Menu

కన్నబిడ్డల జ్ఞాపకాలు నిలుపుకోవడమూ నేరమా? రాకేశ్ స్థూపాన్ని కూల్చేసిన పోలీసులు

anadmin 5 hours ago 0 25

అమరుల బంధుమిత్రుల సంఘం
పత్రిక ప్రకటన
15-5-2026

తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా చింతగట్టు గ్రామంలో రాకేష్ స్థూపాన్ని అడ్డుకొని కూల్చి వేయడాన్ని ఖండిస్తున్నాము.

గత సంవత్సరం మే 21న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజుతో పాటు అమరుడైన రాకేష్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు తమ ఇంటి వద్ద నిర్మాణం చేసుకున్న స్థూపాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు కూల్చివేయడాన్ని, ఆ కుటుంబ సభ్యుల్ని అక్రమంగా అదుపులో తీసుకోవడాన్ని అప్రజాస్వామిక చర్య మేము భావిస్తున్నాము. వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

బిడ్డ శవాన్ని కూడా ఇవ్వక ఇతర మరో రాష్ట్ర ప్రభుత్వం వేధించింది. ఇప్పుడు ఇంటి దగ్గర తమ కుమారుడి జ్ఞాపకంగా నిర్మించుకున్న స్థూపాన్ని కూల్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేదిస్తుంది.
గతంలో జానారెడ్డి హోమ్ మంత్రిగా వున్నపుడు సొంత స్థలాల్లో స్థూపాలు కట్టుకుంటే వాటిని కదిలించమని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నిలబెట్టుకుంది. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్థూప నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. ఇలాంటి కక్ష సాధింపు ధోరణి ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాము.

అంజమ్మ
రాష్ట్ర అధ్యక్షురాలు

శాంత
ఉపాధ్యక్షురాలు

పద్మ కుమారి
కార్యదర్శి

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad