ప్రవర్తిస్తున్నప్పటికీ నిన్నమొన్నటి దాకా అవి తెలంగాణ వద్దన్న సంగతి చరిత్ర ఇంకా గుర్తుంచుకున్నది. కనుక ఆ హడావుడి చేసిన రాజకీయపక్షాలు పిలిచాయని కూడ కాదు.
రాజకీయపక్షాల ఎన్నికల తతంగాలతో సంబంధం లేని ఐక్య కార్యాచరణ సమితి పిలుపు ఇచ్చిందని జనం వచ్చారు. రాజకీయపక్షాల వల్ల కాదు, రాజకీయపక్షాలు ఉన్నప్పటికీ తమ ఆకాంక్ష కోసం జనం తరలి వచ్చారు. తెలంగాణ సాధించడానికి అన్ని మార్గాలూ ప్రయత్నించాం, ఇంకా ఏం చేయాలి అని నిరాశతో, నిస్పృహతో కాదు, మరొకసారి ఆశను కూడగట్టుకునేందుకు వచ్చారు. ఎవరో తీసుకొస్తే కాదు, ఎవరో తోసుకొస్తే కాదు, ప్రతి వ్యక్తీ తనంతట తాను కదిలివచ్చారు. గుండె రవరవలాడితే తోసుకుని వచ్చారు. ఒక్కసారి ఆ నాలుగులక్షల ముఖాల్లోకి చూస్తే ఎవరికయినా ఆ బలవత్తరమైన ఆకాంక్ష అర్థమయి ఉండేది. ఆ రెండు మూడు కిలోమీటర్లు అటు చివరినుంచి ఇటు చివరిదాకా రెండుసార్లు తిరిగితే వేలాది మంది పరిచయస్తులూ మిత్రులూ కలిశారు. సొంత పూనికమీద, సొంతఖర్చుతో, అక్కడికి వెళ్లకపోతే గొప్ప అనుభవం ఒకటి పోగొట్టుకుంటామన్నంత ఆర్తితో తరలివచ్చిన వారు.
రాజకీయ గుర్తింపు కోసమో, లైవ్ టెలివిజన్ లో కనిపించాలనే యావతోనో వేదిక మీదికి అవసరం లేని వాళ్లు కూడ ఎక్కడం, వారిని దిగమని చేసిన విజ్ఞప్తులే సగం సమయాన్ని ఆక్రమించడం, వేదిక మీదికి రావలసిన, మాట్లాడవలసిన రాజకీయ నాయకులు రాకపోవడం, వేదిక మీద కార్యక్రమాలు క్రమబద్ధంగా జరగకపోవడం వంటి లోపాలెన్ని ఉన్నా, వాటన్నిటినీ విస్మరించదగినంత గొప్ప స్ఫూర్తిని ఆ జనసందోహం అందించింది.
సాగరహారంలో హింస, విధ్వంసాల మీద ముందూ తర్వాతా చాల చర్చ, రచ్చ జరుగుతున్నది. కాని సాగరతీరంలో దృశ్యం వేరు. ఐదు-ఐదున్నర సమయంలో అప్పటికి గంట సేపటినుంచి వేదిక వెనుకవైపు నుంచి ఆకాశంలోకి ఎగస్తున్న పొగలు చూసి, ఉండీ ఉడిగీ వినిపిస్తున్న తుపాకి కాల్పుల శబ్దాలు విని అక్కడ ఏం జరుగుతున్నదో చూద్దామని వేదిక వెనుకవైపు వెళ్లాం. అక్కడ కనిపించినది ఒక అద్భుత దృశ్యం. 1969 జై తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులకూ సి ఆర్ పి దళాలకూ జరిగిన పిచ్ డ్ బ్యాటిల్స్ – ఎదురుబొదురు యుద్ధాల – గురించి చదివి మాత్రమే ఉన్నవారికి అది కళ్ల ముందర పునరావృతమైన అద్భుత సందర్భం. వేదికకు యాభై గజాల వెనుకనే పోలీసులు ముళ్లకంచెల అడ్డుకట్టలు కట్టి ఉన్నారు. ఆ ముళ్లకంచెలను తొలగించి, అక్కడి పోలీసుల లాఠీచార్జిలనూ, టియర్ గ్యాస్ కాల్పులనూ ఎదిరిస్తూ రాళ్లతో జవాబు చెపుతూ ప్రజలు పోలీసులను అక్కడి నుంచి దాదాపు ఒక కిలోమీటర్ అవతలి దాకా వెనక్కి నెడుతూ వెళ్లారు. పోలీసులు ఆ కోల్పోయిన స్థలాన్ని తిరిగి ఆక్రమించడానికి లాఠీచార్జిలతో, టియర్ గ్యాస్ తో, హింసాకాండతో మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండడం కళ్లారా చూశాను.
