Menu

అరుంధతీ రాయ్‌పై యూఏపీఏ కేసును ఉపసంహరించాలి‍‍ ‍‍-AIPF

anadmin 2 years ago 0 55

ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ యూఏపీఏ విధించడం ఖండించిన‌ ఆల్ ఇండియా పీపుల్స్ ఫ్రంట్ ఆమెపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలనిడిమాండ్ చేసింది. ఆల్ ఇండియా పీపుల్స్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు ఎస్. ఆర్. దారాపురి పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ,వ్యక్తి సుశీల్ పండిట్ అనే వ్యక్తి పిర్యాదు మేరకు ఆమెపై యూఏపీఏ విధించడం ప్రతీకార చర్య అని ఆయన అన్నారు. అరుంధతీ రాయ్‌పై యుఎపిఎ విధించడం సామాజిక-రాజకీయ కార్యకర్తలు, మేధావులు, రచయితలను వేధించే మోడీ ప్రభుత్వ దీర్ఘకాల విధానంలో భాగమేనని దారాపురి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మోడీదీ ప్రభుత్వం చేసిన అప్రజాస్వామిక అణచివేత చర్యను దేశ ప్రజలు తిరస్కరించారని, కానీ దాని నుంచి గుణపాఠం నేర్చుకోకుండా, అసమ్మతి స్వరాలను అణచివేయడంలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని ఆయన మండిపడ్డారు.
అరుంధతీ రాయ్‌పై మోడీ ప్రభుత్వం అణచివేతకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్ఛకు అనుకూలంగా ఉన్న సమాజంలోని అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు మరియు పౌర సమాజానికి ఆల్ ఇండియా పీపుల్స్ ఫ్రంట్ పిలుపునిస్తోంది.
ఎస్ ఆర్ దారాపురి,
జాతీయ అధ్యక్షుడు,
ఆల్ ఇండియా పీపుల్స్ ఫ్రంట్.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad