పెరుగుతున్న అణిచివేత, ఒత్తిడి ‍‍- ‍ తోటి వారిని కాల్చి చంపిన జవాను


పెరుగుతున్న అణిచివేత, ఒత్తిడి ‍‍- ‍ తోటి వారిని కాల్చి చంపిన జవాను

పెరుగుతున్న

మిలటరీ, పారా మిలటరీ బలగాల్లో అధికారుల వేధింపుల పట్ల రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ గోడు ప్రపంచానికి వెళ్ళబోసుకుంటే వత్తిడి భరించలేని మరో CISF జవాను ఏకంగా కాల్పులు జరిపి నలుగురు సాటి జవాన్లనే బలిగొన్నాడు. బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఆవరణలో ఈ ఘటన జరిగింది.

ఎన్ని రోజులనుండి అడుగుతున్నప్పటికీ అధికారులు లీవు ఇవ్వనందుకు ఆగ్రహించిన జవాన్ బల్వీర్ కుమార్ బ్యారక్‌లోకి వెళ్లి తోటి జవాన్లపై కాల్పులు జరిపాడని పోలీసు సూపరింటెండెంట్ సత్యప్రకాశ్ తెలిపారు. బ్యారక్‌లో అతడు తన సర్వీసు తుపాకీతో కాల్పులు జరుపగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారని చెప్పారు.

కాల్పుల్లో గాయపడ్డ మరో ఇద్దరు పొరుగున ఉన్న రోహతాస్ జిల్లాలోని దవాఖానలో మరణించారు. విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న బల్వీర్‌ను తోటి జవాన్లు ఒడిసిపట్టుకున్నారు.

అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. సీనియర్ పోలీసు అధికారులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారని సత్యప్రకాశ్ తెలిపారు.

బల్బీర్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగడ్‌కు చెందినవాడని, మృతుల పేర్లు అమర్‌నాథ్ మిశ్రా(దర్భాంగా), బచ్చాశర్మ(పాట్నా), అరవింద్‌కుమార్ (ముజఫర్‌నగర్), గౌరీశంకర్‌రాం(గడ్వా, జార్ఖండ్) అని అధికారులు తెలిపారు.

బీహార్ రాజధాని పాట్నాకు 120 కిలోమీటర్ల దూరంలోని ఔరంగాబాద్ సమీపంలో ఎన్టీపీసీ, బీహార్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తున్న నబీనగర్ థర్మల్ విద్యుత్కేంద్రం వద్ద వారంతా డ్యూటీలో ఉన్నారు.

Keywords : army, cisf, bsf, tej bahadur yadav, crpf, officers, modi
(2018-07-19 21:03:07)



No. of visitors : 961

Suggested Posts


కడుపునిండా అన్నం అడిగినందుకు BSF జవానుపై అధికారుల దుర్మార్గపు దాడి !

నుకన్నట్టే అవుతోంది. తమ అవినీతి బట్టబయలు చేసిన BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ పై అధికార్లు కత్తిగట్టారు. అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓ కుక్కను చంపేందుకు పిచ్చికుక్క్త అనే ముద్ర వేసినట్టు అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్మార్గపు దాడి చేస్తున్నారు....

ʹనాభర్త ఏమయ్యాడొ తెలియడం లేదు... నాకొడుకును ఆర్మీలో చేర్చనుʹ

BSF జవాన్లు ఆకలితో ఎలా అలమటిస్తున్నారో, వారికి రావాల్సిన రేషన్ ను అధికారులు అమ్ముకుంటున్నారో BSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ లో వీడియో పెట్టిన తర్వాత నుండి అతను తమకు కాంటాక్ట్ లో లేకు‍ండా పోయాడని, అతను ఎక్కడున్నాడో కూడా తెలియడంలేదని అతని భార్య ఆందోళన చెందుతున్నారు...

సరిహద్దుల్లోజవాన్ల‌ ఆకలి కేకలు ‍- అధికారుల అవినీతి పై ఆగ్రహ జ్వాలలు

ఈ వీడియోలో నా వెనుక కనపడుతున్న దృశ్యాలు మీకు చాలా అందంగా ఉన్నాయనుకుంటా. కానీ ఇక్కడ మాజీవితాలు చాలా అద్వాన్నంగా ఉన్నాయి. మా ఈ జీవితాల గురించి ఏ మీడియా చూయించదు. ఏ మంత్రి, ఏ ప్రభుత్వమూ వినదు. నేను మీకు చూయిస్తున్న ఈ వీడియో.. మా అధికార్లు మాపట్ల ఎంత అన్యాయం చేస్తున్నారో... ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ...

నిన్న తేజ్‌బహదూర్‌.. నేడు జీత్‌ సింగ్ - ‍వెలుగు చూస్తున్న‌ జవాన్ల దుర్భర జీవితాలు

నిన్నBSF జవాను తేజ్‌బహదూర్‌ యాదవ్‌ తమకు పెడుతున్న ఆహారం గురించి, అధికారుల అవినీతి గురించి వీడియో ద్వారా బయట ప్రపంచానికి తెలియజేస్తే. ఇప్పుడు ఓ సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అతనికి తోడుగా గొంతు విప్పాడు. జీత్‌సింగ్‌ అనే సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్.....

జవాన్ల ఆకలి కేకలు, అధికారుల అవినీతి బాగోతాలు ‍- వెలుగు చూస్తున్న కొత్త నిజాలు

సరిహద్దులో జవాన్ల ఆకలి కేకలు , అధికారుల అవినీతి బాగోతాన్నిBSF జవాను తేజ్ బహదూర్ యాదవ్ తన ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన తర్వాత అధికారుల అవినీతి కథలు మరిన్ని బయటపడుతున్నాయి....

మమ్ములను భానిసలకన్నా హీనంగా చూస్తున్నారు ‍- మరో సైనికుడి ఆవేదన‌

భారత సైనికులపై సైనికాధికారుల వేధింపులు ఎంత దుర్మార్గంగా ఉన్నాయో.. వాళ్ళను భానిసలకన్నా నీచంగా ఎలా చూస్తున్నారో మరో సైనికుడు గొంతు విప్పాడు. BSF జవాను తేజ్ బహదూర్ సింగ్ తమ దుర్భర జీవితాన్ని ప్రపంచానికి వెల్లడించిన తర్వాత ఒక్కొక్కరు ధైర్యం చేసి ముందుకొస్తున్నారు. మొన్న తేజ్ బహదూర్ సింగ్ నిన్న జీత్ సింగ్ ఇవ్వాళ్ళ యగ్య ప్రతాప్ సింగ్ ...

ప్రశ్నించినందుకు ఆ సైనికుడిని డిస్మిస్ చేశారు

పై అధికారులు తమ ఆహారాన్ని అమ్ముకుంటూ తమను ఆకలికి మాడిపోయేట్టు చేస్తున్నారని ఆరోపణలు చేసిన బీఎస్ఎఫ్ జ‌వాను తేజ్‌బ‌హ‌దూర్ యాద‌వ్ గుర్తున్నాడా ? అతన్ని ఉద్యోగంలోంచి తొలిగించారు. బీఎస్ ఎఫ్ జవాన్లకు పెడుతున్న ఆహారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు అతనిపై బీఎస్ ఎఫ్ అధికారులు...

Search Engine

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మతోన్మాదులు ఈ న‌వ‌ జంటను చంపేస్తారేమో !
గోగూండాల దాడులపై సుప్రీం కోర్టు ఆగ్రహం
78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి
ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం
భీమాకోరేగాఁవ్ ప్రజా పోరాటాన్ని ముందుకు తీసుకపోదాం - ఆగస్ట్ 3న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం
ప్రశ్నలను నిషేధిస్తారట...సంధ్యక్క‌ను హత్య చేస్తారట‌
చిన్న పొరపాటుకు చిన్నారికి బ‌హిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గం
ఒక బీజేపీ ఎమ్మెల్యే రాసలీలలు.. అండగా పార్టీ హైకమాండ్
ʹమతం పేరుతో హింసను రెచ్చగొడుతున్నారుʹ
ఏడవకు బిడ్డా - గుగివా థియాంగో
హస్బెండ్‌ స్టిచ్‌ - గీతాంజలి
సీపీఎం కు ఇక రామాయణమే రక్షనట !
తెల‍ంగాణ డీజీపీకి 26 మంది మేధావుల బహిరంగ లేఖ‌ !
కత్తి మహెష్ నగర బహిష్కరణ అప్రజాస్వామికం - విరసం
దేవుడు లేడంటే.. సంసదకు ఎసరొస్తుంది.. పెద్దరికాలకు ఇబ్బందొస్తుంది
కత్తి మహేష్ ʹనగర బహిష్కరణʹ.. అక్రమం, చట్టవ్యతిరేకం
छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर
छत्तीसगढ़ : मानवाधिकार कार्यकर्ताओं की गिरफ्तारी के विरोध में प्रदर्शन
ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి
Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju
Kerala; Alleged Maoist Shyna Gets Bail in all the cases.
పంటలు పండటానికి నాలుగు మంత్రాలు చాలు.. గోవా ప్రభుత్వం కొత్త స్కీం
దుర్గాప్రసాద్, బద్రి, రంజిత్, సుధీర్ లను వరంగల్ జైల్లో అధికారులు వేధిస్తున్నారు..వీవీ
ఇజ్రాయేలీ సైనికులకు తమ నృత్యంతో చెమటలు పట్టించిన పాలస్తీనా యువత
more..


పెరుగుతున్న