అక్కడ అప్పటికే తగలబడిపోయిన, తగలబడుతున్న వాహనాల దగ్గర వందలాది మంది మూగి వాటిని తమ సెల్ ఫోన్లలో చిత్రించుకుంటున్నారు. వాళ్లు వాటిని హింసాకాండ అనో, విధ్వంసమనో అనుకోవడం లేదు. ఏదో ఒక పవిత్ర తీర్థయాత్రా స్థలానికి వచ్చినట్టు వస్తున్నారు. ఆ జనం కళ్లలోని తృప్తినీ, సంతోషాన్నీ చూస్తే వారెవ్వరూ దాన్ని హింస అనుకోవడం లేదని, తెలంగాణ ధర్మాగ్రహ ప్రకటనకు ప్రతీక అని అనుకుంటున్నారని అర్థమయింది. అలాగే ముందుకు వెళుతుండగా అటునుంచి వందలాది మంది గుంపుగా పరుగెత్తుకువస్తూ ʹవాటర్ క్యానన్ల సాయంతో పోలీసులు వస్తున్నారు పరుగెత్తండిʹ అన్నారు. వారితో పాటు నేనూ గోడ దూకి రైలుకట్టమీదికి ఎక్కాను. ఒక ఫర్లాంగు వెనక్కి వచ్చాక హుస్సేన్ సాగర్ లోకి వచ్చే నాలా మీద వంతెన. పట్టాల మధ్య ఒక్క మనిషి మాత్రమే నడవగల దారి. వందలాది మంది ఒకరివెనుక ఒకరు క్రమశిక్షణతో చీమలదండులా ఆ వంతెన దాటి సభవైపు వచ్చారు. అప్పటికే రైలు వంతెనకు సమాంతరంగా ఉన్న రోడ్డు వంతెనమీది దాకా జనాన్ని తరుముతూ వచ్చిన వాటర్ కానన్లు రైలు కట్టమీదికి కూడ నీటి జల్లులు కొట్టాయి. కాని ఒక్క నిమిషంలో దృశ్యం మారిపోయింది. కొన్ని వందల మంది జనం ఆ వాటర్ కానన్ల మీదికి రాళ్లు విసురుతూ వాటిని బెదిరిస్తున్నట్టుగా ముందుకు కదులుతుంటే ఆ మహారాక్షస యంత్రం వెనక్కి వెనక్కి పారిపోవడం మొదలుపెట్టింది. అంతకన్న నయనానందకర సుందర ఉజ్వల దృశ్యం మరేముంటుంది?
తర్వాత సభకు తిరిగి వస్తే కొద్ది నిమిషాల్లోనే భోరున వాన. ఇటీవలి కాలంలో ఎప్పుడూ కురవనంత పెద్ద వాన. అది కూడ ఐదో పదో నిమిషాలు కురిసి ఆగిపోయిన వాన కాదు. అయినా జనం కదలలేదు. తెలంగాణ కోసం దేన్నయినా ఎదిరిస్తాం, దేనికయినా సిద్ధపడతాం అని జనం అక్షరాలా మనోవాక్కాయకర్మలా ప్రకటించిన అద్భుత సన్నివేశం అది. ఆ వర్షం నేలనంతా బురదమయం చేయకపోతే, రాజకీయ వాదవివాదాలు అడ్డురాకపోతే పివి ఘాట్ తెహ్రీర్ స్క్వేరో, జకోటి పార్కో అయి ఉండేదా? సాగరహారం మిలియన్ మార్చ్ తోనో ఆక్యుపై వాల్ స్ట్రీట్ తోనో భుజం కలిపి ఉండేదా? వారాలో నెలలో కాకపోయినా కనీసం కొన్ని రోజులయినా సాగి ఉండేదా? మహాఘనత వహించిన ఆంధ్ర ప్రదేశ్ సర్కారు తాను హోస్నీ ముబారక్ కన్న, బారక్ ఒబామా కన్న అనాగరికమైనదాన్నని రుజువు చేసుకుని ఉండేదా?
ఆ జరగని పని ఎలా ఉన్నా జరిగిన పని అద్భుతమైనది. సకల అవరోధాల మధ్య ఆ పని సాధించిన తెలంగాణ మహాజనానికి జేజేలు.

-ఎన్ వేణుగోపాల్, వీక్షణం ఎడిటర్, రచయిత , కవి, విశ్లేషకులు

Keywords : sagara haram, telangana, struggle, trs, kcr, writer, hyderabad
(2024-04-24 21:04:22)



No. of visitors : 4057

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మహాజనాద్భుత