Menu

సాయిబాబాకు నివాళులు అర్పించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్)

anadmin 1 year ago 0 117

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా (మార్క్సిస్ట్-లెనినిస్ట్) భారత ప్రజల విముక్తి కోసం అత్యుత్తమ పోరాటం చేసిన‌ యోధుడు కామ్రేడ్ డా. జి. ఎన్. సాయిబాబా మరణానికి సంతాపం తెలుపుతున్నది.

చిన్నతనంలో పోలియో సోకి 90% వైకల్యానికి గురైన వీల్‌చైర్‌లో ఉన్న సాయిబాబా, అనారోగ్యం కారణంగా 10 రోజుల క్రితం తెలంగాణలోని హైదరాబాద్ లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్స పొందుతూ మరణించారు.

ఢిల్లీ యూనివర్శిటీలో ఉద్యోగం చేస్తూ, భారతదేశంలోని పేద, శ్రామిక ప్రజల హక్కుల కోసం సుదీర్ఘకాలం పాటు ప్రచారం చేసిన డాక్టర్ సాయిబాబాకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)తో సంబంధాలున్నాయని, ఆ పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారనే ఆరోపణలపై మే 9, 2014న అరెస్టు చేశారు. దేశంపై యుద్ధం చేస్తున్నట్టుగా ఆరోపిస్తూ అతనిపై ఉపా చట్టం ప్రయోగించారు.

అరెస్టు సమయంలో, మావోయిస్టు పార్టీ సాయుధ పోరాట యోధులకు వ్యతిరేకంగా చేపట్టిన మిలిటరీ క్యాంపెయిన్ ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా ‘ఫోరమ్ ఎగైనెస్ట్ వార్ ఆన్ పీపుల్’కి డాక్టర్ సాయిబాబా కన్వీనర్‌గా ఉన్నారు.

డాక్టర్ సాయిబాబాను అరెస్టు చేసిన దాదాపు 10 సంవత్సరాల తర్వాత, ఈ ఏడాది మార్చి 5న బొంబాయి హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిర్దోషిగా విడుదల చేసింది. ప్రాసిక్యూషన్ ఈ కేసును నిరూపించలేదని బాంబే హైకోర్టు గుర్తించింది. వాస్తవానికి, అతను నిర్దోషిగా విడుదల కావడానికి అసలు కారణం అతని విడుదల కోసం జరిగిన భారతీయ, అంతర్జాతీయ ప్రచారమే.

తన పదేళ్ల జైలు జీవితం గురించి డాక్టర్ సాయిబాబా ఇలా అన్నారు: “జైలు అనేది బాహ్య ప్రపంచంలోని సూక్ష్మరూపం, ఇక్కడ అన్ని సామాజిక దురాచారాలు బయట కంటే ఎక్కువగా కనిపిస్తాయి.”

“జైలులో కుల ఆధారిత వివక్ష ప్రబలంగా ఉంది. ఖైదీల కులం ఆధారంగా పనులు కేటాయించబడతాయి. నిజానికి, జైలు మాన్యువల్‌లో కూడా కులం ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు గురించి ప్రస్తావించబడింది” అని డాక్టర్ సాయిబాబా చెప్పారు.

సవరించిన జైళ్ల చట్టం 1894 ఖైదీలను నియంత్రించడానికి, క్రమశిక్షణలో ఉంచడానికి ‘తేలికపాటి శారీరక హింస’ని అనుమతిస్తుంది. అటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష ద్వారా తప్ప ఎవరూ నిరసన తెలపడానికి మార్గం లేనప్పటికీ, జైలు వెలుపల గొంతులు విస్తరిస్తే తప్ప ఫలితం ఇవ్వదు.
చిత్రహింసలకు గురిచేస్తారు అని డాక్టర్ సాయిబాబా చెప్పారు.

విశిష్ట విప్లవ‌ సమరయోధుడు డాక్టర్ సాయిబాబా కుటుంబ సభ్యులకు, మిత్రులకు, సహచరులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad