భీమా కోరేగామ్ కేసు నిందితులు, ప్రస్తుతం ముంబాయి విడిచి వెళ్లగూడదనే షరతులతో కూడిన బెయిల్ మీద ముంబాయిలో ఉన్న వరవరరావు (85), సుధా భరద్వాజ్ (65) బెయిల్ షరతులను ఉల్లంఘించారని, అందువల్ల వారి బెయిల్ రద్దు చేయాలని ఎన్ఐఎ ఇవాళ ఈ కేసును విచారిస్తున్న కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు వారిద్దరి సమాధానం కోరింది.
బెయిల్ మీద ఉండిన సహనిందితుడు గౌతమ్ నవ్లాఖాకు షరతు సడలించి ముంబాయి వదిలి వెళ్లవచ్చునని, ఆయన స్వస్థలమైన ఢిల్లీలో ఉండవచ్చునని బొంబాయి హైకోర్టు జనవరిలో తీర్పు చెప్పిన సందర్భంలో, ఆయన మిత్రులు ఆయనకు బొంబాయి ప్రెస్ క్లబ్ లో వీడ్కోలు విందు ఇచ్చారు. ఆ విందుకు వరవరరావు, సుధా భరద్వాజ్ హాజరయ్యారనేది ప్రస్తుతం ఎన్ఐఎ అభియోగం.
ఇప్పుడు బొంబాయి ప్రెస్ క్లబ్ కు జరగనున్న ఎన్నికలలో బలమైన అభ్యర్థి, గతంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడుగా చిరకాలం పని చేసిన గురుబీర్ సింగ్ ను పోటీ చేయకుండా చూడడానికి, ప్రస్తుత అధ్యక్ష కార్యదర్శులు, ఆ విందును సాకుగా చూపెట్టి, “ప్రెస్ క్లబ్ ప్రతిష్ఠ దిగజార్చే వ్యక్తులను ప్రెస్ క్లబ్ లోకి ఆహ్వానించారని” గురుబీర్ సింగ్ ను, మరొక ఇద్దరు సీనియర్ జర్నలిస్టులను ప్రెస్ క్లబ్ సభ్యత్వం నుంచి ఏప్రిల్ లో బహిష్కరించారు. గురుబీర్ సింగ్ కోర్టుకు వెళ్ళి తన బహిష్కరణ మీద స్టేను, పోటీ చేయడానికి అనుమతిని సాధించుకున్నారు.
ఈలోగా ఎన్ఐఎ రంగంలోకి దిగి, ప్రెస్ క్లబ్ సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకుని, భీమా కోరేగామ్ నిందితులు “అర్బన్ నక్సలైట్ వ్యూహరచన కోసమే” అక్కడ కలిశారని, అది బెయిల్ షరతుల ఉల్లంఘనేనని ఇప్పుడు పిటిషన్ తయారు చేసింది.
ఎనిమిది సంవత్సరాలైనా విచారణ ప్రారంభం కాని, చార్జెస్ ఫ్రేమ్ కూడా చేయని అబద్ధపు కేసులో, అబద్ధపు ఆధారాలతో నిజమైన వేధింపుకు మరొకసారి తెర లేపుతున్నారు.
ఇంకా ఆశ్చర్యం, మావోయిజం అంతమయిందని ఒకవైపు అంటూ, మొన్నటివరకూ సాయుధంగా ఉండిన మావోయిస్టులకు ముఖ్యమంత్రులు, డీజీపీలు ఎర్రతివాచీలు పరుస్తూ, కేవలం మావోయిస్టులతో సంబంధం ఉన్నదనే అబద్ధపు ఆరోపణ మీద పెట్టిన కేసులో ఇంత దారుణమైన వేధింపులకు పూనుకోవడం
(ఎన్.వేణుగోపాల్ fbవాల్ నుండి)

సమాజాన్ని భయాందోళనకు గురిచేసేందుకే గాదె ఇన్నయ్య అరెస్టు -భారత్ బచావో
మావోయిస్టు నాయకుడు రూపేష్ కు జీవిత ఖైదు విధించిన తమిళనాడు కోర్టు
అంకితా మమ్మల్ని క్షమించు… ఇది భారత దేశం… ఇక్కడ సామాన్య మహిళల జీవితాలు లెక్కలోకి రావు
కస్టడీలో రాజకీయ ఖైదీలను చిత్రహింసలపాలు చేసిన NIA
పంజాబ్, హర్యానా, ఢిల్లీలలో ప్రజా సంఘాల కార్యకర్తలపై NIA దాడులను ఖండించండి!
స్టాన్ స్వామి స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చిన మద్రాసు హైకోర్టు 