ʹజబ్ దిల్ హీ టూట్ గయా హమ్ జీకే క్యా కరేʹ

ʹజబ్

78 ఏండ్ల ఆ వృద్దుడు ఏడుస్తున్నాడు.....జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో శతృసైనికుల బుల్లెట్లకు ఎదురొడ్డి నిల్చిన ఆ మాజీ సైనికుడు మోడీ కొట్టిన ఒక్క దెబ్బకు వెక్కి వెక్కి బోరున ఏడుస్తున్నాడు...ఏడ్చే శక్తి కూడా లేక శరీరం వణికి పోతోంది.... అయినా ఆగడంలేదు ఏడుపు..... ఏమేమి గుర్తుకొచ్చాయో.... ఇన్నేండ్లుగా పడుతున్న ఎన్ని కష్టాలు గుర్తుకొచ్చాయో.... గాయాలన్నీ కండ్లలోంచి కారిపోతున్నాయి. చుట్టూ వందలాది జనం... జనం కాదు ఖాతాదారులు... అందరి గుండెలు దుఖంతోనే ఉన్నాయి. ఈ వృద్దుణ్ణి చూస్తే అందరికి జాలి కలుగుతోంది. కానీ ఎవరేం చేయగలరు ?

అతని పేరు నంద్ లాల్ . ఒకప్పుడు అతను సైనికుడు. పంజాబ్ , కాశ్మీర్ సరిహద్దుల్లో పని చేశాడు. ఎన్నో సార్లు శతృసైనికులతో హోరాహోరి పోరాటంలో పాల్గొన్నాడు. రిటైర్మెంట్ తర్వాత గుర్ గాం లో స్వంత ఇంట్లో నివసించేవాడు. పిల్లలు లేరు. ముప్పయేండ్లకింద భార్య చనిపోయింది ఆ తర్వాత ఒంటరి జీవితం . ఓ అమ్మాయిని దత్తత తీసుకొని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. పెండ్లి చేశాడు. పెండ్లి తర్వాత ఆ అమ్మాయి ఇతని ఇల్లును అమ్మేసి వెళ్ళి పోయింది. మళ్ళీ ఒంటరి జీవితం.... పెన్షన్ గా వచ్చే 8 వేల రూపాయలతో గుర్ గాం లోని భీం నగర్ లో పది అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు ఉన్న చిన్న కిరాయిరూం అందులో ఒక చిన్న బెడ్, ఓ ప్లాస్టిక్ కుర్చీ, ఓ పాత ట్రంక్ పెట్టె, ఓ ప్లాస్టిక్ బకెట్, ఓ రెండు నీళ్ళ బాటిళ్ళు, ఓ రెండు దేవుడి ఫోటోలు ఇవి ఆయన స్వంత ఆస్తులు. అయినా అతను జీవితంలో ఆనందం వెతుక్కోవడం నేర్చుకున్నాడు. తనకొచ్చే పెన్షన్ తో బతుకుబండి లాగుతూన్నాడు.

కానీ.... హటాత్తుగా ప్రధాని మోడీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రతి నెల తనకొచ్చే ఎనిమిదివేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడం అసాధ్యమై పోయింది. ఇంటి ఓనర్ కు కిరాయి కట్టాలి. కిరాణా షాప్ లో బియ్యం, ఉప్పు, పప్పు లాంటి సామాన్లు కొనుక్కోవాలి. తనకు సహాయంగా ఉండే పని మనిశికి జీతమివ్వాలి. ఎలా ??? తన అకౌంట్ ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ కు ఎన్ని సార్లు వెళ్ళినా నిరాశే మిగిలింది. అప్పటికి మూడురోజులుగా వంద రూపాయలకు ఓ రిక్షాను మాట్లాడుకొని బ్యాంకుకు రావడం లైన్లొ నిలబడడం... ఉట్టి చేతులతో వెనక్కి మళ్ళడం... ఈ రోజూ పొద్దున్నే చేతి కర్ర సహాయంతో మళ్ళీ బ్యాంకు దగ్గరికి వచ్చాడు. శక్తి లేకపోయినా రెండు గంటలకు పైగా క్యూలో నిలబడ్డాడు. ఒక్క సారిగా జనం ( కాతాదారులనాలేమో ) పెరిగి తిక్కిసలాట జరిగింది. పాపం నంద్ లాల్ ను లైన్లో నుండి పక్కకు తోసేశారు. అప్పటిదాకా ఆపుకున్న ఆవేశం , నిస్సహాయత ... దుఖం ఏరులై పారింది... ఆ పైనున్న ఫోటో హిందుస్తాన్ టైమ్స్ ఫోటో గ్రాఫర్ అప్పుడు తీసిందే. ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మోడీ ప్రభుత్వం పై నెటిజన్లు విరుఛుక పడ్డారు. అక్రమ ధనం ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారని చెప్పిన మోడీ , అతని భక్తులు నంద్ లాల్ కు జవాబు చెప్పాలని నిలదీశారు. ఆ పై హిందుస్తాన్ టైమ్స్ ప్రతినిధి నంద్ లాల్ ను వెతుకుతూ అతని ఇంటికి వెళ్ళారు. అతనితో మాట్లాడారు.
ʹమా డబ్బులు మాకెందుకివ్వరు ? ముందుగా ఏర్పాట్లు ఎందుకు చేసుకోలేదు ?ʹ అని నంద్ లాల్ ప్రశ్నించారు. ఇది ఓ అతి సామాన్యుడు అడిగే అతి సామాన్య ప్రశ్న. దీనికి జవాబు ఎవ్వరివ్వాలి ?
అతన్ని ఎరిగిన చుట్టు పక్కల వాళ్ళు అతను చాలా ధైర్యంగా జీవితాన్ని సాగిస్తున్నాడని చెప్పారు. నిజమే కదా అతను సైనికుడు. అతను తన జీవితం గురించి చెబుతూ చివరగా ఓ హిందీపాట చరణాలను వినిపించాడు " జబ్ దిల్ హీ టూట్ గయా హమ్ జీకే క్యా కరే " ( గుండే పగిలిన తర్వాత బతికి ఏం ప్రయోజనం )
78 ఏండ్ల నంద్ లాల్ గుండెను ముక్కలు చేసిందెవరు ?


Keywords : demonetisation, modi, banks, nand lal, uttarapradesh, gurgav
(2024-03-26 14:31:16)



No. of visitors : 1784

Suggested Posts


One Step Forward, Two Steps Back: Kobad Ghandy on Demonetisation

The recent month has seen millions of poor and middle-class people, with no cash to buy food and medicines, standing in long queues to access their own money from the ATMs and banks, while the bigwigs of the Bharatiya Janata Party (BJP) were celebrating a five-day wedding....

Fight breaks out as woman jumps bank queue, police fire in air

A nasty fight erupted outside a bank here after a woman attempted to jump the queue to withdraw money, prompting police to fire in the air. The woman identified as Shanti tried to jump the queue.....

50 రోజులన్నది ఉత్తి మాటే...కష్టాల క్యూలు ఇప్పట్లో తగ్గవు !

ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని మోడీ 50 రోజుల మాట నీటి మూటేనని తేలిపోయింది. కష్టాల క్యూలైన్లు పెరగడమే తప్ప ఇప్పట్లో తగ్గవని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. . నోట్ల డిమాండ్ కు తగినంత సప్లయ్....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹజబ్